shantanu naidu
-
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
ఒక మనిషి చనిపోయినా.. అతడు చేసిన మంచి ఎప్పుడూ బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామికవేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఒకరు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. లెక్కకు మించిన డబ్బును అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. రతన్ టాటా మరణించిన తరువాత.. ఆయన ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న.. ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి ఇప్పుడు సమాధానం లభించింది.టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన రతన్ టాటా ఆస్తి సుమారు రూ. 10వేలకోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుమారు రూ.3800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు.తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద రూ.800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. వీటికి కేటాయించిన ఆస్తులలో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్‌లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు రాశారు.జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరు మీద అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు.ఇదీ చదవండి: EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!రతన్ టాటాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే శునకాల సంరక్షణ కోసం కూడా రూ. 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసే విధంగా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.ఇక అందరూ తెలుసుకోవాలనుకునే విషయం.. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు ఏమి కేటాయించారు అని. అయితే శంతను నాయుడుకు తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. అది కాకుండా.. స్టూడెంట్ లోన్ మాఫీ చేశారు. ఇది కాకుండా రతన్ టాటా పక్కింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చిన రూ. 23 లక్షలు కూడా మాఫీ చేశారు. -
రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు
దివంగత వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న 'శంతను నాయుడు' (Shantanu Naidu)కు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈయన కంపెనీలో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని తానె స్వయంగా తన లింక్డ్ఇన్లో వెల్లడించారు.''టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ & జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా తండ్రి తన తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం నేను కిటికీలో చూస్తూ ఉండేవాడిని. ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది'' అని శంతను నాయుడు తన లింక్డ్ఇన్లో రాశారు.ఎవరీ శంతను నాయుడు?శంతను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజినీర్. ఇతడు ఒక రోజు రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి ఉండటాన్ని గమనించిన చలించిపోయాడు. ఆ తరువాత వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు.ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.మోటోపాస్ పేరుతో స్టార్టప్వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్’ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతను అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. MBA పూర్తి చేసి ఇండియాకు వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతను నాయుడును పిలిపించుకున్న రతన్ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.ఇదీ చదవండి: కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీగుడ్ఫెలోస్సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్‌టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్ నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్‌తోపాటు శంతన్ సెప్టెంబర్ 2022లో ‘గుడ్‌ఫెలోస్’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు.