security guard killed
-
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మళ్లీ రెచ్చిపోయారు. మున్సిపల్ కౌన్సిలర్‌ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్‌ఖాత్ అహ్మద్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్ పీర్ అనే మరో కౌన్సిలర్ గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్ డీజీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగుల దుశ్చర్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్ పండిట్ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముష్కరులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా డిమాండ్ చేశారు. మృతులకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముష్కరుల అకృత్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన రియాజ్ అహ్మద్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలిచారు. -
ఐసీయూ వెలుపల సెక్యూరిటీ గార్డు హత్య
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానికి సమీపంలోని గురుగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన గార్డు కత్తితో దాడి చేసిన ఘటనలో మరో సెక్యూరిటీ గార్డు మరణించారు. శీతల్ ఆస్పత్రిలోని ఐసీయూ వెలుపల జరిగిన ఈ దాడిలో బాధితుడని జుగల్ కిషోర్‌గా గుర్తించారు. సెక్యూరిటీ గార్డు కిషోర్‌ను కత్తితో పొడిచిన నిందితుడు నౌఫిల్ అన్వర్ హత్యానంతరం పరారయ్యాడని పోలీసులు చెప్పారు. దాడి జరిగే సమయంలో ఆస్పత్రి ఎంట్రన్స్ గేట్ వద్ద అన్వర్ ఉండగా, మూడో ఫ్లోర్‌లోని ఐసీయూ వెలుపల కిషోర్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్వర్ కిషోర్‌పై దాడిచేసి అతని ఛాతీ, ముఖం, పొట్టపై కత్తితో పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడని డీసీపీ వెస్ట్‌జోన్ సుమీర్ సింగ్ చెప్పారు. హత్యకు దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, బాధితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసి, ఇతర గార్డులను ప్రశ్నించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. -
కొడనాడులో బీభత్సం
► సెక్యూరిటీ గార్డు హత్య ► ఆసుపత్రిలో మరోగార్డు ► డాక్యుమెంట్లు, నగలు, నగదుతో ఉడాయింపు ► న్యాయవిచారణకు స్టాలిన్ డిమాండ్ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్ దోపిడీ, హత్య దురాగతాలతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో ఓం బహదూర్(50) అనే సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోగా, కిషన్ బహదూర్ అనే మరో సెక్యూరిటీ గార్డు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. జయలలిత ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదు దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని కొడనాడులో జయలలితకు సొంతమైన 1600 ఎకరాల ఎస్టేట్, తేయాకు తోటలు ఉన్నాయి. ఈ ఎస్టేట్‌కు శశికళ, ఇళవరసి, సుధాకర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. 1991–96 మధ్య కాలంలో జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఈ ఎస్టేట్ కొనుగోలు చేశారు. సాధారణ స్థాయిలో ఉన్న ఆ ఎస్టేట్‌ను జయ కొన్న తరువాత అనేక వసతులతో కూడిన బ్రహ్మాండమైన భవనంగా తీర్చిదిద్దారు. తేయాకు తోటల మధ్యలో రెండు బంగ్లాలు ఉండగా వాటిల్లో ఒకటి పాతది. మరొకటి 55 వేల చదరపు అడుగుల్లో 99 గదులతో కూడిన లగ్జరీ భవంతి. ఇక్కడ హెలిపాడ్, బోట్‌షికారు, మినీ థియేటర్, అద్దాల భవంతి, ఎస్టేట్ తిరిగి చూసేందుకు బ్యాటరీ కార్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. జయలలిత తరచూ ఈ కొడనాడు ఎస్టేట్‌లో కొద్దికాలం విశ్రాంతి తీసుకునేవారు. సీఎంగా ఉన్నపుడు కొడనాడు ఎస్టేట్‌కే అధికారులను పిలిపించుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ మినీ సచివాలయంగా మార్చేవారు. తనకు అత్యంత సన్నిహితులను మినహా ఎవ్వరినీ లోనికి ప్రవేశించలేని రీతిలో బంగ్లా చుట్టూ ఉండే 13 ప్రవేశద్వారాల వద్ద 24 గంటలూ తమిళనాడు పోలీసులు, జెడ్ కేటగిరీ బందోబస్తుగా బ్లాక్ కమెండోలను ఉంచారు. అంతేగాక జయలలిత ఎక్కువగా వినియోగించే 8, 9, 10 నెంబరు గల వీవీఐపీ గేట్ల వద్ద మరింత గట్టి బందోబస్తు ఉండేది. ఈ ఎస్టేట్ భవనంలో జయలలిత, ఆమెకు సొంతమైన వారి డాక్యుమెంట్లు భద్రం చేసిఉన్నట్లు తెలుస్తోంది. తిరుప్పూరు ఎన్నికల సమయంలో మూడు లారీ కంటైనర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.540 కోట్లు కొడనాడు ఎస్టేట్ నుంచే ఆంధ్రాకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. జయలలిత మరణం తరువాత ఎస్టేట్‌లోని పోలీసు బందోబస్తును ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డులు నాలుగు నెలలుగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అన్ని ప్రవేశద్వారాల వద్ద ఇద్దరు చొప్పున నేపాల్‌కు చెందిన గూర్ఖాలు 24 గంటలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జయలలిత రాకపోకలు సాగించే 10వ మెయిన్‌గేటు వద్ద ఆదివారం రాత్రి ఎప్పటిలాగే ఓం బహదూర్ (50), కిషన్ బహదూర్ (38)లు విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో రెండు కార్లతో గుర్తుతెలియని పది మంది వ్యక్తులు ఎస్టేట్‌లోకి జొరబడ్డారు. గార్డులపై వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ఓం బహదూర్ కాళ్లూ చేతులు కట్టివేసి నరకడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. కిషన్ బహదూర్ స్పృహ తప్పడంతో చనిపోయాడని భావించిన దుండగులు అతన్ని సమీపంలోని చెట్టుకు కట్టివేశారు. బంగ్లా అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. కిషన్ బహదూర్ మూలుగులు విని దగ్గరకు వచ్చిన మరోగేటు సెక్యూరిటీ గార్డులు వెంటనే ఇతర గేట్ల వద్దనున్న వారిని అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే దుండగులు బంగ్లాలోని అత్యంత ముఖ్యమైన పత్రాలు, నగలు, రత్నాలు, వైఢూర్యాలు, పెద్ద ఎత్తున నగదుతో ఉడాయించినట్లు తెలుస్తోంది నీలగిరి జిల్లా కలెక్టర్ శంకర్, ఎస్పీ మురళీ రంభ తదితర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎస్టేట్ చుట్టూ 200 మంది పోలీసులను మోహరింపజేశారు. మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించలేదు. పోలీసు జాగిలం జెన్నీని తీసుకురాగా రెండు కిలోమీటర్లు పరుగులు పెట్టింది కానీ ఎవ్వరినీ గుర్తించలేదు. ఆదివారం సాయంత్రం కొందరు యువకులు విద్యార్థుల్లా బొలెరో జీపులో సంచరించినట్లు తెలుసుకుని ఆరా తీస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో అదనపు బందోబస్తు పెట్టి వాహనాల తనిఖీలు చేపట్టారు. లాడ్జీలు, కాటేజీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తమపై మత్తు మందుజల్లి మారణాయుధాలతో దాడికి దిగారని, తాను చనిపోయినట్లు భావించి చెట్టుకు కట్టి వదిలేశారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిషన్ బహదూర్ పోలీసులకు తెలిపాడు. నిందితులను పట్టుకునేందుకు ఐదుగురితో కూడిన పోలీసు బృందాన్ని ఎస్పీ నియమిచారు. అన్నాడీఎంకేలోని అధికార వర్గం శశికళ, దినకరన్‌లను దూరం పెట్టడం, పన్నీర్‌సెల్వం వర్గంతో విలీనానికి సిద్ధమవుతూనే విమర్శలకు పాల్పడుతున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది. కొడనాడు ఎస్టేట్‌పై న్యాయవిచారణ జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వ్యవహారాలపై న్యాయ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. తిరువారూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ అధ్యక్షుడు కరుణానిధి తరఫున ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం నియోజకవర్గంలో పర్యటించిన స్టాలిన్ మాట్లాడుతూ కొడనాడులో జరిగిన హత్య రాష్టంలో శాంతిభద్రతల స్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. కొడనాడు ఎస్టేట్ ఎవరి స్వాధీనంలో ఉందనేది జయ మరణంలా మిస్టరీగా మారినందున న్యాయవిచారణ జరిపి తీరాలని ఆయన అన్నారు. -
ఢిల్లీలో భారీ దోపిడీ.. కోటిన్నర చోరీ!
-
ఢిల్లీలో దోపిడీ దొంగల బీభత్సం, రూ.1.50కోట్లు చోరీ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రయివేట్ బ్యాంక్ సెక్యూరిటీ వ్యాన్ నుంచి రూ.1.50 కోట్లు నగదు అపహరించుకు వెళ్లారు. చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును హతమార్చిన దుండగులు నగదుతో పరారయ్యారు. నార్త్ ఢిల్లీలోని కమలా నగర్ ఏరియాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లక్షలే లక్ష్యం
= నానాటికీ పెరుగుతున్న ఏటీఎం నేరాలు = దేశంలో మూడో స్థానంలో కర్ణాటక = దక్షిణాదిలో ప్రథమం = వినియోగదారులకు భద్రత కరువు = అలసత్వం వీడని పాలకులు, అధికారులు = విదేశీ పర్యటనలకే పరిమితమైన ‘అధ్యయనం’ సాక్షి, బెంగళూరు : ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు బ్యాంకర్లు ప్రవేశపెట్టిన ఏటీఎం (ఆటోమెటిక్ టెల్లర్ మిషన్) వ్యవస్థ అసాంఘిక శక్తులకు వరప్రసాదమవుతోంది. ఏటీఎం ఏర్పాట్లపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణపై చూపకపోవడంతో ప్రజాధనానికే కాదు.. వినియోగదారుల ప్రాణాలకే భద్రత లేకుండా పోతోంది. మొన్నటిమొన్న మహదేవపుర వద్ద ఉన్న ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డు హత్య, తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌పై దాడి, నిన్న సెక్యూరిటీ గార్డుపై దాడి ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. సంఘటన చోటు చేసుకున్నప్పుడు హడావుడి చేయడం తప్ప అసలు సమస్యకు పరిష్కారం కనుగొనడంలో బ్యాంకర్లు, పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో చోటు చేసుకుంటున్న నేరాల్లో దేశవ్యాప్తంగా పోలిస్తే కర్ణాటక మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్న ఏటీఎం దోపిడీలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు ఏటీఎం కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర హోం శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఓ లేఖ రాసింది. అమలుకు నోచుకోని విదేశీ అధ్యయనాలు! రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా అధ్యయనం పేరిట ప్రజా ప్రతినిధులు విదేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. అక్కడ వారు అధ్యయనం చేసిన విషయాలను ఇక్కడ అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఏటీఎంల నిర్వహణ విషయంలోనే ఈ విషయం తేటతెల్లమవుతోంది. విదేశాల్లోని ఏటీఎం కేంద్రాలు అక్కడి పోలీస్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఏటీఎం కేంద్రాల్లోని అలారం మీట నొక్కితే అయా పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు అప్రమత్తమై క్షణాల్లో అక్కడకు చేరుకునే సదుపాయం విదేశాల్లో ఉంది. ఇలాంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడం గమనార్హం. దీంతో ఏటీఎం కేంద్రాల్లో లూటీ, దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. 2013లో చోటు చేసుకున్న ముఖ్య ఏటీఎం దురా‘గతాలు’.. = బెంగళూరులోని ఆర్టీ నగర్‌లోని కార్పొరేషన్ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళుతున్న వ్యాన్‌ను ముసుగులు ధరించిన ఏడుగురు మారణాయుధాలతో అటకాయించి, రూ.1.91 కోట్ల నగదును లూటీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ కేవలం రూ. 50 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. = నాగశెట్టిహళ్లిలోని కెనరా బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసిన ముగ్గురు వ్యక్తులు రూ.31.9 లక్షల నగదును దోచుకున్నారు. తర్వాత వీరిని పోలీసులు పట్టుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో నగదు రికవరీ చేయలేకపోయారు. = ఔటర్ రింగ్ రోడ్డు మహదేవపుర వద్ద ఉన్న ఏటీఎంను ముగ్గురు వ్యక్తులు దోచుకోవడానికి విఫల యత్నం చేశారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డును చంపేశారు. = కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌పై 40 రోజుల క్రితం ఏటీఎం కేంద్రంలో జరిగిన పాశావిక దాడిలో నిందితుడి ఆచూకీని ఇప్పటికీ పోలీసులు గుర్తించలేకపోయారు. = హొంగసంద్రలోని ఎస్బీఎం ఏటీఎం లూటీకి ఇద్దరు విఫల యత్నం చేశారు. ఈ ఘటనలో ఒక దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఏటీఎం సెక్యూరిటీ గార్డు షహబుద్దీన్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.