Shops lease
-
'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం
బెంగళూరు: బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలో వాణిజ్య దుకాణాలకు ఉండే బోర్డులను కన్నడలోనే ఉంచాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్లపై 60 శాతం కన్నడ పదాలని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. "నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. అనంతరం 60 శాతం కన్నడ వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత కన్నడ భాషా నేమ్ప్లేట్లను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 లోగా సమయం ఇస్తాం. ”అని గిరి నాథ్ చెప్పారు. కొత్త ఆదేశాల తర్వాత కేఆర్‌వి మద్దతుదారుడు దుకాణాదారులను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇది కర్ణాటక. కన్నడ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రానికి గర్వకారణం. మీ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందే.' అని ఓ మహిళ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందేనని సీఎం సిద్ధరామయ్య గత అక్టోబర్‌లో ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అప్పట్లోనే కన్నడ వర్సెస్ హిందీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య గతంలోనూ కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించారు. ఇదీ చదవండి: Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు? -
ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్!
దిల్లీ ప్రభుత్వం ఆర్థికంగా బలంగా మారడానికి చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా దుకాణాలను 24 గంటలు తెరిచి ఉంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంత సొమ్ము జమవుతుందని భావిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో 83 దుకాణాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో దిల్లీలో 24 గంటలపాటు తెరిచి ఉంచే దుకాణాల సంఖ్య 635కు చేరింది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ (ఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది. కమిటీకి మొత్తం 122 దరఖాస్తు వచ్చాయి. కానీ సరైన వివరాలు వెల్లడించని కారణంగా 29 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిర్దిష్ట ప్రదేశాల్లోని దుకాణాలను ఎంపిక చేసి అనుమతించినట్లు చెప్పారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు 24 గంటలు పనిచేయడంతో నగర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దాంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్ణయం సహకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వేలం పేరుతో వసూళ్ల దందా!
ఎమ్మినూరు పట్టణ నడిబొడ్డున సోమప్ప సర్కిల్లో మున్సిపల్ క్యాంటీన్‌ను లీజుకు తీసుకొన్న ఓ టీడీపీ నేత మున్సిపాలిటీకి జీఎస్టీతో కలిపి రూ.27వేలు అద్దె చెల్లిస్తున్నాడు. దానిని పార్టులుగా విభజించి రెండు బట్టల దుకాణాలు, ఓ హోటల్, రెండు డబ్బా అంగళ్లు, స్ట్రీట్ వ్యాపారాలకు సబ్‌లీజుకిచ్చి నెలనెల రూ.1.5 లక్షలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నాడు. సుమారు రూ.20 లక్షలకుపైగా అడ్వాన్సు రూపంలో పొందాడు. కూరగాయల మార్కెట్‌గేటు దగ్గర ఓ బడావ్యక్తి మున్సిపల్ షాపును లీజుకు తీసుకొని మున్సిపాలిటీకి నెలకు రూ.4,300 అద్దె చెల్లిస్తున్నాడు. అదే షాపును రెండు పార్టులుగా విభజించి సబ్లీజుకివ్వటంతో ఆ వ్యక్తికి నెలకు రూ.65 వేలకుపైగా ఆదాయం అందుతోంది. ఇలా బినామిలతో మున్సిపల్ షాపులను తమ గుప్పెట్లో ఉంచుకున్నవారు 40 శాతంపైగానే ఉన్నట్లు మున్సిపల్ అధికారుల పరిశీలనలో తేలింది. మున్సిపల్ షాపుల్లో బినామిలదే అగ్రతాంబూలం. కర్నూలు, ఎమ్మిగనూరు: లీజు గడువు ముగిసిన షాపుల వేలాలు వేసేందుకు ఎమ్మిగనూరు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం వేలాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయ, వ్యాపార దళారులకు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొనేందుకు పావులు కదిపినట్లు సమాచారం. గతంలో తక్కువ అద్దెకు లీజు దక్కించుకొని సబ్ లీజులకిచ్చి మున్సిపల్ ఆదాయానికి గండికొట్టిన వ్యక్తులకే మళ్లీ షాపులు దక్కేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అందుకు నజరానాగా రూ.1.2 కోట్లకుపైగా దళారులు వసూలు చేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇందులో మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కూడా వాటా ఉందనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షకు తగ్గిన గుడ్‌విల్.. ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని ఏ,బీ,సీ బ్లాక్‌లలోని 49 షాపులకు, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్లలోని 19 షాపులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. 25 ఏళ్ల లీజుగడువు పూర్తయిన ఏ, బీ, సీ బ్లాక్‌లోని షాపులకు మళ్లీ వేలాలు నిర్వహించాలని 2007లోనే మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ షాపుల లీజుదారులు హైకోర్టులో కేసు నడిపారు. ఇటీవల మున్సిపల్ అధికారులను కలసి తాము కేసు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు వారు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటంతో అధికారులు షాపులకు వేలాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజకీయ, వ్యాపార దళారులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొనేందుకు పావులు కదిపారు. మొదట్లో రూ.2 లక్షలను గుడ్‌విల్ పాటగా చూపుతూ వేలాలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయం భారీగా పెరుగుతోందని అందరూ భావించారు. కానీ రాజకీయ దళారులు పైరవీలు చేయటంతో రూ.2 లక్షల గుడ్‌విల్ రూ. లక్షకు తగ్గిపోయింది. సుమారు రూ.68 లక్షలు మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రవేటు వ్యుక్తుల షాపుల లీజు, మున్సిపల్ షాపుల సబ్లీజులే రూ.30 వేలకు పైగానే ఉన్నా అధికారులు మాత్రం పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వేలాల్లో మున్సిపల్ షాపులకు మాత్రం రూ.2,000 నుంచి రూ.13,200 వరకు అద్దె నిర్ణయించారు. వేలంపాట దక్కాలంటేఅదనంగా రూ.2 లక్షలు! ‘మున్సిపాలిటికీ చెల్లించాల్సిన గుడ్‌విల్‌ను రూ.లక్ష తగ్గించామని, షాపుల లీజులను కూడా నామినల్ రేట్లకే మార్చామని’ చెబుతూ దళారులు వసూళ్ల పర్వానికీ తెరలేపినట్లు తెలుస్తోంది. ‘వేలంపాట రోజు ఎవరిషాపు వారికే దక్కేలా ఏర్పాట్లు జరిగాయని, ఎవరైనా పోటీపడితే మున్సిపల్ అధికారులు వేలాలు వాయిదావేస్తూ పోతారని, ఎవరూ రాని సందర్భం చూసి మీకే షాపులు వచ్చేలా ఏర్పాట్లు జరిగాయంటూ ’ పేర్కొంటుండటం పట్టణంలో హాట్‌టాపిక్ అయ్యింది. ఇందుకుగాను రూ.2 లక్షలు అదనంగా ఇవ్వాలని, అన్నీ తామే చూసుకొంటామని వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. కాగా ఇంటెలిజెన్సు, ఎస్బీ, ఏసీబీ అధికారులు సైతం అక్రమ వసూళ్ల పర్వాన్ని ఆరాతీసి ఉన్న తాధికారులకు సమాచారం అందించడంతో మున్సిపల్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. నేడు మున్సిపల్షాపులకు వేలాలు ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 68 షాపులకు శుక్రవారం వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ.లక్ష గుడ్‌విల్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆయా షాపుల లీజు అద్దెను మున్సిపల్ అధికారులు ముందుగానే నిర్ణయించారు. అక్రమ వసూళ్లతో సంబంధం లేదు మున్సిపల్ షాపులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నాం. ఆశావాహులు ఎవరైనా వేలంపాటలో పాల్గొనవచ్చు. రాజకీయ దళారులు బయటచేపట్టే అక్రమ వసూళ్లతో తమకు సంబంధంలేదు. – జి.రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
దుకాణంలో దొంగలు.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: వ్యాపారులకు మంచి జరగాలి.. పంచాయతీకి ఆదాయం రావాలన్న సదుద్దేశంతో పంచాయతీ, వ్యాపారుల భాగస్వామ్యంతో నిర్మించిన దుకాణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని దుకా ణాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల పంచాయతీ ఆదాయానికి గండికొ డుతున్నారు. తక్కువ అద్దెలు చెల్లిస్తూ ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా వారిలో మార్పువచ్చిందా అంటే అదీ లేదు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న దుకాణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇదే చీపురుపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు నేటికీ అదే ధోరణిని కొనసాగి స్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. అయితే, దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించడం ద్వారా పంచాయతీకి ఆదాయం చేకూర్చవచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు సూచించారు. ఇదీ కథ... చిరువ్యాపారుల సంక్షేమం దృష్ట్యా చీపురుపల్లి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పయంచాయతీ స్థలంలో 26 దుకాణాల నిర్మాణానికి 2009లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ప్రణాళికలు వేశారు. దుకాణాల నిర్మాణానికి చిరు వ్యాపారుల నుంచి కొంత వరకు నిధులు సమీకరించి ఆ డబ్బుతో దుకాణాలను నిర్మించారు. సాధారణ అద్దె నిర్ణయించి ఏడు సంవత్సరాలు లీజుకు దుకాణాలను కేటాయించారు. తరువాత 2016లో పంచాయతీ తిరిగి ఆ దుకాణాలను తీసుకుని బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంది. అప్పటికి టీడీపీ అధికారంలో ఉండడంతో రెండేళ్లు తాత్సారం చేసింది. 2018లో స్థానిక టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి బహిరంగ వేలం లేకుండా 30 శాతం అద్దెలను పెంచుతూ తమ వర్గీయులకు దుకాణాలను కేటాయించుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ‘ఇంజక్షన్ ఆర్డర్’ను ఇచ్చింది. దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా టీడీపీ పాలకులు తమ అనుయాయులకు, ఇష్టులకు తక్కువ అద్దెలకు దుకాణాలను కట్టబెట్టి మొదటి నుంచీ ఉన్న వారికి దుకాణాలు కేటాయించకుండా అన్యా యం చేశారు. అలా అన్యామైపోయిన వారిలో కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు. అయితే, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మెయిన్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నాయకుడికి చెందిన దుకాణానికి టీడీపీ మాజీ జెడ్పీటీసీ వర్గీయులు సోమవారం దౌర్జన్యంగా తాళం వేశారు. ఇదేమిటని అడిగిన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువార్గాల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అద్దెల లెక్క ఇలా... ప్రస్తుతం ఒక్కో దుకాణం నుంచి రూ.2వేల నుంచి రూ.2,800 వరకు మాత్రమే పంచాయతీకి అద్దెలు వస్తున్నాయి. కానీ అక్కడ మార్కెట్లో మాత్రం ఒక్కొక్క దుకాణానికి రూ.20వేల నుంచి రూ.25 వేల వరకూ అద్దెలు పలుకుతున్నాయి.ఈ లెక్కన ఏడేళ్లకు రూ.5.46 కోట్ల ఆదాయం పంచాయతీకి రావాల్సి ఉంది. టీడీపీ నాయకుల చేతివాటంతో పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో పంచాయతీలో ఉద్యోగులకు జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలు అంటూ అనేక పనులకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలు, పంచాయతీ బాగు కోసం ఆలోచించి బహిరంగ వేలానికి మద్దతిస్తే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అర్హులకు దుకాణాలు దక్కే అవకాశం ఉంది. వేలంతో పంచాయతీకి ఆదాయం.. చీపురుపల్లి దుకాణాల అంశంపై కలెక్టర్ హరిజవహర్‌లాల్‌తో ఇప్పటికే చర్చించాం. దుకాణాలకు ప్రస్తుతం అతి తక్కువ అద్దెలు వస్తున్నాయి. దీనివల్ల పంచాయతీకి ఆదా యం రావడం లేదు. ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది. అందుకే బహిరంగ వేలం నిర్వహించాల్సింది గా కలెక్టర్‌ను కోరాం. అదే జరిగితే పంచాయతీకి ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పంచాయతీ అవసరాలకు ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. – బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ, విజయనగరం ఉన్నతాధికారుల సూచనల మేరకే... వ్యాపారులు దుకాణాల కోసం గ్రీవెన్సుసెల్‌ను గతేడాది ఆశ్రయించారు. దీంతో ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించాం. 30 శాతం అద్దె పెంచుతూ దుకాణాలను కేటాయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారం అద్దెలు పెంచుతూ దుకాణాలను కేటాయించాం. – డి. శ్రీనివాస్, మేజర్ పంచాయతీ అధికారి, చీపురుపల్లి -
కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు
నెల్లూరు సిటీ: సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగర పాలక సంస్థ మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో షాపు లీజుదారులు కొనసాగుతున్నారు. బయట వ్యక్తులకు ఎక్కువ మొత్తానికి షాపులను అద్దెకు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులో 234 షాపులు ఉండగా, వాటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైబడి కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులను పదేళ్లకుపైగా కొందరు బినామీలు నడుపుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం షాపు లీజుకు తీసుకుని మూడేళ్లు దాటితే వేలం పాట నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు అమలు కావడంలేదు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కొన్ని సార్లు వేలం పాటలు నిర్వహించేందుకు యత్నించినా బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అడ్డుకుని షాపు లీజుదారుడికే కట్టబెట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజుదారుడు ఒకరు.. బాడుగకు ఉండేది మరొకరు... మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపు నిర్వహణ చేయాలి. అయితే లీజుదారుడు కార్పొరేషన్‌కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయట వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజారు, డైకాస్రోడ్డు, మద్రాసుబస్టాండు, గాంధీబొమ్మ సెంటర్లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో కొందరు షాపులను వేలం పాటలో రూ.5 నుంచి రూ.7వేలకు తీసుకుని, బయట వ్యక్తికి అదే షాపును రూ.10వేల నుంచి రూ.15వేలకు బాడుగకు ఇస్తున్నారు. వేలం పాటలు నిర్వహించపోవడంతో ఏటా లక్షల రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. మున్సిపల్ షాపుల వేలానికి అడ్డంకులు గతంలో పనిచేసిన కమిషన్ పీవీవీఎస్ మూర్తి కార్పొరేషన్ పరిధిలోని 25 ఏళ్ల లీజు నిండిన 65 షాపులకు వేలం పాట నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. షాపుల వేలం పాట తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా వేలం పాట నిలిపివేశారు. ఇది జరిగి ఒకటన్నర ఏడాది కావస్తున్నా అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వేలం పాటలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. షాపింగ్ కాంప్లెక్ పేరు షాపుల సంఖ్య ప్రకాశం పంతులు కాంప్లెక్స్ 18 సుబేదారుపేట కాంప్లెక్స్ 13 బీవీఎస్ఎం కాంప్లెక్స్ 16 పప్పులవీధి కాంప్లెక్స్ 24 ఏసీ భవన్ కాంప్లెక్స్ 12 పనుతల వారి కాంప్లెక్స్ 13 చిన్నబజారు కాంప్లెక్స్ 38 డైకాస్రోడ్డు 06 సౌదాన్య కాంప్లెక్స్ 15 డైకాస్రోడ్డు కాంప్లెక్స్ 05 ఏసీ విహార్ కాంప్లెక్స్ 05 ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ 22 -
ఆలయ మడిగల కబ్జా- నిందితులకు జైలు
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆలయానికి చెందిన మడిగలను కబ్జా చేసిన కేసులో నలుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఎల్బీ నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం పరిధిలో 102 మడిగలు(దుకాణాలు) ఉన్నాయి. వీటిలో 76, 77 మడిగలలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇరవయ్యేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. అయితే 2011లో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తన భార్య పేరుపై ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై ఆలయ చైర్మన్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డిజిల్లా కోర్టు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవితాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడు మల్లారెడ్డి, మరో ముగ్గురికి ఏడాది జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. -
అంతుచిక్కని ‘అద్దె’ లెక్క
మున్సిపాలిటీ లీజు షాపుల అద్దెపై ప్రతిష్టంభన అద్దె బకాయిలు రూ. 4 కోట్లు పట్టించుకోని మున్సిపాలిటీ నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీ కార్యాలయానికి చెందిన షాపుల అద్దె విషయం అంతుచిక్కడం లేదు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 238 షాపుల అద్దె బకాయి సుమారు రూ.3 కోట్లకు పైగా ఉన్నట్లు గతేడాది ఆడిట్ బృందం అధికారులు తేల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో కోటి రూపాయల అద్దె బకాయిలు పెరిగినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. మొత్తం 4 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఈ మున్సిపల్ షాపులకు అధికారులు వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొనాలంటే అద్దె చెల్లించాలని మున్సిపల్ అధికారులు నిబంధన పెట్టడంతో కొంత మంది వ్యాపారులు బ్యాంకులలో చలానా ద్వారా చెల్లించినట్లు తెలిసింది. కేవలం కొంది మంది మాత్రమే 20 లక్షల రూపాయల వరకు బ్యాంకులలో చెల్లించినట్లు సమాచారం. కానీ ఏ వ్యాపారి ఏ బ్యాంకులో ఎంత చెల్లించారనేది తెలియకపోవడంతో లీజు షాపుల అద్దె బకాయిల లెక్కలపై ప్రతిష్టంభన నెలకొంది. లెక్క తేలేది ఎలా ? మున్సిపాలిటీ కార్యాలయానికి కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో నిధుల కొరత ఏర్పడుతుంది. డబ్బులు లేవని చెబుతున్న అధికారులు తమకు రావల్సిన బకాయిలపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడివి అక్కడే నిలిచిపోతున్నాయి. వ్యాపారులు అద్దెను నేరుగా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించే ఏర్పాట్లు చేయయకపోవడమూ దీనికి కారణంగా చెప్పవచ్చు. కొంత మంది నిజాయితీ గల వ్యాపారులు అద్దె చెల్లిస్తున్నా ఎంత అనేది కనుక్కోవడం మున్సిపాలిటీ అధికారులకు సవాల్‌గా మారింది. చలానా ద్వారా బ్యాంకులలో అద్దె చెల్లించాలని గత దశాబ్దం క్రితం అప్పటి మున్సిపల్ అధికారులు చెప్పినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. కానీ 2010 నుంచి వ్యాపారులు అద్దె చెల్లించడం చాలా వరకు మానేశారు. ఇలా ప్రతి సంవత్సరం అద్దె చెల్లింపులు జరుగకపోవడంతో వ్యాపారులు ప్రస్తుతం కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. మున్సిపల్ షాపుల అద్దెకు సంబంధించిన లెక్కలు గత ఐదేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు లెక్క తేలడమే అధికారులకు తలనొప్పిగా మారింది. వ్యాపారులు చెల్లించిన ఓచర్లు కూడా మున్సిపల్ అధికారులకు సమర్పించకపోవడంతో లెక్క దొరకని పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో అకౌంట్, రెవెన్యూ విభాగాల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నా వాటిని ఎలా రాబట్టాలనే దానిపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఇరు విభాగాలను సమన్వయం చేసి, అకౌంట్ విభాగం ద్వారా బ్యాంకులలో ఐదేళ్ల నుంచి జమ చేసిన వివరాలు బయటికి తీస్తే లెక్క తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో నెల రోజుల్లోనే డబ్బులు వసూలు చేసే వెసులుబాటు కలుగుతుంది. మున్సిపాలిటీలో వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇతరులకు అది కల్పతరువుగా మారిందనే చెప్పాలి. మున్సిపల్ ఉన్నతాధికారులు జో క్యం చేసుకుంటేనే బకాయిల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇదో రకం..పంచాయితీ!
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: పాలకొండ పట్టణం నగర పంచాయతీగా మారి సుమారు ఏడాది అవుతోంది. ఇటీవలే ఎన్నికలు జరిగి కౌన్సిల్ పాలకవర్గం కూడా ఏర్పాటైంది. కానీ ఇప్పటికీ ఇక్కడ పంచాయతీ పాలనే కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రధాన మార్కెట్లోని షాపుల లీజుల వ్యవహారం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి పట్టణ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారం నగర పంచాయతీగా మారిన తర్వాత కూడా కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఏడాది క్రితం వరకు పంచాయతీగా ఉన్న పాలకొండలోని ప్రధాన మార్కె ట్లో సుమారు 28 ఏళ్ల క్రితం నిర్మించిన షాపులకు ఇప్పటికీ నామమాత్రపు అద్దెలే వసూలు చేస్తున్నారు. 36 పెద్ద, 10 చిన్న షాపులు ఉండగా.. పెద్ద షాపులకు రూ.700, చిన్నవాటికి రూ.550 అద్దె వసూలవుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీని వల్ల పాలకొండ గత పంచాయతీ, ప్రస్తుత నగర పంచాయతీ లక్షల్లోనే ఆదాయం కోల్పోయింది. స్థాయి పెరిగిన తర్వాత కూడా.. నిబంధనల మేరకు అద్దె ఎందుకు పెంచలేదన్నది పక్కన పెడితే నగర పంచాయతీగా మారిన తర్వాత దాని పరిధిలోని షాపులు, ఇతరత్రా లీజులను టెండర్లు పిలిచి మున్సిపల్ కమిషనర్ ఖరారు చేయాల్సి ఉంటంది. అద్దెలను కూడా నగర పంచాయతీ స్థాయికి తగినట్లు పెంచాలి. కానీ ఇక్కడ మాత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలోని కొందరి అండదండలతో పాలకొండ పంచాయతీ అధికారులే ఆ పని కానిచ్చేశారు. మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆగమేఘాల మీద పాత రేట్లకే లీజులు రెన్యూవల్ చేసేశారు. స్పెషల్ అధికారి దృష్టికి గానీ, కమిషనర్ దృష్టికి గానీ తీసుకువెళ్లక పోవడంతో అక్రమాలు జరగాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందుకు గాను ఒక్కో షాపు నుంచి వేలల్లో దండుకున్నారని తెలుస్తోంది. పైగా తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు లీజు కాలపరిమితి పెంచినట్లు ఆయా అధికారుల సంతకాలతోనే ధ్రువపత్రాలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ధ్రువపత్రాలు చూపేందుకు అటు సిబ్బంది.. ఇటు షాపుల నిర్వాహకులు అంతగా సుముఖత చూపకపోవడంతో అధికారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయన్న అనుమానాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. సొంత షాపుల్లా చెలామణీ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన మార్కెట్లో ఉన్న ఈ 46 షాపులను ఏళ్ల తరబడి అనుభవిస్తున్న వర్తకులు వీటిని తమ సొంత షాపుల్లా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వీటిలో వస్త్రాలు, కిరాణా, సిమెంట్, ఐరెన్ వంటి హోల్‌సేల్ దుకాణాలతో పాటు కూరగాయలు, పండ్లు వంటి చిరు వ్యాపారాలు చేస్తున్నవారూ ఉన్నారు. ప్రతి మూడేళ్లకోసారి లీజు గడువును పొడిగించుకుంటూ నామమాత్రపు అద్దెలు చెల్లిస్తున్నారు. తాజాగా 2014-15 సంవత్సరానికి గాను ఈ షాపుల రెన్యూవల్ ఇటీవలే జరిగింది. అయితే అద్దెలు మాత్రం పంచాయతీ హయాంలో చెల్లిస్తున్న రేట్లే చెల్లిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా లీజుకు తీసుకున్న ఈ షాపుల్లో కొన్నింటిని లీజుదారులు వేరే వ్యక్తులకు ఇచ్చి అధిక అద్దెలు వసూలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై నగర పంచాయతీ కమిషనర్ టి.కనకరాజు వద్ద ప్రస్తావించగా ఏళ్ల తరబడి ఉన్న వ్యాపారస్తులు మూడేళ్లకోసారి షాపుల రెన్యూవల్‌కు దరఖాస్తు చేస్తున్నారని, తాజాగా మార్చి నెలలో ఈ షాపుల లీజు రెన్యూవల్ చేసిన సమయంలో 33.13 శాతం అద్దె పెంచినట్లు చెప్పడం విశేషం. ఫైళ్లు చూపించడం లేదు:డీపీవో ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత ఫైల్ తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ ఫైల్‌ను తనకు చూపించలేదని ఎక్కడ ఉందో కూడా తెలియడంలేదన్నారు. దాంతో తనకూ కూడా అనుమానం కలుగుతోందన్నారు. నగర పంచాయతీగా మారిన తర్వాత లీజు పొడిగింపు అధికారం పంచాయతీ అధికారులకు ఉండదన్నది వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు.