.విధి వంచితులు!
నాలుగుగంటల వ్యవధిలో వృద్ధదంపతుల మృతి
మార్టూరు కష్టసుఖాలు పంచుకుంటూ కలసిమెలిసి జీవిస్తున్న ఆ వృద్ధ దంపతులు చావులోనూ విడిపోలేకపోయారు. ప్రకాశంజిల్లాలో ఈ ఘటన మంగళవారం జరిగిం ది. మార్టూరులో నివాసం ఉంటున్న షేక్మస్తాన్బీ (65), షేక్ హుస్సేన్ (70) దంపతులు వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
అయినప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉన్నంతలో ఆనందంగానే జీవిస్తున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మస్తాన్‌బీ మంగళవారం భర్త ఇంట్లోలేని సమయం లో మృతిచెందింది. నాలుగు గంటల తర్వాత ఇంటి సమీపంలోనే ఉన్న హుస్సేన్ సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. వృద్ధ దంపతులిద్దరూ వెనువెంటనే ఒకరికి తెలియకుండా మరొకరు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు.