సాక్షి, అమరావతి: గ్రామీణ పేదరిక నిర్మూల న సంస్థ (సెర్ప్) ఉద్యోగులు శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సెర్ప్ పరిధిలో పనిచేసే 4,569 మంది ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ)ల వేతనాలను ప్రస్తుత మూల వేతనానికి 23 శాతం అదనంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం సెలవు అయినప్పటికీ పలుచోట్ల డీఆర్‌డీఏ, మండల సమాఖ్య కార్యాలయాల వద్ద సెర్ప్ ఉద్యోగులు సమావేశమై సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కాగా, సెర్ప్ ఉద్యోగుల జీతాలను పెంచడంపై సెర్ప్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొమ్ము నాగరాజు, సెక్రటరీ జనరల్ ధనుంజయ్‌రెడ్డి, కన్వినర్ శోభన్‌బాబు, కో–కన్వినర్లు జగన్, పద్మ ఒక ప్రకటనలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment