selector
-
పాక్ సెలక్టర్‌గా ‘మ్యాచ్ ఫిక్సర్’
ఫిక్సింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన మాజీ ఆటగాడు సల్మాన్ బట్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జాతీయ జట్టు సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అతనితో పాటు మరో ఇద్దరు మాజీలు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అంజుమ్ కూడా సెలక్టర్లుగా ఎంపికయ్యారు. చీఫ్ కోచ్ వహాబ్ రియాజ్‌తో కలిసి వీరిద్దరు పని చేస్తారు. సల్మాన్ బట్ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో కెప్టెన్‌గా ఉన్న బట్ సహచరులు ఆసిఫ్, ఆమిర్‌లతో నోబాల్స్ వేయించి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ నిషేధంతో పాటు బట్కు 30 నెలల జైలు శిక్ష కూడా పడింది. అయితే 7 నెలలకే విడుదలైన బట్ 2016లో తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టాడు. దేశవాళీలో మంచి ప్రదర్శన కనబర్చినా...పాక్ జట్టు కోసం అతని పేరును మళ్లీ పరిశీలించలేదు. అయితే ఇప్పుడు సెలక్టర్‌గా అతను అధికారిక పదవిలోకి వచ్చాడు. -
షమీ ప్రపంచ కప్‌లో ఆడతాడు.. బీసీసీఐ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులు, నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన భారత బృందాన్ని ఇదివరకే ప్రకటించిన విషయం తెలసిందే. అయితే ఈ జట్టు ఎంపికపై అభిమానులతో పాటు పలువురు సీనియర్లు, మాజీ, విశ్లేషకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మరింది. కొందరు సంజూ శాంసన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మహ్మద్ షమీని 15 మంది సభ్యుల బృందంలోకి తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై తాజాగా ఓ బీసీసీఐ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీకి 15 మంది సభ్యుల బృందంలోని వచ్చేందుకు దారులు మూసుకుపోలేదని, త్వరలో జరుగనున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరు విఫలమైనా వారి ప్లేస్‌లో మహ్మద్ షమీ ఫైనల్ 15లోకి వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమాంతరంగా ఈ సిరీస్‌ల్లో షమీ సైతం రాణించాల్సి ఉంటుందని, ఇది జరిగితే షమీ ప్రపంచ కప్‌లో ఆడటం ఖాయమని అన్నాడు. షమీని స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేయడంపై సదరు సెలెక్టర్ స్పందిస్తూ.. 10 నెలల పాటు పొట్టి ఫార్మాట్‌కు (జాతీయ జట్టుకు) దూరంగా ఉన్న కారణంగా షమీని తుది జట్టులోకి (15 మంది సభ్యుల బృందం) తీసుకోలేదని వివరణ ఇచ్చాడు. షమీ జట్టుకు దూరంగా ఉన్నసమయంలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు కాబట్టే అతనికి అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. కాగా, షమీని స్టాండ్ బైగా ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 14 మంది పేయర్లని ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన సెలెక్టర్లు.. 15వ ఆటగాడి ఎంపికను హిట్‌మ్యాన్‌కు వదిలేసినట్లు తెలుస్తోంది. 15వ బెర్త్ కోసం షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోటీలో, కెప్టెన్ ..అశ్విన్‌కే ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహార్ -
500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం..
లండన్: 146 టెస్టుల్లో 517 వికెట్లు పడగొట్టినా ఇంగ్లండ్ అండ్ వేల్స్(ఈసీబీ) మాజీ సెలెక్టర్ ఎడ్ స్మిత్ మాత్రం తనను ఓ ఆటగాడిగా గుర్తించలేదని ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వాపోయాడు. ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరుగనున్న వరుస టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సెలెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, అతరువాత దానికి కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించాడు. టెస్టు ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడల్లా(రొటేషన్ పద్ధతి కారణంగా) రాణిస్తున్న నేను సహజంగానే ఉత్తమ జట్టులో ఉంటానని ఆశించానని, కానీ సెలెక్టర్ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో తన పేరు లేకపోవడం బాధించిదని ఎడ్ స్మిత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో రొటేషన్ పద్ధతిని చూపిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని ఆరోపించాడు. త్వరలో జరుగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేసవిలో ఇంగ్లండ్.. న్యూజిలాండ్, భారత్ జట్లతో మొత్తం ఏడు టెస్టులు ఆడనుంది. జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనుండగా.. జూన్ 10న బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత భారత్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది. కాగా, ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌కే పరిమితమైన 34 ఏళ్ల బ్రాడ్.. 146 టెస్టులు, 121 వన్డేలు, 56 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో అతను సాధించిన మొత్తం వికెట్లలో 10 వికెట్ల మార్క్‌ను 3 సార్లు, ఐదు వికెట్ల మైలురాయిని 18 సార్లు అందుకున్నాడు. అతను టెస్టుల్లో బ్యాట్‌తో కూడా రాణించాడు. అతని కెరీర్లో సెంచరీతో పాటు13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్‌కు చివాట్లు -
ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి
ముంబై: ఓ తెలుగు జట్టు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్ పదవీకాలం ముగియగా... ఇప్పుడు అతని స్థానంలో మరో తెలుగు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాడు సునీల్ జోషి సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా వచ్చాడు. 49 ఏళ్ల సునీల్ జోషి గతంలో హైదరాబాద్ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్‌జోన్)ని ఎంపిక చేయగా... ఈ ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జోషి సిఫారసును బోర్డు ధ్రువీకరించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సెంట్రల్ జోన్ నుంచి ఖాళీ అయిన స్థానంలో మాజీ భారత పేస్ బౌలర్, 42 ఏళ్ల హర్వీందర్ సింగ్‌కు అవకాశమిచ్చారు. ఎమ్మెస్కేతో పాటు గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) పదవీ కాలం కూడా ముగిసింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఇప్పటికే జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)లు ఉండగా... కొత్తవారు త్వరలోనే బాధ్యతలు చేపడతారు. భారత మాజీ క్రికెటర్లు నయన్ మోంగియా, అజిత్ అగార్కర్ సహా మొత్తం 40 మంది సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోగా... ఇందులో నుంచి సునీల్ జోషి, హర్వీందర్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, శివరామకృష్ణన్‌లను తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించాక చైర్మన్, సెలక్టర్‌ను ఖరారు చేశారు. ‘సెలక్షన్ కమిటీ కోసం అత్యుత్తమ వ్యక్తుల్నే ఎంపిక చేశాం. జోషి, హర్వీందర్‌లు సరైన దృక్పథంతో ఉన్నారు. ఇంటర్వ్యూలో వాళ్లిద్దరు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా సూటిగా స్పష్టంగా ఉన్నాయి’ అని సీఏసీ చైర్మన్ మదన్ లాల్ తెలిపారు. సీఏసీకి చాలా దరఖాస్తులే వచ్చాయని, అందరి పేర్లను పరిశీలించాకే తుది జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పారు. చైర్మన్ సునీల్ జోషి, సెలక్టర్ హర్వీందర్‌లు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. జోషి తెలుసుగా... సునీల్ జోషి అంటే గొప్పగా గుర్తొచ్చే ప్రదర్శన సఫారీపైనే! నైరోబీలో 1999లో జరిగిన వన్డే టోర్నీలో జోషి 10–6–6–5 బౌలింగ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 1996 నుంచి 2001 వరకు సాగిన స్వల్ప కెరీర్లో జోషి 15 టెస్టులాడి 41 వికెట్లు, 69 వన్డేలు ఆడి 69 వికెట్లను పడగొట్టాడు. హైదరాబాద్ రంజీ కోచ్‌గా వ్యవహరించిన జోషికి బంగ్లాదేశ్ జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాజీ పేసర్ హర్వీందర్ది కూడా స్వల్ప కాలిక కెరీరే! 1998 నుంచి 2001 వరకు కేవలం నాలుగేళ్లే టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈ మాజీ సీమర్ మూడే టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. -
అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం!
ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎన్ని...? అతని అనుభవం ఎంత? ఏడాది పాటు సెలక్టర్‌గా, ఆ తర్వాత చీఫ్ సెలక్టర్‌గా పని చేసిన మూడేళ్ల కాలంలో అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి లెక్క లేనన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న ఎదురవుతూ వచ్చింది. ముఖ్యంగా కీలక, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నప్పుడైతే వీరంతా ప్రసాద్‌ను విమర్శించడంలో ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. కానీ సెలక్టర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించడం తప్ప విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెస్కే వ్యాఖ్యానించారు. ముంబై: భారత జట్టు సాధిస్తున్న విజయాలే తమ సెలక్షన్ కమిటీ పనితీరుకు సూచిక అని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘మేం ఎన్ని మ్యాచ్‌లు ఆడామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా, ఎంత అంకితభావంతో పని చేశామన్నదే ముఖ్యం. మాకంటే ఎక్కువ క్రికెట్ ఆడినవాళ్లు కూడా సెలక్టర్లుగా విఫలమయ్యేవారేమో. ఏదేమైనా విజయాలే మన గురించి చెబుతాయి. ప్రస్తుతం భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఎలా ఆడుతుందో చూస్తే చాలు. గతంలో ఏ సెలక్షన్ కమిటీకి కూడా మా అంత మెరుగైన రికార్డు లేదు. అనుభవం లేనివాళ్లమే అయినా విజయవంతమైన జట్లను ఎంపిక చేశాం. సీనియర్ టీమ్ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా ‘ఎ’ జట్లయితే విశేషంగా రాణించాయి. 13 సిరీస్‌లు ఆడితే అన్నీ గెలిచాయి. సీనియర్ టీమ్‌లో ఇప్పుడు మ్యాచ్ ఫలితాలను శాసించగల ఎనిమిది మంది ఫాస్ట్ బౌలర్లు, ప్రధాన స్పిన్నర్లతో పాటు మరో ఆరుగురు స్పిన్నర్లు, ఆరుగురు సమర్థులైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకా మా నుంచి ఏం ఆశిస్తున్నారు’ అని ఎమ్మెస్కే వివరించారు. ప్రపంచకప్ సెమీస్‌లో పరాజయానికి ‘నాలుగో స్థానం’ కారణం కాదని, సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడటం జరగనే లేదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు మినహా తాము అవకాశం ఇచ్చిన కొత్త ఆటగాళ్లంతా సత్తా చాటారన్న మాజీ వికెట్ కీపర్... బుమ్రాను టెస్టుల్లోకి ఎంపిక చేయడం తమ అత్యుత్తమ నిర్ణయమన్నారు. సెలక్టర్‌గా పని చేసేటప్పుడు విమర్శలు రావడం సహజమేనన్న ఎమ్మెస్కే... ధోని, కోహ్లిలతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ‘మేనేజ్మెంట్ విద్యార్థినైన నేను ఆంధ్ర క్రికెట్ డైరెక్టర్‌గా ఇంతకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలక్టర్‌గా ఉన్న సమయంలో నేను దిగ్గజ క్రికెటర్ల సలహాలు తీసుకుంటూ వచ్చాను. ధోని, కోహ్లిలతో నా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు. జనం ఏమైనా అనుకోవచ్చు గానీ వారిద్దరు నన్ను ఎంతగా గౌర విస్తారో నాకు తెలుసు’ అని ప్రసాద్ అన్నారు. -
'సెలక్టర్ గా చేయాలని ఉంది'
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ క్రికెట్ బోర్డులో కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. తనకు ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్ గా చేయాలని ఉందంటూ మనసులోని బయటపెట్టాడు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా యార్క్‌షైర్‌కు సెలక్షన్ బాధ్యతలను చూసిన గిలెస్పీ.. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాలో సెలక్షర్ పదవిపై మక్కువగా ఉన్నాడు. ఇప్పటికే వచ్చే బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్టైకర్కు కోచ్ గా వ్యవహరించనున్న గిలెస్పీ.. ఇక ఇంగ్లండ్ వెళ్లే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ కు సెలక్షన్ బాధ్యతలు చూడాలని ఉన్నట్లు తెలిపాడు. 'యార్క్‌షైర్ నుంచి తప్పుకోవడం చాలా కఠినతో కూడిన నిర్ణయం. ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, నా కెరీర్‌ను దృష్టిలో పెట్టుకునే ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేశాను. ఆసీస్ చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్‌తో కలిసి పని చేయాలని ఉంది' అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వచ్చే సంవత్సరం జరిగే సెలక్టర్ల నియామకాల్లో తన పేరును బోర్డుకు సూచిస్తానని గిలెస్పీ పేర్కొన్నాడు. -
టీమిండియా సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్