ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. జీవోఎంకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమావేశం అనంతరం మంత్రులను మాట్లాడించేందుకు ప్రయత్నించగా మంత్రి జేడీ శీలం 'నో కామెంట్' అని వ్యాఖ్యానించగా, కావూరి 'కాఫీ తాగాం' అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి మంత్రుల బృందాన్ని మరోసారి కలుస్తాం అని పనబాక లక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ లను కలుస్తామన్నారు.