మళ్లీ ఓడిన భారత్
మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు పరాజయంతో మొదలుపెట్టి పరాజయంతోనే ముగించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 0-5తో కోల్పోయింది. సోమవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో టీమిండియా 0-7 గోల్స్ తేడాతో బ్రిటన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బ్రిటన్ క్రీడాకారిణి షోనా మెక్ కాలిన్ మూడు గోల్స్‌తో రాణించగా... సుశన్నా టౌన్సెండ్, క్రిస్టా క్యులెన్, కేట్ వాల్ష్ , హెలెన్ వాల్ష్ ఒక్కో గోల్ చేశారు. ఈ సిరీస్ మొత్తంలో భారత జట్టు 3 గోల్స్‌చేసి 17 గోల్స్‌ను సమర్పించుకుంది.