Salary increase
-
గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?
ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. అందుకు భిన్నంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగార్థులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది. గూగుల్‌లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఇటీవల బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ ‘ప్రధాన టెక్ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. -
సీఎం జగన్ చిత్రపటాలకు సెర్ప్ ఉద్యోగుల క్షీరాభిషేకం
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదరిక నిర్మూల న సంస్థ (సెర్ప్) ఉద్యోగులు శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సెర్ప్ పరిధిలో పనిచేసే 4,569 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ)ల వేతనాలను ప్రస్తుత మూల వేతనానికి 23 శాతం అదనంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సెలవు అయినప్పటికీ పలుచోట్ల డీఆర్డీఏ, మండల సమాఖ్య కార్యాలయాల వద్ద సెర్ప్ ఉద్యోగులు సమావేశమై సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కాగా, సెర్ప్ ఉద్యోగుల జీతాలను పెంచడంపై సెర్ప్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొమ్ము నాగరాజు, సెక్రటరీ జనరల్ ధనుంజయ్‌రెడ్డి, కన్వినర్ శోభన్‌బాబు, కో–కన్వినర్లు జగన్, పద్మ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!
Latest News On Central Government Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను ఇటీవల పెంచిన తర్వాత, వారి జీతం రూ.95,000 పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)లో 28 శాతం పెంచింది. ఆ తర్వాత ఆ డీఏ నుంచి 28శాతం నుంచి 31శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పే గ్రేడ్ ప్రకారం జీతం పెరుగుతుంది ఉద్యోగుల బేసిక్ పే, గ్రేడ్ ప్రకారం వారి జీతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు, డీఏ పెరిగిన తరువాత జీతం పెరగాల్సి ఉంటుంది. ఇక కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ పే కమిషన్ సిఫార్సు ప్రకారం, లెవెల్ 1 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ. 18000 నుండి రూ. 56900 వరకు ఉంటుంది. రూ. 18000 జీతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వార్షిక జీతం రూ. 30,240 పెరుగుతుంది. మినిమం బేసిక్ శాలరీ ►ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000 ►కొత్త డియర్నెస్ అలవెన్స్ (31%) రూ. 5580/నెలకు ►డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (17%) రూ. 3060/నెలకు ►ఎంత కరువు భత్యం పెరిగింది 5580-3060 = రూ 2520/నెలకు ►వార్షిక జీతం పెరుగుదల 2520X12 = రూ. 30,240 మ్యాగ్జిమం బేసిక్ శాలరీ ►ఉద్యోగి ప్రాథమిక వేతనం: రూ. 56900 ►కొత్త డియర్నెస్ అలవెన్స్ (31%) రూ 17639 / నెల ►డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (17%) రూ. 9673 / నెల ►డియర్నెస్ అలవెన్స్ ఎంత పెరిగింది 17639-9673 = రూ 7966 / నెల ►వార్షిక వేతనం పెరుగుదల 7966X12 = రూ. 95,592 ►31% డియర్నెస్ అలవెన్స్ ప్రకారం, రూ. 56900 బేసిక్ జీతంపై మొత్తం వార్షిక డియర్నెస్ అలవెన్స్ రూ. 211,668. కానీ వ్యత్యాసం గురించి మాట్లాడితే, జీతంలో వార్షిక పెరుగుదల రూ. 95,592 పెరుగుతోంది. చదవండి : పీఎఫ్ఓ రూల్స్ మారాయ్, ఈపీఎఫ్ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్ఫిట్స్..! -
అంచనాలు మించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రూ. 4,845 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 4,019 కోట్లతో పోలిస్తే ఇది 20.5 శాతం అధికం. లాభం సుమారు రూ. 4,534 కోట్ల స్థాయిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో ఇన్ఫీ ఆదాయం రూ. 22,629 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ. 24,570 కోట్లకు పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను కూడా ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 2–3 శాతం మేర వృద్ధి ఉంటుందని సవరించింది. గతంలో ఇది 2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకమే ఊ తంగా 2021 ఆర్థిక సంవత్సరం ఆదాయ, మార్జిన్ల అంచనాలను సవరించాము‘ అని కంపెనీ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. డిజిటల్, క్లౌడ్ విభాగాల తోడ్పాటుతో మార్కెట్లో మెరుగైన పనితీరు కనపర్చగలుగుతున్నామని, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దీన్ని ప్రతిబింబించేవిగా ఉన్నాయని ఆయన పేర్కొ న్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నిధు ల నిల్వలు గణనీయంగా పెరిగాయని ఇన్ఫీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర డివిడెండ్‌ను షేరుకు 50% పెంచి రూ. 12 చెల్లించనున్నట్లు వివరించారు. ఈ క్వార్టర్లో ఐటీ దిగ్గజాలకు సంబంధించి ఇప్పటికే టీసీఎస్, విప్రో ఫలితాలు వెలువడ్డాయి. ఇక హెచ్‌సీఎల్ అక్టోబర్ 16న ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. జనవరి 1 నుంచి జీతాల పెంపు.. అన్ని స్థాయిల సిబ్బందికి జనవరి 1 నుంచి జీతాలను పెంచనున్నట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వెల్లడించారు. అలాగే, రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు 100 శాతం వేరియబుల్ పే ఇస్తున్నట్లు వివరించారు. ‘క్లిష్ట పరిస్థితుల్లోనూ మా ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో రెండో త్రైమాసికంలో 100% వేరియబుల్ పే చెల్లిస్తున్నాం. అలాగే క్యూ3లో మా జూనియర్ ఉద్యోగులకు వన్ టైమ్ ప్రాతిపదికన ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం‘ అని సలీల్ పరేఖ్ చెప్పారు. జీతాల పెంపు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. జూనియర్ స్థాయిల్లో గత త్రైమాసికం నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించామని, ఇకపై మిగతా అన్ని స్థాయిలకు దీన్ని విస్తరించనున్నామని పరేఖ్ చెప్పారు. కరోనా సంక్షోభంతో వ్యాపారంపై ప్రతికూలత కారణంగా ప్రమోషన్లు, జీతాల పెంపులను నిలిపివేస్తున్నట్లు ఇన్ఫీ గతంలో ప్రకటించింది. తాజాగా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వాటిని మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. జీతాల పెంపు పరిమాణం గతంలోలాగానే ఉంటుందని సీవోవో ప్రవీణ్‌రావు తెలిపారు. దేశీయంగా ఉద్యోగులకు గతేడాది సగటున వేతనాల పెంపు సుమారు 6%గా ఉండగా, విదేశాల్లో ఉన్న సిబ్బందికి 1–1.5 శాతం స్థాయిలో నమోదైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెల్లడయ్యాయి. ఇన్ఫీ షేరు 2% క్షీణించి రూ. 1,136 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో డిజిటల్ విభాగ ఆదాయాలు 1,568 మిలియన్ డాలర్లుగా (మొత్తం ఆదాయంలో 47.3 శాతం వాటా) నమోదయ్యాయి. ► క్యూ2లో ఇన్ఫోసిస్ 3.15 బిలియన్ డాలర్ల భారీ డీల్స్ కుదుర్చుకుంది. ► ఆదాయాల్లో ఉత్తర అమెరికా వాటా 60% కాగా, యూరప్(24.3%), భారత్(3%), ఇతర దేశాలు(12%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► వ్యయ నియంత్రణ, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో నిర్వహణ మార్జిన్ సీక్వెన్షియల్‌గా 270 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో ఇన్ఫీ నికరంగా 975 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. ఉద్యోగుల సంఖ్య 2,40,208కి చేరింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) వార్షిక ప్రాతిపదికన 18.3 శాతం నుంచి 7.8 శాతానికి దిగి వచ్చింది. -
ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ
మంచిర్యాలఅర్బన్ : ఈ నెల 11న ఆర్టీసీలో తలపెట్టిన సమ్మెపై కార్మిక సంఘాలు, యాజమాన్యం ఎవరి వ్యూహల్లో వారు నిమగ్నమయ్యారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూని యన్ సమ్మెకు పిలుపునివ్వగా జేఏసీ మద్దతునిచ్చిన సంగతి విదితమే. సమ్మెకు మూడు రోజు లు గడువు మిగిలి ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 7నుంచి టీఎంయూ, జేఏసీలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేస్తున్నాయి. ఒకవేళ సమ్మె జరిగితే చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. సమ్మె పిలుపు నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. మరోవైపు ఆయా డిపోలలో సమ్మెపై ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీయటం, కార్మిక సంఘాల నేతల ఫోన్‌నంబర్లు, ఇతరత్రా – మిగతా వివరాలు సేకరించారు. ఆర్టీసీలో చేపట్టే సమ్మెపై వ్యుహప్రతివ్యుహలు సాగుతుండటం చర్చానీయంశంగా మారింది. సమ్మె సక్సెస్‌కు.. ఆర్టీసీలో సమ్మె సక్సెస్‌కు కార్మిక సంఘాలు సన్నాహలు చేస్తున్నాయి. ఆదిలాబాద్ రీజినల్‌లోని ఆరు డిపోలలో 650 బస్సులుండగా 3000 మంది కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె జరిగితే ఒక్క బస్సును కూడా డిపోలోనుంచి కదలనివ్వకుండా వ్యూహలు రచిస్తున్నారు. గుర్తింపు సంఘం తలపెట్టిన సమ్మెకు జేఏసీ కూడా మద్దతు ప్రకటించటంతో విజయవంతానికి తలమునకలయ్యారు. మరోవైపు సూపర్వైజర్ అసోసియేషన్ సిబ్బంది కూడా ఒకటి రెండు రోజుల్లో సమ్మెకు అనుకూల ప్రకటన చేసే అవకాశం ఉందని కార్మిక సంఘాలు నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రెడ్బ్యాడ్జీలతో నిరసన, గేట్ ధర్నా, రీజినల్ కార్యాలయం ఎదుట నిరహరదీక్షలు చేపట్టారు. సమ్మె సన్నాహక సదస్సులు నిర్వహిస్తూ కార్మికులను సమాయత్త పరుస్తున్నారు. ముందస్తు చర్యల్లో యాజమాన్యం. ఆర్టీసీలో సమ్మె తప్పనిసరి అయితే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే ముందస్తు చర్యలపై యాజమాన్యం దృష్టి సారించింది. గురువారం ఆదిలాబాద్ రీజినల్‌లోని ఆయా డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యుహలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అద్దెబస్సులను నడపటంతో పాటు పైవేట్ సర్వీసులను వినియోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ల కొరత అధిగమించేందుకు పోలీస్, ఇతరశాఖల డ్రైవర్ల సహకారం పొందా లని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. పదోతరగతి ఉత్తీర్ణులైన వారిని తాత్కాలిక కండక్టర్లుగా విధుల్లోకి చేర్చుకోవాలనే నిర్ణయించినట్లు సమాచారం. ఇదంతా చేసిన సూపర్వైజర్ అసోసియేషన్ కూడా సమ్మెలోకి వెళ్లితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని బేరిజు వేసుకుంటున్నారు. ఇంటలిజెన్స్ ఆరా.. ఆర్టీసీలో 11న తలపెట్టిన సమ్మెపై ఆయా డిపో పరిధిలో ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. శుక్రవారం మంచిర్యాల డిపో పరి«ధిలో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఎంత మంది ఉన్నారు.. సంస్థ బస్సులు, అద్దెబస్సులు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు సేకరించారు. రోజుకు సమ్మె మూలంగా నష్టం ఎంత..? ఏయే కార్మిక సంఘాలు బలంగా ఉన్నాయనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘాల నేతల ఫోన్ నంబర్లు సేకరించటం చర్చానీయంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె వాయిదా వేసుకునే పరిస్థితి లేదని ఓ కార్మిక సంఘం నాయకుడు అభిప్రాయపడ్డాడు. -
పట్టువీడరు.. మెట్టు దిగరు
రవాణా సమ్మె బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. బస్సుల సౌకర్యం లేకపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా, కోర్టు కొరడా ఝుళిపించినా సమ్మెకారులు ఎంతకూ పట్టువీడడం లేదు. అలాగే ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. గురువారం తప్పనిసరిగా విధుల్లో చేరాలని మద్రాసు హైకోర్టు ఉద్యో గులకు బుధవారం సాయంత్రం అల్టిమేటం ఇచ్చింది. సాక్షి, చెన్నై: నెలసరి వేతనాన్ని 2.57 శాతం పెంచాలని, జీతంలో మినహాయించుకున్న రూ.7వేల కోట్ల పీఎఫ్ మొత్తాన్ని విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికులు తలపెట్టిన సమ్మె బుధవారానికి ఏడోరోజుకు చేరుకుంది. సిటీ బస్సుల్లో ప్రయాణానికి బాగా అలవాటుపడిన ప్రజలు వారంరోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రయివేటు వాహనాల దోపిడీకి గురవుతున్నారు. లోకల్ రైళ్ల బోగీల కిటీకీ ఊచలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో మరింత ఒత్తిడి తేవడంలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు మంగళవారం తమ భార్య, పిల్లలను సైతం వెంటపెట్టుకుని వచ్చి ఆందోళనలు సాగించారు. సమ్మెపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించినా కార్మికులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కోర్కెలు నెరవేరేవరకు సమ్మె విరమించబోమని కార్మిక సంఘాల నాయకులు పునరుద్ఘాటించారు. బస్సులు, కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రమాదానికి దారితీస్తున్నాయి. బుధవారం సైతం అనేక సంఘటనలను చోటుచేసుకున్నాయి. తిరుప్పూరు–తిరుమంగళం రోడ్డులో ప్రభుత్వ బస్సు తాత్కాలిక డ్రైవర్ కారుపైకి ఎక్కించాడు. ఊటీ సమీపంలో ఒక బస్సు ఇంటిపైకి దూసుకెళ్లింది. తాత్కాలిక డ్రైవర్ల కారణంగా ఈ వారం రోజుల్లో ఐదుగురు బలయ్యారు. కొందరు డ్రైవర్లు రెండుచేతులతో గేర్లను మారుస్తూ ప్రయాణికులను భయపెడుతున్నారు. అసలే డొక్కు బస్సులు, ఆపై అనుభవం లేని డ్రైవర్లు ప్రమాదాలకు కారణంగా మారింది. విధుల్లో చేరాలంటూ కార్మికుల ఇళ్లకు వెళ్లి మరీ కొందరు బెదిరిస్తున్నారు. కరూరు జిల్లాలో డ్రైవర్ ఇంట్లోకి చొరబడిన ఒక పోలీసు కానిస్టేబుల్ బెదిరింపులకు గురిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రవాణా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసినా సమ్మెకారులు వినిపించుకోలేదు. 60 వేల మందికి నోటీసులు, 63 మందికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మెకు బలైన ముగ్గురు కార్మికులు: వారంరోజులుగా సాగుతున్న రవాణా సమ్మె ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు గుండెపోటుతో మరణించారు. మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన సెల్వం (55) అదే ఊరిలోని బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె ప్రారంభం కాగానే భార్య పిల్లలను ఉసిలంపట్టిలోనే ఉంచి తాను దిండుగల్లు జిల్లా వత్తలగుండులోని తన స్నేహితుని ఇంట్లో ఉంటున్నాడు. యథాప్రకారం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మెలో పాల్గొని సమీపంలోని ఒక తోటలో నిద్రించాడు. అదే రోజురాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే తిరునెల్వేలి జిల్లా సెంగొట్టైకి చెందిన గణేశన్ (50) అనే డ్రైవర్ సమ్మె గురించి తన తోటి కార్మికులకు చెప్పుకుని బాధపడేవాడు. మంగళవారం సాయంత్రం ఒక తోటలో అతను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగం నుంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగిస్తుందని కొందరు ప్రచారం చేయడంతో ఈరోడ్ జిల్లాకు చెందిన దేవరాజ్ (45) అనే డ్రైవర్ గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
రేటు పెంచేసిందట!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను నేటి తారలు అక్షరాలా పాటిస్తుంటారు. ఇందుకు నటి కాజల్ అగర్వాల్ అతీతం కాదు. ఆదిలో అవకాశాల కోసం పోరాడింది. ఆ తరువాత విజయాల కోసం ఆరాటపడింది. ఇప్పుడు పారితోషికాన్ని పెంచడానికి తహ తహలాడుతోంది. 2004లో ఒక హిందీ చిత్రంలో సహ నటిగా పరిచయమైన కాజల్‌అగర్వాల్‌ను అక్కడ ఎవరూ గుర్తించలేదు. అయితే కోలీవుడ్, టాలీవుడ్లో మాత్రం కథానాయకిగా అవకాశాలిచ్చి ఆహ్వానించారు. తమిళంలోకి పళని చిత్రం ద్వారా దిగుమతి అయిన కాజల్ ఆ తరువాత మంచి అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కొన్ని చిత్రాల్లో నటించినా విజయాలు ఎడారిలోని ఒయాసిసుల్లానే అనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో తొలి చిత్రమే విజయాన్ని అందించింది. అలా అక్కడ నటిగా ఎదుగుతున్న సమయంలో మళ్లీ కోలీవుడ్‌లో కార్తీకి జంటగా నాన్‌మహాన్ అల్ల చిత్రంలో నటించే అవకాశం అందడంతో పాటు సక్సెస్‌ను వరించింది. ఆ తరువాత విజయ్‌తో తుపాకీ, జిల్లా చిత్రాలు కాజల్ అగర్వాల్ మార్కెట్‌ను పెంచాయి. దీంతో తన పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకు పెంచుకుంటూపోయింది. ఈ మధ్య తెలుగులో మెగాస్టార్ చిరంజీవితోనూ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ ఇరగదీసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ తెలుగులో కంటే తమిళంలో అధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. తాజాగా స్టార్ నటులు విజయ్, అజిత్‌లతో ఏక కాలంలో భారీ చిత్రాల్లో నటించే లక్కీ చాన్సును కాజల్ కొట్టేసింది. అజిత్‌కు జంటగా నటిస్తున్న వివేకం చిత్రం రేపు తెరపైకి రానుండగా, విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న మెర్శల్ చిత్రం దీపావళికి సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఇలా ఇద్దరు స్టార్స్ చిత్రాల్లో నటించిన ఖుషీలో ఉన్న కాజల్ అగర్వాల్ ఈ చిత్రాల విజయం ఖాయం అన్న నమ్మకంతో పనిలో పనిగా తన పారితోషికాన్ని కోటిన్నర నుంచి రెండు కోట్లకు పెంచేసిందనే ప్రచారం జరుగుతోంది.