seven people died
-
హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం
షిమ్లా/డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు. వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్‌నగర్‌లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షా దిగ్భ్రాంతి షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్‌సింగ్ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు. కేదార్‌నాథ్‌కు రాకపోకలు బంద్ ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని ప్రైవేట్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్దామ్ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్‌లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టాండో మస్తి ఖాన్ స్టేషన్లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
ఏడుగురి మృత్యువాత
పెరిగిన ఉష్ణోగ్రతలు వడదెబ్బకు గాలిలో కలుస్తున్న ప్రాణాలు గుత్తిరూరల్/ శెట్టూరు/ బుక్కరాయసముద్రం/ లేపాక్షి/ యల్లనూరు/ నార్పల/ ఉరవకొండ రూరల్ : జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో ఉంది. వడదెబ్బకు మంగళ,బుధవారాల్లో ఏడుగురు మృత్యువా తపడ్డారు. అనేక మంది ఆస్పత్రులపాలవుతున్నారు.గుత్తి రూరల్ మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో బుధవారం ఎస్.సావిత్రమ్మ(61) వడదెబ్బతో మృతి చెందింది. వ్యవసాయ పొలంలోని పత్తికట్టెను తొలగించేందుకు మంగళవారం వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చాక తీవ్ర అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శెట్టూరు మండల కేంద్రానికి చెందిన భాస్కర్‌రెడ్డి (46) వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. హోటల్ నిర్వహించే భాస్కర్‌రెడ్డి రోజు మాదిరిగానే మంగళవారం ఇంటి నుంచి హోటల్‌కు ఎండలో నడిచి వెళ్లారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందారు. మృతుడికి భార్య రాములమ్మ, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యులను కళ్యాణదుర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి హనుమంతరాయుడు, సర్పంచ్ రమేష్, నేత హరినాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కంబాలపల్లి మంజు, రామిరెడ్డి, తహశీల్దార్ వాణీశ్రీ, వీఆర్వోలు పరామర్శించారు. బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేటకు చెందిన రాజమ్మ (26) వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. రాజమ్మ సోమవారం గ్రామంలో వ్యవసాయ కూలి పనికి వెళ్లింది. సాయంత్ర ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకుంది. వెంటనే ఆమెను బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. లేపాక్షి మండలంలోని కోడిపల్లి గ్రామానికి చెందిన సంజీవమ్మ(45) వడదెబ్బతో మృతి చెం దింది. ఈమె జీవనోపాధి కోసం ఎప్పటిలాగే మంగళవారం కూడా చుట్టు పక్కల గ్రామాలకు గంపలో మామిడి కాయలు తీసుకెళ్లి విక్రయించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైంది. వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. స్థానిక వీఆర్వో రామాంజినప్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మురళి మృతురాలి ఇంటివద్దకు వెళ్లి పంచనామా చేశారు. యల్లనూరు మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామంలో రంగమ్మ(75) వడదెబ్బకు బుధవా రం మృతి చెందింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో తట్టుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నార్పల మండల కేంద్రంలోని మసీద్ కట్ట కాలనీకి చెందిన పన్నూరు లింగప్ప (55) వడదెబ్బతో మంగళవారం రాత్రి మృతి చెందింది. కూలి పనికి వెళ్లిన వచ్చిన లింగప్ప అస్వస్థతకు గురికావడంతో ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. నిద్రలోనే ఆయన మృతి చెందారు. రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు బుధవారం విచారణ జరిపారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.ఉరవకొండ రూరల్ పరిధిలోని వైరాంపురం గ్రామానికి చెందిన పరమేశ్వర్(38) బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం పొలానికి వెళ్లిన పరమేశ్వర్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి వాంతులు చేసుకుని మృతి చెందారు. ప్రభుత్వాస్పత్రి కిటకిట తాడిపత్రి టౌన్: మండుతున్న ఎండలకు జనం విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా తాడిపత్రి ప్రాంతం నుంచి రోజు 50 నుంచి 60 మంది రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆ సంఖ్య 70కు చేరింది. ప్రధానంగా తాడిపత్రి పట్టణంతోపాటు రూరల్, యాడికి, పెద్దపప్పూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, మందులు, పడకలు తక్కువగా ఉండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. -
మరపురాని విషాదం
వంగర : చిన్న నిర్లక్ష్యం ఏడుగురు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పొట్టకూటికోసం బాణసంచా పనికి వెళ్తే ప్రాణాల మీదకు వస్తుందని తెలియక మృత్యుపంజరంలో చిక్కుకున్నారు. మండలంలోని కొత్తమరువాడలో ఈ నెల 15న జరిగిన బాణాసంచా పేలుడులో గాయపడిన వారంతా మృతిచెందారు. క్షతగాత్రుల శరీర భాగాలు పూర్తిగా కాలిపోవడంతో మృత్యువుతూ పోరాడుతూ విశాఖ కేజీహెచ్‌లో మరణించగా, ఆఖరుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గేదెల పోలీసుల కూడా బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ కుటుంబంలో ఆయనతోపాటు తల్లి గేదెల రాములమ్మ, కొడుకు గేదెల శ్రీను, సోదరుడు గేదెల భాస్కరరావు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరు కాకుండా మరో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి. పోలీసు కుటుంబంలో ఉన్న మగవారంతా మృతిచెందారు. 18 ఏళ్ల కుమార్ మినహా ఆ నాలుగు కుటుంబాల్లో మగవారన్నవారు లేకుండా పోయారు. రెండు ఇళ్లుతోపాటు సర్వం కాలిబూడిదయ్యాయి. శోకసంద్రంలో గ్రామం కొత్తమరువాడ దుర్ఘటనలో క్షతగాత్రులంతా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాయపడిన ఏ ఒక్కరూ బతకకపోవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రి వద్ద వారి రోదనలు మిన్నంటాయి. వారిని చూసిన వారంతా కంటతడిపెడుతున్నారు. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. పొట్టకూటి కోసం చేసే కూలి పని ప్రాణాల మీదకు తెచ్చిందని, జీవనాధారమైన ఇళ్లు, గృహోపకరణ వస్తువులు, తిండిగింజలతోపాటు, విలువైన ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయని వాపోతున్నారు. బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని స్థానికులు, బాధితులు వేడుకుంటున్నారు. -
ఏడుగుర్ని బలిగొన్న అతి వేగం
ఏలూరు (వన్ టౌన్) : పది నిముషాలలో గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. ఏలూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, మరొకరు కారు డ్రైవర్. ఆగివున్న లారీని వెనుక నుంచి టవేరా కారు అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ముందు భాగం లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది. మృతదేహాలు బయటకు తీయడానికి కూడా వీలులేనంతగా వాహనంలో ఇరుక్కుని ఛిద్రమైపోయాయి. మొహాలు గుర్తు పట్టలేనంతగా గాయాలయ్యూరుు. హృదయ విదారకమైన ఈ ఘటన ఏలూరు ఆశ్రం కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో టవేరా కారు డ్రైవర్ రమణ, అందులో ప్రయూణిస్తున్న మహిళలు పల్లిశెట్టి రాజ్యం, అప్పల భారతీరత్నం, కుప్పం లక్ష్మి, పైడిమర్రి నాగరత్నం, పాలడుగు కస్తూరిబాయ్, వంకినేని విజయలక్ష్మి మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన అనూరాధ, కె.సీతామహాలక్ష్మి, రత్నకుమారిలను చికిత్స నిమిత్తం తొలుత ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు, విజయవాడ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అంతా ఏలూరు వారే ఏలూరు దక్షిణపు వీధికి చెందిన 9 మంది మహిళలు శ్రీ వెంకటేశ్వర గానామృతం భక్త బృందం పేరిట చుట్టుపక్కల నాలుగు జిల్లాలలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి కల్యాణాలు జరిగినా వెళ్లి భజనలు చేసి వస్తుంటారు. శనివారం ఉదయం టవేరా కారులో రావులపాలెంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణానికి హాజరై తిరిగి ఏలూరు వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యూరు. జాతీయ రహదారిపై లారీ ఆపిన డ్రైవర్ సిగ్నల్స్ కూడా వేయకుండా లారీ వెనుక రెండువైపులా మట్టలు తగిలించి ఉంచాడు. వెనుక వస్తున్న టవేరా వాహనం డ్రైవర్ లారీ రన్నింగ్‌లో ఉందనుకుని వేగంగా వచ్చేశాడు. లారీ ఆగివున్న విషయం గ్రహించి కారును అదుపు చేసేలోపే ప్రమాదం జరిగిపోయింది. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధులకు హాజరై ఏలూరు వస్తున్న డీఎస్పీ కెజీవీ సరిత ఈ ఘటన చూసి తక్షణమే స్పందించారు. కొన ఊపిరితో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. -
విషాదం..
తుళ్లూరు/ విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ : గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పంచాయతీ పరిధిలోగల కేంద్రీయ విద్యాలయంలో పెనుమూడి రాజేష్(17), బోరుగడ్డ సాగర్(17) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో వీరిద్దరూ మరో 15 మంది విద్యార్థులతో కలిసి ఆటోల్లో చౌడవరంలో తమ స్నేహితుడు షాలిన్ తండ్రి మార్క్ నిర్వహిస్తున్న చర్చిలో ప్రార్థనలకు వెళ్లారు. ఒంటి గంట సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో గ్రామ సమీపంలోని కొండను ఎక్కి కొంత సేపు ప్రకృతి అందాలను తిలకించారు. 3 గంటల ప్రాంతంలో దాసరిపాలెం వద్ద ఆటోలు నిలిపారు. అక్కడి క్వారీ గుంతల్లోని నీటిలో ఈతకు దిగాలనుకున్నారు. కొందరు వద్దని వారిస్తున్నా ఏడుగురు విద్యార్థులు ఈతకు దిగారు. వీరిలో లోతుకు వెళ్లిన రాజేష్, సాగర్ నీటిలో మునిపోతుండగా ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేశారు. వచ్చి రక్షించేలోగానే ఇద్దరూ నీట మునిగిన వారిని వెలికితీసి గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమతోపాటుగా ఆడుతూ పాడుతూ అప్పటి వరకూ ఉన్న స్నేహితులు మరణించటంతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో కష్ట పడి చదువుకునే విద్యార్థుల మృతివార్త విని పాఠశాల ప్రిన్సిపల్ ఎం.రాజేశ్వరరావు కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాద విషయం విషయం తెలుసుకున్న రూరల్ డీఎస్పీ నరసింహ, సీఐ వై.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి క్వారీ గుంతలు తవ్విన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు. సంప్రదాయాలు మరిచిపోకూడదనే గుంటూరుకు.. రాజేష్ తల్లిదండ్రులు రమణ, బాలబూసీలకు ఒక్కగానొక్క కొడుకు. స్వస్థలం సత్తెనపల్లి మండలం యన్నాదేవి. బాలబూసి సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పని చేస్తున్నారు. విధుల నిమిత్తం 15 ఏళ్ళుగా డిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో పనిచేశారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న బాలబూసీ తాను విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేశానని, రాజేష్ చిన్న నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో పెరగటం వల్ల తెలుగు భాషను, సంప్రదాయాలు తెలియకుండా పోతాయనే ఉద్ధేశంతో నాలుగు నెలల క్రితం గుంటూరులోని ఏటీ అగ్రహారం 4వలైనుకు వచ్చామని తెలిపారు. సాగర్‌ది జిల్లాలోని మేడికొండూరు. తండ్రి రాజారత్నం డ్రైవర్. కూలీ పనులు చేసుకుంటూ తాము తినకున్నా కొడుకును చదివిస్తున్నారు. అతన్ని ఉన్నత స్థితిలో ఉంటే చూడాలని కలలు కన్న కొడుకు అర్ధంతరంగా లోకం వీడటంతో తండ్రి రాజారత్నం కన్నీరుమున్నీరు కావడం చూపరులను కదిలించింది. విహారం కోసం వచ్చి... అమరేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన యువ ఇంజినీర్ల బృందంలో నదిలో స్నానానికి దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోగల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో విద్యుత్ ఏఈలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో వున్న వివిధ థర్మల్ పవర్ ప్లాంట్లకు చెందిన ఏఈలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారంతో శిక్షణా తరగతులు ముగిశాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఏఈలు అమరావతి చూడాలని భావించారు. తొమ్మిదిమంది యువ ఇంజినీర్లు, ముగ్గురు మహిళా ఇంజినీర్లు కలసి మొత్తం 12 మంది కృష్ణా జిల్లా ఫెర్రి పడవల రేవు నుంచి ఓ మరపడవలో కృష్ణానది మీదుగా అమరావతికి వచ్చారు. అమరేశ్వరుని దర్శించుకుని పడవలోనే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో సాయంత్రం సుమారు 5గంటల సమయంలో మండల పరిధిలోని వైకుంఠపురం ఇసుక తిన్నెల వద్ద సందీప్శ్యామ్సన్(26), పాండురంగారావు(25) అనే ఇద్దరు ఇంజినీర్లు స్నానానికి దిగారు. ఈ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు వారిద్దరూ నీటమునిగి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. పొలాల నుంచి వెళుతున్న స్థానికులు విషయం తెలుసుకుని వెంటనే అమరావతి సీఐకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అమరావతి, తుళ్ళూరు పోలీసులు, ఫైర్ సిబ్బంది గల్లంతయిన వారిని గాలించేందుకు హరిశ్చంద్రపురంలోని పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చూపిన సంఘటనా స్థలంలో గజ ఈతగాళ్ళతో గాలింపు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.కన్నీరు మున్నీరైన సహచర ఉద్యోగులు..రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏఈగా పనిచేస్తున్న సందీప్ శ్యాంసన్, ఎన్టీటీపీఎస్లో ఏఈ అయిన పాండురంగారావు ఇద్దరికీ ఇంకా కూడా వివాహం కాలేదని తోటి ఉద్యోగులు తెలిపారు. కళ్లముందే నీట మునుగుతున్నా కాపాడలేకపోయామని, ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.