28న హైదరాబాద్‌లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
‘సిరిధాన్యాలు – అమృతాహారం’ అనే అంశంపై ఈ నెల 28(ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1.30 గం. వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికలో ప్రగతి రిసార్ట్స్ రజతోత్సవాల సందర్భంగా జరిగే సభలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రారంభోపన్యాసం చేస్తారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రగతి గ్రూప్ సీఎండీ డా. జీబీకే రావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 84990 78294.
అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు శిల్పారామం సంప్రదాయ వేదికలోనే డాక్టర్ ఖాదర్‌వలి దేశీ ఆహారంతో వ్యాధుల్లేని జీవనంపై ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు.
వివరాలకు.. 040–23395979.
29న మెహదీపట్నంలో..
వర్షాధారంగా సిరిధాన్యాలు సాగుచేసుకొని, మిక్సీతో శుద్ధి చేసుకొని తినటం ద్వారా ఆధునిక రోగాల నుంచి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై ఈనెల 29న సా. 5.30 గం. నుంచి 7.30 గం. వరకు హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. పిల్లర్ నం. 83 దగ్గర పల్లవి గార్డెన్స్ కొణిజేటి ఎన్‌క్లేవ్‌లో ఉచిత అవగాహన కార్యక్రమం జరుగుతుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 9676797777.