Settlement cases
-
లోక్ అదాలత్‌లో 10,35,520 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఒకేరోజు 10,35,520 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,81,611, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 4,53,909 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.743 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను సాయంత్రం రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. రెట్టింపు ఉత్సాహంతో కేసులను పరిష్కరించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టులో 132 కేసులు.. హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. హైకోర్టులో 132 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం.. రంగారెడ్డి కోర్టులు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైన కేసులతో సత్వర న్యాయంతోపాటు కక్షిదారులు చెల్లించిన కోర్టు రుసుమును కూడా తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు.కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులగారి కృష్ణ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 33 లోక్ అదాలత్ ధర్మాసనాలు ఏర్పాటు చేయగా సుమారు లక్షా 27వేల పైచిలుకు క్రిమినల్, సివిల్ ఇతర కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు మొత్తంగా 5 కోట్ల 85 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి. -
ఖాకీ క్రౌర్యం: నేను చెప్పింది చెయ్.. అంతే.. లేదంటే చుక్కలే..
‘పోలీసైతే చాలు.. లైసెన్స్ లేదని వంద నొక్కేయొచ్చు... దొంగోడి దగ్గర సగం కొట్టేయొచ్చు.. ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరి దగ్గరా దండుకోవచ్చు.. అంతెందుకు అసలు ఎవడినైనా తొక్కేయొచ్చు.. ’’ ఓ సూపర్ హిట్ తెలుగు సినిమాలో అవినీతి పోలీసులపై పూరీ జగన్నాథ్ పంచ్ డైలాగ్ ఇది.. ఇప్పుడు ఇదే డైలాగ్ జిల్లాలోని ఒకరిద్దరు అక్రమార్కులకు కచ్చితంగా వర్తిస్తుందనే చెప్పాలి. చాలామంది పోలీసులు నిజాయితీగానే పని చేస్తున్నప్పటికీ.. కొద్దిమంది చేతివాటం, అడ్డగోలు అక్రమార్జన ఇప్పుడు వివాదాస్పదమై జిల్లా పోలీసు శాఖలోనే చర్చనీయమైంది. అసలు విషయమేమిటంటే... సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న హథీరాంజీ కాలనీలో బొడ్డు జయ చంద్ర అనే వ్యాపారి రెయిన్బో కలెక్షన్స్ పేరిట చిన్నపాటి రెడీమేడ్ దుస్తుల షాపు పెట్టుకున్నారు. ఈ మేరకు షాపు భవన యజమాని మాధవీదేవితో 2018 మే నెల 9వ తేదీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. కనీసం ఐదేళ్లపాటు ఆ షాపును అక్కడే కొనసాగించేందుకు సమ్మతిస్తూ ఇరువర్గాలు మాట్లాడుకున్నాయి. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో ఆ క్రమంలో అక్కడ జయచంద్ర దాదాపు ఏడులక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇదిలా ఉండగా, సరిగ్గా 16 నెలలకు మాధవీలత తరఫున కొందరు వచ్చి షాపు ఉన్నట్టుండి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ‘ఇదేమిటి.. ఇప్పుడే చాలా పెట్టుబడి పెట్టాను.. ఐదేళ్ల వరకు కాకపోయినా కొన్నాళ్లు ఆగండి’ అని జయచంద్ర చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. వాదోపవాదాలు, ఘర్షణల స్థాయికి వెళ్తుండడంతో అతను 2019 నవంబర్‌లో తిరుపతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. అప్పటి నుంచి వివాదం కోర్టులోనే ఉంది. ఇక్కడి వరకు జరిగిన పరిణామాలు చాలా చోట్ల అందరూ చూసే ఉంటారు. వినే ఉంటారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అక్రమంగా చొరబడి.. దౌర్జన్యం చేసినా.. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈనెల 5వ తేదీన ఆదివారం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి షాపులోకి జొరబడి.. అక్కడ పనిచేస్తున్న ఓ యువతిని బయటకి పంపివేసి.. షాపునకు తాము తెచ్చుకున్న తాళం వేసి వెళ్లిపోయారు. ఇదంతా సీసీ రికార్డుల్లో నమోదు కావడంతో ఆ ఫుటేజీని తీసుకుని జయచంద్ర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే తన షాపులోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆ స్టేషన్‌లోని ఓ అధికారి ముందు కూర్చుని ఉన్నారు. దీంతో జయచంద్ర ‘సర్.. వీళ్లు నేను లేని సమయంలో నా షాపులోకి వచ్చి దౌర్జన్యం చేశారు... కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడైన జయచంద్రపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషాలు చేస్తున్నావా.. వెంటనే ఖాళీ చేయి.. లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేస్తా.. అని బెదిరించారు. దీంతో బిత్తరపోయిన జయచంద్ర వెంటనే ఉన్నతాధికారిని కలిసి విషయం చెప్పడంతో ఎట్టకేలకు 6వ తేదీన ఎఫ్ఐఆర్(నెం721) నమోదైంది. 448, 427, 341, 506 డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద మాధవీదేవీపైనా కేసు నమోదు చేశారు. కానీ షాపు తాళాలు మాత్రం ఇప్పించేందుకు పోలీసులు నిరాకరించారు. విషయం కోర్టులో ఉంది కదా.. వేచిచూడాలంటూ దాటవేశారు. అయితే ఇదిలా ఉండగానే డిసెంబర్ 21వ తేదీన మరోసారి గుర్తుతెలియని దుండగులు వచ్చి షాపు షట్టర్ తెరిచి లోపల ఉన్న దుస్తుల సరుకును చిందర వందర చేసి పడేశారు. మొత్తం సరుకుతో పాటు టేబుల్స్, రాక్స్, హాంగర్స్, డిస్ప్లే మోడల్స్ అన్నీ తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై వెంటనే బాధితుడు జయచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా. ఎఫ్ఐఆర్ (నం.735)తో 448, 427 సెక్షన్ల కింద మాధవీదేవిపైనా కేసులు నమోదు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా దౌర్జన్యం చేసినా, దానిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. పోలీసులే నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం విడ్డూరం నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు అప్పులు చేసి జీవనోపాధికి బట్టల షాపు పెట్టుకున్నాను. ముందుగానే మాట్లాడుకుని ఓనరుతో ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ వివాదం రేగడంతో కోర్టును ఆశ్రయించాను. కానీ ఓనర్ తరఫున వాళ్లు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఓ అధికారి అయితే స్వయంగా బెదిరించారు. కనీసం షాపు వద్దకు వచ్చి విచారణ చేయాల్సిందిగా ఎన్నిమార్లు బతిమాలినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఘటనా స్థలానికి కూడా రాలేదు. పోలీస్‌స్టేషన్‌కు 200 అడుగుల దూరంలోనే మా షాపు ఉంటుంది. ఇలాగైతే ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎలా ఎక్కుతారు? – జయచంద్ర, ఫిర్యాదుదారు -
రూ. లక్ష కోట్లకుపైగా చెల్లిస్తున్న ఫోక్స్‌వ్యాగన్
మైలేజీ మోసం కేసు... డెట్రాయిట్: మైలేజీ మోసాల కేసులో వినియోగదారుల, ప్రభుత్వాలతో కేసుల సెటిల్మెంట్, కోసం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి 1,500 కోట్ల డాలర్లకు పైగా(రూ. లక్ష కోట్లకు పైనే) చమురు వదులనున్నది. మైలే జీ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో మోసాలకు పాల్పడినందుకు వినియోగదారులకు, ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పరిహారం చెల్లించనున్నది. కాగా అమెరికా చరిత్రలో అతి పెద్ద వాహన సంబంధిత క్లాస్-యాక్షన్ సెటిల్మెంట్ ఇదే. శాన్ఫ్రాన్సిస్కో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ వెల్లడించిన దాని ప్రకారం, 4,75,000 వాహనాలను రిపేర్ చేయడానికి గానీ, లేదా తిరిగి వాటిని వెనక్కి తీసుకోవడానికి గానీ ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ 1,000 కోట్ల డాలర్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా వాహన వయస్సును బట్టి వినియోగదారులకు 5,100- 10,000 డాలర్ల రేంజ్లో పరిహారం చెల్లించనున్నది. మైలేజీ విషయమై మోసం చేసిన కార్లను రిపేర్ చేయడానికి గత కొన్ని నెలలుగా ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ కార్లను రిపేర్ చేయడం సాధ్యం కాదని, ఆ కార్లను కంపెనీ వినియోగదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయక తప్పదని సమాచారం. పర్యావరణానికి హాని కలిగించినందుకు ప్రభుత్వానికి 270 కోట్ల డాలర్ల చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్‌కు 1,530 కోట్ల డాలర్ల చమురు వదలనున్నది.