'కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తా' | can show you prescriptions:Jogendra Behera | Sakshi
Sakshi News home page

'కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తా'

Published Tue, Aug 16 2016 3:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

'కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తా'

'కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తా'

భువనేశ్వర్: వ్యక్తిగత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకుని విమర్శలపాలైన ఒడిశా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జోగీంద్ర బెహరా ఈ వివాదంపై వివరణయిచ్చారు. అనారోగ్యం కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు.

'నొప్పి కారణంగా నా ఎడమ కాలును మడచలేకపోతున్నాను. షూ లేస్ కట్టుకోవడానికి నా వ్యక్తిగత సెక్యురిటీ అధికారి సహాయం చేశాడు. అతడు నాకు కొడుకు లాంటి వాడు. నా కాలి నొప్పి నివారణ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ ను సంప్రదించాను. కావాలంటే డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కూడా చూపిస్తా'నని బెహరా తెలిపారు.

సోమవారం కియోంజర్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయిన బెహరా జెండా వందనం తర్వాత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో దుమారం చెలరేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement