Shahnawaz
-
ఆమె కోసం ఎదురు చూస్తాం..
సాక్షి, సిటీబ్యూరో: అది ఆకలి.. కానీ ఆ ఆకలి ఎక్కడా కనిపించదు.. నట్టింట్లో మూడంకె వేసుకొని పేగులను గట్టిగా ముడివేసుకుంటుంది. ఆ రొద వినిపించకుండా పెదాలను చిరునవ్వుతో బిగించేస్తుంది. పేవ్మెంట్లపైకి రావాలన్నా.. అన్నపూర్ణ ప్లేట్లతో కడుపు నింపుకోవాలన్నా సరే.. బిడియం అడ్డొస్తుంది. దాతలను అర్థించకుండా ఆత్మాభిమానం హెచ్చరిస్తుంది. లాక్డౌన్ అనేక మందిని అనేక విధాలుగా కకావికలం చేసింది. రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికిన వాళ్లను ఆకలి కేకలతో రోడ్డెక్కించింది. కష్టజీవులు, యాచకులు ఒక్కటై అన్నం కోసం బారులు తీరారు. ఇది నాణేనికి ఒకవైపు.. అయితే మరోవైపు.. చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు చేస్తూ నెలజీతంతో ఇంటి గుట్టు బయటపడకుండా గుంభనంగా సంసారాన్ని నెట్టుకొస్తున్న మధ్యతరగతి వేతన జీవులు సైతం విలవిల్లాడుతున్నారు. ఏ వస్త్ర దుకాణంలోనో, మరే షాపింగ్ మాల్లోనో ఉద్యోగం చేస్తూ బతికిన వాళ్లు లాక్డౌన్తో ఉపాధిని కోల్పోయారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్డ్రైవర్లు పనుల్లేక పైసల్లేక, పస్తులతో వెళ్లదీయాల్సి వస్తోంది. చేయిచాచి యాచించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక భారంగా గడిపేస్తున్నారు. అలాంటి వారి కోసం నేనున్నానంటూ అండగా నిలుస్తోంది షహనాజ్.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ గవర్నర్ దివంగత భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి మనుమరాలు. అసంఘటిత రంగంలో పనిచేస్తూ లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు, కష్టాలను అనుభవిస్తున్న ఎంతోమందికి ఆమె అండగా నిలుస్తోంది. ఆయన జీవితం ఆదర్శప్రాయం.. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి చివరి వరకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. దేశసేవ కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దత్తపుత్రికగా పెరిగిన షహనాజ్ తాతలోని సేవాదృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘ఇదంతా నా తృప్తి కోసం మాత్రమే’ అంటూ దాటవేస్తారామె. కానీ ఈ లాక్డౌన్ వేళలో తనకు తెలియకుండానే ఎంతోమందికి కొండంత అండగా నిలబడటం విశేషం. ఎదురుచూపులు.. లాక్డౌన్ ఒక గడ్డుకాలం. చాలామంది తాము పడుతున్న బాధలను పంటిబిగువున భరిస్తున్నారు. బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్లను వెతుక్కుంటూ వెళ్తున్నారు షహనాజ్. వాళ్ల అవసరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఒక కుటుంబానికి సరిపడా బియ్యం, అవసరమైన వాళ్లకు మందులు, వంటనూనె, పప్పులు సహా ఇతర అన్ని రకాల నిత్యావసర వస్తువులను స్వయంగా అందజేస్తున్నారు. ‘అదంతా ఎంతో సహజంగా అనిపిస్తుంది. చాలాకాలంగా తెలిసిన అమ్మాయి, ఎంతో దగ్గరి బంధువు వచ్చి ఆదుకుంటున్నట్లుగానే ఉంటోంది. కానీ ఎవరో దాత వచ్చి ఉదారంగా చేసే సహాయంలా అనిపించదు. ఆమె సహాయం ఎప్పటికీ మరిచిపోలేం..’ బోరబండకు చెందిన ఒక మహిళ అభిప్రాయం ఇది. ఆకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో షాపింగ్మాల్లో చేస్తున్న ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఇంటి కిరాయి, నిత్యావసర వస్తువులు, ఇద్దరు పిల్లల పోషణ భారంగా మారాయి. ఆ విషయం తెలిసిన షహనాజ్ ఇతోధిక సహాయాన్ని అందజేశారు. ‘నెలకు పది, పన్నెండు వేల జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చే వాళ్లు ఆకస్మాత్తుగా ఆ ఒక్క ఆధారాన్ని కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసు. ఒకప్పుడు మా నాన్నకు వచ్చే రూ.8 వేల జీతంతో మేం బతికాం. అందుకే బాధలను బయటకు చెప్పుకోలేని వారికి నా వల్ల ఏ కొంచెం ఊరట లభించినా చాలనిపిస్తోంది.’ అని అంటారామె.. ఇప్పటి వరకు ఆమె 500 కుటుంబాలకు పైగా సహాయం చేశారు. బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు అవసమైన వారికి మందులు కొనిచ్చారు. ఇక అప్పటికప్పుడు ఆకలి తీర్చేందుకు బంజారాహిల్స్లో రోడ్ నెంబర్–12లో ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారంలో కనీసం 300 మందికి పైగా ఇక్కడ భోజనాలు లభిస్తాయి. ‘ఆమె కోసం ఎదురు చూస్తాం. మధ్యాహ్నం పన్నెండింటికల్లా ఆమె వస్తారు. కడుపు నిండా తింటున్నాం. నెల రోజులుగా ఇలాగే గడిచిపోతోంది.’ మాసాబ్ట్యాంక్కు చెందిన ఒక క్యాబ్డ్రైవర్ సంతృప్తి ఇది. బాధితులను, నిస్సహాయులను గురించి స్వయంగా తెలుసుకొని కావాల్సిన సహాయాన్ని అందజేస్తున్నారు. -
రైల్వే బ్రిడ్జి కింద చిన్నారి మృతదేహం
ఆరేడు నెలల వయసున్న ఓ చిన్నారి పాప మృతదేహం లభ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగుజూసింది. ఎస్ఐ షానవాజ్ తెలిపిన వివరాల ప్రకారం.....ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందిల్ ఫైల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా...దాదాపు ఆరేడు నెలల వయసున్న పాపగా గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందితే ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారీ మెడపై చీమలు కరిచినట్లు ఉందని ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఒళ్లు తెలియని కోపంతో..
మోటారుసైక్లిస్ట్ని కొట్టి చంపారు చిన్నారుల ఎదుటే తండ్రి ఉసురు తీసిన వైనం సాక్షి, న్యూఢిల్లీ : ఓ చిన్న ఘటనతో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. తమ కారును ఢీకొట్టాడన్న కోపంతో కొందరు దుర్మార్గులు ఇద్దరు చిన్నారుల అమాయకపు చూపుల మధ్యేవారి తండ్రిని ఒళ్లు తెలియని కోపంతో నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. ఈ దారుణం ఆదివారం రాత్రి దరియాగంజ్ ప్రాంతంలో తుర్క్మన్గేటు వద్ద జరిగింది. షానవాజ్(38) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను మోటారుసైకిల్పై కూర్చోబెట్టుకుని ఆదివారం రాత్రి ఇంటికి తిరిగివెళుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఐ20 కారును అనుకోకుండా ఢీకొట్టాడు. ఇది చిన్న ఘటనే అయినప్పటికీ కారులోని వ్యక్తులు షానవాజ్తో వాదులాటకు దిగారు. ఒళ్లు తెలియని కోపంతో కర్రలు, ఇనుపరాడ్లతో షానవాజ్ను తీవ్రంగా కొట్టారు. తలపై ఇనుపరాడ్ బలంగా తగలడంతో షానవాజ్ సృహతప్పి కిందపడిపోయాడు. దీంతో కారులో వచ్చిన వ్యక్తులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. షానవాజ్ పడిఉండటాన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే షానవాజ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు రోడ్లను దిగ్బంధించారు. అటుగా వచ్చిన రెండు కార్ల విండోలను ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలను తగలబెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతోనే నిందితులు పారిపోయారని వారు ఆరోపించారు. కాగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు ప్రయాణికుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అలాగే వాహనాలను ధ్వంసం చేసిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపింది..
ముజఫర్ నగర్ : ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో భార్య. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లోని రూర్కలి గ్రామంలో చోటుచేసుకుంది. కలప వ్యాపారి సైదా హసన్ (45)ను ...భార్య సనవర్ బేగం ...ప్రియుడు షహనావాజ్తో కలిసి హతమార్చినట్లు పోలీసులు బుధవారమిక్కడ తెలిపారు. కాగా కలప కొనేందుకు అటవీప్రాంతానికి వెళ్లిన సైదా హసన్ చివరకు శవమై తేలాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ...సనవర్ బేగంను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. షహనావాజ్తో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని భర్త హెచ్చరించటం వల్లే ఈ హత్య చేసినట్లు భార్య తెలిపింది. వారిద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. -
'రాహుల్ వ్యాఖ్యలు ముస్లింలను బాధించేలా ఉన్నాయి'
పాట్నా: ముజాఫర్ నగర్ బాధితులకు పాకిస్తాన్ వల వేస్తుందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అతని వ్యాఖ్యలు ముస్లిం యువతను బాధించేలా ఉన్నాయని బీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, సాగర్, బుందేల్ఖండ్ తదితర ప్రాంతాల్లో గురువారం ఏర్పాటైన ‘సత్తా పరివర్తన్’ ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ముజాఫర్ నగర బాధితులకు పాకిస్థాన్ గాలం వేస్తుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.