sekhar babu
-
ఏటీఎం వ్యాన్‌లో డబ్బు వస్తుందన్నాడు!
∙శేఖర్‌బాబు మాటలు నమ్మే నగదు సమీకరించా ∙మార్పిడి వ్యవహారం అతడికే తెలుసు ∙పోలీసుల విచారణలో ఫజలుద్దీన్ వెల్లడి సిటీబ్యూరో: ఎంత భారీ మొత్తం పాత కరెన్సీ సమీకరించినా మార్చేద్దామని, బ్యాగులు, సంచులు కాకుండా ఏకంగా ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్లలోనే కొత్త నోట్లు వస్తాయని శేఖర్‌బాబు తనను నమ్మించినట్లు నోట్ల మార్పిడి కేసులో మూడో నిందితుడి ఫజలుద్దీన్ సైఫాబాద్ పోలీసులకు చెప్పాడు. పాత నోట్ల మార్పిడికి యత్నిస్తూ సోమవారం రాత్రి చిక్కిన దళారులను నగదుతో సహా సమావేశపరిచిన ఫజలుద్దీన్ను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పదిమంది దళారుల్ని అరెస్టు చేసి, రూ.రూ.3,01,46,000 విలువైన పాతనోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఐదుగురిలో ఫజలుద్దీన్ ఒకడు. తాము సమీకరించిన సొమ్ము రియల్ ఎస్టేట్ వ్యాపారులదేనని నిందితుడు వెల్లడించాడు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన శేఖర్‌బాబుతో రియల్ ఎస్టేట్ లావాదేవీల నేపథ్యంలోనే ఫజలుద్దీన్‌కు పరిచయమైంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో పాతనోట్ల మార్పిడికి కుట్ర పన్నిన శేఖర్‌బాబు ఆ విషయాన్ని ఫజలుద్దీన్తో చెప్పాడు. ఏటీఎం వాహనాన్ని ఫజలుద్దీన్‌కు చూపించినప్పుడు శేఖర్‌తో పాటు వ్యక్తి ఉన్నాడని, అయితే అతను ఎవరన్నది తనకు తెలియన్నాడు. దీంతో శేఖర్‌బాబు సహా మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బ్యాంకు అధికారులతో ఉన్న సంబం«ధాల నేపథ్యంలో భారీగా మార్పిడి చేద్దామంటూ శేఖర్‌బాబు చెప్పినందున సోమవారం రాత్రి బషీర్‌బాగ్ మొఘల్స్ కోర్ట్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో తన కార్యాలయానికి దళారులు అందరినీ పిలించానని ఫజలుద్దీన్ అంగీకరించాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు నగదు మూలాలు కనుక్కోవడానికి, అసలు వ్యక్తుల్ని గుర్తించడానికి పది మంది దళారుల్నీ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
నిర్మాత శేఖర్‌బాబు మృతి
ప్రముఖ నిర్మాత కేసీ శేఖర్ బాబు (71) శనివారం మృతి చెందారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని స్వగృహంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. 1946 జనవరి 5న కృష్ణాజిల్లా గన్నవరంలోని కోలవెన్నులో కంచర్ల నారాయణరావు, కమలాదేవి దంపతులకు జన్మించారు శేఖర్‌బాబు. తండ్రి చిత్ర పంపిణీ రంగంలో ఉండటంతో ఇంటర్ తర్వాత శేఖర్‌బాబు కూడా సినీ రంగంలోకి ప్రవేశించారు. 1973లో కృష్ణ, జమున కాంబినేషన్లో ‘మమత’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ రాసింది ఆయనే. ఆ తర్వాత ‘సంసార బంధం’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘పక్కింటి అమ్మాయి’ వంటి సినిమాలు నిర్మించారు. కృష్ణంరాజుతో ‘జగ్గు’, ‘సర్దార్, సాహస సామ్రాట్’, చిరంజీవితో ‘ముఠామేస్త్రీ’ వంటి చిత్రాలు నిర్మించారు. దాదాపు అన్ని చిత్రాలనూ వేరే నిర్మాతలతో కలసి నిర్మించారు. ఫిలిం సెంట్రల్ బోర్డ్ చైర్మన్‌గా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన గత కొంత కాలంగా దక్షిణాది ఫిలించాంబర్ కమిటీ మెంబర్ పదవిలో ఉన్నారు. ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భా్రంతి వ్యక్తం చేశారు. శేఖర్‌బాబుకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం ఆయన ఆంత్యక్రియలు జరగనున్నాయి. -
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
-
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత శేఖర్‌బాబు(73) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం,గోపాలరావుగారి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, చిలకమ్మ తదితర సినిమాలను ఆయన నిర్మించారు. -
కొవ్వూరు కుర్రాడికి అవార్డుల పంట
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : కొవ్వూరుకి చెందిన ఆంధ్ర ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి గెడ్డం శేఖర్‌బాబుకు రెండేళ్ల శిక్షణాకాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఉత్తమ ట్రైనీ అవార్డుతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించిన మరో ఆరు అవార్డులను సొంతం అయ్యాయి. 2013 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కి చెందిన శేఖర్‌బాబు రెండేళ్ల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో సోమవారం స్నాతకోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆల్ రౌండర్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు(అత్యుత్తమ ట్రైనీ అధికారిగా)ను, గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా టాపర్ ఇన్ కోర్ ఫారెస్టెరీలోను బంగారు పతకం అందుకున్నారు. పి.శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు, డాక్టర్ బీఎన్ గంగూలీ అవార్డు తోపాటు రూ.25వేలు నగదు పారితోషికం అందుకున్నారు. ఆర్ఎన్ మాతుర్ మెమోరియల్ అవార్డు, సీనియర్ ఫారెస్టరీ అవార్డు, కేపీ సాంగీయా వినికి అవార్డు ఫర్ బెస్ట్ ట్రైనీ అధికారి అవార్డును శేఖర్‌బాబు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రి జయదేవకర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. అకడమిక్ ఎక్స్‌లెన్స్(ప్రతిభ), ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ ఫారెస్ట్ లా, కోర్ ఫారెస్టరీ సబ్జెక్ట్స్, అటవీ ఉత్పత్తుల విభాగం, ఫీల్డ్ ఫారెస్టరీ తదితర అంశాలలో శేఖర్ బాబు ఈఅవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో కేంద్ర పర్యావరణ కార్యదర్శి అశోక్ లవాస, అకాడమీ డెరైక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్ధలో కందిసాగులో అధిక దిగుబడులను ఇచ్చే జన్యువులను గుర్తించినందుకు పీహెచ్‌డీతో పాటు గోల్డ్‌మెడల్‌ను శేఖర్‌బాబు దక్కించుకున్నారు. శేఖర్‌బాబు తండ్రి శంకర్రావు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి సువర్ణ గృహిణి. తమ కుమారుడు ఐఎఫ్ఎస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు సొంతం చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
హారతికి ఆనతి లేదు
ఉపమాక వెంకన్నకు ‘శీతల యంత్ర’ శాపం సీఎం వచ్చి వెళ్లాక హారతులందుకోని స్వామి నక్కపల్లి రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఫలితంగా ఉపమాక వెం కన్న ఆలయంలో హారతివ్వడం ఆగిపోయింది. ఈ నెల 9న సీఎం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో అప్పటికప్పుడే ఏసీ(శీతల యంత్రం) ఏర్పాటు చేశారు. అది పాడైపోతుందని నాటి నుంచి స్వామికి హారతులివ్వ డం ఆపేశారు. శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. హారతుల విషయమై అర్చకులను నిలదీశారు. లోపల ఏసీ ఉండడంతో హారతులొద్దని అధికారులు చెప్పారం టూ అర్చకులు బదులివ్వడంతో పలువురు ఆ గ్రహం వ్యక్తంచేశారు. మరో తిరుపతిగా కీర్తిం చే ఉపమాక ఆలయంలో హారతులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని ఈవో శేఖర్‌బాబు వద్ద ప్రస్తావించగా సీఎం పర్యటనలో భాగం గా ఏసీ ఏర్పాటుచేసినప్పటి నుంచి హారతులు ఆపివేయడం వాస్తవమేనన్నారు. ఆ తర్వాత హారతులు పూర్తిగా నిలిపివేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. -
అక్రమ కేసుకు ఎస్సై వత్తాసు
విచారణ జరిపి న్యాయం చేయాలి కలెక్టర్‌కు దైవాలరావూరు గ్రామస్తుల వేడుకోలు ఒంగోలు కలెక్టరేట్ : కొరిశపాడు మండలం దైవాలరావూరులో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ పెద్దల వరకు వెళ్లి ఘర్షణకు దారితీసిన నేపథ్యంలో ఆ సంఘటనతో సంబంధంలేనివారిపై అక్రమంగా కేసు నమోదు చేశారని, దానికి అక్కడి ఎస్సై వత్తాసు పలుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. ఆదివారం కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామంలో చోటుచేసుకున్న పరిస్థితులను వారు వివరించారు. ఈ నెల 4వ తేదీన చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవ, పెద్దల ఘర్షణకు బాధ్యులను చేస్తూ 12 మందిపై పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారని, వాస్తవానికి సంఘటనలో లేనివారిపై కూడా కేసులు నమోదు చేశారని తెలిపారు. శేఖర్‌బాబు అనే ఉపాధ్యాయుడిని కూడా ఇందులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై శివకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పోలీసుస్టేషన్‌కు పిలిపించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రాత్రి 9గంటలకు ఇళ్లకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలో ఎక్కువ మంది కూలీనాలీ చేసుకొని జీవించేవారమని, తమను ప్రతిరోజూ విచారణ పేరుతో పోలీసుస్టేషన్లో ఉంచడం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని వాపోయారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. విచారణ జరిపిస్తానని కలెక్టర్ విజయకుమార్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబుచ్చుకున్న వారిలో పార్వతి, లక్ష్మీదేవి, కుమారి, శేఖర్‌బాబుతో పాటు మరికొందరు ఉన్నారు. -
ఎవరెస్ట్‌ను మించిన సంకల్పం
‘మిషన్ ఎవరెస్ట్’ వెనుక ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ రేపల్లె శివప్రవీణ్‌కుమార్.. సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘స్వేరోస్’గా పిలిచే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ఏడాది క్రితం ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వతంపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ‘మిషన్ ఎవరెస్ట్’ను అధిరోహించినా వారిని వెన్నంటి ముందుకు నడిపింది మాత్రం ఈ ఐపీఎస్ అధికారే! సంకల్పం మొగ్గతొడిగిందిలా.. ప్రవీణ్‌కుమార్ స్వేరోస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 గురుకుల పాఠశాలల్ని సందర్శించి 90 వేల మందితో స్వయంగా మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో దాగున్న అద్భుత శక్తిసామర్థ్యాలను గమనించారు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదని, ఆ విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించాలని భావించారు. సహజంగానే పోలీసు అధికారి కావడంతో వారికి సాహసక్రీడల్ని పరిచయం చేయాలని సంకల్పించారు. అదే సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ద్వారా శేఖర్‌బాబు అనే వ్యక్తి పరిచయమయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కండక్టర్ కుమారుడైన శేఖర్ దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్ట్ ఎక్కిన ఎకైక వ్యక్తి. 2007లో ఈ ఘనత సాధించారని తెలియడంతో ఆయన సహకారంతో గురుకుల విద్యార్థుల్ని పర్వతారోహకులుగా చేయాలని భావించారు. భువనగిరి నుంచి తొలి అడుగు సాహస క్రీడలకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీంతో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్నీ స్వేరోస్ సంప్రదించింది. అనేక ప్రయత్నాల అనంతరం కిందటేడాది మేలో 110 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాహసక్రీడల శిక్షణ ఇప్పించేందుకు అంగీకరించారు. శేఖర్‌బాబు పర్యవేక్షణలో 30 రోజుల పాటు భువనగిరిలో శిక్షణ ఇచ్చి అక్కడే ఉన్న 600 మీటర్ల ఏకశిలను ఎక్కించారు. ఇందులో ‘ఏ గ్రేడ్’ వచ్చిన 20 మందిని ఎంపిక చేసి అదనపు శిక్షణ కోసం డార్జిలింగ్‌లో టెంజింగ్ నార్గే స్థాపించిన ప్రతిష్ఠాత్మకమైన హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్కు పంపించాని నిర్ణయించారు. అప్పటి వరకు కనీసం రైలు కూడా చూడని ఈ విద్యార్థులు 2013 సెప్టెంబర్‌లో రెలైక్కి డార్జిలింగ్‌కు పయనమయ్యారు. కానీ ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. ఈ 20 మందిలో అనేక మంది 14 ఏళ్ల వారే ఉండటంతో శిక్షణ ఇవ్వమని చెప్పారు. స్వేరోస్ అభ్యర్థన మేరకు కాస్త మెత్తబడ్డారు. పదేసి కిలోల బరువు భుజాన వేసి పది కిలోమీటర్లు పరిగెత్తమంటూ విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఆర్మీ వారినే అధికమించడంతో అవాక్కైన ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్... ఈ గురుకుల విద్యార్థుల కోసం తొలిసారిగా ప్రత్యేక బ్యాచ్ ప్రారంభించారు. శిక్షణ తర్వాత 10 రోజుల ఎక్స్‌పెడిషన్‌లో భాగంగా కాంచనగంగ శిఖరం వైపు నడిపించారు. ఇందులో పాల్గొన్న ఆర్మీ వారు కేవలం 14 వేల అడుగుల నుంచే వెనక్కు వచ్చేయగా... మొత్తం 20 మంది విద్యార్థుల్లో 19 మంది మౌంట్ రీనాక్ పర్వతం వైపు 17 వేల అడుగుల వరకు వెళ్లి అబ్బురపరిచారు. మిషన్ ఇలా మొదలైంది ఈ 19 మంది ప్రతిభను అంచనా వేసిన శిక్షకుడు జ్యోతి వీరిలో ఏడుగురు మాత్రం ఎవరెస్ట్ శిఖరం వైపు 17 వేల మీటర్ల వరకు వెళ్లగలరని చెప్పారు. దీంతో ‘టార్గెట్ ఎవరెస్ట్’ మొదలైంది. ఇందుకు 10 మందిని ఎంపిక చేసి గతేడాది సెప్టెంబర్‌లో లడక్ పంపారు. అప్పటి వరకు ఆకాశంలో ఎగిరే విమానాన్ని మాత్రమే చూసిన ఈ గురుకుల విద్యార్థులు జీతంలో తొలిసారిగా అందులో ప్రయాణించి తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 18 వేల అడుగుల ఎత్తులో 50 రోజులపాటు శిక్షణ పొందారు. వీరిలో చివరికి నలుగురికి ఎవరెస్ట్ అధిరోహించే శక్తి ఉందని అంచనా వేశారు. ఈ నలుగురిలో ఓ బాలిక కూడా ఉండటంతో ఆమెను కూడా ఎవరెస్ట్ ఎక్కించాలని నిర్ణయించారు. అదనపు పరీక్షల తర్వాత ఈ నలుగురిలో మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్‌కుమార్‌లను ఎవరెస్ట్ వైపు నడిపించాలని నిశ్చయించుకున్నారు. షెర్పాలకే స్ఫూర్తినిచ్చిన విద్యార్థులు.. ఆదివారానికి సరిగ్గా 52 రోజుల క్రితం పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. శేఖర్ బాబు సూచలన మేరకు చైనీస్ మౌంటేయినింగ్ ఫెడరేషన్ ద్వారా ఉత్తరం వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కే అనుమతి పొందారు. సురక్షితంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అదేసమయంలో నేపాల్‌లో ఏప్రిల్ 18న జరిగిన ప్రమాదం నేపథ్యంలో పర్వతారోహకులకు మార్గనిర్దేశం చేసే షెర్పాలు సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పూర్ణ అస్వస్థతకు గురైంది. అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే వెళ్తానంటూ పట్టుపట్టడం చూసిన షెర్పాలు.. తమ సమ్మె విరమించారు. వివిధ దేశాల నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు వచ్చిన 100 మంది సాహసికులతో ముందుకు కదిలారు. ఈ బృందంలో ఆదివారం ఉదయానికి కేవలం 30 మందే ఎవరెస్ట్ ఎక్కారు. వారిలో సూర్యోదయ సమయంలో ముందుగా అడుగు పెట్టింది మన పూర్ణే. మరో అరగంటకు ఆనంద్ రాగా.. మిగిలిన 28 మందీ రెండు గంటల తర్వాత శిఖరాన్ని అధిరోహించారు. గురుకుల విద్యార్థులు తమ వెంట భారత జాతీయ పతాకం, బీఆర్ అంబేద్కర్ పతాకం,ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ వ్యవస్థాపకుడైన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకర్లకు చెందిన పతాకాలను తీసుకువెళ్లారు. చాలా ఆనందంగా ఉంది 2007లో నేను ఎవరెస్ట్ ఎక్కినప్పటికంటే ఈరోజు ఎక్కువ ఆనందం కలిగింది. పూర్ణ, ఆనంద్ సురక్షితంగా తిరిగి బేస్ క్యాంప్ వైపు బయలుదేరారు. సోమవారానికి అక్కడికి చేరుకోనున్నారు. - చైనా నుంచి ‘సాక్షి’తో ఫోనులో శేఖర్‌బాబు పాఠ్యాంశంగా పెడతాం పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నిరుపేద విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ఐపీఎస్ అధికారులు కావడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. వీరి సాహస గాథను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని నిర్ణయించాం. -ప్రవీణ్‌కుమార్, ఏపీఎస్డ బ్ల్యూర్ఈఐఎస్ కార్యదర్శి -
బీహార్‌లో చంద్రగిరి జవాన్ మృతి
చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరికి చెందిన బీఎస్ఎఫ్ జవాను శేఖర్‌బాబు(36) గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే ఆయన ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్కూ ఫోర్స్)కు డెప్యుటేషన్‌పై బీహార్‌కు వెళ్లారు. గతనెల 31వ తేదీ రాత్రి 11గంటల సమయంలో చాతీలో నొప్పిగా ఉన్నట్లు సహచర జవాన్లకు తెలిపాడు. అక్కడి అధికారులు వెంటనే అంబులెన్స్‌లో పాట్నాలోని నలంద మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని 13మంది సైనికులు ఆదివారం అర్ధరాత్రి చంద్రగిరిలోని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. అధికార లాంచనాలతో అంత్యక్రియలు జవాను శేఖర్‌బాబు భౌతికకాయూనికి బీఎస్ఎఫ్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్ఎఫ్ అధికారి రథన్సింగ్ జోరా ఆధ్వర్యంలో ఎస్ఐ స్థాయి అధికారి ఎ.ఫాతిమరాజ్తో పాటు 11మంది జవాన్లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శేఖర్‌బాబు కుటుంబసభ్యుల కోరిక మేరకు ముఖం కనబడేటట్లుగా శవపేటికను తెరచిపెట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం సైనిక లాంచనాలతో ఖననం చేశారు. కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ఏఆర్ పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.