Security standards
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
ఏమరపాటుగా ఉంటే అంతే...
సాక్షి,న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్ఫింగ్ ఎలాంటి రిస్క్ లేకుండా సాఫీగా సాగే రోజులు కావివి. ఇంటింటికీ నెట్ అందుబాటులోకి రావడంతో ఆ స్క్రీన్ల వెనుకే ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. నెట్ అనేది లగ్జరీ నుంచి అవసరంగా మారడంతో దాంతోపాటు రిస్క్‌లూ సవాల్ విసురుతున్నాయి. సామాన్యులతో పాటు హ్యాకర్లు ఇప్పుడు కార్పొరేట్లనూ టార్గెట్ చేస్తున్నారు. కంపెనీలను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. టార్గెట్ దాడులు పక్కా ప్రణాళికతో సాగుతుండటంతో వీటికి చెక్ పెట్టడం సంక్లిష్టంగా మారింది. గత ఏడాదిగా టార్గెట్ అటాక్‌కు గురై పెద్ద మొత్తంలో మేథో సంపత్తి వ్యాపారాన్ని కోల్పోయామని సర్వేలో పాల్గొన్న వాటిలో 9 శాతం సంస్థలు వాపోయాయి. 2016లో ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు సగం కంపెనీలు కనీసం ఒక సందర్భంలోనైనా సైబర్ దోపిడీకి గురైన ఉదంతాలు వెల్లడయ్యాయి. 39 శాతం కంపెనీలు రాన్సమ్వేర్ దాడికి గురయ్యాయి. పెద్ద కంపెనీలు సన్నద్ధంగా లేకపోవడమే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కేవలం 45 శాతం కంపెనీలే సైబర్ దాడులను తిప్పికొట్టేలా సన్నద్ధంగా ఉన్నాయని సిస్కో 2017 సెక్యూరిటీ క్యాపబిలిటీస్ సర్వే వెల్లడించడం గమనార్హం. వెబ్‌లో తమ ఆస్తుల పరిరక్షణకు బడా, మధ్యతరహా కంపెనీలు సరైన వ్యూహాలతో ముందుకు రావాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. సంస్థల ఆన్లైన్ కార్యకలాపాలను ఛిద్రం చేసేందుకు సైబర్ నేరస్తులు భిన్న వ్యూహాలతో విరుచుకుపడే ప్రమాదం పొంచిఉండటంతో విభిన్న సెక్యూరిటీ ప్రమాణాలతో సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. ఏటా హ్యాకింగ్ విచ్చలవిడిగా పెరుగుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలపై సైబర్ దాడులకు దిగుతుండటంతో దీన్ని అధిగమించే భద్రతా ప్రమాణాలకు పదును పెట్టాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చెక్ పెట్టొచ్చు కంపెనీలు తమ ఉద్యోగులకు సైబర్ సెక్యూరిట్ ముప్పులపై సరైన అవగాహన కలిగించాలి. స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయకుండా సూచనలు చేయడంతో పాటు పటిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడేలా చొరవ చూపాలి. సైబర్ నేరగాళ్ల నుంచి తమ కంపెనీని రక్షించుకునేందుకు ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ ఇప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. సంస్థకు చెందిన అన్ని సిస్టమ్స్, బ్రౌజర్లు, ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తుండాలి. పెద్ద కంపెనీలు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుండటంతో హ్యాకర్లు సులభంగా సెక్యూరిటీ సిస్టమ్స్‌ను బ్రేక్ చేస్తూ యధేచ్చగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. డేటా స్టోరేజ్‌కు క్లౌడ్ సర్వీసులు వాడటం ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక సంస్థలు సైబర్ దాడులకు చెక్ పెట్టేందుకు పూర్తిస్ధాయి భద్రతా సలహాదారును నియమించుకోవడం మేలని చెబుతున్నాయి. -
మొబైల్ కంపెనీలకు భద్రతా ప్రమాణాలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ కంపెనీల నుంచి వ్యక్తిగత, ఆర్థిక సమాచారం చోరీకి గురవుతుందన్న ఆందోళనలతో ఫోన్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను జారీ చేయనుంది. చైనా కంపెనీల విషయంలో మరింత అప్రమత్తత కోసం ప్రభుత్వం మొబైల్ తయారీ కంపెనీలకు కఠిన భద్రతా, ప్రైవసీ మార్గదర్శకాలు, ప్రమాణాలను నిర్థేశించనుంది. మొబైల్ యూజర్ల డేటాను పరిరక్షించేలా రానున్న కొద్దివారాల్లో ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ను ప్రకటిస్తుందని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ ఫోన్ల నుంచి సమాచార చోరీని అరికట్టేందుకు త్వరలో కఠిన ప్రమాణాలు, మార్గదర్శకాలను జారీ చేస్తామని, ఇది చాలా సీరియస్ అంశమని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భారత్‌లో ఆన్లైన్ కార్యకలాపాలకు అత్యధికులు మొబైల్ డేటాపైనే ఆధారపడుతుండటంతో ఇంటర్నెట్ యాక్సెస్ నేపథ్యంలో డేటా చోరీ ఆందోళనకర అంశంగా ముందుకొస్తోంది. మరోవైపు దేశంలో అమ్ముడవుతున్న ఫోన్లలో అత్యధికంగా చైనా కంపెనీలవే కావడం గమనార్హం. ముఖ్యంగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారంతో రిస్క్ చేయలేమని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. -
బతుకు ‘భాగ్య’ నగరం!
♦ దేశంలోనే మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరంగా నిలిచిన హైదరాబాద్ ♦ మెర్సర్స్ ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వేలో వెల్లడి ♦ మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో వియన్నాకు తొలి స్థానం సాక్షి, హైదరాబాద్: బతుకు.. బతికించు అన్న నానుడి శతాబ్దాల రాచనగరి భాగ్యనగరానికిఅచ్చు గుద్దినట్లు సరిపోతోంది. దేశంలో మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ విడుదల చేసిన ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ నగరంలో సామాన్యుడు మనుగడ సాగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేల్చింది. జీవన ప్రమాణాలు,ప్రజలకు అవసరమైన కనీస వసతులు, భద్రతా ప్రమాణాలు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించింది. దేశంలో హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలోని పుణె, ముంబై, దేశ రాజధాని ఢిల్లీ నిలిచాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 230 పెద్ద నగరాలను ఎంపిక చేసుకుని... అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య సమస్యలు, ప్రజాసేవలు, వినోద సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేసినట్లు మెర్సర్ సంస్థ ప్రకటించింది. ఈ సర్వేలో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని నగరాల్లో సింగపూర్ 26వ స్థానంతో అన్నింటికన్నా పైన నిలిచింది. నేరాలు, కాలుష్యం కూడా తక్కువ.. ‘‘దేశంలోని మిగతా నగరాలతో పొల్చితే హైదరాబాద్, పుణె నగరాల్లో నేరాల శాతం తక్కువ. వాయు కాలుష్యం కూడా తక్కువగా ఉంది. ప్రతిష్టాత్మక ఇంగ్లిషు పాఠశాలలు వెలిశాయి. వాణిజ్య రాజధాని ముంబై (152), దేశ రాజధాని న్యూఢిల్లీ (161)ల కంటే మెరుగైన జీవన ప్రమాణాలున్నాయి..’’ అని మెర్సర్స్ సర్వేలో వెల్లడించింది. దక్షిణాసియాలోని ఇతర నగరాలకన్నా భారత్‌లోని నగరాలు సురక్షితమైనవని పేర్కొంది. ఈ సర్వేలో శ్రీలంక రాజధానికి కొలంబో 132వ స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ 193, లాహోర్ 199, కరాచీ 202, బంగ్లాదేశ్‌లోని ఢాకా 216వ స్థానాలు పొందాయి. భద్రమైన నగరం కూడా.. ప్రజల వ్యక్తిగత భద్రతపరంగా చూస్తే హైదరాబాద్‌కు 121వ స్థానం లభించింది. ఈ విభాగంలో దేశంలో 113వ ర్యాంకుతో చెన్నై తొలిస్థానంలో, 123వ ర్యాంకుతో బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. అంతర్గత సామర్థ్యం, నేరాల స్థాయి, స్థానిక చట్టాల అమలు, ఇతర దేశాలతో సత్సంబంధాలు తదితర విషయాలను ఈ వ్యక్తిగత భద్రత ర్యాంకులకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో లక్సెమ్‌బర్గ్ తొలి స్థానంలో బెర్న్, హెల్సింకీ, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నిత్యం హింసాత్మగ ఘటనలు జరిగే డమాస్కస్ 229, బాగ్దాద్ 230 స్థానాల్లో నిలిచాయి. వరుసగా రెండోసారి టాప్‌లో మెరుగైన జీవనానికి అనువైన నగరాల్లో భారత్ నుంచి వరుసగా రెండోసారి హైదరాబాద్ తొలిస్థానం పొందడం గమనార్హం. అయితే గతేడాది మెర్సర్ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భాగ్యనగరం ఈసారి ఒకస్థానం తగ్గింది. గతేడాది విద్యుత్ అంతరాయాలు పెరగడంతో పాటు ఎండల ధాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1,700 మరణాలు నమోదయ్యాయని మెర్సర్ పేర్కొంది. అయితే మొత్తంగా భారత్‌లో జీవన ప్రమాణాల్లో పెద్దగా ప్రగతి లేదని సర్వే స్పష్టం చేసింది. ‘‘ఆరోగ్యం, ఆస్తులు, కెరీర్ తదితర రంగాల్లో గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్‌గా పనిచేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల తీరుపై 230 నగరాల్లో 2010 నుంచి సర్వేలు చేస్తున్నాం. భద్రతపరంగానూ ఏ నగరాలు ఉత్తమమైనవనే దానిపై కూడా అధ్యయనం చేసి వివరాలు వెల్లడిస్తున్నాం..’’ అని మెర్సర్ భారత ప్రతినిధి రుచికాపాల్ పేర్కొన్నారు. టాప్ టెన్ నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) 3. ఆక్లాండ్ (న్యూజిలాండ్) 4. మ్యూనిచ్ (జర్మనీ) 5. వాంకోవర్ (కెనడా) 6. డస్సెల్‌డోర్ఫ్ (జర్మనీ) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. జెనీవా (స్విట్జర్లాండ్) 9. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) 10. సిడ్నీ (ఆస్ట్రేలియా) ► జీవన ప్రమాణాల్లో హైదరాబాద్ 139, పుణె 144వ స్థానంలో నిలిచాయి ► భద్రత విషయంలో చెన్నై 113, హైదరాబాద్ 121, బెంగళూరు 123వ స్థానాల్లో నిలిచాయి.