జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
– ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్
కర్నూలు (టౌన్): చండీఘడ్‌లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 2 వ తేదీ వరకు నిర్వహిస్తున్న 7వ జాతీయ స్థాయి ఫెడరేషన్ సెపెక్‌తక్రా చాంపియన్ షిప్లో పాల్గొని విజయంతో తిరిగి రావాలని జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న జట్లకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై కర్నూలు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. అనంతరం సెపెక్‌తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు జట్టును ప్రకటించారు. ఎంపికయిన వారిలో బి. రమేష్‌బాబు (కర్నూలు కెప్టెన్ ) సి. అశోక్‌కుమార్ (కర్నూలు ) పి. నాగ శ్రీకాంత్ రెడ్డి (కడప) ఎస్.కె.మాలిక్ బాషా (కర్నూలు )ఎస్. అశోక్‌బాబు (ఒంగోలు) శివకుమార్ (మేనేజర్)లు ఉన్నారు.