second Show
-
కేజీఎఫ్–2 చూస్తూ రచ్చ రచ్చ... థియేటర్లో కాల్పులు
యశ్వంతపుర (కర్ణాటక): తెరపై కేజీఎఫ్2 నడుస్తోంది. హీరో, విలన్ల మధ్య భారీ కాల్పులు, పోరాట దృశ్యాలు చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోయారు. కానీ అవే కాల్పులు ఉన్నట్టుండి థియేటర్లోనే తమ కళ్ల ముందే జరగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కర్ణాటకలో హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సెకండ్ షో చూస్తుండగా వసంతకుమార అనే ప్రేక్షకుని కాలు ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగిలింది. దాంతో గొడవ పడ్డారు. అతను బయటకు వెళ్లి పిస్టల్‌తో తిరిగొచ్చి ఏకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు వసంత కాలు, కడుపులోకి దూసుకెళ్లాయి. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో'
2002లో కేవలం రెండే పాత్రలతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా షో. సూపర్ స్టార్ వారసురాలు మంజుల, విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన షో విశ్లేషకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సినిమా దర్శకుడు నీలకంఠ ఒక్కసారి సినీవర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్సమ్మ మంచి విజయం సాధించినా.. ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. చమ్మక్ చల్లో, మాయ లాంటి సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో కొంత గ్యాప్ తీసుకున్న నీలకంఠ, మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన షో సినిమాకు సీక్వల్ రూపొందించే పనిలో ఉన్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత సెకండ్ షో పేరుతో షో సినిమాకు సీక్వల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సెకండ్ షో అని చెప్పి.. అఘాయిత్యం
రాజవమ్మంగి: సెకండ్ షో సినిమాకని నమ్మించి తీసుకెళ్లి మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని రాజవమ్మంగి శివారు కన్నయ్యమ్మపేటకు చెందిన లోవరాజు(21) ఇంటి సమీపంలోని ఓ బాలికను(12) శుక్రవారం సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా మధ్యలోనే పని ఉంది త్వరగా ఇంటికెళ్లాలని బాలికతో చెప్పాడు. దీనికి సరెనన్న బాలికను ఇంటికి తిరిగి తీసుకొస్తూ.. ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం పై అర్ధరాత్రి బాధితురాలి తల్లిదండ్రులు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఇదివరకే పెళ్లి అయినట్లు సమాచారం.