senior assistants
-
రేపు సీనియర్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్
అనంతపురం న్యూసిటీ : మునిసిపల్ ఆర్డీ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందుతున్న వారికి కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు ఆర్డీ విజయలక్ష్మి తెలిపారు. 22 మునిసిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లతోపాటు సిబ్బంది కూడా హాజరవుతున్నారన్నారు. -
ఈవోల పదోన్నతుల వివాదం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా గ్రేడ్-2 కార్యనిర్వహణాధికారి(ఈఓ) పోస్టుల భర్తీ వ్యవహారం ఇప్పుడు దేవాదాయశాఖలో కొత్త వివాదానికి కారణమవుతోంది. గ్రేడ్-3 ఈవోలకు పదోన్నతులు కల్పించటం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ... దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదమైంది. ప్రస్తుతం భర్తీ కావాల్సిన పోస్టులు దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల కోటాకు సంబంధించినవి. ఇప్పుడు వారికి కాకుండా దేవాలయ ఉద్యోగుల(పాలకమండళ్లు నియమించినవారు)తో భర్తీ చేయనుండటమే వివాదానికి కారణం. పదోన్నతులకు సంబంధించి ఆ శాఖలోని ప్రభుత్వ, దేవాలయ ఉద్యోగుల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరస్పర ఫిర్యాదులతో విచారణలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూ తీసుకున్న ఈ తాజా నిర్ణయం మరింత వేడి రగిల్చింది. దేవాదాయశాఖలో కార్యనిర్వహణాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి గతంలోనే 262 నెంబరు జీఓ ద్వారా మార్గదర్శకాలు వెల్లడించారు.గ్రేడ్-3 ఈవోల పదోన్నతుల ద్వారా, దేవాదాయశాఖ (డిపార్ట్మెంట్) సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించటం ద్వారా, దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించటం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరి వాటా పోస్టులు ఎన్నో కూడా దామాషా లెక్కలు ఖరారు చేశారు. అందులో డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులతో భర్తీ కావాల్సిన 25 గ్రేడ్-2 ఈవో పోస్టులు అలాగే ఉండిపోయాయి. ఆ పోస్టులు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపకపోవటంతోనే అవి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాటిని దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో భర్తీ చేసేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. డిపార్ట్మెంట్ కోటా పోస్టులు అయినందున వాటిని డిపార్ట్‌ంట్ ఖాతాలోనే ఉంచాలని, అందుకోసం అవసరమైతే గ్రేడ్-3 ఈవోలతో భర్తీ చేయాలని శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. దేవాలయ ఉద్యోగులతో వాటిని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించటంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం దేవాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నవారు ఇప్పుడు గ్రేడ్-2 ఈవోలుగా మారి తమ కంటే పై పోస్టులు పొందడం ఎలా సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా అధికారులు దాదాపు తుది నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందారని అధికారులు చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు డిపార్ట్మెంట్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. -
డీటీ..పోటీ!
ఫోకల్ పోస్టులకు భలే గిరాకీ డిప్యూటీ తహసీల్దార్లుగా 14 మందికి పదోన్నతి మంచి స్థానం కోసం పలువురి ప్రయత్నాలు తమకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ఎన్నికల డీటీలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల భర్తీ ఉన్నతాధికారులకు ప్రహసనంగా మారింది. ఇటీవల సీనియర్ అసిస్టెంట్ల నుంచి పదోన్నతి పొందిన 14 మంది పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు 12 మంది ఎన్నికల డీటీలు తమకు ఎన్నికల సంఘం కొనసాగింపు లేనందున రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరువర్గాల్లో ఎక్కువ మంది తమకు ఫోకల్ పోస్టులు కావాలని తమ వంతు ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులను నేరుగా కలిసి విన్నపాలు ఇవ్వగా.... మరికొందరు తెరవెనుక నుంచి ప్రయత్నిస్తున్నారు. అందరికీ పోస్టులు ఇవ్వాలంటే మొత్తం 26 డీటీ స్థానాలు అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఏంచేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల డీటీలకు వేతనాలు బంద్ జిల్లాలోని 12 నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల డీటీలు ఎన్నికల సమయంలో విధుల్లో చేరారు. సహజంగా వీరికి ఎన్నికల సంఘం నిబంధనలు, నిర్ణయం ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం డీటీలను కొనసాగించే విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో డిసెంబర్ నెల వరకే వీరికి వేతనాలు అందాయి. జనవరి సంబంధించిన వేతనం ఫిబ్రవరిలో రావాల్సి ఉండగా.... ఖజానా అధికారులు నిబంధనలు చూపి జీతాలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ డీటీలంతా తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. పనిలో పనిగా కలెక్టర్, జేసీలను కలిసి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి సూచనలు వచ్చినా... రాకున్నా తమను ఎన్నికల విభాగం నుంచి రెగ్యులర్ విభాగానికి మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇతర పోస్టులు ఖాళీ ఉన్నా...్న అవసరం దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలప్రకారం విధులు నిర్వర్తించామని, ప్రస్తుతం అవకాశం ఉన్నందున తమను ఇతర పోస్టుల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల డీటీల పరిస్థితి ఇలా ఉంటే... ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతి ఫైల్‌కు అధికారులు ఇటీవలే మోక్షం కల్పించారు. దీంతో 14మంది సీనియర్ అసిస్టెంట్లు డీటీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారు మంచి పోస్టుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగినట్లు సమాచారం. ప్రత్యేక కలెక్టర్ వద్ద కొత్త ఖాళీలు ప్రస్తుతం జిల్లాలో డీటీ పోస్టులో 14 ఖాళీలు ఉన్నాయి. వీటికితోడు ప్రభుత్వం నూతనంగా కంతనపల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కార్యాలయానికి 4 డీటీ, 4 సీనియర్ అసిస్టెంట్, ఒక లా అధికారితోపాటు ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కేటారుుంచింది. ప్రత్యేక కలెక్టర్‌గా డేవిడ్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ... మిగతా పోస్టుల భర్తీ విషయంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కంతనపల్లి ప్రత్యేక కలెక్టర్ కార్యాలయూన్ని మాత్రం చింతగట్టులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే మరో నలుగురు డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, ఒక తహసీల్దార్ అక్కడ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం ఖాళీలను కొత్తవారితో నింపితే.. కీలక పోస్టుల్లో పరిపాలనా సమస్యలు కూడా వస్తాయని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అన్ని బేరీజు వేసుకుని ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లలో కూడా కొందరికి స్థానచలనం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశమైన ఎన్నికల డీటీలు డిప్యూటీ తహసీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో ఏర్పడ్డ పోటీతో ఎన్నికల డీటీలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నా రు. ఈ విషయంలో తమకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నతాధికారులకు సమస్యను వివరించాలని అభిప్రాయపడ్డారు. అందు కు సంఘం నాయకులు సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తంగా డీటీల పోస్టింగ్‌ల విషయం ప్రసుత్తం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
రవాణాశాఖలో బది‘లీల’లు
ఒంగోలు సబర్బన్: రవాణాశాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి చేపట్టారు. రాష్ట్రంలోని రవాణా శాఖ మూడో జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్లకు హెడ్‌కానిస్టేబుళ్లకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మూడో జోన్ పరిధిలోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు, హెడ్‌కానిస్టేబుళ్లకు 186 జీవో ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టడానికి మూడు జిల్లాల అధికారులు సమాయత్తమయ్యారు. అయితే కార్యాలయ పనివేళల్లో కాకుండా అర్థరాత్రి బదిలీలు చేపట్టడం వెనుక ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా రవాణా శాఖ కార్యాలయంలో కాకుండా ఒంగోలులోని ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించటంతో రవాణా శాఖ అధికారులపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు కృష్ణమోహన్, ఎన్. శివరామప్రసాద్, ప్రభురాజ్‌కుమార్‌లు సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఒంగోలులోని ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మూడు జిల్లాల్లో పని చేస్తున్న 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్ళకు సిబ్బంది నుంచి కౌన్సెలింగ్‌కు సంబంధించిన దరఖాస్తులను తీసుకున్నారు. సిబ్బంది సీనియారిటీ ప్రకారం, ఖాళీలకు అనుగుణంగా అధికారులు బదిలీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. మూడు సంవత్సరాలు పైబడి ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని కౌన్సెలింగ్‌లో బదిలీ అవకాశాలు కల్పించారు. మొత్తం ఈ కౌన్సెలింగ్‌కు 23 మంది సిబ్బంది హాజరయ్యారు. 186 జీవో ప్రకారం కార్యాలయాల సిబ్బందిలో 20 శాతం మందిని బదిలీ చేయాల్సి ఉంది. అందులో భాగంగా 11 మందికి ప్రస్తుత కౌన్సెలింగ్‌లో స్థానచలనం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. అయితే ఈ అర్థరాత్రి కౌన్సెలింగ్ చేపట్టడం వెనుకే మతలబు దాగి ఉందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు సిఫార్సుల మేరకు అర్థరాత్రి కౌన్సెలింగ్ అయితే గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవచ్చునన్న ఆలోచనతోనే ఈ కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముగ్గురు అధికారులను ‘సాక్షి’ ప్రశ్నించగా సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్ చేపట్టాల్సి ఉందని, అయితే నెల్లూరు, గుంటూరు నుంచి తాము రావటం ఆలస్యమైనందున ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. అర్థరాత్రి నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్ ఎందుకు చేస్తున్నానరని ప్రశ్నించగా ఎలాంటి అపోహలకు తావు లేకుండా బదిలీల కౌన్సెలింగ్ చేస్తున్నామని సమాధానమిచ్చారు. -
అక్కడే బాగుందట..!
‘‘పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందనే’’ సామెతను జిల్లాపరిషత్ ఉద్యోగుల్లో కొందరు బాగానే వంట పట్టించుకున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఇతర శాఖల్లోకి... తమకు అనువైన ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో జెడ్పీలో డిప్యుటేషన్ల లొల్లితో పాలన వ్యవస్థ గాడితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీలగిరి : సొంత శాఖలో పనిచేయడమంటే వారికి అయిష్టం.. పొరుగు శాఖల్లో పనిచేస్తూ సొంత వ్యాపకాల్లో మునిగితేలడం వారికి ఎంతో ఇష్టం. రాజకీయ అండదండలున్న ఉద్యోగులు అయితే వారి మాటకు ఎదురుండదు.. జిల్లా అధికారులు సైతం వారి ఆదేశాలకు తలొగ్గాల్సిందే. మండలాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎంపీడీఓలు డిప్యుటేషన్‌ను అడ్డంపెట్టుకుని పొరుగుశాఖలవైపు తొంగిచూస్తున్నారు. ఇదే బాటలో సూపరింటెండెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు పయనిస్తున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులకు డిప్యుటేషన్‌పై ఇతర శాఖలో పనిచేసేందుకు పదేళ్ల పాటు అవకాశం ఉంది. అయితే దీనినే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో సొంత శాఖలో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. పదుల సంఖ్యలో ఉద్యోగులు సొంత శాఖను వదిలి పొరుగు శాఖల్లో పనిచేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు ఇదే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోనే ఉంటూ జెడ్పీలో పనిచేయడం ఇష్టంలేని ఉద్యోగులకు డీఆర్డీఏ, డ్వామా వంటి శాఖలు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఈ విధంగా సొంత శాఖను కాదని వెళ్లిన ఉద్యోగులు ప్రభుత్వ సేవలను పక్కన పెట్టి వ్యక్తిగత అవసరాల పట్ల అమితాసక్తి చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ అధికారులపై మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. హైదరాబాద్‌లో సెటిలైన ఎంపీడీఓలు... జిల్లాలో ప్రస్తుతం 8ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా మండలాల్లో పనిచేయాల్సిన వారు డిప్యుటేషన్లపై వేర్వేరు శాఖల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ శివారు మండలాలైన చింతపల్లి, డిండి, చందంపేటలలో పనిచేయాల్సిన ఎంపీడీఓలు నగరంలో సెటిలయ్యారు. వీరితో పాటు నూతనకల్, మునుగోడు ఎంపీడీఓలు కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సేవలందిస్తున్నారు. నాంపల్లి ఎంపీడీఓ డ్వామా ఏపీడీగా పనిచేస్తున్నారు. అనుమల ఎంపీడీఓ డ్వామా ఏఓగా వెళ్లినట్లు జెడ్పీ అధికారులు వద్ద సమాచారం ఉంది. కానీ ఆమె సూర్యాపేట క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్నారు. నిడమనూరు ఎంపీడీఓ పశ్చిమ గోదావరి జిల్లా డ్వామా కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఆయా మండలాల్లో ఎంపీడీఓల పోస్టులు ఖాళీగా ఉండటంతో కింది స్థాయి ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాల్సి వస్తోంది. ఇన్చార్జ్ పోస్టుల్లో స్థానం సంపాదించేందుకు ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నా రు. నాంపల్లి ఎంపీడీఓ స్థానం కోసం అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ రాజకీయ పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. -
తప్పొకరిది.. శిక్ష మరొకరికి
ఫ్రాంకింగ్, స్టాంప్ పత్రాల కుంభకోణంలో విచిత్రం తప్పు చేసింది ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు కోర్టు చుట్టూ తిరుగుతోంది స్టాంపు వెండర్లు కరీంనగర్ అర్బన్ : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఫ్రాంకింగ్, స్టాంపు పత్రాల కుంభకోణంలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు చేసిన తప్పునకు స్టాంపు వెండర్లు శిక్ష అనుభవిస్తున్నారు. చలాన్ చెల్లించకుండా కొనుగోలు చేసిన పాపానికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. హుజూరాబాద్, మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన విజయ్‌భాస్కర్, సురేశ్ స్టాంపుల లోడింగ్ వ్యవహారంలో రూ. 9లక్షలు, స్టాంపుల విక్రయాలలో రూ.8 లక్షలకుపైగా కాజేసి జేబులు నింపుకున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌ను అరెస్టు చేశారు. భాస్కర్ మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. పాపం.. స్టాంప్ వెండర్స్ స్టాంపు పత్రాలు అమ్ముకుంటూ జీవనం సాగి స్తున్న వెండర్లు చేయని తప్పునకు ఇరుక్కుపోయారు. జిల్లాలోని శైలజ, రవీందర్, కిషన్, రామస్వామి లెసైన్సు పొంది అమ్మకాలు జరుపుతున్నారు. వీరు కొంతకాలంగా అమ్మకాలు సాగిస్తుండడంతో సదరు సీనియర్ అసిస్టెంట్లు పరిచయమయ్యారు. సాధారణంగా వీరు చలాన్ తీసి స్టాంపులు కొనుగోలు చేయాలి. కానీ సదరు సీనియర్ అసిస్టెంట్లను నమ్మి డబ్బులు వారికిచ్చి కొనుగోలు చేశారు. వారు చలాన్ తీయకుండా స్టాంపు పత్రాలు వీరికి అందజేశారు. విచారణలో ఈ విషయం వెలుగుచూడడంతో ఇప్పుడు వెండర్లు పోలీస్‌స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు తిరిగి చెల్లించిన అధికారులు ఈ కుంభకోణం బయటకు రావడంతో సదరు అధికారులు డబ్బులు తిరిగి చెల్లించారు. స్టాం పు వెండర్ల నుంచి డబ్బులు రికవరీ చేసినట్లు చూపించారు. అయితే తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని వెం డర్లు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశా రు. తప్పు చేయనిదే ఇద్దరు అధికారులు డబ్బులు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియదా? సాధారణంగా జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఫ్రాంకింగ్ మిషన్‌లో స్టాంపులు లోడింగ్ చేయా ల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన చాలన్లు చెల్లించారో లేదో ఆయన పరిశీలించాలి. అయితే సీనియర్ అసిస్టెంట్లను రిజిస్ట్రార్ నమ్మడంతోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు చర్చ సాగుతోంది.