Sermon
-
తండ్రి అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చుతో.. బ్రిడ్జ్ నిర్మాణం..
మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంబాలని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులనో తిట్టుకుంటూ కూర్చొంటారు. కొంతమంది కాస్త ముందడుగు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా చేయడం వంటివి చేస్తారు. ఆ తర్వాత షరామాములే! ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు. కానీ ఇక్కడొక వ్యక్తి అన్ని రకాలుగా యత్నించి అవ్వకపోయినా వెనుదిరగక..వ్యక్తిగత ప్రయత్నంతో తమ ఊరికి ఎదురైన సమస్యకు చెక్‌పెట్టి శభాష్ అనిపించుకున్నాడు సుధీర్ ఝా. తండ్రి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రజల మేలు కోసం ఉపయోగించి ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించాడు. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హాయిగా ఉండొచ్చు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. దీంతో పెద్దాయన మహదేవ్ ఝూ తమ గ్రామ పరిస్థితిని చూసి చలించిపోయి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు మహాదేవ్. జీవిత చరమాంకంలో ఉన్న ఆయనకు తనవల్ల ఇది సాధ్యం కాదని తెలుసు. తన సంకల్పం ఎలగైనా నెరవేరాలి. తన ఊరికి మంచి జరగాలి ఇదే ఆ పెద్దాయన ఆశయం. దీంతో మహదేవ్ .. "ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి" అని కుటుంబ సభ్యులను కోరాడు. అది తన కల .. చివరి కోరిక అని వారికి చెప్పాడు. మహాదేవ్ అ్నట్లుగానే కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్ ఝా మరణించాడు. కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహదేవ్ ఝూ అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్ ఝా అలియాస్ సుధీర్ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా లెక్కచేయక దీక్షతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి..ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు. తమ సమస్య తీరడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరిగిందని మహదేవ్ ఝా సోదరుడు మహవీర్ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి తిడుతూ కూర్చొకుండా..వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని మహదేవ్ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయుడిగా మహదేవ్ ఈ సమాజానికి ఓ గొప్ప పాఠాన్ని నేర్పారు. (చదవండి: ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని కాలుపై కాలు వేసుకుని కూర్చొన్నారో.. అంతే సంగతి!) -
సవాళ్లు.. శపథాలు!
రాజకీయాల్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సర్వసాధారణం. ఉదయం మాట్లాడిన మాటలను సాయంత్రానికి మార్చేయడమో.. లేకుంటే అసలు తాము అలా అనలేదనో.. లేదా ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారనో.. తమ వ్యాఖ్యలను మార్చుకునే నేతలు కోకొల్లలు. అన్నమాట ప్రకారం నడుచుకునే వారూ ఉన్నారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట నిలబెట్టుకున్నారు. అయితే మామూలు పరిస్థితుల్లో నాయకులు ఏమన్నా జనాలు పట్టించుకోరు గానీ.. ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సెప్టెంబర్ 6న కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి ప్రచారం సందర్భంగా పలువురు పలు సవాళ్లు చేశారు. నేడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి, అన్నమాట ప్రకారం.. ఎంతమంది నాయకులు మాటకు కట్టుబడి నడుచుకుంటారు? ఎంతమంది తూచ్.. అంటారో చూడాలి. – సాక్షి, హైదరాబాద్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొం దిన రేవంత్ పదునైన ఆరోపణలు చేయడంలో దిట్ట. తాజా ఎన్నికల సందర్భం గా రేవంత్ తన ప్రత్యర్థి కేటీఆర్‌కు ఓ సవాల్ విసి రారు. కొడంగల్‌లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేసిందని, అయినా తాను గెలుస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, గెలిస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తాడా? అని సవాల్ విసిరారు. కేటీఆర్.. ఈ ఎన్నికల్లో అందరికన్నా ముందుగా రాజకీయ సన్యాసం మాట ఎత్తిన నాయకుడు కేటీఆర్. ఓ వేదికపై ప్రసంగిస్తున్న క్రమంలో ఈసారి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పక్షంలో తాను రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీలోనూ.. అటు విపక్షంలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఉత్తమ్.. ఈ ఎన్నికలకు ముందు నుంచీ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. పార్టీ గెలిచేంత వరకు తాను గడ్డం తీసేదిలేదని గతంలో శపథం చేసిన ఉత్తమ్.. ఇటీవల పార్టీ అధికారంలోకి రాకపోతే గాంధీభవన్‌కు రానని చెప్పారు. తాజాగా 11న ఫలితాల అనంతరం తాను గడ్డం తీయబోతున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజగోపాల్‌రెడ్డి.. దూకుడు రాజకీయాలకు పేరుపొందిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒకరు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో శపథం చేసి పంతం నెగ్గించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి నల్లగొండ, నకిరేకల్, మునుగోడులో తాము 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని, ఇది నిజం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు. సోమారపు సత్యనారాయణ.. లగడపాటి సర్వేపై ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ సర్వే నిజమైన పక్షంలో తాను బట్టలిప్పుకుని కూకట్‌పల్లిలో తిరుగుతానని, ఒకవేళ అబద్ధమని తేలితే ఆయన తిరుగుతారా? అని సంచలన సవాల్ చేశారు. అసద్.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అధికార పార్టీకి మద్దతు కొనసాగిస్తూనే.. తమ ఉనికిని, ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. కారు ఎవరి చేతిలో ఉన్నా సరే.. స్టీరింగ్ మాత్రం తమ చేతిలోనే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వంలో చేరతారా? లేక టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారతారా? అన్న విషయంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, గతంలో కొందరు ఇలాగే సవాళ్లు చేశారు. 2016లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే తాను చెవులు కోసుకుంటానంటూ సీపీఐ సీనియర్ నేతనారాయణ అన్నారు. 150 స్థానాల్లో టీఆర్ఎస్ 99స్థానాలు కైవసం చేసుకున్నా నారాయణ మాత్రం స్పందించలేదు. దీనిపై స్పందించిన కేసీఆర్.. మా నారాయణ అందగాడు. ఆయన్ను చెవులు లేకుండా చూడలేం. మీరు ఇబ్బంది పెట్టకండి అని మీడియాకు విజ్ఞప్తి చేశారు. -
పారాయణ పరమార్థం
ఆత్మీయం శిష్యుల ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేవాడే ఉత్తమ గురువు. అందుకే గురువును సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్త స్వరూపంతో పోలుస్తారు. బాబా అచ్చంగా అటువంటి సద్గురువు. ఆత్మసాక్షాత్కార సాధనకు మార్గం చూపించే చుక్కాని వంటివాడు. శ్రీసాయి బోధనకు ప్రత్యేక స్థలం, సమయం, సందర్భం ఉండేవి కావు. సందర్భాన్ని బట్టి బాబా ప్రబోధం ప్రవాహం మాదిరి జాలువారేది. ఒకనాడు ఒక భక్తుడు ఇంకో భక్తుని గురించి అతని పరోక్షంలో ఇతరుల ముందు నిందించసాగాడు. తోటి భక్తునిలోని ఒప్పులను విడిచి, అతను చేసిన తప్పులను కావాలనే ఎత్తి చూపుతూ హీనంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అతని తీరుతో పక్కనే ఉన్న ఇతర భక్తులు నొచ్చుకున్నారు. తన సర్వజ్ఞతతో సదరు భక్తుని బుద్ధిని గ్రహించారు బాబా. పరనిందకు పాల్పడిన భక్తుడిని సరిదిద్దాలను కున్నారు. ఒకనాడు బాబా లెండీతోటకు వెళ్లేటప్పుడు తోటి భక్తుడిని నిందించిన భక్తుడు బాబాకు ఎదురు పడ్డాడు. అప్పుడు బాబా ‘‘ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప లభించని మనిషి పుట్టుక పుట్టి పరనిందకు పాల్పడటమంటే అవతలివారి మలినాలను నీ నాలుకతో శుభ్రపరుస్తున్నట్టే లెక్క. ఇకముం§ð ప్పుడూ అలా చేయకు’’ అని మందలించారు. బాబా చెప్పిన నీతి గ్రహించిన ఆ భక్తుడు వెంటనే తన తప్పు దిద్దుకున్నాడు. మనం బాబా సచ్చరిత్ర పారాయణ చేస్తాం, భక్తితో లెంపలు వేసుకుంటాం. నైవేద్యం పెట్టి, నీరాజనం సమర్పిస్తాం కానీ, బాబా చెప్పిన ఇలాంటి విషయాలు ఆచరించినప్పుడే అది అసలైన పారాయణ అవుతుంది.