Serp employees
-
ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం!
నిజామాబాద్: న్యాయబద్ధమైన తమ హక్కులను సాధించుకోవడానికి ముడుపులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు వాపోతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు అడిగినంత ఇచ్చినా పే స్కేల్ అమలులో సరైన న్యాయం జరుగలేదని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలల్ల చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెర్ప్ ఉద్యోగులు ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరును తప్పుపడుతూ గత పది రోజుల నుంచి పే స్కేల్ అమలులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై చర్చించుకోవడం గమనార్హం. సెర్ప్ సంస్థలో కమ్యునిటీ కో–ఆర్డినేటర్లు, ఏపీఎం, డీపీఎం, ఏపీడీలు అందరూ గతంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన వారే. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల వరకు ఉండగా మన జిల్లాలో 216 మంది ఉన్నారు. పే స్కేల్ అమలు చేసినా ఉద్యోగుల క్యాడర్‌ను తగ్గించడంతో తాము ఆశించిన వేతనం లభించడం లేదన్నారు. సీసీలను జూనియర్ అసిస్టెంట్, ఏపీఎంలను సీనియర్ అసిస్టెంట్, డీపీఎంలను సూపరింటెండెంట్, ఏపీడీలను ఎంపీడీవో స్థాయి అధికారులుగా గుర్తించారు. క్యాడర్ గుర్తింపులో తేడా స్పష్టంగా ఉండటంతో పే స్కేల్ వర్తించినా ఆశించిన వేతనం దక్కడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమొత్తంలో వసూలు చేసిన ఉద్యోగ సంఘం ప్రతినిధులు క్యాడర్ గుర్తించడంలో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాలేదని ఉద్యోగులు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇవి కూడా చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..! -
సీఎం జగన్ చిత్రపటాలకు సెర్ప్ ఉద్యోగుల క్షీరాభిషేకం
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదరిక నిర్మూల న సంస్థ (సెర్ప్) ఉద్యోగులు శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సెర్ప్ పరిధిలో పనిచేసే 4,569 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ)ల వేతనాలను ప్రస్తుత మూల వేతనానికి 23 శాతం అదనంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సెలవు అయినప్పటికీ పలుచోట్ల డీఆర్డీఏ, మండల సమాఖ్య కార్యాలయాల వద్ద సెర్ప్ ఉద్యోగులు సమావేశమై సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కాగా, సెర్ప్ ఉద్యోగుల జీతాలను పెంచడంపై సెర్ప్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొమ్ము నాగరాజు, సెక్రటరీ జనరల్ ధనుంజయ్‌రెడ్డి, కన్వినర్ శోభన్‌బాబు, కో–కన్వినర్లు జగన్, పద్మ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
‘లోకోస్’లో స్వయం సహాయక సంఘాల సమాచారం
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లోకోస్ యాప్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని స్వయం సహయక సంఘాల పూర్తి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కలు, సంఘాల పనితీరు, సంఘాలలోని సభ్యుల సంఖ్యను బుక్ కీపింగ్ లేదా మొబైల్ బుక్ కీపింగ్, సెర్ప్ అకౌంటింగ్ యాప్, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. కాని ఈ యాప్‌ల కంటే అడ్వాన్స్డ్గా యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా సంఘాలలోని సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి బ్యాంక్ రుణాలు, పొదుపు లెక్కలు ఒక్క సంఘానికి సంబంధించినవి మాత్రమే తెలుసుకునే వెసులుబాటు ఉండేది. డిజిటలైజేషన్ ద్వారా అన్ని సంఘాలు చైతన్యవంతమయ్యాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అప్పులు, పొదుపు లెక్కలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేది. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాల సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లలో పొందుపరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తుంటే కేంద్రం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, (వీఎల్ఆర్) మంజూరు చేస్తుంది. ఈ లోకోస్ యాప్ పనితీరుపై ఇప్పటికే సెర్ప్ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. రెండు నెలల క్రితమే యాప్‌లో సంఘాల సమాచారం పొందుపర్చాల్సి ఉండగా వీవోఏల సమ్మె కారణంగా నమోదు ప్రక్రియ ప్రారంభంకాలేదు. శిక్షణ కల్పిస్తున్నాం లోకోస్ యాప్ విధి విదానాలను సెర్ప్ సిబ్బందికి శిక్షణ శి?్బరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ అనంతరం సంఘాల సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తాం. – శ్రీనివాస్, అడిషనల్ డిఆర్డివో, మంచిర్యాల -
సమ్మె విరమించనున్న సెర్ప్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సెర్ప్ ఉద్యోగుల సమ్మె విరమణకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో మంత్రితోపాటు ఎంపీ కవితతో సెర్ప్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని, సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి విరమిస్తామని చెప్పినట్లు సమాచారం. -
రూ.1100 కోట్ల రుణాలకు బ్రేక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 19వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం 4,264 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటం.. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సెర్ప్ పథకాలు చతికిలబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షల స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని 51 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంలో సెర్ప్ది కీలక భూమిక. ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనబాట పట్టడంతో సంఘాల లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల అందజేత అటకెక్కడంతో డబ్బులకు తీవ్ర కటకట ఏర్పడింది. 2017–18లో ఎస్‌హెచ్‌జీలకు రూ.7 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయాలన్నది లక్ష్యం. ఈ ఒక్క నెలలోనే రూ.1,100 కోట్ల రుణ వితరణ జరగాల్సి ఉండగా.. సమ్మె కారణంగా అది సాధ్యపడలేదు. ఇప్పటి వరకు రూ.38 వేల కోట్ల అప్పు ఎస్‌హెచ్‌జీలపై ఉంది. రూ.500 కోట్ల రుణ రికవరీ కూడా ఆగిపోయింది. ఈ నెలలో సుమారు రూ.120 కోట్ల స్త్రీనిధి రుణాలకు మహిళలు నోచుకోలేకపోయారు. సీఎం కేసీఆర్ సెర్ప్న కు చైర్మన్‌గా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు.. కొన్ని జిల్లాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా మూత బడ్డాయి. సదరం క్యాంపులదీ అదే దారి. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చేయడం, మరుగుదొడ్ల నిర్మాణం తదితరాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నడుం బిగించింది. ఈ నెల 20న ‘చలో హైదరాబాద్‌కు’పిలుపునిచ్చింది. ఒక్కో ఉద్యోగి 25 మంది ఆత్మీయులతో కలసి హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
కొలువుల క్రమబద్ధీకరణ ఏదీ..?
సిరిసిల్లటౌన్: రాష్ట్ర సర్కారు చెప్పేదొకటి...చేసేదొకటి అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆది శ్రీనివాస్ విమర్శించారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట సెర్ప్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. సమ్మె ప్రభావం గ్రామీణ మహిళలు, రైతులు, ఆసరా ఫించన్లపై పడుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. దీక్షల్లో పర్శరాములు, వాణిశ్రీ, రేణుక, శ్రీదేవి, బాలరాజు,సెర్ప్ ఉద్యోగుల సంఘం నాయకులు పవన్, నర్సయ్య ఉన్నారు. కేకే. సంఘీభావం శాంతియుతంగా సమ్మె చేస్తున్న సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను సర్కారు స్పందించాలని లేని పక్షంలో తమ పార్టీ ఆ ధ్వర్యంలో సైతం ఉద్యమం చేపడుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే. మహేందర్‌రెడ్డి అన్నారు.సెర్ప్‌ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెర్ప్ ఉద్యోగులకు పనికి తగిన వేతనా లివ్వాలని డిమాండ్ చేశారు.నాయకులు జాలుగం ప్రవీన్, బైరినేని రాము, బుస్సా వేణు, మునిగెల రాజు, సీఐటీ యూ, ఏఐటీయూసీ నాయకులు మోర అజయ్ ఉన్నారు. -
హెల్త్‌కార్డు..ఎప్పుడొస్తదో!
♦ ఎదురుచూస్తున్న ‘సెర్ప్’ ఉద్యోగులు ♦ రాష్ట్రంలో సెర్ప్ ఉద్యోగులు4,200 ♦ హెల్త్ కార్డులు లేకున్నా వైద్యం చేయించుకున్న వారు 209 ♦ వైద్యానికి అయిన ఖర్చు రూ.89.82.లక్షలు సెర్ప్‌లో 4,200 మంది పని చేస్తు న్నారు. వీరు ఒక్కొ క్కరు తమ వాటా ధనంగా రూ.4,000 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 చెల్లి స్తుంది. దీంతో ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదం డ్రులకు రూ.2 లక్షల వరకు వైద్యం అందుతుంది. యాదాద్రి భువనగిరి నుంచి యంబ నర్సింహులు: రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ప్రభుత్వం రెన్యువల్ చేయ కపోవడంతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఉద్యోగులు చనిపోయారు. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించాల్సిన వాటాధనం చెల్లించకపోవడంతో హెల్త్ ఇన్సూ రెన్స్ పథకం నిలిచిపోయింది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 209 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సలు పొంది రూ.89,82,839 లక్షలు సొం తంగా చెల్లించారు. గత ఏడాది కాలంగా సెర్ప్‌లో పనిచేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అప్పుల పాలవుతున్న ఉద్యోగులు.. ఫిబ్రవరి 8 నుంచి ప్రభుత్వం చెల్లింపులు ఆపేయడంతో ఎక్కడికక్కడ వైద్యసేవలు నిలిచిపోయా యి. అయితే తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు ఉద్యోగులు సొంత డబ్బులతో వైద్యం చేయిం చుకుంటున్నారు. ఆర్థిక స్థోమతలేని మరికొందరు తాత్కాలిక వైద్య సేవలు పొందుతూ హెల్త్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఒక ఉద్యోగి రూ.1,19,933 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుని అప్పుల పాలయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 19 మంది, సంగారెడ్డిలో 19, రంగారెడ్డిలో 18, సిద్దిపేటలో 18, నిజామాబాద్‌లో 18, కరీంనగర్లో 10, ఎస్పీఎంయూ (హైదరాబాద్ కేంద్ర కార్యాలయం) 11మంది హెల్త్‌కార్డులు లేకుండానే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారు. -
‘సెర్ప్’ ఉద్యోగినులకూ 6 నెలల ప్రసూతి సెలవులు!
మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలకు పెంపు పాలక మండలికి ప్రతిపాదించనున్న ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లోని కాంట్రాక్ట్ ఉద్యోగినులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 6 నెలల పాటు ప్రసూతి సెలవులు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రతిపాదన మేరకు ఉన్నతాధికారులు ఇందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతమున్న 120 రోజుల ప్రసూతి సెలవును 180 రోజులకు పెంచే విషయమై పాలకమండలి తుది నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. ఈ నెల 23న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరగనున్న పాలక మండలి సమావేశం ప్రధాన ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు. మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు నిమిత్తం ఇప్పటివరకు ఇస్తున్న రూ.10 వేలను రూ.20 వేలకు పెంచాలనే ప్రతిపా దననూ పాలకమండలి ముందు కు తీసుకు రావాలని సెర్ప్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నా యి. సెర్ప్ ఉద్యోగుల సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని ఇటీవల మంత్రి జూపల్లి హామీ ఇచ్చినందున తమ ప్రతిపాద నలకు ఆమోదం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు సెర్ప్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 4,224 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 29 శాతం మహిళలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఉద్యోగుల సమస్యలతో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, అభయ హస్తం, పల్లె ప్రగతి పథకాల అమలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.