secret document theft
-
WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
సైపన్/కాన్బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మీడియా ఎదురుచూపులువిచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు. శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు. భార్యను, తండ్రిని హత్తుకుని..ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
Donald Trump: ట్రంప్ కోసం దేనికైనా రెఢీ (ఫొటోలు)
-
Donald Trump: మరికొన్ని గంటల్లో కోర్టుకు ట్రంప్!
మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది గంట్లలో మియామీ ఫెడరల్ కోర్టుకు హాజరు కానున్నారు. అధ్యక్ష భవనం వీడిన తర్వాత కూడా.. జాతీయ భద్రతకు సంబంధించి కీలక పత్రాలను తన ఇంట దాచినందుకుగానూ ఆయన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొంటూ.. కోర్టుకు హాజరైన మాజీ అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. ట్రంప్ కోర్టుకు హాజరు కావడం ఈ మధ్యకాలంలోనే ఇది రెండోసారి. ఓ పోర్న్స్టా* అనైతిక ఒప్పందాల వ్యవహారంలో ఏప్రిల్‌లో ఆయన న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాజాగా కీలక పత్రాల వ్యవహారంలో ఇప్పుడు హాజరు కానున్నారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆయన మియామీ కోర్టుకు హాజరవుతారు. అటుపై నేరుగా న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్సుకు చేరుకుని.. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ కేసులో తాను అమాయకుడని మొదటి నుంచి ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే., రాజకీయంగా తనను ఇరికించి అధ్యక్ష ఎన్నికలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని, శిక్షపడినా తాను పోటీ చేసి తీరతానని అంటున్నారాయన. రహస్య పత్రాలను దాచినందుకుగానూ మొత్తం 37 నేరారోపణలు ఎదుర్కొంటున్నారాయన. అందులో గూఢచర్యం, నిబంధనల ఉల్లంఘన, రక్షణ సమాచారాన్ని అనధికారికంగా కలిగి ఉండటం లాంటి తీవ్ర నేరాలు ఉన్నాయి. వీటితో పాటు న్యాయాన్ని అడ్డుకునే కుట్ర కూడా ఉంది. ఒకవేళ ఆయన దోషిగా తేలితే.. గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. ఇదిలా ఉంటే ట్రంప్‌కి బుధవారం(జూన్ 14)తో 77 పడిలోకి అడుగుపెట్టనుండగా, అంతకు ముందురోజే క్రిమినల్ అభియోగాలతో కోర్టుకు హాజరు అవుతుండడం గమనార్హం. హింసకు ఛాన్స్? January 6, 2021 క్యాపిటల్ హిల్ ముట్టడి.. దాడి ఘటనను ప్రపంచం అంత తేలికగా మర్చిపోలేదు. అయితే ట్రంప్ మద్దతుదారుల నుంచి మళ్లీ ఆ తరహా హింస చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో మియామీ కోర్టు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా భద్రతను మోహరించారు. ఇంతకు ముందు ట్రంప్ న్యూయార్క్ కోర్టుకు హాజరైనప్పుడు కూడా కోర్టు బయట తీవ్ర గందరగోళం నెలకొన్నప్పటికీ.. పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే మియామీ కోర్టు బయట ట్రంప్ మద్దతుదారులు 50 వేల మందిదాకా గుమిగూడొచ్చని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ దాచిన రహస్య పత్రాల్లో ఏముందంటే.. -
ట్రంప్‌పై నేరాభియోగాలు
మియామి: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఒకదాని తర్వాత మరొకటి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఒక మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్ జ్యూరీ నేరుగా అభియోగాలు నమోదు చేయడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కేసులో 13 తేదీ మంగళవారం మియామి కోర్టుకు హాజరు కావాలని సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఒక మాజీ అధ్యక్షుడికి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశం ఎంతగా దిగజారిపోతున్నా, అందరం కలిసి అమెరికా గ్రేట్ ఎగైన్ అని నిరూపిద్దామని తన అభిమానులకి పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి జరుగుతున్న పోరులో ముందంజలో ఉన్న ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడం రాజకీయంగా ఆయనకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్‌కి ముడుపులు చెల్లించిన కేసులో నేరాభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ ఈ సారి ఏకంగా ఫెడరల్ జ్యూరీ అభియోగాలనే నేరుగా ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2021లో గద్దె దిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను ఆర్కీవ్స్‌కు అప్పగించకుండా ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తరలించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే రుజువైతే వందేళ్లు జైలు రహస్య పత్రాల కేసులో గూఢచర్య చట్టం కింద డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు అంశాల్లో అభియో గాలు నమోదయ్యాయి. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన దగ్గర ఉంచుకోవడం, న్యాయ ప్రక్రియను అడ్డుకో వడానికి కుట్ర, నిజాయితీ లేకుండా డాక్యుమెంట్లను దాచిపెట్టడం, తన గుట్టు బయటపడకుండా పథక రచన, తప్పుడు ప్రకటనలు జారీ చేయడం వంటి అంశాల్లో అభియోగాలు నమోదయ్యాయి. ఇవి రుజువైతే ట్రంప్‌కి గరిష్టంగా వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ అభియోగాలు ఎలాంటి అడ్డంకి కాకపోయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వానికి ఎంత మద్దతు లభిస్తుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి. -
రహస్య పత్రాల తరలింపుపై చర్చకు సిద్ధం
- రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడి న్యూఢిల్లీ: పెట్రోలియం శాఖతో పాటు మరికొన్ని శాఖలనుంచి రహస్యపత్రాలు బయటకు తరలిపోయిన అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ, వివిధ శాఖలనుంచి కార్పొరేట్ కంపెనీలకు రహస్య పత్రాలను లీక్ చేశారన్న వ్యవహారంలో ఇప్పటివరకు కేవలం జూనియర్ స్థాయి అధికారులను మాత్రమే అరెస్టు చేశారని, ప్రభుత్వం ఈ వ్యవహారంలో బడా బాబులను కాపాడుతోందని ఆరోపించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ, అగర్వాల్ లేవనెత్తిన అంశంతోపాటు మిగతా విషయాలపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, కార్పొరేట్ గూఢచర్యం బయటపడిన డిపార్ట్మెంట్లతో సహా కీలక మంత్రిత్వ శాఖల్లోని అధికారిక కంప్యూటర్లు, సిబ్బందికి చేసే భద్రతా పరీక్షలపై కేంద్రం ఆడిట్‌కు ఆదేశించింది. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ నేతృత్వంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శాఖ, డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారిని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ల రక్షణాధికారిగా నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.