Shabad Mandal
-
వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధమే మహిళ హత్యకు దారితీసింది. మే 27న షాబాద్ పహిల్వాన్ చెరువులో పడి మృతి చెందిన ఓ మహిళ కేసును పోలీసులు మొదట అనుమానాస్పద ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసి విచారణ చేయగా ఇది హత్యగా తేలింది. సదరు మహిళతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తే హత్యచేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో షాబాద్ పోలీసులు సోమవారం ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పహిల్వాన్ చెరువులో మే 27న బైండ్ల భారతమ్మ(30) మృతదేహం లభించిన విషయం విదితమే. అయితే పోలీసులు అమె మృతికి సంబంధించిన విషయాలు తెలియకపోవటంతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా ఈ కేసులో ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్న షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్, అతనికి సహకరించిన కమ్మరి లక్ష్మీబాయి, స్నేహితుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్ 15ఏళ్లుగా చికెన్షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. కానీ ఇతనికి పెళ్లికి ముందు నుంచే మృతురాలు బైండ్ల భారతమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఈ విషయం నలుగురికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత నెల 22న ఆమె గపూర్‌కు పోన్ చేయటంతో ఆమెను షాబాద్‌కు రమ్మనాడు. షాబాద్‌లో అతనికి తెలిసిన కుమ్మరి లక్ష్మీబాయి ఇంటికి పిలిపించాడు. చదవండి: మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న 3 గ్రాముల పుస్తెను సహకరించినందుకు లక్ష్మీబాయి తీసుకుంది. మృతదేహాన్ని తన స్నేహితుడైన సయ్యద్ సాదుల్లా హుస్సేన్ సహాకారంతో గోనే సంచిలో పెట్టుకొని స్కూటర్‌పై తీసుకెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో పడేశాడు. కానీ పోలీసులు మృతురాలి ఫోన్‌కాల్ డాటా ఆధారంగా ఆరోజు ఆమె చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసు విచారించారు. దీంతో చివరిగా చేసిన ఫోన్ గపూర్ది కావటంతో అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
మహిళను బైక్‌పై ఎక్కించుకొని.. మద్యం తాగించి.. స్పృహ కోల్పోడంతో
సాక్షి, రంగారెడ్డి: నమ్మించి, మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా దొరికిపోయిన నిందితుడు.. ఇంటి అప్పు తీర్చేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, షాబాద్ సీఐ అశోక్ గురువారం తెలిపారు. షాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన కామారెడ్డి జయమ్మ (40) ఈనెల 20న శంకర్పల్లి మండలం బుల్కాపూర్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కేశపల్లి మల్లారెడ్డి.. తానూ బుల్కాపూర్ వెళ్తున్నానని చెప్పి ఆమెను బైకుపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెకు మద్యం తాగించాడు. దీంతో జయమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చిన జయమ్మ ప్రతిఘటించింది. దీంతో చీరకొంగు మెడకు బిగించి హతమార్చాడు. తర్వాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కాళ్ల కడియాలు, పట్టాగొలుసులు తీసుకుని పరారయ్యాడు. కాగా, జయమ్మ భర్త జంగయ్య.. భార్య కనిపించట్లేదని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా, కేశపల్లి మల్లారెడ్డి ఆమెను బైకుపై తీసుకువెళ్తున్నట్టు కనిపించింది. దీంతో మల్లారెడ్డిని గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిట్లు ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్ మీడియాకు వెల్లడించారు. చదవండి: దారుణం: ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. ఆపై ఉరేసుకున్న తండ్రి -
గొర్రెలు, బర్రెలు కాదు..
సాక్షి, షాబాద్(చేవెళ్ల): బీసీ కార్పొరేషన్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్లో రుణాలకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్లో 5,47 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు నెలలోపు రుణాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేయడం కాదు, వారి అభ్యున్నతి కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. చదువుకున్న చదువులకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందూరి రాములు, జిల్లా కార్యదర్శి రాపోల్ నర్సింలు, నాయకులు సూద యాదయ్య, రామకృష్ణ, శ్రీశైలం, చందు, రమేష్, కృష్ణ, రామకోటి, శివ, తదితరులు ఉన్నారు. -
లయను కాపాడండి
కాచిగూడ: ఆ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు అప్పొసొప్పో చేసి రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.16 లక్షలు ఖర్చు చేస్తే పాప ప్రాణం నిలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన పి.కృష్ణస్వామి, కల్పన దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు లయ(6)కు చిన్నతనంలోనే అరుదైన వ్యాధికి గురైంది. ఆమెకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించేందుకు తమ దగ్గర డబ్బులు లేవని గురువారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిరుపేదలమైన తాము కూతురుని ఎలా కాపాడుకోవాలో తెలియక దాతల సహాయం కోసం వచ్చినట్లు చెప్పారు. రోజురోజుకీ పాప ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు తెలిపారన్నారు. వెంటనే చికిత్స చేయాలని అందుకు రూ.16 లక్షలు ఖర్చు అవుతాయన్నారు. తమ కుమారుడు సాయితేజ(4) బోన్ మ్యారోతీసి పాపకు సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారని, దాతలు డబ్బులు సమకూరిస్తే పాప బతుకుతుందని వేడుకున్నారు. ఇప్పటికే ఇంట్లోని వస్తువులు, బంగారం, పుస్తెలతాడు అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశామని, తమకు సహాయం చేసే వారు 9676541393, 9100785185 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. -
షాబాద్ మండలాన్నిశంషాబాద్ జిల్లాలో కలపాలి
షాబాద్: షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేవరకు అఖిలపక్షం ఆధర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఎ.రవీందర్‌రెడ్డి, బీసీ సేన రాష్ర్ట అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్అండ్బి అథితి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేంత వరకు బంద్ ప్రకటిస్తామన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహార దీక్షలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేయిస్తామన్నారు. షాబాద్ మండల ప్రాంతం శంషాబాద్ కు 30 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. నిత్యం విద్యా, ఉద్యోగంకోసం శంషాబాద్‌కు ఎక్కువగా వెళ్తుంటారన్నారు. రైతులు ప్రతిరోజు శంషాబాద్ మార్కెట్‌కు నిత్యం కూరగాయలు, నిత్యవసర వస్తువుల కోసం వెళ్తుంటారని తెలిపారు. షాబాద్‌ను వికారాబాద్ జిల్లాల్లో కలిపితే పెద్దెత్తున ఉద్యమం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మంగలి శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు రాము, నరేందర్‌రెడ్డి, సర్పంచులు రవీందర్ నాయక్, శివకుమార్, మద్దూర్ మల్లేష్, కాంగెస్ నాయకులు తమ్మళి రవీందర్, అష్మత్ పాష, జనార్దన్‌రెడ్డి, పామెన నర్సింలు, మల్లేష్, జంగయ్య, మాణిక్యప్రభు, అఖిల పక్షం నాయకులు కర్రె శ్రీశైలం, హరిశంకర్, కిరన్, రాపోల్ నర్సింలు, మల్లేష్, శివకుమార్, తదితరులున్నారు. ప్రతాప్‌రెడ్డి, తదితరులున్నారు.