Seetharama Raju
-
మన్యం విప్లవ జ్యోతి..
భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పథాన్ని అనుసరించి పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. విశాఖ జిల్లా పాండ్రంకిలో జన్మించిన ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ విద్యతో పాటు యుద్ధ విద్య, జ్యోతిష్యం వంటివాటిని అభ్యసించాడు. తరువాత దేశ సంచారం చేసి దేశంలో ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని విశాఖ జిల్లా కృష్ణదేవిపేట వచ్చి మన్యంలో తిరుగుబాటు మొదలుపెట్టాడు.కవర్డు, హైటర్ వంటి అధికారులను సీతారామరాజును మట్టు పెట్టటానికి మన్యం పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. లోతుగడ్డ వాగు దగ్గర సీతారామరాజు ఉన్నాడని తెలుసుకొని, 300 మంది పటాలంతో వాళ్లు బయలుదేరారు. ముందుగానే వారి రాకను పసిగట్టిన సీతా రామరాజు విలువిద్యలో ఆరితేరిన గోకిరి ఎర్రేసు, గాము గంటం దొర, మల్లు దొర, పడాలు అగ్గిరాజువంటి వారితో కలిసి గొరిల్లా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇరుకైన మార్గంలో వస్తున్న కవర్డ్, హైటర్లు సీతారామరాజు దళం దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఇది రామరాజు మొదటి విజయం. దీంతో రామరాజు తలమీద బ్రిటిష్ గవర్నమెంట్ 10 వేల రివార్డు ప్రకటించింది.అయితే ఈ దాడిలో మల్లు దొరకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు రామరాజు బ్రిటిష్ వారితో పోరాడాలంటే విల్లంబులు చాలవనీ, తుపాకులు కావాలనీ భావించాడు. తుపాకుల కోసం ఎవరి మీద దాడి చేయకుండా, పోలీస్ స్టేషన్లో తుపాకులను, మందుగుండు సామగ్రిని కొల్లగొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అన్నవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లకు ఒకదాని తరువాత మరొకదానికి మిరపకాయ టపా పంపి తాను స్టేషన్‌పై దాడికి వస్తున్నట్లు తెలిపి మరీ తుపాకులను దోచుకున్నాడు. పోలీస్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు తీసుకువెళ్తున్నాడో ఆ వివరాలన్నీ రాసి కింద ‘శ్రీరామరాజు’ అని సంతకం చేశాడాయన.గుంటూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న రూథర్‌ఫర్డ్‌ను సీతారామరాజును అణచడానికి విశాఖ జిల్లాకు పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదే సమయంలో పరమ నీచుడైన బ్రిటిష్ మేజర్ గుడాల్, గిరిజన గూడేలపై పడి ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తూ పసిపిల్లలను వధించటం, భార్యల ఎదుటే భర్తను చంపటం, గిరిజన గూడేలను తగలబెట్టడం లాంటి చర్యలకు ఒడిగట్టాడు. ఇది సీతారామరాజుకి తెలిసి, తన వల్ల అమాయకులైన గిరిజన జనం చనిపోవడం, ఇబ్బందులపాలు కావడం ఇష్టంలేక లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో గుడాల్ మాటు వేసి, తన సైన్యంతో సీతారామరాజును బంధించాడు. ఆయన్ని నులక మంచానికి కట్టి, నానా హింసలు పెట్టి, వీధుల్లో ఊరేగించి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక విప్లవ జ్యోతి అమరదీపమై దేశ స్వాతంత్రోద్యమానికి దారి చూపింది. – పొత్తూరి సీతారామరాజు, కాకినాడ (నేడు అల్లూరి సీతారామరాజు జయంతి) -
సస్పెన్స్.. థ్రిల్
కృష్ణసాయి, జహీదా శామ్ జంటగా పి.ఎస్. నారాయణ దర్శకత్వంలో ఎం.ఎస్.కె ప్రమిదశ్రీ ఫిలింస్ బ్యానర్‌పై ఎం.ఎస్.కె.రాజు నిర్మిస్తున్న ‘వీడు అసాధ్యుడు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సీతారామరాజు కెమెరా సిచ్చాన్ చేయగా, నటుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. నటుడు శివకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.నారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో, నిర్మాత ఎం.ఎస్.కె.రాజుగారే. హీరోగా కృష్ణసాయి అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. క్రిమినల్ లాయర్‌గా పనిచేసే ఆయన సినిమా నిర్మించాలనే ఆకాంక్షతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు’’ అన్నారు. ‘‘సినిమాపై ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. సామాజిక స్పృహ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. మంచి కంటెంట్‌తో కమర్షియల్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఎం.ఎస్.కె.రాజు. ‘‘మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జహీదా శామ్. ఈ చిత్రానికి çశంభుప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ∙కృష్ణ సాయి, జహీదా శామ్ -
ప్రాణం తీసిన అతివేగం
కనకదుర్గమ్మ వారధి వద్ద యువకుడి సజీవదహనం రేపోమాపో పెళ్లికావాల్సిన కుర్రాళ్లు.. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొత్తగా వేస్తున్న రోడ్డుపై జీబ్రా చారలు వేస్తుండగా పెయింట్ డబ్బాలను ఢీకొనడంతో మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. కనకదుర్గమ్మ వారధిపై గురువారం ఉదయం ఈ సంఘటన సినీఫక్కీలో జరిగింది. తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా) : అతివేగం మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడిని బలితీసుకుంది. పెయింట్ డబ్బాల రూపంలో మృత్యువు వెంటాడగా, పెట్రోల్ రూపంలో సజీవ దహనం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధిపై గురువారం అందరూ చూస్తుండగా అచ్చం సినిమా సన్నివేశంలా జరిగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన వెలగల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు సీతారామరాజు (23)కు చిలకలూరిపేట సమీపంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన మిత్రుడు మందా నారాయణస్వామితో కలిసి రిలయన్స్ 4జి కంపెనీలో విధులు నిర్వహిస్తుంటారు. వీరిద్దరూ నిత్యం గుంటూరు నుంచి పల్సర్ ద్విచక్రవాహనంపై విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. సీతారామరాజుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. రోజూ మాదిరిగానే గురువారం మిత్రుడితో కలిసి విజయవాడ బయలుదేరిన వీరు కనకదుర్గ వారధిపై అతి వేగంగా వెళ్తూ రోడ్డుపై జీబ్రా లైన్లు వేస్తున్న పెయింట్ డబ్బాలను ఢీకొట్టారు. అచ్చం సినిమా సన్నివేశంలా.. బైక్ వేగానికి పెయింట్ డబ్బాలతో పాటు అందులో కలిపే టిన్నర్ సైతం ఎగిరి వీరి ఒంటి నిండా పడింది. అప్పటికే ఆ డబ్బాలలో కొంత కిరోసిన్ కలిపి ఉండడం, అది వీరి ఒంటిపై పడడంతో కంగారు పడ్డ వీరు దిచక్రవాహనాన్ని నియంత్రించలేకపోయారు. వారధిపై 8-9 ఖానాల నడుమ బండి అదుపుతప్పి కిందపడి దూసుకు వెళుతుండడంతో బండిలోని పెట్రోల్ ఒలికి రోడ్డుపై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరినీ తడిపేసింది. ఆ సమయంలోనే పల్సర్ వాహనం ఒత్తిడికి రోడ్డుపై నిప్పు రవ్వలు రేగి, ఆ మంట వీరికి అంటుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. బాధితుల కేకలు విని సమీపంలోని వాహనదారులు, పెయింట్ వేస్తున్న వారు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు అదుపుకాలేదు. ఒంటిపై మంటల ధాటికి ఆర్తనాదాలు చేసిన బాధితులు ఒకానొక తరుణంలో కృష్ణానదిలో దూకేందుకు ప్రయత్నించగా, స్థానికులు నిలువరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు కార్లలో ఉన్న టవళ్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే సీతారామరాజు శరీరం 90 శాతం కాలిపోగా, నారాయణ స్వామికి కొంతమేర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే సీతారామరాజు మృతి చెందగా, నారాయణ స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో రెండు నెలల్లో వివాహం కావాల్సిన కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ చిట్టెం కోటేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించారు.