పాట్నా: ముజాఫర్ నగర్ బాధితులకు పాకిస్తాన్ వల వేస్తుందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అతని వ్యాఖ్యలు ముస్లిం యువతను బాధించేలా ఉన్నాయని బీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ పై మండిపడ్డారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, సాగర్, బుందేల్‌ఖండ్ తదితర ప్రాంతాల్లో గురువారం ఏర్పాటైన ‘సత్తా పరివర్తన్’ ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ముజాఫర్ నగర బాధితులకు పాకిస్థాన్ గాలం వేస్తుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.