seemandhra lawyers
-
విభజన ఆగేదాకా ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్ని ఇదే తీవ్రతతో కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదులు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా వచ్చే నెల 26 వరకు సీమాంధ్రలో విధులను బహిష్కరించాలని వారు తీర్మానించారు. అలాగే వచ్చే నెల 17న ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు ప్రధానమంత్రిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతిపత్రాలు సమర్పించనున్నారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకుగానూ వచ్చే నెల 26న విశాఖపట్నంలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సును నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ‘అడ్వొకేట్స యాక్షన్ కమిటీ ఫర్ సమైక్య ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సు శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సులో హైదరాబాద్‌తో పాటు 13 జిల్లాలకు చెందిన సీమాంధ్ర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా.. కమిటీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పంజాబ్, హర్యానా ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి.. సదస్సులో సీవీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ప్రజలకు కలిగే కష్టనష్టాలను పట్టించుకోకుండా యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చేస్తే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించజాలమన్నారు. వచ్చే పది, పదిహేను ఏళ్లలో నీటి యుద్ధాలు తప్పవని, ఇది తాను చెబుతున్న మాట కాదని, రాజకీయ నిపుణులు చెబుతున్న మాటని ఆయన తెలిపారు. పంజాబ్, హర్యానా ఎప్పుడో విడిపోయినా.. ఇప్పటికీ ఆ రెండింటి మధ్యా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని మోహన్‌రెడ్డి చెప్పారు. అప్పులు, ఆస్తులు, నీటి పంపకాలు ఇలా ప్రతి విషయంలోనూ విభేదాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ వంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే అందుకు కనీసం 50 నుంచి వందేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. రైతుల నోట్లో మట్టే.. అనంతరం బార్ కౌన్సిల్ సభ్యుడు ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. కలిసి ఉంటే అన్ని ప్రాంతాలు కూడా నీటిని పంపిణీ చేసుకోవడం సులభమవుతుందన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రస్తుతం సాగుతున్న పంపిణీ, విభజన వల్ల కష్టసాధ్యమవుతుందని, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు నెలకొంటాయని చెప్పారు. సభలో మాట్లాడేందుకు కొందరికే అవకాశం ఇస్తున్నారని, జిల్లాల నుంచి వచ్చిన తమకు అవకాశం ఇవ్వాలని కొందరు న్యాయవాదులు కొద్దిసేపు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వారికి సర్దిచెప్పడంతో సదస్సు సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, రామిరెడ్డి, గంటా రామారావు, కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, ఎన్.హరినాథ్‌రెడ్డి, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ జయకర్, సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్, ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఏపీ పరిరక్షణ వేదిక సమన్వయకర్త లకష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కొందరు తెలంగాణ న్యాయవాదులు అశోకా గార్డెన్సలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. -
ఉద్యమాలు ఉధృతం చేస్తాం: సీమాంధ్ర న్యాయవాదులు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీమాంధ్ర న్యాయవాదులు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రమే ధ్యేయంగా సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌లోని అశోక గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించి.. వాటర్‌ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర విభజన అవసరం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఈ సందర్భంగా న్యాయవాదులు అన్నారు. హైకోర్టు బెంచ్‌ను ఆంధ్రాలోనూ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో మేధావులు లేరని కేటీఆర్ ఎద్దేవా చేశారని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత సీమాంధ్రలో మేధావులు ఉన్నారో లేదో కేటీఆర్‌కు తెలుస్తుందని తెలిపారు. త్వరలో ఢిల్లీ కోటను ముట్టడిస్తామని, సోనియాకు సమైక్యరాష్ట్ర ఆకాంక్షను తెలియజేస్తామని అన్నారు. మనుషులను మనుషుల్లా చూడటం కేసీఆర్ నేర్చుకోవాలని, ఆయన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని తెలిపారు. తాము శాంతియుతంగానే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. -
హైకోర్టులో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో బుధవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. సీమాంధ్ర న్యాయవాదులు మానవహారాన్ని అడ్డుకునేందుకు రంగారెడ్డి, మేడ్చల్ కోర్టుల తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వీరిని హైకోర్టు గేటు దగ్గరే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం విడుదల చేశారు. విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు బుధవారం హైకోర్టు బయట మానవహారం నిర్వహించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న రంగారెడ్డి, మేడ్చల్ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకుండా మదీనా సెంటర్ నుంచి హైకోర్టు వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే కోర్టులోకి అనుమతించారు. అయితే మధ్యాహ్నం సమయంలో తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిని కోర్టు బయటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణ న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ న్యాయవాదుల అరెస్ట్‌పై న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదుల బృందం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ సేన్‌గుప్తాను కలిసింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరింది. దీంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు తెలంగాణ న్యాయవాదుల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలివ్వడంతో పోలీసులు వారిని విడుదల చేశారు. మానవహారం వాయిదా.. సీమాంధ్ర న్యాయవాదులు బుధవారం తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేయడంతో మానవహారాన్ని వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సీవీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు మోహన్‌రెడ్డితో ప్రధాన న్యాయమూర్తి చర్చలు జరిపారు. ప్రస్తుతం హైకోర్టులో పరిస్థితులు సరిగా లేవని, మానవహారం కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని , లేకుంటే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని మోహన్‌రెడ్డికి ప్రధాన న్యాయమూర్తి సూచించినట్లు సమాచారం. దీంతో మోహన్‌రెడ్డి ఇతర సీమాంధ్ర న్యాయవాదులతో చర్చించి ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తిని అగౌరవపరచడం మం చిది కాదన్న ఉద్దేశంతో, మానవ హా రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మాకు, టి-లాయర్లకు అవగాహన ఉంది: మోహన్‌రెడ్డి
-
మాకు, టి-లాయర్లకు అవగాహన ఉంది: మోహన్‌రెడ్డి
తెలంగాణ న్యాయవాదులకు, తమకు స్పష్టమైన అవగాహన ఉందని సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ నేత సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం నాడు మానవహారం నిర్వహిస్తున్న విషయాన్ని తాము తెలంగాణ లాయర్ల జేఏసీకి కూడా చెప్పామని ఆయన వివరించారు. వారు చలో హైకోర్టు నిర్వహిస్తున్నందున ఒకరి కార్యక్రమాలను ఇంకొకరు అడ్డుకోకూడదని అనుకున్నామని, శాంతియుతంగా 20 నిమిషాలసేపు మానవహారం చేద్దామని నిర్ణయించుకున్నామని మోహన్‌రెడ్డి చెప్పారు. హైకోర్టులో శాంతి భద్రతలను కాపాడాలని ప్రధాన న్యాయమూర్తి తమకు చెప్పారని, గొడవలు పడకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా సూచించారని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రతిష్టలను కాపాడాలని చీఫ్ జస్టిస్ విజ్ఞప్తి చేశారన్నారు. ఈనెల 14వ తేదీన అనంతపురంలో సమావేశమై.. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. -
పోటాపోటీ ప్రదర్శనకు సిద్దమైన ఇరు ప్రాంత లాయర్లు
-
హైకోర్టు వద్ద టెన్షన్ వాతావరణం
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన అంశం హైకోర్టును దద్దరిల్లేలా చేస్తోంది. విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు, దానిని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలతో హైకోర్టు పరిసరాలు బుధవారం అట్టుడుకుతున్నాయి. ఓ వైపు సీమాంధ్ర న్యాయవాదుల మానవ హారం, మరోవైపు తెలంగాణ న్యాయవాదులు ర్యాలీ చేపట్టేందుకు సన్నద్దం అవుతుండటంతో హైకోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైకోర్టు 6,7 గేట్ల వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు. కాగా నిరసనలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అడిషనల్ సీపీ అంజన్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైకోర్టు లోపల, వెలుపల ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్ఫష్టం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేపడితే అరెస్ట్‌లు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఛలో హైకోర్టు అంటూ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం అవుతున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో సమైక్య సమరం
-
హైకోర్టులో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం సీమాంధ్ర న్యాయవాదులు మౌనదీక్ష చేపట్టగా.. దానిని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించటంతో.. హైకోర్టులో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గత వారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. ఈసారి పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టటంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తప్పింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా హైకోర్టులో భోజన విరామ సమయంలో బార్ కౌన్సిల్ ఎదుట మౌనదీక్ష నిర్వహించేందుకు దాదాపు 300 మంది సీమాంధ్ర న్యాయవాదులు బార్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిలో కొందరు జై సమైక్యాంధ్ర నినాదాలు చేయగా.. ఆ దగ్గర్లోనే ఉన్న తెలంగాణ న్యాయవాదులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై రోప్ పార్టీల సాయంతో ఇరుపక్షాల న్యాయవాదులు పరస్పరం ఎదురుకాకుండా అడ్డుకున్నారు. మౌనదీక్షలో పాల్గొనటానికి కిందకు వస్తున్న సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సి.వి.మోహన్‌రెడ్డిని, మరికొందరు న్యాయవాదులను అరెస్ట్ చేసి ఫలక్‌నుమా స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలంగాణ న్యాయవాదుల్లో కొందరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకు న్యాయవాదులను పోలీసులు హైకోర్టుకు తీసుకువచ్చి విడిచిపెట్టారు. ఇదిలావుంటే.. సెప్టెంబర్ 6న సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు జరిపిన దాడిని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖండించాయి. -
న్యాయవాదులే దాడులు చేయడం సమంజసమేనా?
హైకోర్టులో దాడులను ఖండించిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై తెలంగాణ న్యాయవాదులు భౌతిక దాడులకు దిగారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా దుర్భాషలాడారని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులతో కుమ్మక్కై తమపై దాడికి సహకరించారని ఆరోపించారు. సీమాంధ్ర న్యాయవాదులు నలుగురికి రక్త గాయాలయ్యాయని, ఒకరికి ముఖం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించాల్సిన న్యాయవాదులే భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్యంలోని కనీస హక్కులకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించారు. ఇది ఎంతవరకు సమంజసమో వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి’’ అని ఆయన తెలంగాణ న్యాయవాదులకు హితవు పలికారు. హైకోర్టు వద్ద శుక్రవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలు ఘర్షణకు దారితీశాయి. ప్రివెంటివ్ కస్టడీ కింద దాదాపు 60 మంది సీమాంధ్ర న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా విడుదలైన సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం సాయంత్రం గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మానవహారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు కూడా దాడికి సహకరించారని అన్నారు. శనివారం నాటి ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర న్యాయవాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు రణరంగమైంది. న్యాయదేవత సాక్షిగా, పోలీసుల సాక్షిగా సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు న్యాయవాదులు గాయపడగా, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా శుక్రవారం సీమాంధ్ర న్యాయవాదులు చేపట్టిన ‘మానవహారం’.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ‘చలో హైకోర్టు’ కార్యక్రమాలతో హైకోర్టు అట్టుడికింది. ఈ క్రమంలోనే మానవహారానికి సిద్ధమైన సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు న్యాయవాదులు (హైకోర్టుకు చెందిన వారు కాదు) చేయిచేసుకున్నారు. దీంతో హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే చోటు చేసుకుంది. దాడికి దిగిన న్యాయవాదుల్లో ఐదుగురిని పోలీసులు ఆ తరువాత అరెస్ట్ చేశారు. అలాగే సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డితో సహా 25 మందికిపైగా సీమాంధ్ర న్యాయవాదులను అదుపులోకి తీసుకుని సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఏం జరిగిందంటే... రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం సిటీ కాలేజీ నుంచి మదీనా వరకు మానవహారం నిర్వహించాలని నాలుగురోజుల కిందట నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులు గురువారమే హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించడానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రంగారెడ్డి, నాంపల్లి కోర్టులతోపాటు జంట నగరాల్లో వివిధ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం హైకోర్టుకు చేరుకున్నారు. ముందుగానే ఇరుపక్షాల కార్యక్రమాలపై సమాచారం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మదీనా చౌరస్తా, సిటీ కాలేజీలతో పాటు హైకోర్టు పరిసర ప్రాంతాలు పోలీసులతో నిండిపోయాయి. ముందు నిర్ణయించుకున్న మేరకు సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మానవహారం కార్యక్రమం నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ గేటు వద్దకు చేరుకున్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 40 మంది సీమాంధ్ర న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అప్పటికే అక్కడకు తెలంగాణ న్యాయవాదులు వచ్చి ఉన్నారు. మోహన్‌రెడ్డితో పాటు ఓ 30 మంది న్యాయవాదులు గేటు దాటి రోడ్డుపైకి వెళ్లగా, బార్ కౌన్సిల్ వద్ద ఉన్న మిగిలిన న్యాయవాదులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ న్యాయవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. గేటు బయట ఉన్న మోహన్‌రెడ్డి తదితరులు ఉన్న చోటికి తెలంగాణ న్యాయవాదులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే గేటు మూసివేసి, మోహన్‌రెడ్డి తదితరులను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది సీమాంధ్ర న్యాయవాదులు గేటు లోపల కోర్టు ప్రాంగణంలోనే బార్ కౌన్సిల్ వద్దే ఉండిపోయారు. వారు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బయటినుంచి వచ్చిన న్యాయవాదులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడి చేశారు. దాడి.. దూషణలు... సీమాంధ్ర న్యాయవాదులు శ్రీనివాస్, బాలాజీ, విష్ణు తదితరులపై తెలంగాణ న్యాయవాదులు చేయి చేసుకున్నారు. అయ్యప్పదీక్షలో ఉన్న న్యాయవాదుల సంఘం మాజీ కార్యదర్శి జి.ఎల్.నాగేశ్వరరావును కూడా వదిలిపెట్టలేదు. మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన మహిళా న్యాయవాదులను సైతం చుట్టుముట్టి, రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. ఈ ఘటనను సెల్ఫోన్లో ఫోటోలు తీసిన వారిని చితకబాదారు. సెల్ఫోన్లో ఫోటోలు తీసేసేవరకు వారిని వదల్లేదు. చివరకు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు వచ్చి పలుమార్లు సర్దిచెప్పడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ‘జై తెలంగాణ’ నినాదాలతో హైకోర్టు కారిడార్లలో ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తరువాత భోజన విరామ సమయంలో హైకోర్టు న్యాయవాదుల క్యాంటీన్‌కు చేరుకుని అక్కడ భోజనం చేస్తున్న వెంకటేశ్వరరావు అనే న్యాయవాదిపై దాడి చేశారు. అక్కడే గిన్నెల్లో ఉన్న సాంబార్ పోసి, చితకబాదగా ఆయన పళ్లు కదిలిపోయాయి. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స కోసం హైకోర్టులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు హైకోర్టులో దాడుల వ్యవహారంలో పోలీసుల తీరుపై మహిళా న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో అప్పటికప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను సమను చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే కమిషనర్ వెళ్లి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మహిళా న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులకు పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలా..? వద్దా..? అన్న విషయంపై ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. అరెస్ట్ చేసిన న్యాయవాదులందరినీ పోలీసులు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విడుదల చేశారు. పోలీసుల ప్రేక్షకపాత్ర హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పాటించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హైకోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనల నేపథ్యంలో శుక్రవారం దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు ముందే హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఘర్షణలను, దాడులను నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మానవహారం జరిగేముందే ఇరుపక్షాలతో మాట్లాడి వారి వారి కార్యక్రమాల సమయాన్ని మార్చడం, వేదికలను కుదించడం వంటి చర్యలేవీ పోలీసులు చేపట్టలేదు. ఇద్దరు ముగ్గురిపై దాడులు జరిగిన తరువాత పోలీసులు రంగప్రవేశం చేసి కొట్టవద్దని బ్రతిమలాడటం కనిపించింది. -
హైదరాబాద్‌పై ఎటూ తేల్చుకోలేని హైకమాండ్
-
న్యాయవాదుల మధ్య ఘర్షణ, హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ - సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ - హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ అడ్వకేట్ జనరల్ సి.వి.మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అందరిని వ్యానులో ఎక్కించి దూరం తీసుకెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న మానవహారాన్ని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. చిన్నగా మొదలైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైయ్యాయి. హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని... ఎవరూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని మైకుల్లో పోలీసులు పదే పదే ప్రకటించినా ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కసారిగా రెండు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు గుమికూడటంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులు మోహరించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.