Shailendra Singh
-
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
స్కానింగ్ రిపోర్టు చూసి కంగుతిన్న డాక్టర్లు
న్యూఢిల్లీ: యోగాతో ఏదైనా సాధ్యమని, ఏం తిన్నా కడుపులో ఎంచక్కా జీర్ణమవుతాయని భావించాడు. గతంలో కొన్ని రోజులపాటు ఇనుప ముక్కలు తిన్నాడు. బ్లేడ్లు, ట్యూబ్లైట్లను సైతం బొజ్జలో వేసుకున్నాడు. చివరికి తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత వైద్యులు అతడికి పునర్జన్మ ప్రసాదించారు. ఆ వివరాలు.. స్థానిక అశోక్ విహార్‌కు చెందిన శైలేంద్ర సింద్ర(52)కు కొంతకాలం కింద తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయన బాడీని స్కాన్ చేసిన వైద్యులు అప్పట్లో కంగుతిన్నారు. యోగాతో ఏదైనా కరిగించవచ్చని భావించి ఇనుము వస్తువులు, బ్లేడ్లు, ట్యూబ్‌లైట్ అద్దాలు లాంటి పదార్థాలు తిన్నానని డాక్టర్లకు చెప్పాడు. వారి స్కానింగ్‌లో అది నిజమని తేలింది. దీంతో కొన్ని రోజులపాటు వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆయనకు యాంటీ సైకోటిక్ థెరపీ చేసి మెడిసిన్ ఇస్తూ రోజు పరీక్షించినట్లు డాక్టర్ ఆర్పీ బెనివాల్ తెలిపారు. ఎట్టకేలకు ఆపరేషన్ చేసి రెండు లోహపు ప్లేట్లు, ఆరు సూదులు, కొన్ని బ్లేడ్లు, ట్యూబ్‌లైట్ అద్దాలను బయటకు తీసినట్లు వివరించారు. నాలుగు నెలల తమ శ్రమ ఫలించిందని వైద్యులు చెబుతున్నారు. శైలేంద్ర ఒంటరిగా ఉంటున్నాడని ఈ క్రమంలో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాగా కడుపులో లోహాలు, సూదులు, బ్లేడ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పేసరికి ఆశ్చర్యానికి లోనైనట్లు ఆయన సోదరి ఉమ తెలిపారు. అతడు ఇలా చేస్తుంటాడని ఎప్పుడు సందేహం రాలేదన్నారు. అయితే సోదరుడు శైలేంద్ర.. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు హార్మోనియం వాయిస్తూ తోటి పేషెంట్లకు ఊరట కలిగించేవాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం కుదుట పడుతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు. 'నేను ఆర్మీలో చేరాలలనుకున్నాను. కానీ నా పేగులలో సమస్య ఉందని, బతకడం కష్టని చెప్పడంతో ఆశను వదులుకున్నాను. ఇప్పటివరకూ నాకేం కాలేదు. యోగాతో ఏదైనా సాధ్యమని విన్నాను. అందుకే దాదాపు తొమ్మిదేళ్ల కిందట లోహాలు, అద్దాలు, బ్లేడ్లు, సూదులు మింగాను. యోగా వల్ల నేటికీ ప్రాణాలతో ఉన్నాను. ఒక్కోక్కరికి ఒకో రకమైన విశిష్టిత ఉంటుందని' పేషెంట్ శైలేంద్ర సింగ్ వివరించాడు. -
పుకారు తెచ్చిన ప్రమాదం...
ప్లేబ్యాక్ సింగర్ కిశోర్ కుమార్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు కొత్త తరంగంలా వచ్చినవాడు శైలేంద్ర సింగ్. తన కొడుకు రిషి కపూర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త గొంతును పరిచయం చేయాలని రాజ్‌కపూర్ అనుకున్నప్పుడు శైలేంద్ర సింగ్ తారసపడ్డాడు. ‘బాబీ’ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత రిషి కపూర్ నటించిన చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ పాడాడు. రవీంద్రజైన్ వంటి సంగీతకారులు కూడా మంచి మంచి పాటలు ఇచ్చారు. కాని ఒకసారి డయాబిటిస్ వల్ల రెండు మూడు రోజులు శైలేంద్ర సింగ్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ప్రత్యర్థులు ముంబైలో పుకార్లు పుట్టించారు. శైలేంద్రకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని ఇక మీదట రికార్డింగులు చేయలేడని పాడలేడనీ.... అలా అలా అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. పుకార్లను పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించాను అంటుంటాడు ఈ మంచిపాటగాడు. -
ఫస్ట్ లైవ్ బుక్
సన్‌బర్న్’... అంతర్జాతీయ స్థాయి సంగీతోత్సవం. మోడ్రన్ ఇండియా జోష్‌ను ప్రపంచానికి చూపిన సక్సెస్ఫుల్ ఈవెంట్. గోవాలో జరిగే ఈ ఇయర్లీ ఈవెంట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఈవెంట్‌ని సిటీకి పరిచయం చేస్తున్న సందర్భంగా సన్‌బర్న్ కాన్సెప్ట్ సృష్టికర్త... బాలీవుడ్ నిర్మాత కూడా అయిన శైలేంద్రసింగ్ నగరానికి వచ్చారు. తన స్వీయానుభవాలతో రాసిన సన్‌బర్న్ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... భారత్‌లో చాలా మంది, చాలా ఘనత సాధించినప్పటికీ వాటిని పుస్తకాల్లోకి, రికార్డుల్లోకి తర్జుమా చేయటం గురించి ఆలోచించరు. విజయాలను, మార్పులను, గొప్ప విషయాలను రాబోయే తరాలకు అందించే ప్రయత్నం చేయరు. దీన్ని గమనించి... ప్రతి విజయానికీ అక్షర రూపం ఇవ్వడం అవసరమని గుర్తించాను. ది ట్రూ స్టోరీ ఆఫ్ సన్‌బర్న్ పుస్తకం అందులో భాగమే. నేడు సన్‌బర్న్ ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన విజయం. అయితే దీని వెనుక ఉన్న కథ గురించి నేను లేనప్పుడు ఎవరు మాట్లాడుకోరు. అందుకే నా కథ నేనే చెప్పాలని ఈ పుస్తకం రాశా. డ్రీమ్ నుంచే ఫేమ్... ఈ మధ్య యంగ్ జనరేషన్ కలలు కనడానికి కూడా సాహసించట్లేదు. నిజంగా ఒక కల కంటే దానిని సాకారం చేసుకోవటం అసాధ్యం కానే కాదు. పుస్తకాలు రాయడానికి నాకు ప్రత్యేక అర్హత లేదు కానీ రాయటం అవసర ం. నేను ఈ రోజు ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందే రీతిలో ఒక పని చెయ్యగలుగుతున్నానంటే, అది మరెవరైనా చెయ్యగలరు. ఈ విషయాన్ని చదివి చాలా మంది స్ఫూర్తి పొందగలరు. వారి కలలకు వాస్తవ రూపం ఇవ్వగలరు. చీకటి పడితే నిద్రపోవాలా? సన్‌బర్న్ ఈవెంట్లు, బాలీవుడ్ సినిమాలు, చారిటీలు, అవేర్నెస్ క్యాంపైన్లు చేస్తూ కూడా మూడు పుస్తకాలు రాయడానికి సమయం ఎలా చిక్కిందంటే, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నదే నా సమాధానం. పొద్దున నిద్రలేవాలి. రాత్రి నిద్ర పోవాలి. కచ్చితంగా ఇలాగే ఉండాలనుకుంటే ఏదీ చేయలేం. అలసిపోయినప్పుడు నిద్ర పోతే చాలదా! ఇలా ఆలోచిస్తే మీరూ ఎన్ని పనులైనా చేయవచ్చు. హైదరాబాద్‌కు రావడమంటే చాలా ఇష్టం. ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేస్తుంటాను. నా మొదటి పుస్తకం ఫ్లాక్ నోస్ కూడా హైదరాబాద్‌లోనే లాంచ్ చేశా. మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఈ బుక్ ప్రీవ్యూ ఇక్కడే చెయ్యాలనిపించింది. నెక్ట్స్ సబ్జెక్ట్..! ఈ పుస్తకం తర్వాత మరో పుస్తకాన్ని కూడా లాంచ్ చేయబోతున్నా. అది సెక్స్ గురించిన పుస్తకం. 18 ఏళ్ల నా కొడుకుతో సెక్స్ గురించిన విషయాలు చెప్పాలనుకున్నా, చర్చించాల్సిన అవసరం ఉన్నా.. వాటిని మాటల్లో చెప్పలేను. కానీ చెప్పలేని ఎన్నో విషయాలను రాయవచ్చని ఇలా పుస్తక రూపంలో పెట్టా. ఈ పుస్తకం జనవరిలో లాంచ్ చేస్తున్నా.