
సియోని : కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు పార్టీకి చెందిన ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ షూ లేసులు కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. కమల్‌నాథ్‌కు షూ లేసు కడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో రజ్నీష్ ఎందుకిలా చేశాడని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రజ్నీష్ స్పందించారు. కమల్‌నాథ్‌కు తాను షూ లేసులు కట్టడం గౌరవంగా భావిస్తానని రజ్నీష్ తెలిపారు.
కాగా, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కొందరు పార్టీ నేతలతో కలిసి రజ్నీష్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కమల్‌నాథ్‌కు షూ లేస్ కడుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోపై రజ్నీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన (కమల్‌నాథ్) నాకు తండ్రిలాంటి వారు. ఆయన అంటే నాకెంతో గౌరవం. స్కూళ్లో ఉన్నప్పటి నుంచి ఆయన కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటే. మా కుటుంబానికి, ముఖ్యంగా నా తండ్రికి కమల్‌నాథ్ చాలా సన్నిహితుడు. ఆ సమయంలో పార్టీ నేతలు చాలామంది అక్కడే ఉన్నారు. షూ లేస్ కట్టుకునేందుకు కమల్‌నాథ్ ఇబ్బంది పడగా.. నేను ఆయనకు సాయం చేశాను. ఇందులో తప్పేముంది. కొందరు దీన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని’ ఎమ్మెల్యే రజ్నీష్ వివరణ ఇచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment