seeds companies
-
అక్రమ హెచ్‌టీబీటీ పత్తిసాగుపై చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా హెచ్‌టీబీటీ పత్తి విత్తనాల సాగు ఒక్కసారిగా ఊపందుకోవడంపై ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ), నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఐ) ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల పర్యావరణంతోపాటు రైతులకు, చట్టబద్ధమైన విత్తన కంపెనీలకు, ప్రభుత్వాల ఆదాయానికి నష్టమని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి మెరుగ్గా ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తు చేశాయి. గతేడాది 25 లక్షల ప్యాకెట్ల హెచ్‌టీబీటీ కాటన్ విత్తనాలను సాగు చేయగా.. ఈ ఏడాది 70 లక్షల ప్యాకెట్లకు పెరిగిపోయినట్టు రాసి సీడ్స్ చైర్మన్, ఎఫ్‌ఎస్‌ఐఐ చైర్మన్ ఎం.రామసామి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిశ్రమకు, రైతులకు ఎంతో నష్టమన్నారు. -
నకిలీ విత్తన దందా: నకిలీకి ‘అసలు రంగు’
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ విత్తనాల వ్యవహారంలో ఇటీవల కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ఇటు పోలీసు శాఖ, అటు వ్యవసాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రైతులకు, సీడ్ కంపెనీలకు మధ్య అనుసంధానంగా ఉండే దళారుల చేతివాటమే ఈ మొత్తం వ్యవహారానికి మూలకారణమని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో లభిస్తున్న, పక్క రాష్ట్రం నుంచి వస్తున్న నకిలీ విత్తన కేసుల్లో అధిక శాతం ఇలాంటివే వస్తున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. పనికి రాని, తక్కువ నాణ్యత కలిగిన, నకిలీ విత్తనాలను రంగులద్ది ప్యాకింగ్ చేసి, మంచి లాభాలు వస్తాయని ఆశ చూపి రైతులకు అంటగడుతున్నారు. ఈ వ్యవహారంలో పలు జిల్లాల్లో విత్తనాలను విక్రయించే డీలర్లు కూడా కేంద్ర బిందువుగా మారిన విషయాన్ని పోలీసులు గుర్తించి వారిపై నిఘా పెంచారు. సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తున్నా రు. తొలిసారైతే సాధారణ కేసులు, రెండు, మూడోసారి అయితే పీడీ యాక్టులు పెడుతున్నారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు పలు మార్గాల్లో చొరబడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ బృందాలు గుర్తించాయి. దందా నడిచేది ఇలా రాష్ట్రంలో పలు లైసెన్స్ పొందిన విత్తన కంపెనీలు ఉన్నాయి. ఇవి నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తాయి. తయారీకి ముందు రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తాయి. విత్తనాలు సేకరించాక వాటిని తొలుత పలు దశల్లో ప్రాసెస్ చేస్తాయి. తర్వాత వాటికి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తాయి. అందులో తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలను తిరస్కరించి, మిగిలిన వాటికి రైతుల కోసం ప్యాకింగ్ చేస్తాయి. ఇందుకోసం రైతులకు, సీడ్ కంపెనీలకు మధ్యలో కొందరు దళారులుగా ఉంటారు. వీరిని సీడ్ ఆర్గనైజర్లు అంటారు. తిరస్కరించిన విత్తనాలను వీరు తిరిగి రైతులకు అప్పగించాలి. అయితే ఈ విత్తనాలకు ఎంతోకొంత ఇచ్చి వాటిని రైతుల నుంచి సేకరిస్తారు. పైగా ఈ ఆర్గనైజర్లు రైతులకు అప్పులు ఇస్తారు. రైతుల నుంచి సేకరించి, కంపెనీకి పంపిన విత్తనాలు ల్యాబ్‌లో పరీక్షల అనంతరం నాణ్యమైనవని తేలితే అప్పు పోగా, మిగిలిన డబ్బును రైతులకు చెల్లిస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే రైతు తిరిగి వారికే అప్పు చెల్లించాలి. ఈ వ్యవస్థ జిల్లాల్లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక ఫెయిలైన వాటిని ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో నింపి మళ్లీ రైతులకే విక్రయిస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రముఖ బ్రాండ్ల లోగోలను ప్యాకెట్లపై ముద్రించి మరీ అమ్ముతున్నారు. పగులగొట్టరు.. రైతులకు ఇవ్వరు పత్తి విత్తన చట్టం ప్రకారం ఫెయిలైయిన విత్తనాలను కంపెనీలు, ఆర్గనైజర్లు ఆయా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ అధికారుల సమక్షంలో పగులగొట్టాలి. ఇలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఫెయిల్ అయిన విత్తనాలను ఆర్గనైజర్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఎవరైనా రైతులు కావాలని గట్టిగా పట్టుబడితే నామమాత్రంగా కిలోకు రూ.200 మించకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ విత్తనాలకు ఆర్గనైజర్లు రంగులద్ది లూజ్‌గా విక్రయిస్తున్నారు. ఈ ఏడాది అత్యధికంగా కేసులు 2014లో 3 కేసులు, 2015లో 25 కేసులు, 2016లో 31 కేసులు, ఏడు పీడీ కేసులు 2017లో 69 కేసులు, మూడు పీడీ కేసులు, 2018లో 115 కేసులు, ఒక పీడీ యాక్టు, 2019లో 160 కేసులు, రెండు పీడీ యాక్ట్‌లు, 2020లో 112 కేసులు, 14 పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో జనవరి 1 నుంచి జూన్ 19 వరకు ఏకంగా 321 కేసులు, 7 పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి. 446 మందిని అరెస్టు చేశారు. 4,940 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు.. ‘నకిలీ విత్తనాలకు సంబంధించిన కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. రైతులకు నష్టం కలిగించే విత్తనాల విషయంలో మోసాలను ఉపేక్షించేది లేదు. ఈ క్రమంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విత్తన డీలర్లు, సీడ్ ఆర్గనైజర్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజలకు కూడా ఎలాంటి చిన్న సమాచారం తెలిసినా డయల్ 100 లేదా సమీపంలోని పోలీసు స్టేషన్లో సమాచారమివ్వండి.’ - ఐజీ నాగిరెడ్డి -
రాష్ట్రం విత్తన భాండాగారం కావాలి
-
రాష్ట్రం విత్తన భాండాగారం కావాలి
- విత్తన కంపెనీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు - 95 నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి - రైతులకు మేలు రకమైన సాగు పద్ధతులు నేర్పించండి - తెలంగాణలో విత్తన ఉత్పత్తి మరింత పెరగాలి - వ్యవసాయ వర్సిటీకి పూర్వ వైభవం తెస్తాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియలో విత్తన కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం విత్తన ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, పలువురు విత్తన కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తొలి దశలో తెలంగాణలోని 95 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని, ఒక్కో విత్తన కంపెనీ దత్తత తీసుకోవాలని సీఎం కోరారు. కంపెనీ దత్తత తీసుకున్న గ్రామాల్లో రైతులను విత్తన ఉత్పత్తికి ప్రోత్సహించి, మేలు రకమైన సాగు పద్ధతులు నేర్పాలన్నారు. సీఎం ప్రతిపాదనకు విత్తన కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో సమావేశమై గ్రామాలను దత్తత తీసుకునే అంశంలో తుది నిర్ణయం తీసుకొంటా మని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రం లో విభిన్న స్వభావం కలిగిన నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం ఉన్నా యని, ఈ పరిస్థితులు విత్తన ఉత్పత్తికి ఎంతో దోహదం చేస్తాయని సీఎం చెప్పారు. ‘‘ఇలాం టి ప్రత్యేక పరిస్థితులున్నందునే ఇక్రిశాట్‌తో పాటు దాదాపు 364 విత్తన కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. భారత దేశ విత్తన రాజధానిగా పేరుంది. దేశానికి అవసరమయ్యే 80 శాతం విత్తనాలు తెలంగాణలో తయారవుతున్నాయి. 2.90 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరిస్థితిని మరింత సానుకూలంగా మలుచుకొని విత్తన ఉత్పత్తి మరింతగా జరగాలి. అది రైతులకు ఉపయోగపడాలి. దేశానికి అవసరమైన, మనం ఉత్పత్తి చేయాల్సిన విత్తనాలు, ఏ ప్రాంతంలో ఏ రకమైన విత్తనాలు పండించాలనే అంశాలపై అవగాహనకు రావాలి. రైతులను చైతన్య పరిచి విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించాలి’’ అని సీఎం అన్నారు. పరిశోధనలు ప్రోత్సహిస్తాం... రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో అధికారులను నియమిస్తున్నామన్నారు. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయ అధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వ్యవసాయ వర్సిటీకి పూర్వవైభవం తెచ్చి, పరిశోధనలు ప్రోత్సహిస్తామన్నారు. రైతులు వీలైన సాగు పద్ధతులు పాటించేలా అవగాహన పెంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిడ్డంగుల సంఖ్య పెంచుతామన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ పలు ప్రాంతాలను క్రాప్ కాలనీలుగా వర్గీకరణ చేసిందన్నారు. ఇది మరింత లోతుగా సాగాలన్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీలు కలిసికట్టుగా ఈ అధ్యయనం చేయాలని సూచించారు. సమైక్య పాలనలో కుదేలయిన వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి వ్యవసాయాధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సూచించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, ఏ పంటలు వేస్తే మేలు జరుగుతుందో చెప్పాలన్నారు. మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్రం, జిల్లాలకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. కాగా రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలం టే విత్తన సాగుకు ముందుకు వచ్చే రైతులకు కొంత నగదును ప్రోత్సాహకంగా ఇవ్వాలని విత్తన కంపెనీల రైతులు సీఎంకు సూచిం చిగా... అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పం దించినట్లు సమాచారం. విత్తనోత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై మరోసారి చర్చించేందుకు సీఎం బుధవారం 40 పెద్ద విత్తన కంపెనీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. విత్తన ఉత్పత్తితో అధిక ఆదాయం ఇక విత్తన ఉత్పత్తి చేసే రైతుకు సాధారణ పంట కంటే అధిక ఆదాయం వస్తుందని మంత్రి పోచారం తెలిపారు. రైతులు పండిం చిన విత్తనాలను కంపెనీలు నిర్ణీత ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతువారీ బీమా, కనీస మద్దతు ధర, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వంటి విషయాలపై త్వరలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణమాఫీలో మిగిలిన సగాన్ని ఒకేసారి త్వరలోనే బ్యాంకులకు చెల్లిస్తామని చెబుతున్నా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఏపీలో రుణమాఫీనే జరగలేదని గుర్తుచేశారు. విత్తన ఉత్పత్తి సంస్థల ప్రతిని ధులు హరీష్‌రెడ్డి, ఏఎస్ఎన్ రెడ్డి, నిరంజన్, సుదర్శన్, శ్యాంసుందర్‌రావు, రమణారావు, శ్రీపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తి రైతుల గగ్గోలు
వీణవంక: విత్తన కంపెనీల మాయాజాలంలో పడి విత్తనోత్పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు. పదిరోజుల్లో ఇస్తామన్న విత్తన ధాన్యం డబ్బులు.. మూడు నెలలైనా అందకపోవడంతో ముప్పు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతవరణం ఉండటంతో 42 దేశీ, విదేశీ విత్తనోత్పత్తి వరి ధాన్యం కంపెనీలు 22 ఏళ్లుగా పాగా వేశాయి. మొదట్లో రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు చెల్లించేవారు. కానీ రానురాను మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. గత రబీలో జి ల్లాలో లక్ష ఎకరాల్లో ఆడ, మగ వరి సాగైంది. వాతావరణం సహకరించడంతో అనుకున్నదాని కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. 1.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం చేతికి వస్తుందని కంపెనీలు అంచనా వేయగా దాదాపు మూడు లక్షల క్వింటాళ్ల ధాన్యం పండింది. ఏప్రిల్‌లో కంపెనీలు కళ్లాల వద్దే కాంటాలు వేసి ధాన్యాన్ని కొని.. లారీల ద్వారా తమ ప్రాంతాలకు తరలించుకున్నాయి. రైతులకు దాదాపు రూ.వంద కోట్లు రావాల్సి ఉంది. నిలువుదోపిడీ క్వింటాల్‌కు రూ.5-10వేలు చెల్లిస్తామని ఆశ చూపడంతో ఆ ధాన్యం సాగు చేసేం దుకు రైతులు మొగ్గు చూపారు. పంట దిగుబడి వచ్చిన రాకపోయిన ఆ ధర చె ల్లిస్తామని నమ్మించారు. అంతేకాకుండా నేరుగా రైతు ఖాతాలోనే జమవుతాయని ఆశ పెట్టారు. ధాన్యం కొనే సమయంలో తరుగు పేరిలా క్వింటాల్‌కు పది కిలోల చొప్పున తీసివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కంపెనీలు డీలర్లకు డబ్బులు చెల్లించినా వారు సొంతానికి వాడుకున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల వీణవంక మండలం లస్మక్కపల్లికి చెందిన తిరుపతిరెడ్డి అనే ఏజెంట్‌ను మహదేవపూర్ మండల రైతులు కిడ్నాప్ చేయడం సంచలనం రేపింది. డబ్బులు సకాలంలో ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని రైతులు సదరు ఏజెంట్‌ను చితకబాదారు. కొన్ని కంపెనీలు బోర్డు తిప్పేసేటట్టు ఉన్నాయని తెలుసుకున్న రైతు లు కంపెనీ ప్రధాన కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంథని, జగిత్యాల, శంకరపట్నం, హుజూరాబా ద్, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి, సు ల్తానాబాద్, పొత్కపల్లి మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు.