Shiv Sena comments
-
ఆచరణాత్మక బడ్జెట్: ముఖ్యమంత్రి ఫడ్నవీస్
ఎంయూటీపీ-3కి రూ. 11,500 కోట్ల కేటాయింపుపై హర్షం ముంబై: కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆచరణాత్మకమైందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సాంకేతిక ఆధారిత ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తూ రైల్వేలో పునరుజ్జీవనం నింపేందుకు కృషిచేస్తున్న ప్రధాని మోడీ, రైల్వే మంత్రి సురేశ్ ప్రభులకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ ప్రగతీ శీలమని, ఆచరణయోగ్యమని వర్ణించారు. ఎంయూటీపీ 3 కోసం రూ. 11, 500 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. బడ్జెట్‌పై శివసేన వ్యాఖ్యలకు సీఎం స్పందిస్తూ... బహుశా వారు బడ్జెట్‌ను సరిగా విని ఉండరు అని అన్నారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ మాత్రం సామాన్యులకు, ముఖ్యంగా ముంబై, మహారాష్ట్రకు ఏమాత్రం బడ్జెట్ ఉపయోగకరం కాదని విమర్శించాయి. చార్జీలు పెంచబోమన్న ప్రభు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత మానిక్‌రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, రవాణా చార్జీలను 6.2 శాతం, ముంబై సబర్జన్ చార్జీలు 200 శాతం పెంచిందని విమర్శించారు. గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో బడ్జెట్లో చార్జీలు తగ్గిస్తారని ఆశించామని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలను కలిపేలా ఏర్పాటు చేయాలన్న రైల్వే లైన్ల నిర్మాణల ప్రస్తావనే తేలేదని విమర్శించారు. కాగా, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ... ముంబైలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ, మల్టీనోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్ ఏర్పాటు చేస్తానన్న ప్రభు..తన మాట నిలబె ట్టుకోలేదని విమర్శించారు. -
బీజేపీని మురికిగా మార్చి ఊడ్చేసిన ఆప్
సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యలు సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుపై పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని మురికిలాగా ఊడ్చేసిందని శివసేన బుధవారం తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. బీజేపీ ఘోర వైఫల్నాకి ప్రధాని మోదీయే కారణమని పేర్కొంది. కేవలం ఎన్నికల వాగ్దానాలు, ప్రసంగాలతోనే విజయం సాధించలేమని, బీజేపీకి ఢిల్లీ గుణపాఠం నేర్పిందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన బీజేపీని ఆప్ మురికిగా మార్చేసిందని తెలిపింది. తాము గెలిచిన సీట్లను లెక్కించేందుకు బీజేపీ నేతలకు చేతి వేళ్లు కూడా అవసరం లేదని ఎద్దేవా చేసింది. కిరణ్‌బేదీని ఓటమికి బాధ్యురాలిని చేయడం సరి కాదని సూచించింది. అమిత్‌షా తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోయారని, చివరి అస్త్రంగా మోదీని ప్రయోగించినా విఫలమయ్యారని ఎత్తిపొడిచింది. ఇది మోదీ పరాజయమని అన్నా హజారే వ్యాఖ్యానించారని, తాము కూడా అలాగే భావిస్తున్నామని శివసేన తెలిపింది. ఓ కార్పొరేషన్లో శివసేన ఓడితే... ఉద్దవ్ ఠాక్రే ఓడినట్టు భావించాలా..? : సిఎం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొనడం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. నాసిక్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఏదైనా కార్పొరేషన్లో శివసేన ఓడిపోతే అది ఉద్ధవ్ ఠాక్రే పరాజయంగా భావించాలా..? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని నరేంద్ర మోడీ పరాజయంగా పేర్కొనరాదన్నారు. ముఖ్యంగా పక్కింట్లో పిల్లాడు పుట్టాడన్న సంతోషాన్ని ఎక్కువ రోజులు వ్యక్తపరచరాదని కూడా ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో పరాజయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకుంటుందన్నారు.