shadows
-
Zero Shadow Day: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు నిమిషాలపాట నీడ మాయమైంది. మధ్యహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య మనుషులు, వస్తువుల నీడ కన్పించలేదు. సూర్య కిరణాలు నడినెత్తి మీద పడటంతో షాడో మాయమైంది. దీన్ని 'జీరో షాడో డే'గా పిలుస్తారు. నీడ మాయమవుతుందని తెలియడంతో నగరంలో అనేక మంది రోడ్ల మీదకు వచ్చి గుమిగూడారు. నీడ పడుతుందో లేదో చెక్ చేశారు. 12:12 నుంచి 12:14 వరకు షాడో మాయం కావడం ప్రత్యక్షంగా వీక్షించారు. వస్తువులను కూడా రోడ్లపై పెట్టి షాడో పడుతుందో లేదో పరీక్షించారు. ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కన్పిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది చదవండి: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి.. -
చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..
చనిపోయేముందు వ్యక్తుల ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందట.. అంతేకాదు ఓ మాటను పదేపదే ఉచ్చరిస్తారట కూడా. ఇంకా అనేక విషయాల గురించి అమెరికాలోని ఓ నర్సు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. జూలీకి దాదాపుగా 14 యేళ్లు నర్సుగా పనిచేసిన అనుభవం ఉంది. అందులో 9 యేళ్లు ఐసీయూ నర్సుగా పనిచేసింది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలలో కూడా 5 యేళ్లు నర్సుగా పనిచేసింది. అమె తన సర్వీసులో అనేక మంది మరణించడం చూసింది. ఐతే చనిపోయేముందు అనేక మంది ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందని జూలీ చెబుతోంది. ఇంకాసేపట్లో మరణించే అవకాశం ఉన్న వ్యక్తుల్లో అనేక మంది ఒకే విధమైన విషయం చెప్పడం గమనించిందట! జూలీ మరణించేముందు శరీర రంగు మారడం, జ్వరం, తమకి అత్యంత ప్రియమైన వారి పేరును పదే పదే తలచుకోవడం చేస్తారట. ఎక్కువ మంది ‘ఐ లవ్ యూ’ అని అనడమో, గతంలో మరణించిన తల్లిదండ్రులకు ఫోన్ చేయడం వంటి పనులు చేస్తారట. అంతేకాకుండా రోగుల్లో చాలా మంది చనిపోయే ముందు నీడలను చూడటం ప్రారంభిస్తారని పేర్కొంది. తమకి అత్యంత ప్రియమైన (అప్పటికే మరణించిన) వారి నీడలను చూడటం, ఇంటికి వస్తున్నానని చెప్పడం చేస్తారట. చాలా మందికి మరణం గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు తనకు తెలుసని టిక్‌టాక్ ద్వారా ఓ వీడియోను ఆరు నెలల క్రితం పోస్ట్ చేసింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. పుట్టిన వారందరూ ఏదో ఓ రోజు మరణించక తప్పదు. అయినా మరణం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుందనే విషయాలపై కూడా ఆసక్తి చూపడం నిజంగా ఓ వింతే! చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. -
ఆర్డీవో కార్యాలయాల్లో షాడోలు
జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. సిబ్బంది చేయాల్సిన పనులకు షోడోలు అడ్డుపడుతున్నారు. పనికి రేట్లను ఫిక్స్ చేసి ప్రజలను దోచేస్తున్నారు. ఈ తంతు మొత్తం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆఫీసులో ఉన్న అవినీతి తిమింగలం నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఒకరేటు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారులు సైతం వారికే వత్తాసు పలకడంతో మిగతా సిబ్బంది చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి దాపురించింది. గుంటూరు కలెక్టరేట్లో సైతం ఓ అధికారి డమ్మీగా మారినట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి పలుమార్లు సెలవులో వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో.. ఈ కార్యాలయంలో ఓ డీటీ (డిప్యూటీ తహసీల్ధార్)స్థాయి అధికారి హవా నడుస్తోంది. మొత్తం ఆదాయ వనరులుగా ఉన్న సబ్జెక్టులు అతని వద్దనే ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారికి అతను చెప్పిందే వేదం. కార్యాలయంలో ఉండే సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో కూడా పాలన గాడితప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్ధార్ కార్యాలయం.. ఇక్కడ వివిధ హోదాల్లో ఓ అధికారి తిష్ట వేసి, ఇష్టారాజ్యంగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి తక్కెళ్ల పాడులో అసైన్డ్ భూములకు దొంగపట్టాలు ఇవ్వటంలో సదరు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. గతంలో తాను చేసిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు ఈ కార్యాలయంలోనే ఉండేలా అధికార పార్టీనేతలను ఆశ్రయించి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. తెనాలి ఆర్డీఓ ఆఫీసులో అన్నీ తానై... తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి పెత్తనానికి అడ్డుఅదుపు లేకుండా పోయిం దని అక్కడి ఉద్యోగులే విమర్శిస్తున్నారు. కార్యాలయ అధికారిని కాదని, ప్రతి వ్యవహారంలో తలదూర్చి, పనికి రేట్లు ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలతో జిల్లాకు చెందిన ఓ మంత్రి బదిలీ సిఫారసు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలకార్యాలయాల్లో తహసీల్ధార్ రాసే రిపోర్టులకు సైతం కొర్రీలు వేసి, వాటిని ఆయనే తయారు చేసి డబ్బులు గుంజుతున్నట్లు చర్చ జరగుతోంది. డీటీలు దండుకుంటున్నారు.. నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఓ డీటీ కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కార్యాలయంలో ఉన్న అధికారి, డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఎక్కడున్నారో చెప్పలేని దుస్థితి. గతంలో రెవెన్యూ ఇన్పెక్టర్గా ఆ డివిజన్‌లోనే పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం భూ వ్యవహారాల సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురజాలలో గుంజుడెక్కువ.. గతంలో అధికార పార్టీ నాయకుడి వెంట తిరిగిన ఓ అధికారి ప్రస్తుతం వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు. ఇతనిపై ఏసీబీ దాడులు జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉడటంతో ఉన్నతాధికారి సదరు అధికారిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమాంతర వ్యవస్థ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఈ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. -
క్రీనీడలలో భారత క్రికెట్
బీసీసీఐని సంస్కరించడానికి నియమించిన సీఓఏ అధికారాల పరిధి బోర్డు నిర్వహణలోని ప్రయోజనాల ఘర్షణలను సరిదిద్దడమే. కానీ గుహ ఉత్తరాలు క్రీడకారులకు, ప్రత్యేకించి పూర్వ క్రీడాకారులకు సంబంధించిన ఎన్నో పరస్పర ప్రయోజనాల ఘర్షణను వెలుగులోకి తెచ్చాయి. మన క్రికెట్‌కు సంబంధించిన మరో రంగంలోని, మరింత ఎక్కువ ముఖ్యమైన ప్రయోజనాల ఘర్షణ సైతం వెలుగులోకి వచ్చింది. క్రికెట్, డబ్బు, అధికారాల మధ్య కుమ్మక్కు అనే పాత కథే మరోసారి, మరో రకంగా పునరావృతం అవుతోందని తేలింది. బోర్డ్ ఆఫ్ క్రికెట్ బోర్డును (బీసీసీఐ) సంస్కరించాలనే సదుద్దేశంతో సుప్రీం కోర్టు చేసిన ప్రయత్నం అతుకుల బొంతలా అనిపిస్తోంది ఎందుకు? అత్యంత వివేకవంతులు, సీనియర్లు అయిన న్యాయమూర్తుల ద్వారా సుప్రీం కోర్టు బెంచి గత రెండేళ్లుగా భారత క్రికెట్లో చురుగ్గా జోక్యం చేసుకుంటోంది. అయినాగానీ అది ఎవరో ఒక అసహనపు శస్త్ర చికిత్సా నిçపుణుడు నిలువునా కోసేసి ఆపరేషన్ బల్లపై అలాగే వదిలేసిన రోగిలాగా ఎందుకు కనిపిస్తోంది? అతి సుప్రసిద్ధులైన రిటైర్డ్ న్యాయమూర్తులు, క్రికెటర్లు, అధికారులు, కార్పొ రేట్ రంగంలో పనిచేస్తున్న ఒక ప్రముఖుడు, ఒక అగ్రశ్రేణి భారత క్రికెట్ చరి త్రకారుడు (రాజకీయ చరిత్రకారుడు కూడా) సేవలందిస్తున్నా అది అలాగే ఉన్నదెందుకు? ఆ రోగికి కుట్లు వేసేదెన్నడు? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కాపాడుకోవాల్సిన భారత క్రికెట్ జట్టు రేపు (ఆదివారం) ఇంగ్లండులో పాకి స్తాన్ జట్టుతో కీలకమైన మ్యాచ్‌లో తలపడనుంది. అయినాగానీ, మన జట్టు ఆ మ్యాచ్‌కు సన్నాహాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు జట్టు కోచ్, తది తర అంశాలపై బీసీసీఐ ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ కూర్చుంది ఎందుకు? భారత్ క్రికెట్ ఎన్నడూ లేనంత ఎక్కువగా నేడు చీలిపోయి కనిపి స్తోంది, ఎందుకు? అదే ఎన్నో విషయాలను చెబుతుంది. ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలను నడపడానికి కోర్టులు నియమించిన సుప్ర సిద్ధ రిటైర్డ్ న్యాయమూర్తులలో ఒకరు.. తన సొంతవారికి ఇచ్చుకున్న ఉచిత పాస్‌ల గురించి, ఆ వ్యవహారంలో ఆయన కుమార్తె పాత్ర గురించి ప్రశ్నించిన ఒక రిపోర్టర్‌ను కోర్టు ధిక్కార నేరం కింద విచారిస్తానని బెదిరించిన విష యాన్ని చెప్పడం అతిశయోక్తి కాబోదు గానీ ప్రమాదకరం అవుతుంది. ఏడాది కంటే ముందు అటు మైదానంలోనూ ఇటు నిర్ణయాలు తీసుకునే బోర్డ్ రూం లోనూ కూడా ప్రపంచ క్రికెట్ శక్తిగా ఉన్న స్థానం నుంచి భారత క్రికెట్ నేడు బ్రహ్మాండమైన సంక్షోభానికి చేరిందనేది నిరాకరించలేని వాస్తవం. ఇక కోహ్లీ జట్టు నైపుణ్యం, ప్రేరణ మాత్రమే చాంపియన్స్ ట్రోఫీలో దాన్ని దరి చేర్చాలి. గుహ బయటపెట్టిన లుకలుకలు అయితే, డ్రెస్సింగ్ రూంలోని జట్టు, దాని నిర్వాహక సంస్థ కూడా చీలి పోయి ఉన్నాయి, ఐసీసీ బోర్డ్ రూంలో జగజ్జేతలాంటి ప్రముఖ స్థానంలో ఉండిన భారత్ నేడు తోక ఊపుకుంటూ నిలిచిన కుక్క పిల్లలా ఉందనేది వాస్తవం. ఇక బీసీసీఐ నిర్వహణకు, సంస్కరణల అమలుకు గౌరవనీయ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) అంతర్గత విభేదాలతోనూ, బహు ప్రయోజనాల ఘర్షణతోనూ చీలిపోయి ఉంది. చరిత్ర కారుడూ, ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖ మేధావి అయిన రామచంద్ర గుహ ధైర్యంగా అంతర్గతమైన లుకలుకలను బయటపెట్టే కార్యకర్త పాత్రను పోషిం చారు. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలన్నిటితో ఏకీభవించకపోయినా క్రికెట్ ప్రేమికులమైన మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంది. స్పాట్–ఫిక్సింగ్ వివాదంతో నాలుగేళ్ల క్రితం క్రికెట్లో న్యాయవ్యవస్థ జోక్యం మొదలైంది. ఆ తదుపరి సంవత్సరాలలో ఇతర సమస్యలు కూడా తలెత్తడంతో ఆ జోక్యం పెరుగుతూ పోవడం కొనసాగింది. చివరికి గౌరవ నీయ న్యాయస్థానం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎమ్ లోథా నేతృత్వంలో రిటైరైన ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయ మూర్తుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 12 నెలలు కష్టించి కృషి చేసి, బీసీసీఐ పాలనా వ్యవహారాల తీరులో తీవ్ర మార్పులను సూచిస్తూ నివేదికను రూపొందించింది. 2016 అక్టోబర్ చివరికల్లా వాటిని అమలు చేయాలని కోర్టు బీసీసీఐని ఆదేశించింది. అది ఆదేశాలకు కట్టుబడక పోవడంతో, ఆచరణలో బోర్డ్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలకు ఉద్వాసన పలికింది. రాయ్–లిమాయే ద్వయం లీల ఆ తర్వాత అది లోథా కమిటీ సలహానుసారం సంస్క రణల అమలుకు హామీని కల్పించడానికి, ఈలోగా తాత్కాలికంగా బీసీసీఐని నియంత్రించడా నికి కమిటీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటర్లను (సీఓఏ) నియమించింది. అనుద్దేశపూర్వక పర్యవసానాల నియమం పనిచేయడం మొదలైంది అప్పుడే. బహుశా జస్టిస్ లోథా తనకున్న నమ్మకాన్ని బట్టే సీఓఏకు అధిపతిగా మాజీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ వినోద్ రామ్‌ను నియమించి ఉంటారు. లోథా ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేస్తుండగా వివాదాస్పదమైన కేరళలోని సుసంపన్నమైన పద్మ నాభస్వామి ఆలయాన్ని కోర్టు నియమించిన పరి పాలనా కమిటీ పర్యవేక్షణ కింద ఉంచారు. దాని ఆర్థిక వ్యవహారాలను ఆడిట్ చేసే బాధ్యతలను రాయ్‌కు అప్పగించారు. ఆ తర్వాత వివాదాస్పద మైన ఎమ్‌సీఐని (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సంస్కరించడానికి నియమించిన కమిటీలో కూడా రాయ్‌కు స్థానం కల్పించారు. కాబట్టి తార్కికంగా సీఓఏకు నేతృత్వం వహిం చాల్సిందిగా ఆయన రాయ్‌నే ఎన్నుకున్నారని ఊహించవచ్చు. సీఓఏలోని మిగతా ముగ్గురు సభ్యులలో ఒకరు ముంబై కేంద్రంగా పనిచేసే ఐడీఎఫ్సీ లిమిటెడ్‌కు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయే. అదే కంపెనీకి రాయ్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు కాబట్టి, లిమాయేను ఆయనే ఎంపిక చేసి ఉండాలి. ఇక డయానా ఎదుల్జీ, గుహ ఎలా ఎంపిక అయ్యారో స్పష్టత లేదు. అయితే వారిద్దరూ వివాదరహి తులు లేదా వారం క్రితం వరకు వివా దరహితులుగానే ఉండేవారు. సీఓఏ నాలుగు నెలలుగా బీసీసీఐపై పూర్తి అధికారాలతో పనిచేస్తోంది. అంతేకాదు, స్వల్పకాలిక సమాచారంతోనే సుప్రీం కోర్టు క్రికెట్ బెంచ్ దాన్ని కలుసుకోడానికి సుముఖంగా ఉంది. అయినా సీఓఏ లోథా కమిటీ సంస్కరణ లను అమలుచేయడంలో ఏ మేరకు విజయం సాధించిందో స్పష్టత లేదు. కోర్టు దానికి కాల పరిమితిని విధించలేదు కాబట్టి కొంతకాలం పాటూ బీసీసీఐని సీఓఏ నియంత్రిస్తోందో కూడా తెలియదు. ఈలోగా ప్రపంచ రంగస్థలిపై భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారాలలోని సంస్కరణలుగా పిలుస్తున్న రాబడి పంపిణీ, ఓటింగ్ ప్రమాణాలను అది వ్యతిరేకించనైనా లేకుపోయింది. మూడు పెద్ద తలకాయలకు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో కలిపి) నేతగా ఉన్న స్థానంలో ఉన్న భారత్ ఇంత వరకు ఓటమిని ఎరుగదు. అలాంటిది 13–1 తేడాతో అవమానకమైన ఓటమిని ఎదుర్కొంది. సీఓఏ పోరాడి ఓడటం కాదు, అసలు పోరాడనే లేదు. ఐసీసీ నియంత్రణ ఎంత పరిపూర్ణంగా, నిరం కుశంగా ఉందో తెలుసుకోవాలంటే... కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేయడం సహా ఎలాంటి చర్యా చేపట్టకుండా అది బీసీసీఐకి జారీ చేసిన ఉత్తరువుల పరంపరను చూడండి. మన క్రికెట్ జట్టు ఇప్పుడు చీలిపోయింది. కెప్టెన్, కోచ్‌ల మధ్య యుద్ధం నడుస్తోంది. మినీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా కోచ్ ఉద్యోగానికి దర ఖాస్తులను పిలిచారు. వీటన్నిటికి తోడు సీఓఏఏలోని ఒక ప్రముఖ సభ్యుడు తన కొన్ని ఉత్తరాలను బయటపెట్టారు. వాటిలో ఆయన కమిటీలోని తన సహచరులు అసమర్థతపైనా, సంస్కరణలను అమలుచేయంలోని వైఫల్యం పైనా పరోక్ష విమర్శలను సంధించారు. ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాల్సిన ఇద్దరు క్రీడాకారులు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అందరిలోకీ సీనియర్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోనీలపై అను మానపు నీడలు ముసిరేలా చేశారు. అపరిమిత ప్రయోజనాల ఘర్షణ సీఓఏ అధికారాల పరిధి బీసీసీఐ నిర్వహణలోని ప్రయోజనాల ఘర్షణ లను సరిదిద్దడమే. కానీ గుహ ఉత్తరాలు మన క్రికెట్ క్రీడకారులకు, ప్రత్యే కించి పూర్వ క్రీడాకారులకు సంబంధించిన ఎన్నో పరస్పర ప్రయోజనాల ఘర్షణను వెలుగులోకి తెచ్చాయి. న్యాయవ్యవస్థ చురుకైన పాత్ర వహిం చడం వల్ల కలిగిన అనుద్దేశపూర్వక పర్యవసానంగా భారత క్రికెట్‌కు సంబంధించిన మరో రంగంలోని ఘర్షణలు, మరింత ఎక్కువ ముఖ్యమైనవి వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా నియంత్రితమైన ఫైనాన్స్ మార్కెట్లు, బ్యాంకింగ్, అధికారవర్గ–కార్పొరేట్ వ్యవస్థలు, వాటి మధ్య అనుసంధానాలు బయ టపడ్డాయి. సీఏఓపైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత శక్తివంతమైన బ్యాంకింగ్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణలు, పునర్వ్యవస్థీకరణకు అధిపతిగా ఉన్న రాయ్.. ఐడీఎఫ్సీ బ్యాంక్‌కు ప్రమోటరైన ఐడీఎఫ్సీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఐడీ ఎఫ్‌సీ, ప్రభుత్వ బ్యాంకులకు పోటీదారు. అంతేకాదు, రాయ్ తన సీఈఓను సీఓఏలో తనకు సహాయకునిగా నియమించుకున్నారు! లిమాయేను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు (ఎన్ఎస్ఈ) సీఈవోగా ఎంపిక చేశారు. దేశంలోని 80 శాతం స్టాక్ మార్కెట్ లావాదేవీలు దానిలోనే జరు గుతాయి. నెలల తరబడి దానికి అధిపతి లేరు. అయినా లిమాయే సీఓఏ సభ్యునిగా కొనసాగడం మానుకుంటే తప్ప మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీ బాధ్యతలను ఆయన చేపట్టలేరు. బలీయమైన అధికారవర్గపు శక్తుల మద్దతుతో జరిగిన లిమాయే నియా మకంలో ఆయన ద్విపాత్రాభినయంలోని ప్రయోజనాల ఘర్షణను ప్రశ్నించిన సెబీ ధైర్యం ప్రశంసనీయం. ఆయన నేతృత్వం వహించాల్సిన సంస్థలో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఒకటే లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఆయన రెండు పక్షాలలోనూ ఉండగలరా? దేశంలోని అతి ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజి సీఈఓకు బీసీసీఐ లాంటి వివాదాస్పద సంస్థను నడపడానికి సమయం ఉంటుందా? ఇక ఆయన ఐడీఎఫ్సీకి ఎంత సమయాన్ని కేటాయిం చగలుగుతారు? సెబీ స్పష్టతను కోరడం సమంజసమే. బీసీసీఐ ఆడిటింగ్ కాంట్రాక్టును ఎన్ఎస్ఈ డైరెక్టరు, ఎన్ఎస్ఈ సెలెక్ట్ కమిటీ సభ్యుని సొంత కంపెనీకి ఇచ్చారు. దాన్ని తర్వాత రద్దు చేశారు. రెండువారాల క్రితం లిమాయే తాను ఆగస్టులో సీఓఏ విధులను బయ టపడతానని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. మరో సభ్యుడు గుహ నిష్క్రమించారు కాబట్టి ఇక భారత క్రికెట్ ఎక్కడ నిలుస్తుంది? ఈలోగా ఎన్ఎస్ఈ అధిపతి లేకుండా ఉండాల్సిందేనా? క్రికెట్, డబ్బు, అధికారాల మధ్య కుమ్మక్కు అనే అదే కథ మరోసారి, మరో రకంగా పునరావృతం అవు తోంది. సీఓఏ విధులను చేపట్టి నప్పుడు రాయ్ తాను నైట్ వాచ్‌మెన్‌లా నిర్దిష్ట మైన పనికే పరిమితమౌన్నారు, బాగానే ఉంది. కానీ క్రికెట్ అధికారం పూర్తిగా వివశం చేసేస్తుంది. twitter@shekargupta -
పాండురంగాపురంలోనూ నయీమ్ నీడలు
ఈ ఏడాదిలోనే రెండు దఫాలు వచ్చి వెళ్లినట్లు ప్రచారం తాళం వేసి అనుమానాస్పదంగా ఉన్న ఇంటిపై పోలీసుల ఆరా ఖమ్మం అర్బన్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ నీడలు రోజుకొకటైనా బయటపడుతున్నాయి. రెండో డివిజన్లోని పాండురంగాపురంలోనూ అతని స్థావరం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చిపోతుండేవాడని అంటున్నారు. పాండురంగాపురంలోని గ్రామదేవత (బొడ్రాయి) వద్ద ఉన్న ఇంటిని సుమారు పదేళ్ల క్రితమే నయీమ్ కొత్తపల్లి ప్రసాద్ పేరుతో కొనుగోలు చేశాడని, తన సమీప బంధువు వరుసకు పెద్దమ్మ అయ్యే అత్తరున్నీసా, మేనల్లుడు మిన్ను దాంట్లో నివాసం ఉండేవారని చెబుతున్నారు. ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ప్రహరీ గోడ ఎత్తు పెంచి, అక్కడక్కడ రంధ్రాలు చేయించాడని, వెనుక వైపు భారీగా ఎత్తు పెంచించాడని అంటున్నారు. అప్పుడప్పుడు నయీమ్ కొంతమంది మహిళలతో వచ్చి రెండు, మూడు రోజులు గడిపి వెళ్లే వాడట. ఈ ఏడాది జనవరిలో, రంజాన్‌కు ముందు నయీమ్ ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నయీమ్ మృతికి వారం రోజుల ముందునుంచే ఈ ఇంటికి తాళం వేసి ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచే సెటిల్మెంట్లు పాండురంగాపురంలో కొనుగోలు చేసిన ఇంటి నుంచే భూములు, ప్లాట్ల వివాదంలో సెటిల్మెంట్లు చేసేవాడని చెబుతున్నారు. ప్రస్తుతం తాళం వేసి, చుట్టూ చెత్తాచెదారంతో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఈ ఇంటిని నయీమ్ కొత్తపల్లి ప్రసాద్ పేరుతో కొనుగోలు చేశాడు. అసలు ఈ ప్రసాద్ ఎవరనేది తేలాల్సి ఉంది. స్థానికుడా, నకిలీ పేరును సృష్టించాడా? అనే దానిపై ప్రచారం సాగుతోంది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ బుధవారం ఆ ఇంటిని పరిశీలించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. వాస్తవం ‘తాళం’ మాటున.. నయీమ్ స్థావరంగా చెప్పుకుంటున్న ఆ ఇంటి తాళం తీస్తేగానీ అసలు విషయం బయటకు రాదు. ఇంట్లో పెద్దమొత్తంలో బంగారు, డబ్బులు, విలువైన పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఇంట్లో ఓ వృద్ధురాలు ఉండేది. మేము వెళ్లిన వెంటనే ఆమె పన్ను చెల్లించేది..’ అని పన్ను వసూలు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల క్రితం ఇంటి లోపల ఎత్తు బేషన్ అమర్చినట్లు ప్లంబర్ పోలీసుల ఎదుట వివరించాడు. -
బయటపడుతూనే ఉన్న నయీమ్ నీడలు
పోలీసుల అదుపులో నయీమ్ డ్రైవర్? చర్లలో తనిఖీల్లో పట్టుబడిన శామ్యూల్ ఛత్తీస్‌గఢ్ పారిపోతూ చిక్కిన వైనం 9 ఎంఎం పిస్టల్, 6 బుల్లెట్లు స్వాధీనం నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన రోజు సెలవులో.. 26 వరకు రిమాండ్.. ఖమ్మం తరలింపు సరిహద్దులో మూడు రోజులుగా విస్తృత సోదాలు సాక్షిప్రతినిధి, ఖమ్మం/ చర్ల: ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మండలాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ కారు డ్రైవర్ గంధం శామ్యూల్‌ను చర్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను ఛత్తీస్‌గఢ్ పారిపోతుండగా తనిఖీల్లో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతన్ని భద్రాచలం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఈనెల 26వ తేదీ వరకు రిమాండ్ నిమిత్తం ఖమ్మం తరలించినట్లు తెలుస్తోంది. కానీ చర్ల సీఐ సాయిరమణ మాత్రం తామెవరినీ పట్టుకోలేదని చెబుతుండటం గమనార్హం. నయీమ్‌కు ఎలా ఆ రాష్ట్రంతో సంబంధాలు ఏర్పడి ఉండవచ్చు..! గతంలో ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు మావోయిస్టుల సమాచారం ఇవ్వడం ద్వారా కూడా నయీమ్‌కు అక్కడ సంబంధాలు ఏర్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నయీమ్ అనుచరులు ఛత్తీస్‌గఢ్ పారిపోయే అవకాశం ఉందన్న రాష్ట్ర పోలీసుల అధికారుల సూచనలతో సరిహద్దులోని వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మూడు రోజులగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లోనే శామ్యూల్ పోలీసులకు పట్టుబడ్డాడని తెలిసింది. సరిహద్దులో మరింత అలర్ట్ నయీమ్ కారు డ్రైవర్‌గా భావిస్తున్న గంధం శామ్యూల్ చర్లలో తనిఖీల్లో పట్టబడడంతో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు మరింత అలర్టయ్యారు. లొంగిపోయిన తర్వాత నయీమ్ రాష్ట్ర పోలీసులతో పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులకు కూడా మావోయిస్టుల సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలోని సుకుమా, జగ్దల్పూర్, బీజాపూర్, కాంకేడ్ ప్రాంతాల్లో ఉంటూ కాంట్రాక్టర్‌గా పనులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ నయీమ్ పెద్ద ఎత్తున తన అనుచరులును ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాలకు ఖమ్మం మీదుగానే వెళ్లాలి. నయీమ్ 2011కి ముందు ఛత్తీస్‌గఢ్‌కు తన అనుచరులతో పలుమార్లు వెళ్లినట్లు ఈ సంఘటన ఆధారంగా తెలుస్తోంది. అతని వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన శామ్యూల్‌కు ఈ రూట్ తెలవడం, ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్ అనుచరులు ఎవరైనా షెల్టర్ ఇస్తారనే ఉద్దేశంతో పారిపోతూ చర్లలో పోలీసుకు చిక్కాడు. అతని వద్ద 9 ఎంఎం పిస్టల్, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసుల విచారణలో తనది మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మచ్చల గ్రామం అని, నయీమ్‌కు కొంతకాలం కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు చెప్పినట్లు తెలిసింది. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన రోజు సెలవులో ఉన్నట్లు పేర్కొనట్లు సమాచారం. ఈ సంఘటనతో ఒక్క సారిగా ఉలికిపడిన జిల్లా పోలీసు అధికారులు ప్రధాన రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఏజెన్సీ మండలాల్లో అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లా మీదుగా నయీమ్ అటు .. ఇటు.. గాంధీనగర్‌కాలనీలో ఇంటిని కొనుగోలు చేసి డెన్ ఏర్పాటు చేసుకున్న నయీమ్ పలుమార్లు భువనగిరి నుంచి వరంగల్ జిల్లా తొర్రూరు.. ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లినట్లే.. ఛత్తీస్‌గఢ్ కూడా వెళ్లినట్లు శామ్యూల్ పోలీసులకు చిక్కడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ నయీమ్ కేసు విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయడంతో అతనితో సంబంధం ఉన్న చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లారు. రాజధానిలో ఉంటున్న అనుచరుల్లో తమపై ఎప్పుడు సిట్ దాడి చేస్తుందోనని రహస్య ప్రదేశాల్లో ఉంటున్నారు. శామ్యూల్ తానుకూడా పట్టుబడతానని ఖమ్మం మీదుగా ఛత్తీస్‌గఢ్ పారిపాయే ప్రయత్నాల్లో పోలీసులకు చిక్కాడు. ఇతను నయీమ్ వాహనం నడుపుతూ చాలాసార్లు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లడంతో అక్కడ షెల్టర్ తీసుకోవడానికే వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. నయీమ్ జిల్లా మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లకపోతే శామ్యూల్‌కు ఆప్రాంత ఎలా తెలిసి ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు అతని నుంచి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కాగా శామ్యూల్ శనివారం రాత్రే బస్సులో భద్రాచలం చేరుకొని ఇక్కడ బస చేసి ఆదివారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరి చర్లలో పోలీసులకు పట్టుబడ్డాడని సమాచారం. నయీమ్ జాడలేదంటూనే.. నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకే విస్తరించిన నయీమ్ నేర సామ్రాజ్యం నీడలు జిల్లాలో కూడా ఉండడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. శామ్యూల్ పట్టుబడడంతో నయీమ్ కచ్చితంగా జిల్లా మీదుగా ఛత్తీస్‌గఢ్ పలుమార్లు వెళ్లిఉంటాడని భావిస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎవరితోనైనా అతనికి సంబంధాలు ఉన్నాయా..? భూదందాలు ఏమైనా చేశాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. గాంధీనగర్‌లో నయీమ్ కొనుగోలు చేసిన ఇంట్లో కొంతకాలం అతని అత్త బీబమ్మ (సుల్తానాబేగం) ఉండడంతో ఈ సమాచారం అంతా పోలీసు అధికారులు ఇప్పటికే సిట్‌కు చేర వేశారు. అసలు ఇక్కడే నయీమ్ ఇంటిని ఎందుకు కొనుగోలు చేశాడు..? అతనికి ఎవరు సహకరించారని పోలీసులు లోతుగా పరిశోధన ప్రారంభించారు. మొత్తంగా జిల్లాలో నయీమ్ జాడలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో జిల్లా పోలీసులు అలర్టయ్యారు.