మొద్దుగుట్ట ఎన్కౌంటర్పై రెండో విచారణ
ములుగు : గత సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన గోవిందరావుపేట మండలం మొద్దుగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో భాగంగా అధికారి ఆర్డీఓ చీమలపాటి మహేందర్జీ బుధవారం రెండో విచారణ జరిపారు. విచారణకు తాడ్వా యి, గోవిందరావుపేట మండలాల తహసీల్దార్లు, రంగాపురం, చల్వాయికి చెందిన నలుగురుని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, పస్రాకు చెందిన ఓ నాయకుడు హాజరయ్యారు.
విచారణలో వారు ఆర్డీఓకు వాంగ్మూలం ఇచ్చారు. కాగా, ఈ నెల 3వ తేదీన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన శృతి, విద్యాసాగర్ తల్లిదండ్రులు, మానవహక్కులు సంఘాల సభ్యులు విచారణ అధికారి ముందు హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించిన విషయం తెలిసిందే.