
నిందితుడు కేశపల్లి మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి: నమ్మించి, మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా దొరికిపోయిన నిందితుడు.. ఇంటి అప్పు తీర్చేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, షాబాద్ సీఐ అశోక్ గురువారం తెలిపారు. షాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన కామారెడ్డి జయమ్మ (40) ఈనెల 20న శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కేశపల్లి మల్లారెడ్డి.. తానూ బుల్కాపూర్ వెళ్తున్నానని చెప్పి ఆమెను బైకుపై ఎక్కించుకున్నాడు.
మార్గమధ్యలో ఆమెకు మద్యం తాగించాడు. దీంతో జయమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చిన జయమ్మ ప్రతిఘటించింది. దీంతో చీరకొంగు మెడకు బిగించి హతమార్చాడు. తర్వాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కాళ్ల కడియాలు, పట్టాగొలుసులు తీసుకుని పరారయ్యాడు. కాగా, జయమ్మ భర్త జంగయ్య.. భార్య కనిపించట్లేదని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్‌లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో..
పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా, కేశపల్లి మల్లారెడ్డి ఆమెను బైకుపై తీసుకువెళ్తున్నట్టు కనిపించింది. దీంతో మల్లారెడ్డిని గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిట్లు ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్ మీడియాకు వెల్లడించారు.
చదవండి: దారుణం: ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. ఆపై ఉరేసుకున్న తండ్రి
Comments
Please login to add a commentAdd a comment