shesha chalam forests
-
ఊళ్లలోకి వస్తున్న గజరాజులు, చిరుతలు... ఎక్కడంటే ?
సాక్షి, తిరుపతి: శేషాచలం అడవుల్లో చిరుతపులులు.. కౌండిన్య అడవుల్లో ఏనుగుల సంతతి పెరిగింది. మరోవైపు వలస వచ్చే ఏనుగుల గుంపులు అధికమయ్యాయి. దారితెలియక కొన్ని, ఆహారం కోసం మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి ఉచ్చులు, కరెంటు తీగలకు బలవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో శేషాచలం, కౌండిన్య అడవులు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ఈ అడవుల్లో చిరుతపులులు, ఏనుగులతోపాటు వివిధ రకాల వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. వాతావరణం అనుకూలించటం, ఆహారం సమృద్ధిగా దొరుకుతుండటంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అడవుల్లో నుంచి చిత్తూరు జిల్లాలోని అడవుల్లోకి వస్తున్నాయి. దీంతో చిరుతపులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రెండేళ్ల కిందట 20 నుంచి 30 లోపున్న చిరుతపులులు ఇప్పుడు 50కి చేరినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. శేషాచలంలో జింక, దుప్పి, కణుజు, కొండగొర్రెల సంతతి భాగా పెరిగింది. వీటికోసం చిరుతపులులు నల్లమల నుంచి శేషాచలం బాట పట్టాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. చిరుతల సంచారం ఆహార అన్వేషణలో భాగంగా శేషాచలం వచ్చిన కొన్ని చిరుతపులులు దారితెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముఖ్యంగా ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి మంగళం ప్రాంతాల్లో అనేకసార్లు చిరుతపులులు కనిపించాయి. వారం కిందట ఎర్రావారిపాలెం మండలం కోటకాడపల్లిలో స్థానికులు వేసిన ఉచ్చులో చిక్కి ఒక చిరుతపులి మృతిచెందింది. ఏడాది కిందట ఎర్రావారిపాలెంలోకి ఓ చిరుతపులి వచ్చివెళ్లింది. వలస ఏనుగులతో బెంబేలు జిల్లాలోని పడమటి ప్రాంతంలో విస్తరించి ఉన్న కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటికే ఏనుగుల సంతతి అనూహ్యంగా పెరిగింది. గతంలో 30 నుంచి 40 మధ్యలో ఉన్న ఏనుగుల సంఖ్య ప్రస్తుతం 60కి చేరింది. వీటితోపాటు తమిళనాడులోని క్రిష్ణగిరి, కర్ణాటక ప్రాంతంలోని 26 ఏనుగులతో కూడిన గుంపు మైసూరు అటవీ ప్రాంతాల నుంచి కావేరిపట్నం మీదుగా వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో సేదతీరి, అక్కడినుంచి గుడుపల్లి, పలమనేరు ప్రాంతాల్లో జనావాసాల్లోకి వస్తున్నాయి. విడివిడిగా వచ్చిన ఏనుగులు ఒక్కటయ్యాయి. వీటిలో ఒక ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. గున్న ఏనుగు నడచి తిరిగే వరకు ఈ ఏనుగుల గుంపు తిరిగి వెళ్లదని అటవీ అధికారులు చెబుతున్నారు. తరిమినా .... ఏనుగుల గుంపు జనావాసాల్లోకి వచ్చి భయాందోళనలకు గురిచేస్తుండటంతో ఇటీవల ఆ గుంపును పక్క రాష్ట్రం సరిహద్దులోని మొర్దన అడవుల్లోకి తరిమారు. కానీ , ఆ గుంపు గున్న ఏనుగు కోసం మళ్లీ కౌండిన్య అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వలస వచ్చిన 26 ఏనుగుల గుంపు వల్లే సరిహద్దు ప్రాంతంలో అలజడి నెలకొందన్నారు. కాగా కౌండిన్య అభయారణ్యంలో గతంలో 6 మగ ఏనుగులు ఉండేవని, విద్యుత్ షాక్‌కుగురై వాటిలో 4 ఏనుగులు మృతి చెందాయని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. దారితెలియక జనారణ్యంలోకి – మదన్‌మోహన్‌రెడ్డి, ఎఫ్ఆర్వో, కుప్పం తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతంలోని ఏనుగుల గుంపు కౌండిన్య అభయారణ్యంలోకి వలస వచ్చింది. వాటికి దారి తెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. వీటిని గతంలో మొర్దన ఫారెస్ట్‌లోకి తరిమేశాం. అయితే అవి గున్న ఏనుగు కోసం తిరిగి కౌండిన్యలోకి చొరబడ్డాయి. కౌండిన్య అభయారణ్యంలోనే ఉండే ఏనుగుల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. చిరుతపులుల సంతతి రెట్టింపైంది – సుబ్బరాయుడు, ఎఫ్ఆర్వో, తిరుపతి శేషాచలం అభయారణ్యంలో చిరుతపులల సంతతి రెట్టింపు అయింది. అడవిలో వాటికి అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటమే సంతతి పెరుగుదలకు కారణం. శేషాచలంలో ఆహారం లభ్యం అవుతుండటంతో నల్లమల నుంచి కూడా కొన్ని చిరుతపులులు వచ్చినట్లు ఆనవాళ్లున్నాయి. ఆ పులులే జనారణ్యంలోకి వస్తున్నాయి. -
అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల దాడి
-
అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల దాడి
చిత్తూరు: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు హద్దులేకుండో పోతోంది. ఏమాత్రం భయంలేకుండా తమ ఇష్టారాజ్యంగా వారు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా దేవరకొండ అటవీ ప్రాంతంలో, వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనం కూలీలు అటవీ సిబ్బందిపై దాడి చేశారు. భయంతో ఆటవీ సిబ్బంది పరుగులు తీశారు. దేవరకొండ అటవీప్రాంతం యర్రావారిపాలెం మండలం తుమ్మలచేనుపల్లిలో అటవీ సిబ్బంది(ఎస్టిఎఫ్ దళాలు)పై ఎర్రచందనం కూలీలు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 200 మంది కూలీలు పాల్గొన్నారు. కూలీలపై ఎస్టిఎఫ్ దళాలు కాల్పులు జరిపారు. ఒక కూలీ మృతి చెందాడు. మిగిలిన కూలీలు పారిపోయారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిని జిల్లా ఎస్పి శ్రీనివాసరావు పరిశీలించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల వీరంగం చేశారు. రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద దాదాపు వంద మంది కూలీలు అటవీ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. దాంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆ తరువాత వారు పారిపోయారు. బాలుపల్లి అటవీప్రాంతంలో ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో దావూద్ ముఠా హవా
-
శేషాచలంలో డి-గ్యాంగ్!
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో దావూద్ ముఠా హవా కీలక ఆధారాన్నిచ్చిన సీసీఎస్ పోలీసులు రైల్వేకోడూరు సహా తొమ్మిది గ్రామాల్లో నెట్వర్క్ ఈశాన్య సరిహద్దుల గుండా అక్రమ రవాణా ముఠా కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వేట హైదరాబాద్: దుబాయ్‌లో తలదాచుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను శేషాచలం అడవుల్లో లభించే అతి విలువైన ఎర్రచందనంపై పడింది. శేషాచలం అడవుల్లోని తొమ్మిది గ్రామాలతో పాటు కడప జిల్లా రైల్వేకోడూరు, పొరుగున ఉన్న కర్ణాటక సహా వివిధ ప్రాంతాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తన అనుచరుల సహకారంతో సముద్ర మార్గంలో గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనాన్ని దుబాయ్‌కి తరలించేస్తున్నాడు. ఈ నెట్‌వర్క్‌లో భాగమైన ముఠాను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందించారు. దీంతో మిగిలిన నిందితుల్ని పట్టుకోవడం కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వేట ప్రారంభించింది. గ్రామీణ యువతకు చోటా భాయ్ గాలం... దావూద్ ఇబ్రహీం ముఠాలో కీలకమైన వ్యక్తిగా ఉన్న కర్ణాటక వాసి చోటా భాయ్ ఇక్కడి ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. శేషాచలం అడవులు విస్తరించి ఉన్న కడప, చిత్తూరు జిల్లాల్లో యువతను ఆకర్షించడం ద్వారా అనేక మందిని ఎంపిక చేసుకున్నాడు. ఈ సభ్యులెవరికీ తాము పని చేస్తున్నది దావూద్ గ్యాంగ్‌లో అనే విషయం తెలియకుండా జాగ్రత్తపడుతున్నాడు. విహారయాత్రల ముసుగులో... శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన కూలీలతో నరికిస్తున్న ముఠా సభ్యులు వాటిని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల వద్ద నిర్ణీత కాలం భద్రపరుస్తున్నారు. ఆపై వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలకు లోనైన వాహనాలను మారు పేర్లతో కొనుగోలు చేయడంతో పాటు చోరీ వాహనాలను సేకరించి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ వాహనాల్లో ఎక్కువగా తమ వల్లో పడిన విద్యాధికులు, విద్యార్థులను ఉంచి, విహారయాత్రకు వెళ్తున్న ముసుగులో రోడ్డు మార్గంలో అనంతపురం మీదుగా కర్ణాటకలోకి కోలార్, చిత్తూరు మీదుగా తమిళనాడులోని మధురై ప్రాంతాలకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో పోలీసు తని ఖీలు ఎదురైతే వాహనాల్లోని వారు వాటిని వదిలి పారిపోయినా ద ర్యాప్తులో ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటిలోని విద్యార్థులు పట్టుబడినా లింకు అక్కడితో తెగిపోవడంతో దర్యాప్తు ముందుకు సాగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. స్క్రాప్‌తో పాటు ఎర్రచందనం రవాణా... రోడ్డు మార్గంలో ఎర్రచందనం లోడుతో వెళ్తున్న వాహనాలకు కాస్త ముందో, వెనుకో ముఠాకు చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్తుంటారు. వివిధ విభాగాలకు చెందిన చెక్‌పోస్టులతో పాటు హైవే పెట్రోలింగ్ సిబ్బందినీ లోబరుచుకుని, వారికి భారీ మొత్తం చెల్లిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎర్రచందనాన్ని కర్ణాటకలోని మంగుళూరు, తమిళనాడులోని వీఓసీ పోర్టులకు తరలిస్తున్నారు. ఓడల్లో ఎర్రచందనాన్ని దుబాయ్‌కు పంపిచేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న దావూద్ ప్రధాన అనుచరుడు బడా భాయ్ ఈ పోర్టుతో పాటు నేపాల్, బర్మా, ఈశాన్య రాష్ట్రాల మీదుగానూ ఎర్రచందనాన్ని అక్కడకు రప్పిస్తున్నాడు. కాగా, చోటా భాయ్, అతని అనుచరులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కర్ణాటక పంపాలని పోలీసుఅధికారులు నిర్ణయించారు.