security beefed up
-
మహారాష్ట్ర సీఎం ప్రాణాలకు ముప్పు.. భద్రత మరింత పటిష్ఠం
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు ఉందని ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.. శనివారం సాయంత్రం ఓ ఆగంతుకుడి నుంచి బెదిరింపు వచ్చిందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. సీఎం షిండేకు ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత ఉంది. అయినా బెదిరింపుల దృష్ట్యా దాన్ని మరింత పటిష్ఠం చేస్తున్నారు అధికారులు. ఠాణెలోని సీఎం వక్తిగత నివాసంతో పాటు ముంబైలోని అధికారిక నివాసం వర్షకు భద్రతను మరింత పెంచారు. షిండే అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్‌లో తన తొలి ర్యాలీలో పాల్గొననున్నారు. దీనికి మూడు రోజుల ముందు బెదిరింపులు రావడంతో నిఘా వర్గాలు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని సీఎం షిండే అన్నారు. హోంశాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల కోసం తన పని తాను చేసుకుంటూపోతానని, భద్రత విషయాన్ని అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు. మరోవైపు ఉద్ధవ్ థాక్రేకు షాక్ ఇస్తూ వొర్లీలో దాదాపు 3,000మంది శివసేన కార్యకర్తలు షిండే వర్గంలో చేరారు. థాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేన ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో కలిసి షిండే జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి -
నాకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో చెప్పాలి!
సాక్షి, హైదరాబాద్: తనకు ఎవరి ద్వారా ప్రాణ హాని ఉందో పోలీసులు స్పష్టంగా తెలపాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అసలు ఎవరి ద్వారా ముప్పు పొంచి ఉందో చెప్పకుండా ఉండటం ఏంటని హోంమంత్రిని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొందరు ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందని జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు. ఈ మేరకు ఆష్టు 24న ఆయన లేఖ రాశారు. కొందరు ఉగ్రవాదుల నుంచి రాజా సింగ్‌కు ప్రాణహాని ఉందని , జాగ్రత్తగా ఉండాలని సీపీ కోరారు. గతంలో మాదిరిగా ద్విచక్ర వాహనంపై తిరగవద్దని, ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని రాజాసింగ్‌కు సూచించారు. డీసీపీ స్థాయి అధికారి రాజాసింగ్ భద్రతను చూసుకుంటారని ఆయన తెలిపారు. (‘సెక్యూరిటీ’ వార్!) తనకు భద్రత పెంపు విషయంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరి వల్ల ముప్పు పొంచి ఉందో, ఆ విషయాన్ని పోలీసులు తక్షణం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర హోంమంత్రికి లేఖ రాశారు. తన నియోజకవర్గం ఎక్కువ స్లమ్‌లోనే ఉంది కాబట్టి బండి పైనే ఎక్కువగా తిరుగుతానని రాజాసింగ్ పేర్కొన్నారు. స్థానికంగా ముప్పు ఉందా లేక ఇతర ప్రాంతం నుంచి ఉందా అనే విషయం చెప్పాలని కోరారు.ఈ విషయంలో హోంమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. (హిట్‌లిస్ట్‌లో రాజాసింగ్.. భద్రత పెంపు) అయితే తన గన్ లైసెన్స్ ఫైల్ రెండు సంవత్సరాల నుంచి కమిషనర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని, దీనిని తర్వలోనే అప్డేట్ చేయాలని రాజాసింగ్ కోరారు. ఇదిలా ఉండగా మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారో పోలీసులు, ప్రభుత్వం సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. బీబీ కా ఆలం ఊరేగింపునకు ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. -
‘సెక్యూరిటీ’ వార్!
సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: భారతీయజనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ల మధ్య సెక్యూరిటీ అంశాలకు సంబంధించి కోల్డ్ వార్ మొదలైంది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కొత్వాల్.. ఎమ్మెల్యేకు లేఖ రాయగా, అసలు ఆ ముప్పు ఎవరి నుంచో చెప్పాలంటూ రాజాసింగ్ నిలదీయడంతో పోలీసు శాఖకు చిక్కొచ్చి పడింది. అలాగే పోలీసు కమిషనర్ రాసిన రహస్య (కాన్ఫిడెన్షియల్) లేఖ సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. కొన్ని గంటల తర్వాత ఆ లేఖ అనుకోకుండా బయటకు వచ్చిందని ప్రచారమైంది. బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతం నుంచే ముప్పు పొంచి ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. అయితే అది ఇటీవలి కాలంలో మరింత తీవ్రమైందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలకు లేని విధంగా ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ (బీపీ) కారు సమకూర్చాలని నిఘా విభాగం అధికారులు సిఫారసు చేశారు. ఇటీవల ముప్పు తీవ్రమైన నేపథ్యంలోనే రాజాసింగ్ భద్రతాధికారుల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు అదనపు సూచనలు, శిక్షణ కూడా ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఆయన పలు మార్లు కారును వదిలి ద్విచక్ర వాహనంపై ప్రజల్లోకి వెళ్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. దీని వల్ల మరింత ముప్పు ఉందని, తాము అందించిన బీపీ కారునే వాడాలని, భద్రతకు సంబంధించి అంశాల్లో తమకు సహకరించాలని సూచిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ నెల 24న ఎమ్మెల్యేకు ఓ కాన్ఫిడెన్షియల్ లేఖ రాశారని తెలుస్తోంది. అయితే ఇందులోని తేదీని ఈ నెల 28వ తేదీగా మార్ఫ్ చేసిన కొందరు వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇది శనివారం హల్చల్ చేసింది. బుల్లెట్‌పైనే తిరుగుతా.. ఇదిలా ఉండగా ఈ అంశంపై రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఎవరి వల్ల ముప్పు పొంచి ఉందో, ఆ విషయాన్ని పోలీసులు తక్షణం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా తనకు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు తనకు కొత్తగా ఎవరి నుంచి హాని పొంచి ఉంది, ఇటీవల ఏ రకంగా ఆ ముప్పు పెరిగిందో తెలపాలని డిమాండ్ చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజలను కలుసుకోవడానికి బుల్లెట్ వాహనంపై తిరుగుతానని స్పష్టంచేశారు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో తెలపాలని కోరుతూ డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖలు రాస్తున్నట్లు చెప్పారు. -
హైదరాబాద్‌లో రక్షణ సంస్థలకు భద్రత పెంపు
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పాక్ ఏదో ఒక దుస్సాహసానికి ఒడిగట్టే ప్రమాదం ఉందని ముందునుంచే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఆర్మీ అధికారులకు, కంటోన్మెంట్ ఇతర ప్రాంతాలకు ఎలర్టులు వచ్చాయి. హైదరాబాద్ కూడా హై ఎలర్టులో ఉంది. ఆర్మీ పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాస్‌లు లేని వాహనాలు వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు, గోల్కొండ ప్రాంతాల్లో ఇప్పటికే చెక్ పోస్టులు పెట్టారు. రాత్రిపూట ఎవరినీ అనుమతించడం లేదు. పగలు కూడా గుర్తింపు పత్రాలు చూసిన తర్వాతే అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లో రక్షణ రంగానికి చెందిన డీఆర్డీఎల్, డీఆర్డీఓ, మిధాని తదితర సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ చాలా కీలకమైనవి కావడంతో.. గుర్తుతెలియని వ్యక్తులను అసలు ఆ ప్రాంతాల్లోకి అనుమతించవద్దని గట్టిగా చెబుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇందుకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. ఈ సంస్థల మీద దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. రక్షణ సంస్థలున్న రాష్ట్రాలన్నింటి ముఖ్యమంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే మాట్లాడారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆయన ఫోన్ చేశారు. కంటోన్మెంట్, ఏఓసీ గేట్ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. -
షారుక్‌పై ముంబై మాఫియా గురి?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ముంబైలోని అండర్ వరల్డ్ మాఫియా నుంచి ముప్పు పొంచి ఉందా? షారుక్‌తో మాట్లాడేందుకు రవి పూజారి ప్రయత్నించాడా? సరిగ్గా ఇలాంటి అనుమానాలే ముంబై పోలీసులకు కూడా వచ్చాయి. దాంతో సూపర్‌స్టార్‌కు భద్రత మరింత పటిష్ఠం చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నమే షారుక్‌తో మాట్లాడేందుకు రవిపూజారి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో ముందు జాగ్రత్త చర్యగా షారుక్ భద్రత పెంచారు. బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీ ఇంటివద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవలే ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. షారుక్ ఖాన్‌కు అలీ మొరానీ చాలా సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా. కొన్ని రోజుల క్రితమే తనకు పెద్దమొత్తంలో డబ్బులు పంపాలంటూ అలీ మొరానీకి రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినా, ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో భయపెట్టేందుకు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఇప్పుడు ఆయనకు సన్నిహితుడైన షారుక్‌పై కూడా రవిపూజారి కన్ను పడిందని చెబుతున్నారు. షారుక్ ప్రస్తుతం 'హేపీ న్యూ ఇయర్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.