shoelaces row
-
సోనియా షూ లేస్ కట్టిన రాహుల్.. వీడియో వైరల్
మాండ్యా: దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సుదీర్ఘ కాలం తర్వాత సోనియా గాంధీ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో అరుదైన సంఘటన జరిగింది. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు రాహుల్ గాంధీ. పాదయాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ షూ లేస్ ఊడిపోవటంతో.. స్వయంగా రాహుల్ గాంధీనే సరి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తన తల్లి షూ లేస్ కడుతున్న రాహుల్ గాంధీ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తల్లి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. షూ లేస్ సరిచేసిన తర్వాత పాదయాత్రను కొనసాగించారు నేతలు. సోనియాతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధ రామయ్యలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: తనయుడి వెంట.. భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
‘మనది భారతదేశం.. అతడిని అభినందించాలి’
లక్నో : కొందరు మంత్రులు చెలాయిస్తున్న అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. ప్రభుత్వాధికారి చేత షూలేస్ కట్టించుకోవడమే కాక రామయణాన్ని తెర మీదకు తెచ్చి మరి దాన్ని సమర్థించుకున్నాడో మినిస్టర్. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మినిస్టర్ లక్ష్మీ నారాయణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాజహాన్పూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు మినిస్టర్ షూ లేస్ ఊడిపోయింది. దాంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వెంటనే వెళ్లి అమాత్యుల వారి షూలేస్ కట్టి తన ప్రభు భక్తిని చాటుకున్నాడు. వారించాల్సిన మినిస్టర్ కాస్తా దర్జాగా నిల్చూని ప్రభుత్వ ఉద్యోగి చేత సేవ చేపించుకుని తరించారు. #WATCH: UP Minister Laxmi Narayan gets his shoelace tied by a government employee at a yoga event in Shahjahanpur, yesterday. pic.twitter.com/QbVxiQM7bI — ANI UP (@ANINewsUP) June 22, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో లక్ష్మీ నారాయణ్‌ని, ఉద్యోగిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంఘటన గురించి లక్ష్మీ నారాయణ్‌ని ప్రశ్నించగా.. ఆయన సిగ్గుపడకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి చెప్పులు ధరించే విషయంలో నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను’ అంటూ రామయణాన్ని తెరమీదకు తెచ్చి పొంతన లేని వాదనను వినిపించాడు. అయితే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడటం సదరు మినిస్టర్‌కు కొత్త కాదు. గతంలో హనుమంతుడు జాట్ల తెగకు చెందిన వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మి నారాయణన్. -
పార్టీ చీఫ్ షూలేస్ కట్టిన ఎమ్మెల్యే..
సియోని : కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు పార్టీకి చెందిన ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ షూ లేసులు కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. కమల్‌నాథ్‌కు షూ లేసు కడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో రజ్నీష్ ఎందుకిలా చేశాడని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రజ్నీష్ స్పందించారు. కమల్‌నాథ్‌కు తాను షూ లేసులు కట్టడం గౌరవంగా భావిస్తానని రజ్నీష్ తెలిపారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కొందరు పార్టీ నేతలతో కలిసి రజ్నీష్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కమల్‌నాథ్‌కు షూ లేస్ కడుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోపై రజ్నీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన (కమల్‌నాథ్) నాకు తండ్రిలాంటి వారు. ఆయన అంటే నాకెంతో గౌరవం. స్కూళ్లో ఉన్నప్పటి నుంచి ఆయన కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటే. మా కుటుంబానికి, ముఖ్యంగా నా తండ్రికి కమల్‌నాథ్ చాలా సన్నిహితుడు. ఆ సమయంలో పార్టీ నేతలు చాలామంది అక్కడే ఉన్నారు. షూ లేస్ కట్టుకునేందుకు కమల్‌నాథ్ ఇబ్బంది పడగా.. నేను ఆయనకు సాయం చేశాను. ఇందులో తప్పేముంది. కొందరు దీన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని’ ఎమ్మెల్యే రజ్నీష్ వివరణ ఇచ్చుకున్నారు. -
'కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తా'
భువనేశ్వర్: వ్యక్తిగత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకుని విమర్శలపాలైన ఒడిశా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జోగీంద్ర బెహరా ఈ వివాదంపై వివరణయిచ్చారు. అనారోగ్యం కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. 'నొప్పి కారణంగా నా ఎడమ కాలును మడచలేకపోతున్నాను. షూ లేస్ కట్టుకోవడానికి నా వ్యక్తిగత సెక్యురిటీ అధికారి సహాయం చేశాడు. అతడు నాకు కొడుకు లాంటి వాడు. నా కాలి నొప్పి నివారణ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ ను సంప్రదించాను. కావాలంటే డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కూడా చూపిస్తా'నని బెహరా తెలిపారు. సోమవారం కియోంజర్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయిన బెహరా జెండా వందనం తర్వాత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో దుమారం చెలరేగింది.