shiva shankar
-
గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో జనసేన కార్యకర్త విజయ్..
-
KSR Live Show: పక్కాగా ఈవీఎం గోల్ మాల్.. నిమ్మకు నీరెత్తినట్టు ఈసీ
-
చంద్రబాబు చీకటి రాజకీయం.. సూపర్-6 ఎగనామం
-
నేను నిద్రలో కూడా డాన్స్ చేసేవాడిని
-
అన్నీ ఉన్నా ఒంటరి వాడిని అయిపోయాను..!
-
నాకు నగలు ఎందుకు ఇష్టం అంటే : శివశంకర్ మాస్టర్
-
డిజిటల్ ఫ్యూచర్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి: శివశంకర్
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల డిజిటల్ వినియోగం మరింత పెరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ & వర్చువల్ మీటింగ్‌ల నుండి ఆన్లైన్ విద్య వరకు ఇప్పుడు 'కొత్త టెక్నాలజీ మన జీవితంలోని అన్ని అంశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు & వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ & ఆటోమేషన్తో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు Metaverse. మెటవర్స్ అంటే మనం నివసించే ప్రపంచానికి మించిన ఒక సింక్రోనస్ డిజిటల్ ప్రపంచం. Web 3.0 ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, బ్రాండ్లతో పరిశ్రమ అంతటా అలలను సృష్టించాయి, వినియోగదారులకు ఇంతకు ముందెన్నడూ చూడని ఇంటరాక్టివిటీని అందించే అవకాశాలను అన్వేషించాయి. క్రిష్టోకరెన్సీ & NFTల విస్తరణ అలాగే ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ టెక్నాలజీ, ఈస్పోర్ట్ల పెరుగుదల డిజిటల్ భవిష్యత్తును మనకు అందిస్తుంది. ప్రస్తుతం సాంకేతికత మనం జీవించే, పనిచేసే విధానాన్ని మరింత వేగంగా మారుస్తుంది. అయితే, ఈ సాంకేతికతలను నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి ఇది నిస్సందేహంగా కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా: ఒక కొత్త భవిష్యత్తుకు మార్గం సుగమం భారతదేశంలో మరింత సౌకర్యవంతంగా, మా ప్రభుత్వం దాని ఫ్లాగ్షిప్ 'డిజిటల్ ఇండియా" చొరవ ద్వారా భారతదేశాన్ని డిజిటల్‌గా సాధికారత కలిగిన సమాజంగా & నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి పెట్టుబడి పెడుతుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆన్-డిమాండ్ గవర్నెన్స్ & సేవలు అలాగే పౌరుల డిజిటల్ సాధికారత వంటి ప్రోగ్రామ్‌ల ముఖ్య ఫోకస్ ఏరియాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావం, పరిణామం & మనం నివసించే ప్రపంచాన్ని మర్చివేయడంతో యువత ముఖ్యంగా పెరుగుతున్న ఈ డిమాండ్లకు, సరిపోయేలా ఆచరణాత్మక మార్గాల్లో వారి శిక్షణను ప్లాన్ చేయడం ద్వారా ఫలితం పొందుతారు. స్కీల్లింగ్ ప్రోగ్రామ్‌లు: ముఖ్యమైన నైపుణ్యాలతో విద్యార్థులను శక్తివంతం చేయడం బహుళ తరాల శ్రామికశక్తితో, ప్రపంచంలోని ఎక్కువ మొత్తంలో యువ జనాభా కలిగిన భారతదేశం, ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది యువత వర్క్‌ఫోర్స్‌లో చేరడాన్ని మనం గమనిస్తున్నాం. యువత విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ వారందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది. అది వారంతా ఉపాధి పొంది మంచి నాణ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. మహమ్మారి సమయంలో మంచి నైపుణ్యం గల వనరుల అవసరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది IT పరిశ్రమ, ప్రభుత్వానికి బాగా తెలుసు. యజమానులు తమ ఉద్యోగులకు ఉన్న నైపుణ్యాలు, ఉద్యోగార్టులకు ఉన్న నైపుణ్యాల మధ్య అంతరం ఎలా ఉందో పరిశ్రమలు మాట్లాడుతున్నాయి. 12వ తరగతి గ్రాడ్యుయేట్లకు అవకాశాలు: డ్యూయల్, డిపెండబుల్ & వైవిధ్యం 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్‌కి సిద్దం అవుతున్న విద్యార్థులు పూర్తిగా రూపాంతరం చెందిన డిజిటల్ సొసైటీకి శిఖరాగ్రంగా నిలుస్తున్నారు. IT పరిశ్రమ 2022లో వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా టైర్-2 నగరాల్లో పటిష్టమైన ఉపాధి. అవకాశాలను అందిస్తుందని ఇటీవలి పరిశ్రమ నివేదికలు తెలుపుతున్నందున, 12 తరగతి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీ సంబందిత శిక్షణా కార్యక్రమాలలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 'డ్యుయల్-ఫోకస్': విద్యపై డ్యుయల్ -ఫోకస్ ఏకీకృతం చేయడం + ఆచరణాత్మక శిక్షణ, ఇందులో ఈ రోజు IT పరిశ్రమలో అత్యవసరంగా అవసరమైన నైపుణ్యాలను అందించడం. వాస్తవాప్రపంచ ఐటీ ప్రాజెక్ట్‌లను బహిర్గతం చేయడం వంటివి ఉంటాయి. 'డిపెండబుల్': శిక్షణా కార్యక్రమం వ్యవధిలో వారికి స్టెపండ్ ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తూ, శిక్షణానంతరం హామీ ఇవ్వబడిన ఉద్యోగంలో ఉంచే భద్రతను విద్యార్థులకు అందిస్తుంది. వైవిధ్యం: విద్యార్థి వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు & మార్గదర్శకత్వానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలపై దృష్టి సారించే సంపూర్ణ బోధనను కలిగి ఉంటుంది. మీరు భారతదేశంలో విద్య & ట్రైనింగ్ చరిత్రను పరిశీలించినప్పుడు, వృత్తిపరమైన ట్రైనింగ్ & నైపుణ్యం మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయినట్లు మీరు చూడవచ్చు. గురుకులం, పాఠశాల అభ్యాస రీతులు, హైబ్రిడ్ మోడల్ లెర్నింగ్‌పై దృష్టి సారించాయి, ఇది రోజు మొత్తంలో నైపుణ్యాలను ఆచరణాత్మకంగా ఉపయోగించడం చేర్చబడ్డాయి. ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్‌లు: విస్తరిస్తున్న హారిజోన్లు HCL టెక్నాలజీస్‌లో, హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ ఇన్-క్లాస్ ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్‌లను అందించడంపై మేము దృష్టి పెడుతున్నాము, ఇది విద్యార్థులు లైవ్ ప్రాజెక్ట్‌లో క్లాస్‌రూమ్‌లో నేర్చుకున్న వాటిని ఆచరణాత్మకంగా వర్తింపజేసే అవకాశాలను అందిస్తుంది. 'వారు నేర్చుకునేటప్పుడు' సంపాదించే అవకాశం విద్యార్థులకు చిన్న వయస్సు నుండే ఆర్థిక బాధ్యతను నేర్పుతుంది. వారు పొందే ఆచరణాత్మక ఎక్స్పోజర్ & మార్గదర్శకత్వం వారి తోటివారిపై వారికి ఆధిక్యతను అందిస్తుంది. మన చుట్టూ ఎన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ, స్మార్ట్ మార్గాన్ని ఎంచుకునే వారికి ITలో అవకాశాల కొరత లేదు. IT పరిశ్రమకు అవసరమైన సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారు, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, వాస్తవ-ప్రపంచ ప్రాజెక్ట్‌లకు ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం చాలా అనిశ్చిత సమయాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించగలదు. నా కెరీర్ ప్రారంభ దశలో, డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌లో పని చేయడానికి, నేర్చుకోవడానికి నాకు అవకాశం లభించింది, భారతదేశం గొప్ప నాయకులు మరియు దూరదృష్టి గలవారిలో ఒకరిగా వారిని మనమందరం ప్రేమగా గుర్తుంచుకుంటాము. ఆయన అనేక వివేకవంతమైన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అతని ఒక అందమైన కోట్ గుర్తుకు వస్తుంది. "ఆకాశంవైపు చూడు. మనం ఒంటరిగా లేము. మొత్తం విశ్వం మనతో స్నేహపూర్వకంగా" ఉంటుంది అలాగే కలలు కనేవారికి, పని చేసేవారికి ఉత్తమమైన వాటిని అందించడానికి మాత్రమే సహకరిస్తుంది. శ్రీమతి శివశంకర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ -
శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్
Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం(నవంబర్29)న పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులు అర్పించారు. కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్, దర్శకనిర్మాత ఓంకార్‌తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్ బాబు శివశంకర్ మాస్టర్ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్- శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన డ్యాన్స్ షోలు అప్పట్లో సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. -
శివశంకర్ మాస్టర్ సేవలు మరువలేనివి : హీరో కార్తి
Hero Karthi Condolences To Late Shivashankar Master: నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారమని నటుడు కార్తీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూసిన శివ శంకర్ మాస్టర్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘శివశంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారం..ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అని సోమవారం ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శివశంకర్ మాస్టర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలు చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌తో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు. My heartfelt condolences to the family and friends of Shivashankar master. A man of immense talent and decades of contribution to Indian cinema. pic.twitter.com/rsG45Dbwy0 — Actor Karthi (@Karthi_Offl) November 29, 2021 -
శివ శంకర్ మాస్టర్ తొలి పారితోషికం ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: శివ శంకర్ మాస్టర్ సాక్షాత్తు ఆ నటరాజు రూపంగా అభిమానులు భావిస్తారు. డ్యాన్స్మీద ప్రేమ వ్యామోహంతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పట్టుదలగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కరియర్ ఆరంభంలో ప్రముఖ కొరియాగ్రాఫర్లు సలీం, సుందరం లాంటి వారి దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత కొరియాగ్రాఫర్‌గా తనదైన శైలిలో రాణించారు. అలా సుమారు నాలుగున్నర దశాబ్దాలు పాటు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొరియాగ్రాఫర్, నటుడుగా, బుల్లితెరపై జడ్జ్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే తన ఆహార్యం, వేషధారణ, దుస్తులపై వచ్చిన విమర్శలను కూడా చాలా సున్నితంగా తిరస్కరించేవారు. తను కళకు అంకితమైన వాడిననీ వృత్తిపరంగా తాను చేయాల్సిందంతా చేశానని చెప్పేవారు. నృత్యమంటేనే అర్దనారీశ్వరత్వం అది ఉంటేనే నృత్యానికి అందమనీ, ప్రేక్షకుల అభిమానం, వారి ఆదరణే తనకు ముఖ్యమని, వారుచెందే గొప్ప అనుభూతే తన కళకు సార్థకమని గర్వంగా ప్రకటించారు శివ శంకర్ మాస్టర్. అంతేకాదు అసిస్టెంట్ డ్యాన్స్‌మాస్టర్‌గా తనకు అందుకున్న రెమ్యునరేషన్ 7.50 రూపాయలట. ఈ విషయాన్ని శివ శంకర్ మాస్టారే స్వయంగా వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో. అంతేకాదు తెలుగు పరిశ్రమే తనను ఉద్ధరించిందనీ, టాలీవుడ్ తనంటూ ఒక స్థాయిని తెచ్చిపెట్టిందంటారు శివ శంకర్. కాగా లెజెండరీ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచినసంగతి తెలిసిందే. -
బాడీ లాంగ్వేజ్‌పై విమర్శలు.. మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్ చిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. ఏడాది వయసులో ఓ ప్రమాదంలో వెనుముక తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సంకల్ప బలంతో డ్యాన్స్ అవ్వాలనుకున్నారు. పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుని నృత్య దర్శకుడు అయ్యారు. చదవండి: Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ శంకర్ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలో ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తన డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్ 800లకు పైగా చిత్రాలకు పని చేశారు. అలాంటి మాస్టర్‌కు విమర్శలు తప్పలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయనపై వచ్చే విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో మాస్టర్ తనదైన శైలి సమాధానం ఇచ్చి ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. చదవండి: రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్ ఓ ఇంటర్య్వూలో యాంకర్ తన బాడీ లాంగ్వేజ్‌పై వచ్చి కామెంట్స్‌కు మీ సమాధానం ఏంటని అడగ్గా.. అవన్ని నేను పట్టించుకోనని, వారు అన్నంత మాత్రాన నేను అది అయిపోయిను కదా. నాకంటే ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాక ఎవరూ నవ్వితే వారి పళ్లు బయట పడతాయి, ఓ డ్యాన్స్ మాస్టర్‌గా నేను ఇలాగే ఉంటాను. ఫైట్ మాస్టర్‌గా కూలింగ్ గ్లాస్ పెట్టుకని రఫ్‌గా ఉండను. నాలో కళానైపుణ్యం ఉంది. దానికి తగ్గట్టుగానే నేను ఉంటాను. ఎవరు ఏమని కామెంట్ చేసిన నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: Shiva Shankar Master: వెన్నుముక గాయంతో 8 ఏళ్లు మంచానికే, డ్యాన్స్ మాస్టర్ ఎలా అయ్యారంటే.. ఇక తన ముఖంలో రౌద్రం, వినయం, భావోద్యేగం వంటి భావాలను తన ముఖంలో చూపిస్తూ ఇందులో నా ఆర్ట్ కనిపించిందా?, ఆడంగి తనం కనిపించిందా? అని తిరిగి యాంకర్‌ను ప్రశ్నించారాయన. ఇక మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన టీవీయే మీపై ఇలాంటి విమర్శలకు కారణమైందని ఎప్పుడైనా బాధపడ్డారా అనే ప్రశ్నకు.. ఆయన ప్రతి విషయానికి బాధపడుకుంటూ పోతే మనం జీవించలేమన్నారు. ‘నా మనసు మంచిదా? నేను మంచివాడినా? నాలో ఆర్ట్ ఉందా? ధన్యుడనా కాదా అనేదానిపైనే నా దృష్టి ఉంటుంది. నేను ఎటూ చూసిన, ఏం చేసిన, ఏడు నడిచినా అది నా కళ కోసమే, ఈ దారిలో నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అంతగా పట్టించుకోను’ అంటూ తనదైన శైలిలో శివ శంకర్ మాస్టర్ సమాధానం ఇచ్చి విమర్శకుల నోరు మూయించారు. -
శివశంకర్ మాస్టర్: ‘కురువి కూడు’ చిత్రంతో డ్యాన్స్ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(నవంబర్ 28) ఆయన తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్ సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు. ఏడాది వయసులోనే ఓ ప్రమాదంలో తన వెన్నుముక దెబ్బతినడంతో 8 ఏళ్లు మంచానికే పరిమితమైన ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా ఎలా మారారో తెలుసుకుందాం.ఏడాది వయసులోనే వెన్నుముకకు గాయం కావడంతో ఏనిమిదేళ్లు మాస్టర్ మంచానికి పరిమితయ్యారు. దీంతో ఆయన తండ్రి మాస్టర్‌కు ట్యూషన్ పెట్టించారు. ఇక మాస్టర్ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి వాటిపై శివ శంకర్ మాస్టర్‌కు ఆసక్తి నెలకొంది. ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలనే పట్టుదల ఆయనలో పెరిగిపోయింది.దాంతో తనంతట తానే డ్యాన్స్ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అలా 1974లో డ్యాన్స్ మాస్టర్ సలీమ్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు శివశంకర్. అప్పటికి సలీమ్ మాస్టర్ సినిమా పరిశ్రమలో పేరున్న కొరియోగ్రాఫర్. ఆరేళ్ల పాటు అసిస్టెంట్‌గా చేసి... ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా మారారు శివ శంకర్. అక్కడి నుంచి వరుసగా ‘సాటై్ట ఇల్లాద పంబరం’, ‘మన్ వాసనై’, ‘ఎన్ ఆసై మచ్చాన్’, ‘పూవే ఉనక్కాగ’ తదితర తమిళ చిత్రాలకు చేశారు. అప్పటికి శివ శంకర్ మాస్టర్ హవా మొదలైంది. శివ శంకర్ స్టెప్పులను తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న తరుణంలో తెలుగు పరిశ్రమ దృష్టి కూడా ఆయనపై పడింది. ‘ఖైదీ’లో చిరంజీవి, మాధవిలతో ‘రగులుతోంది మొగలి పొద..’ అంటూ శివ శంకర్ మాస్టర్ చేయించిన డ్యాన్స్ సూపర్ హిట్. ‘అమ్మోరు’ (1995), ‘దొంగ దొంగది’ (2003), ‘అల్లరి పిడుగు’ (2005).. ఇలా వరుసగా తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ కొరియోగ్రాఫర్ అయిపోయారు. ‘దొంగ దొంగది’లో మనోజ్, సదాతో ‘మన్మథ రాజా మన్మథ రాజా..’ పాటకు శివ శంకర్ మాస్టర్ మంచి మాస్ స్టెప్స్.. అది కూడా స్పీడ్ స్టెప్స్ వేయించారు. అలాగే ‘అరుంధతి’ (2009)లో క్షుద్ర మాంత్రికుడు సోనూ సూద్‌ని అంతం చేయడానికి అనుష్కతో ‘భు భు భుజంగం.. ది ది తరంగం....’ అంటూ డ్రమ్స్ డ్యాన్స్ చేయించిన తీరు అద్భుతం. ఇందుకు పూర్తి భిన్నంగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ (2009)లో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్‌తో ‘ధీర ధీర ధీర మనసాగలేదురా..’లో స్టయిలిష్ రొమాంటిక్ స్టెప్ట్స్ వేయించారు. ఈ స్టెప్సే ఆయనకు ఉత్తమ నృత్యదర్శకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళంలోనే కాదు.. దక్షిణాదిన పలు భాషల్లో కొరియోగ్రాఫర్‌గా చేసిన రికార్డ్ శివ శంకర్‌ది. పది భాషల్లో సుమారు 800 చిత్రాల్లో 15వేలకు పైగా పాటలకు నృత్యదర్శకుడిగా చేశారు. నటుడిగానూ...శింబు, త్రిష నటించిన ‘అలై’ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ క్యారెక్టర్‌తో నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు ఆయన. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన ‘వరలారు’లో అజిత్‌కు డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా శివ శంకర్ నటించారు. బాల దర్శకత్వంలో వచ్చిన ‘పరదేశి’లో ఓ కీలక పాత్ర చేశారు. ఇక తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘నీను వీడని నీడను నేనే’, ‘రాజుగారి గది 3’ చిత్రాల్లో తనదైన శైలి నటనతో మాస్టర్ మెప్పించారు. ఇతర భాషా చిత్రాలోన్లూ నటించారాయన. బుల్లితెరపై కూడా ఇటు యాక్టింగ్‌లోనూ, అటు డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగాను సత్తా చాటారు. తెలుగులో ‘నాగభైరవి’, ‘నెంబర్ 1 కోడలు’ సీరియల్స్‌తో పాటు తమిళ సీరియల్ ‘జ్యోతి’లోనూ నటించారు. శివ శంకర్ మాస్టర్‌కు భార్య సుకన్య, ఇద్దరు కుమారులు (విజయ్, అజయ్) ఉన్నారు. కుమారులిద్దరూ కొరియోగ్రాఫర్లుగా చేస్తున్నారు. -
శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా?
Shiva Shankar Master Last Wish: ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ (72) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనుటుల, హీరోలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ శివ శంకర్ మాస్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి, సోనుసూద్, మంచు విష్ణుతో పాటు పలువురు హీరోలు నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్ 80కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు. అలాంటి మాస్టర్ తన చివరి శ్వాస వరకు పని చేయాలని ఆకాంక్షించారు. మరణం కూడా తనకు షూటింగ్‌లోనే రావాలని, సినిమా సెట్లోనే తను కన్నుమూయాలనేది మాస్టర్ కోరిక. ఈ విషయాన్ని తరచూ ఆయన తన సన్నిహితులతో పాటు పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చేవారు. దీన్ని బట్టి ఆయన వృత్తిని ఎంత ప్రేమించి ఉంటారో ఊహించుకోండి. 2009లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి కొరియోగ్రఫి అందించిన శివ శంకర్ మాస్టర్ ఈ మూవీకిగాను జాతీయ పురస్కారం అందుకున్నారు. -
ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్ భావోద్వేగం
Megastar Chiranjeevi Emotional Sentences On Shiva Shankar Death: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడి ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. శివశంకర్ మాస్టర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మాస్టర్ మరణం తనను కలచివేసిందని చిరింజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలు అందించారని మెగాస్టార్ కొనియాడారు. 'శివశంకర్ మాస్టర్, నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఇది చదవండి: శివశంకర్ మాస్టర్‌కు చిన్నప్పుడు గాయం.. సుమారు ఎనిమిదేళ్లు.. -
శివశంకర్ మాస్టర్‌కు చిన్నప్పుడు గాయం.. సుమారు ఎనిమిదేళ్లు..
Shiva Shankar Master On Bed For Eight Years: కరోనా రక్కసి ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ కన్ను మూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ తల్లిదండ్రులు కాగా, తండ్రి కొత్వాల్ చావిడిలో పండ్ల వ్యాపారం చేసేవారు. శివ శంకర్ మాస్టర్‌కు చిన్నతనంలో ఉండగా ఒక ప్రమాదం కూడా జరిగిందట. భయపడి.. శివశంకర్ మాస్టర్ ఏడాదిన్నర వయసు ఉండగా, తనని వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట అరుగుమీద కబుర్లు చెప్పుకునేవారట. ఒకరోజు అరుగు మీద కూర్చొన్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివ శంకర్ పెద్దమ్మ భయపడి ఆయన్ను ఎత్తుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న శివ శంకర్ కూడా కింద పడిపోయారు. దీంతో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా సరికాకపోవడంతో మాస్టర్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్ అనే ఆయన వద్దకు శివ శంకర్‌ను తీసుకెళ్లారు మాస్టర్ తల్లిదండ్రులు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్ శివ శంకర్ తల్లిదండ్రులకు ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని హామీ ఇచ్చారు. ఆయనను నమ్మి శివ శంకర్ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. అంతే సుమారు ఎనిమిదేళ్లపాటు శివ శంకర్ పడుకునే ఉన్నారు. తర్వాత ఆ గాయం నుంచి కోలుకున్నారు. ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు -
టాలీవుడ్లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు
Shiva Shankar Master Is No More: టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
శివశంకర్ మాస్టర్‌కు మెగాస్టార్ చేయూత.. తక్షణ సాయంగా..
Megastar Chiranjeevi Support To Shiva Shankar Master: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటే ఫ్యాన్స్ విజిల్స్ వేయకుండా ఉండలేరు. తనదైన నటనతో అలరించడమే కాకుండా బ్లడ్, ఐ, ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్నారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఆచార్య. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో పరిస్థితి విషమంగా ఉన్నసంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మాస్టర్‌తో పాటు ఆయన భార్యకు వైరస్ సోకడంతో ఆమె హోం క్వారంటైన్ అయ్యారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి సైతం కొవిడ్ సోకగా వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇది చదవండి: విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, సాయం కోసం ఎదురుచూపు! ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులకు కరోనా సోకడంతో ఇబ్బందుల్లో పడింది శివశంకర్ కుటుంబం. దీంతో ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు రూ. లక్ష ఖర్చు అవుతున్నందున మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం చేయాల్సిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన మెగాస్టార్ అజయ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని, తక్షణ సాయంగా రూ. 3 లక్షల చెక్కు అందజేశారు. వైద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి తామంతా ఉన్నామని అభయమిచ్చారు. ఇది చదవండి: శివశంకర్ మాస్టర్‌కు సోనూసూద్ సాయం! 'నాన్నకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి రమ్మని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. చిరంజీవి అంటే నాన్నకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి నాన్న సినిమాలు చేశారు. ఇటీవల ఆచార్య షూటింగ్లో కూడా నాన్న, చిరంజీవిని కలిశారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి నాకు చాలా అవసరం. చిరంజీవి గారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాను' అని శివశంకర్ మాస్టర్ చిన్నకుమారుడు అజయ్ తెలిపారు. ఇది చదవండి: శివశంకర్ మాస్టర్‌కు ధనుష్ సాయం!.. టాలీవుడ్ స్టార్స్‌పై నెటిజన్ల విమర్శలు -
శివశంకర్ మాస్టర్‌కు సాయం.. పబ్లిసిటీ చేయవద్దని కోరిన ధనుష్!
Dhanush Extend Support To Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్ సాయం చేసేందకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం. అంతేకాకుండా తాను డబ్బులు ఇచ్చిన విషయం గురించి పబ్లిసిటీ చేయవద్దని ధనుష్ కోరినట్లు తెలుస్తుంది. సాయం చేసినా ఎవరికి చెప్పొద్దని కోరడం ధనుష్ మంచి మనసుకు నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే టాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ పాటలకు కొరియోగ్రాఫీ చేసిన ఆయనకు టాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడం ఏంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ధనుష్‌ని చూసి టాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో వందల సంఖ్యలో పాటలకు కొరియోగ్రాఫీ చేసిన శివశంకర్ మాస్టర్ పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా సైతం వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. రంగంలోకి దిగిన సోనూసూద్
Sonu Sood Helps To Choreographer Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. Iam already in touch with the family, Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl — sonu sood (@SonuSood) November 25, 2021 -
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
Siva Shankar Master Health Condition Critical: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. Noted Choreographer #ShivaShankar Master affected with #COVID19 and now in critical condition. Due to expensive treatment the family is unable to pay the bills.Wishing him a speedy recovery. For Contact Ajay Krishna (Son) 9840323415 pic.twitter.com/2IqBiQUnM7 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 24, 2021 -
శివశంకర్‌ను లోతుగా విచారించాలి
కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఎం శివశంకర్‌ను మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్‌కు ఒక జాతీయ బ్యాంక్‌లో లాకర్ సౌకర్యం లభించేందుకు శివశంకర్ సహకరించాడని పేర్కొంది. స్మగ్లింగ్ ద్వారా పొందిన లాభాలను ఈ లాకర్లోనే స్వప్న సురేశ్ దాచేవారని ఈడీ తెలిపింది. పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో బుధవారం నగదు అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో మధ్యంతర చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. అందులో స్వప్న సురేశ్, సరిత్ పీఎస్, సందీప్ నాయర్లను ప్రధాన నిందితులుగా చేర్చింది. శివశంకర్‌కు దగ్గర అయినందువల్లనే ప్రభుత్వ స్పేస్‌పార్క్ ప్రాజెక్ట్‌లో తాను సెలెక్ట్ కాగలిగానని స్వప్న సురేశ్ అంగీకరించారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. తన అపాయింట్మెంట్ విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలుసని కూడా ఆమె ఒప్పుకున్నారంది. అయితే, ఈ విషయాన్ని సీఎం విజయన్ పలుమార్లు ఖండించారు. సీఎం విజయన్ సమక్షంలోనే శివశంకర్‌ను స్వప్న పలుమార్లు కలిశారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. తన చార్టర్డ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌తో కలిపి స్వప్నకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించానని ఆగస్ట్ 12, ఆగస్ట్ 15 తేదీల్లో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్ ఒప్పుకున్నారని తెలిపింది. స్వప్న సురేశ్ దగ్గరున్న డబ్బుల నిర్వహణకు గానూ చార్టర్డ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌ను ఆమెకు శివశంకర్ పరిచయం చేశారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే, స్వప్న సురేశ్ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న విషయం తనకు తెలియదని విచారణ సందర్భంగా శివశంకర్ చెప్పారని ఈడీ పేర్కొంది. బంగారం స్మగ్లింగ్‌లో స్వప్న సురేశ్ స్వయంగా పాల్గొనేవారని, తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శివశంకర్‌ను లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. ‘2019 ఆగస్ట్‌లో యూఏఈ కాన్సులేట్‌లో ఉద్యోగాన్ని స్వప్న సురేశ్ వదిలేశారు. ఆ తరువాత తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా సీఎం విజయన్ వద్ద ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉన్న శివశంకర్‌ను కోరారు. దాంతో, కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన స్పేస్ పార్క్ ప్రాజెక్ట్‌లో శివశంకర్ ఆమెకు ఉద్యోగం ఇప్పించారు’ అని ఈడీ తెలిపింది. -
ఆ 'నాన్న' అనాథగా కాటికి..
అనంతపురం, హిందూపురం: వైఎస్సార్ జిల్లా చెనిక్కాయపల్లి రామాపురం చిట్టూరు వాసి శివశంకరయ్య (80) ఆరోగ్యం క్షీణించి కన్నుమూశాడు. కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లేకపోవడంతో అనాథగా కాటికి చేరాడు. శివశంకరయ్య కుటుంబాన్ని పోషించే సమయంలో వ్యసనాలకు లోనై ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. భార్యా పిల్లలు ఏమయ్యారో కూడా పట్టించుకోలేదు. వృద్ధాప్యం మీదపడిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. చక్కెరవ్యాధితో బాధపడుతున్న ఇతడు కాలికి గాంగ్రిన్ అవడంతో నడవలేని స్థితిలో హిందూపురం ఆస్పత్రిలో చేరాడు. ఇతనికంటూ ఎవరూ లేకపోవడంతో సపర్యలు చేసేవారు కూడా కరువయ్యారు. ఇతని దీనస్థితిపై ఈ నెల 2 నుంచి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కుటుంబంతో అతడిని కలిపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తమకు చేసిన ద్రోహాన్ని తలచుకుని కుటుంబ సభ్యులు శివశంకరయ్యను చూడటానికి కూడా ఇష్టపడలేదు. దీంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమర్ ఫరూక్ తదితరులు శివశంకరయ్యకు అండగా నిలవగా.. వైద్యులు మానవత్వంతో స్పందించి ఆపరేషన్ చేశారు. తర్వాత సేవామందిరంలోని వృద్ధాశ్రమానికి చేర్చారు. కుటుంబాన్ని దూరం చేసుకుని తాను ఎంత పెద్ద తప్పు చేశానోనని, అవసాన దశలో దిక్కులేని వాడినయ్యానని మనోవేదన చెందిన శివశంకరయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేకపోవడంతో సీఐ బాలమదిలేటి, ఎస్ఐ కరీం, ఏఎస్ఐ వెంకటరాముడు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమర్‌ఫరూక్, షేక్‌షబ్బీర్, ఉమర్, దండోరా నాయకులు సతీష్‌కుమార్, మండీ మోట్ అసోసియేషన్ హాజీ నూరుల్లా, ఖురైష్ వెల్ఫేర్ అసోసియేషన్ సాదిక్ ఖురేషీ, ఉసామాఖాన్, ఉమర్ పరిగిరోడ్డులోని శ్మశానవాటిలో శివశంకరయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నాకు నాన్న అవసరం లేదు... -
శివశంకరయ్య కథ సుకాంతం..
అనంతపురం, హిందూపురం: కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన వైఎస్సార్ జిల్లాకు చెనిక్కాయపల్లి రామాపురం చిట్టూరుకు చెందిన వృద్ధుడు శివశంకరయ్య హిందూపురం ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని సేవామందిరంలోని వృద్ధాశ్రమానికి చేరాడు. శివశంకరయ్య వయసులో ఉన్నపుడు జల్సాలకు అలవాటుపడి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధాప్యం మీద పడ్డాక అనారోగ్యం బారినపడి ఇటీవల హిందూపురం ఆస్పత్రిలో చేరాడు. ఇతని దీనస్థితిని గమనించిన ‘సాక్షి’ ఈ నెల రెండో తేదీ నుంచి వరుస కథనాలు ప్రచురించింది. అవసాన దశలో ఉన్న అతడిని కుటుంబంతో కలపడానికి ప్రయత్నించింది. అయితే శివశంకరయ్య తమకు చేసిన అన్యాయాన్ని తలుచుకుని కుటుంబ సభ్యులు ఆయన్ను తీసుకుపోవడానికి ముందుకు రాలేదు. చక్కెరవ్యాధిగ్రస్తుడైన ఈయన కాలుకు అయిన గాంగ్రీన్ వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు చీదరించుకున్నా ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమర్ ఫరూక్, షేక్ షబ్బీర్, ఉమర్‌లు ఆ వృద్ధుడికి అండగా నిలిచి సపర్యలు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కేశవులు, వైద్యులు శివప్రసాద్ నాయక్, డాక్టర్ ప్రభాకర్ నాయుడులు కూడా మానవత్వంతో స్పందించి వృద్ధుడి కాలికి ఆపరేషన్ చేశారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో సీఐలు బాలమద్దిలేటి, ధరణీకిషోర్ చొరవతో ఎస్ఐ కరీం దగ్గరుండి శివశంకరయ్యను సేవామందిరంలోని వృద్ధాశ్రమంలో చేర్చారు. రెండురోజుకోకసారి వైద్యపరీక్షలు చేయించి, కట్టు కట్టిస్తామని స్వచ్ఛందసంస్థ సభ్యులు తెలిపారు. అంపశయ్యపై నాన్న! నాకు నాన్నఅవసరంలేదు... -
‘ఎయిర్‌సెల్’ శివశంకరన్ ఆస్తులు అటాచ్
సాక్షి, చెన్నై: ‘ఎయిర్‌సెల్’ సంస్థ వ్యవస్థాపకుడు శివశంకరన్‌కు చెందిన చెన్నైలోని రూ.224 కోట్ల ఆస్తులను ఈడీ శనివారం అటాచ్ చేసింది. శివశంకరన్ కొంతకాలం క్రితం ఐడీబీఐ బ్యాంక్ నుంచి వ్యాపార నిమిత్తం రూ.600 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సొంత అప్పుల్ని తీర్చేందుకు వాడుకున్నాడు. వడ్డీ చెల్లించకపోవడంతో ఐడీబీఐ పలుమార్లు నోటీసులిచ్చింది. అసలు చెల్లించాలని ఒత్తిడి చేయగా శివశంకరన్ చేతులు ఎత్తేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ చెన్నైలో శివశంకరన్‌కు చెందిన రూ.224 కోట్ల విలువైన స్థిర, రూ.35 లక్షల చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి
ప్రేమ అంటూ పట్టుకున్నదంటే పుట్టే లక్షణాల్లో ఒకటి, నిద్ర లేకపోవడం. ఎన్ని పాటల్లో ఎందరు నాయికానాయకులు దాన్ని పాడుకునివుంటారు! ‘ప్రియమైన నీకు’ చిత్రంలో స్నేహ కూడా అలాగే పాడుతుంది, కాకపోతే మరింత అందంగా, మరింత కవిత్వంగా. ‘నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో’ అంటుంది. ఈ గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. పల్లవి వెంటనే గుర్తురాకపోతే గనక అది ఇలా సాగుతుంది. అందులోనూ నాయకుడిని చూడగానే నాయిక పడే తడబాటు. ‘మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ’. దీనికి సంగీతం శివ శంకర్. పాడినవారు చిత్ర. 2001లో వచ్చిన ఈ తెలుగు– తమిళ ద్విభాషా చిత్రానికి దర్శకుడు బాలశేఖరన్. తరుణ్ నటించారు.