secret relations
-
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్‌లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్‌తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్‌లోని కీలక మిలటరీ బేస్‌నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్‌ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
టీడీపీ స్పెషల్ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరును ఎండగట్టారు. బాబు.. ప్రజలు గమనిస్తున్నారు ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు. మరో ట్వీట్లో లోకేష్ బాబుకి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు. -
ట్రంప్ అల్లుడి తెర వెనుక కథ!
► వేడెక్కిన అమెరికా రాజకీయాలు! రష్యా ప్రభుత్వంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న తన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు, వైట్‌హౌస్ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ డిసెంబర్లో అమెరికాలో రష్యా రాయబారితో మాట్లాడడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అప్పటికి ట్రంప్ అధ్యక్ష పదవి కూడా స్వీకరించలేదు. అంటే ఆయన అల్లుడు సాధారణ పౌరుడు. ఎలాంటి అధికార పదవి లేకుండా ట్రంప్ బృందం తరఫున రష్యా రాయబారి సెర్గీ కిసిలియాక్తో మాట్లాడటంపై రెండు అమెరికా ప్రధాన దినపత్రికలు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాలు ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తునకు మరింత పదును పెంచాయి. అయితే, తన అల్లుడిపై రాసిన వార్తలపై ట్రంప్ మండిపడటమే కాక, కుష్నర్ చాలా మంచోడని ప్రశంసించారు. తమతో మంచి సంబంధాలు లేని దేశంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మంచిదేనని అమెరికా హోంశాఖ మంత్రి జాన్ కెలీ వ్యాఖ్యానించారు. రహస్య సంబంధాలు ఎందుకు? దౌత్యపరమైన సౌకర్యం ద్వారా రష్యాకు లభించే సమాచార సంబంధాలను ట్రంప్ వాడుకుంటే రష్యన్లతో ఆయనేం మాట్లాడిందీ అమెరికా గూఢచార సంస్థలు తెలుసుకోలేవు. వైట్‌హౌస్‌లోని ముగ్గురు కీలకవ్యక్తులు అందించిన సమాచారంతో ఈ విషయం లీకైంది. కిందటి డిసెంబర్లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో రష్యా రాయబారితో జరిగిన సమావేశంలో కుష్నర్తో పాటు వివాదాస్పద మాజీ జనరల్ మైకేల్ ఫ్లిన్ కూడా ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొద్దికాలం ఫ్లిన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రహస్య కమ్యూనికేషన్ సౌకర్యం ఏర్పాటుకు ఎవరు ప్రతిపాదించారో తెలియదు. ట్రంప్ బృందం ఈ విషయాన్ని అప్పట్లో వెల్లడించలేదు. 5 నెలల తర్వాత ట్రంప్ బృందం-పుతిన్ సంబంధాలపై ఎఫ్‌బీఐ, కాంగ్రెస్ కమిటీల దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ విషయం మీడియాలో రావడంతో రష్యాతో కుష్నర్ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది. రష్యా బ్యాంకు ఉన్నతాధికారితో సమావేశం ఎందుకు? రాయబారితో సమావేశం తర్వాత అప్పటికే అమెరికా ఆంక్షలతో సతమౌతమవుతున్న బడా రష్యా బ్యాంక్ వ్నెషేకానం బ్యాంక్ (వీఈబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గీ గోర్కోవ్తో కుష్నర్ భేటీ కావడానికి ట్రంప్ టవర్ మీటింగ్‌కూ సంబంధం ఉండొచ్చని రెండు పత్రికలూ సూచనప్రాయంగా తెలిపాయి. ఈ బ్యాంక్ సహా ఇతర రష్యా ఆర్థిక సంస్థలపై విధించిన ఆంక్షలు తొలగిస్తే, అందుకు బదులుగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్న కుష్నర్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ సంస్థ (666 ఫిఫ్త్ ఎవెన్యూ)కు వాటి నుంచి పెట్టుబడులు సంపాదించే విషయమై ఈ భేటీలో చర్చించి ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఈ కథనాల తర్వాత తన అల్లుడు సమర్ధుడు, మంచివాడని ట్విటర్లో ట్రంప్ ప్రశంసించినా, మరోపక్క కొంతకాలం ‘తగ్గి ఉండాలని’ ఆయనకు సూచించారని వార్తలొచ్చాయి. కుష్నర్ చేసింది కరెక్టే: వికీలీక్స్ అసాంజ్ రష్యాతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటుకు కుష్నర్ చేసిన ప్రయత్నంలో తప్పేమీ లేదని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజ్ సమర్ధించారు. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్‌ను వికీలీక్స్ బయట పెట్టిన విషయం తెలిసిందే. రష్యా గూఢచార సంస్థల సహకారంతోనే అసాంజ్ ఈ పనిచేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. హిల్లరీ ఈ మెయిల్స్ వ్యవహారాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే.