Shrimp cultivation
-
రొయ్యల సాగు: సక్సెస్ సీక్రెట్ ఇదే!
రొయ్యల పెంపకం విజయవంతానికి సీడ్ (పిల్లల) నాణ్యతే కీలకమైన అంశం. టైగర్, వెనామీ వంటి సాగుకు అనువైన రొయ్యల జాతుల వలన ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఒక ముఖ్య పరిశ్రమగా మారింది. చెరువుల్లో రొయ్యల పెరుగుదల, ఆరోగ్యం, బతుకుదల అనేవి నీటి నాణ్యత, చెరువు నిర్వహణ పద్ధతులు, సీడ్ సాంద్రత, మేత నాణ్యత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. చెరువులో రొయ్య పిల్లలు ఎలా పెరుగుతున్నా యనేది అర్థం చేసుకోవడం దిగుబడిని పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి, సుస్థిరత్వానికి ముఖ్యమైన అంశం. చెరువులోని నీటి వాతావరణ పరిస్థితులకు రొయ్యల సీడ్ అలవాటు పడే ప్రక్రియపై శ్రద్ధచూపటం చాలా అవసరం. ఈ ప్రక్రియనే ఎక్లిమటైజేషన్ అంటారు. హేచరీలు, చెరువుల మధ్య ఉష్ణోగ్రత, లవణీయత వంటి నీటి నాణ్యత గుణాలలో ఆకస్మిక మార్పులు గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది రొయ్యలలో శారీరక, ప్రవర్తనా సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల చెరువుకు అలవాటుచేయడం, ఈ మార్పులకు రొయ్యలు క్రమంగా సర్దుబాటు అవడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి అధికమైతే మరణాలకు దారితీస్తుంది లేదా పెరుగుదల కుంటుపడుతుంది. రొయ్యల సీడ్‌ను చెరువుకు అలవాటు చేయటం ఒక క్లిష్టమైన అంశం. హేచరీలలో రొయ్యపిల్లలు స్థిరమైన, నియంత్రిత ఉష్ణోగ్రతలో పెరుగుతాయి. అయితే చెరువుల్లో వాతావరణ మార్పులు, నీటి ప్రవాహం కారణంగా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వదిలినప్పుడు ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు రొయ్యల సీడ్‌ను ఒకవిధమైన ’షాక్’ కు గురి చేస్తుంది. వాటి జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై వ్యాధులకు గురి చేస్తుంది.అదేవిధంగా, హేచరీ, చెరువు మధ్య లవణీయత (సెలినిటి) హెచ్చుతగ్గులు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. క్రమంగా అలవాటు చేస్తే రొయ్య పిల్లలు చెరువు నీటి లవణీయతకు సర్దుకోగలుగుతాయి. మరో ముఖ్యమైన అంశం నీటిలోని ఆక్సిజన్ స్థాయి. రొయ్యల ఆరోగ్యం, పెరుగుదలను ప్రోత్సహించడానికి హేచరీలు ఎయిరేషన్ ద్వారా అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను అందిస్తాయి. అయితే, చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి నీటి ఉష్ణోగ్రత, సంఖ్య వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. రొయ్యల సీడ్‌ను చెరువులో సరిగ్గా అలవాటు చేయకపోతే అకస్మాత్తుగా తక్కువ ఆక్సిజన్ స్థాయిలున్నపుడు అవి ఒత్తిడికి గురవుతాయి. అలాగే, పిహెచ్ హెచ్చుతగ్గులు స్టాకింగ్ సమయంలో పోస్ట్–లార్వాల బ్రతుకుదలపై ప్రభావం చూపెడతాయి. కాబట్టి వాటిని సర్దుబాటు చేయాలి. చెరువు నీటిని విత్తన సంచులకు క్రమంగా కలపడం, తరువాత నెమ్మదిగా చెరువులోకి రొయ్య పిల్లలను విడుదల చేయడం మేలు.చెరువు నీటికి సరిగ్గా అలవాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. మెరుగైన బతుకుదల 2. మంచి పెరుగుదల 3. వ్యాధి నియంత్రణ లేదా తక్కువ వ్యాధి ప్రమాదాలు4. పర్యావరణ ఒత్తిడి ప్రభావం తగ్గుదల 5. ఖర్చు తగ్గటం6. మెరుగైన ఉత్పాదకతచెరువులో రొయ్యల విత్తనాలను ప్రవేశపెట్టే ముందు, ఉష్ణోగ్రత, పిహెచ్, లవణీయత, నీట కరిగిన ఆక్సిజన్ స్థాయి వంటి కీలక నీటి గుణాలు రొయ్యలకు సరైన స్థాయిలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. వెనామీ రొయ్యలకు అనువైన పరిస్థితులు: ఉష్ణోగ్రత: 28–32 డిగ్రీల సెల్షియస్పిహెచ్: 7.5–8.5లవణీయత: 15–35 పిపిటి (స్థానిక పరిస్థితులను బట్టి)నీటిలో కరిగిన ఆక్సిజన్: 5 పిపిఎం కన్నా తక్కువచెరువు పరిస్థితులు, హేచరీ నీటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నట్లయితే, సీడ్ వేయడానికి ముందు సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది (ఉదా.. మంచినీరు, ఎయిరేషన్ మొదలైనవి). రవాణా సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి రొయ్యల సీడ్ ను ( పోస్ట్–లార్వాలు) శుభ్రమైన, ఆక్సిజన్ ఉన్న బ్యాగ్‌లు లేదా ఫైబర్ కంటైనర్లలో రవాణా చేయండి. బ్యాగ్‌లు/కంటెయినర్ల రవాణా సమయంలో ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు రొయ్యలకు హాని కలిగిస్తాయి. పర్యావరణ ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం సీడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రొయ్యల విత్తనాల రవాణా వేగంగా జరిగేలా చూడండి.రొయ్యల సీడ్‌ను చెరువుకు అలవాటుచేసే ప్రక్రియసాగు చేసే ప్రదేశానికి రొయ్య పిల్లలను చేర్చిన తర్వాత, బ్యాగులను తాడు/కర్రల సహాయంతో చెరువు ఉపరితలంపై కట్టి ఉంచండి. ఉష్ణోగ్రతల సర్దుబాటుకు ఇది సహాయపడుతుంది. తర్వాత సీడ్ బ్యాగ్‌లను తెరిచి క్రమంగా చెరువు నీటిని సీడ్ బ్యాగ్‌లలోకి ప్రవేశపెట్టండి. ప్రతి 10–20 నిమిషాలకు 10–20% చొప్పున కంటైనర్/బ్యాగ్‌లో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పిహెచ్, ఉష్ణోగ్రత, లవణీయతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది.కొనుగోలు చేసిన పి.ఎల్. సంఖ్య నీటి గుణాల వ్యత్యాసాల పరిధిని బట్టి కొన్ని గంటల పాటు ప్రక్రియను కొనసాగించండి. ఈ సమయంలో నీటి నాణ్యత గుణాలను నిరంతరం గమనించండి. థర్మామీటర్, రిఫ్రాక్టోమీటర్, పిహెచ్ మీటర్లను ఉపయోగించండి.చెరువు నీటిలోకి చేరిన రొయ్య పిల్లలు ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం పాలవటం, మరణాలు పెరగడం వంటి ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు గమనిస్తే.. చెరువు నీటికి వాటిని అలవాటు ప్రక్రియను మరింత నెమ్మదిగా చేయండి లేదా నీటి గుణాలను తగిన రీతిలో మార్చండి. చెరువులోకి రొయ్యలను నెమ్మదిగా వదలండి. రొయ్య పిల్లలను ఒకేసారి చెరువు నీటిలోకి వేసెయ్యకుండా చిన్న బ్యాచ్‌లుగా విడుదల చేయండి.రొయ్య పిల్లలను చెరువు అంతటా సమానంగా పంపిణీ చేయండి. వాటికి షెల్టర్, ఆక్సిజన్, తగిన ఫీడింగ్ జో¯Œ లు అందుబాటులో ఉంచండి. విడుదల చేసిన తర్వాత, మొదటి కొన్ని రోజులు చెరువు నీటి నాణ్యతను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఉష్ణోగ్రత, లవణీయత లేదా ఆక్సిజన్ స్థాయి స్థిరంగా ఉండేలా చూసుకోండి.రొయ్యల పరిమాణం, వయసుకు తగిన మేత షెడ్యూళ్లను అమలుచేయండి. నీటి నాణ్యత క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి అతిగా మేత ఇవ్వడం మానుకోండి. ఫీడ్ కంపెనీల ద్వారా సరఫరా చేయబడిన ఫీడ్ చార్ట్‌లను అనుసరించండి. మేత తినే తీరు, కదలికలను గమనించడం ద్వారా రొయ్యల ఆరోగ్యాన్ని గమనించండి. ఆరోగ్యకరమైన రొయ్యలు చురుకుగా తింటాయి. ప్రశాంతంగా ఈత కొడతాయి. ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు ఉంటే తక్షణమే పరిష్కరించాలి. ్ర΄ారంభ రోజుల్లో రొయ్య పిల్లలు చిన్నగా ఉంటాయి. స్పష్టంగా కనిపించవు కాబట్టి ఇది చాలా కష్టమైన ప్రక్రియ.చెరువు నీటికి అలవాటు చేసే ప్రక్రియలో రొయ్య పిల్లలు వ్యాధికారక క్రిములకు గురికాకుండా చూసుకోండి. వ్యాధుల ప్రవేశాన్ని నివారించడానికి రవాణాలో, చెరువు నిర్వహణ పద్ధతుల్లో సరైన పరిశుభ్రతను పాటించండి. చెరువు నీటి నాణ్యత గుణాలు, రొయ్యల ఆరోగ్య వివరాలను ‘రికార్డ్’ చేయండి. ఈ సమాచారం సమస్యలను పరిష్కరించడంలో, భవిష్యత్తులో రొయ్యల సాగులో తగిన మెళకువలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మరికొన్ని సూచనలు: నీటి గుణాలను సర్దుబాటు చేస్తే రొయ్య పిల్లలు క్రమంగా, సాఫీగా చెరువుకు అలవాటు పడతాయి. ఆక్సిజన్ తగినంత అందేలా చూడండి. ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లలను బ్యాచ్‌ల వారీగా రవాణా చేసి, నెమ్మదిగా చెరువు నీటిలోకి విడుదల చేయండి. రొయ్యలు, చెరువు వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోవడానికి విడుదల చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు వాటి ఆరోగ్యాన్ని, ప్రవర్తనను నిశితంగా గమనించండి.చాలా మంది రైతులు రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసి, త్వరగా చెరువులో వేసుకోవాలని ఆత్రంగా వ్యవహరిస్తుంటారున. నెమ్మదిగా చేపట్టాల్సిన ఈ కీలక ప్రక్రియను పట్టించుకోరు. కాబట్టి, రొయ్యల పంట విజయానికి ఉత్తమమైన ప్రారంభాన్ని ఇవ్వటం ముఖ్యం. ఈ ప్రక్రియలో సీడ్‌ను చెరువుకు అలవాటు చేయడమే కీలకఘట్టం. రొయ్యల సీడ్ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో హేచరీ/ల్యాబ్‌లోని ఒత్తిడి పరీక్షలు సహాయపడతాయి. – డా. పి. రామమోహన్‌రావు (98851 44557), కాకినాడ -
‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆక్వా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిందని.. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తామని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావ్, అసోసియేషన్ నేతలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఎగుమతిదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరోపియన్, చైనాల జీరో కోవిడ్ పాలసీ అమలు, అమెరికాలో వనామీ రొయ్యల నిల్వలు పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆక్వా రంగం గత మూడు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విదేశాల్లో పండుగలు ఉన్నాయని.. అక్కడ నిల్వ ఉన్న సరుకుతోపాటు దేశంలో ఎగుమతిదారుల వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోతుందని, ఫలితంగా భారత్‌లో తిరిగి రొయ్యల ఎగుమతులు పుంజుకుంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు 100 కౌంట్ రూ.210, 30 కౌంట్ రూ.380కి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజూ ధరల్లో మార్పులేకుండా 10–20 రోజుల పాటు నిర్ణీత ధర ఇచ్చేందుకు అంగీకరించారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. కొంతమంది జె–ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం తర్వాత అత్యధిక సాగులో ఉన్న ఆక్వా రంగంపై లేనిపోని ఆరోపణలుచేసి రైతులతో రాజకీయం చెయ్యొద్దని వారు విజ్ఞప్తి చేశారు. క్రాప్ హాలిడే ఆలోచనే లేదు: ఆక్వా రంగం సంక్షోభాలు రైతులకు కొత్తేమీకాదన్నారు. టైగర్ రొయ్య సాగులో నష్టాలు చూశారన్నారు. ప్రస్తుతం వనామీలో సంక్షోభం తాత్కాలికమేనని వారు స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారన్న ఆరోపణలను వారు ఖండించారు. అలాంటి ఆలోచన రైతులకు లేదన్నారు. కేవలం గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు, ఎగుమతిదారులను సంప్రదిస్తూ సూచనలు చేస్తోందన్నారు. ఇందుకుగాను ఒక కమిటీ వేసి మరీ పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై సంప్రదించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. రైతులకు సూచనలు.. ఆక్వా రంగంలో నష్టాల నుంచి గట్టెక్కాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాలని విధానాలపై వక్తలు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అవి.. ► అందరూ ఒకేసారి పంట వేసి ఇబ్బందులు పడకుండా క్రాప్ రొటేషన్ పద్ధతి పాటించాలి. ► ఎగుమతులకు ఇబ్బందికరంగా మారిన 100 కౌంట్ రొయ్యల సాగుకు స్వస్తిపలికి 70, 80, 30 కౌంట్ రొయ్యలపై దృష్టిపెట్టాలి. ► చెరువుల్లో తక్కువ స్థాయిలో సీడ్ వేసి ఎక్కువ కౌంట్ సాధించేలా ప్రణాలికాబద్ధంగా వ్యవహరించాలి. ► దేశంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరుగుతోంది. ► ఇందులో సింహభాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఉంటోంది. పెద్ద రైతులకూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వం చిన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. వాటిని పెద్ద రైతులకూ అమలుచేయాలి. మేతల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. నాణ్యమైన సీడ్, మేత లభించకపోవడం ఓ కారణమైపోతోంది. – రుద్రరాజు నానిరాజు, ఆక్వా రైతులు, కోనసీమ -
తల్లి రొయ్యలకూ.. ఓ క్వారంటైన్ సెంటర్
సాక్షి, అమరావతి: రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ కోసం రంగం సిద్దమైంది. 2023 నాటికి ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రొయ్యల సాగు చేపట్టాలంటే నాణ్యమైన సీడ్ (రొయ్య పిల్ల) చాలా ముఖ్యం. నాణ్యమైన సీడ్ కావాలంటే జన్యుపరమైన సమస్యలు, రోగాల్లేని బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) అవసరం. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు బ్రూడర్స్ ద్వారా వాటి సంతతికి సంక్రమించవని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ అని వస్తేనే బ్రూడర్స్‌ను సీడ్ ఉత్పత్తికి అనుమతిస్తారు. దేశం మొత్తం చెన్నైకి క్యూ యానిమల్ ఇంపోర్ట్ యాక్ట్–1898 ప్రకారం విదేశాల నుంచి ఏ రకం లైవ్ స్టాక్ (జీవాల)ను దిగుమతి చేసుకున్నా.. వాటిద్వారా వాటి సంతతికి, మానవాళి సహా ఇతర జీవ రాశులకు ఎలాంటి రోగాలు సోకవని నిర్ధారించుకునేందుకు వాటిని క్వారంటైన్ చేయాల్సిందే. అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తల్లి రొయ్యలను కూడా క్వారంటైన్లో ఉంచి పరీక్షిస్తారు. ఇలా పరీక్షించేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చెన్నైలో మాత్రమే ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఉంది. దీన్ని మెరైన్ ప్రోడక్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా), రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చరిక్స్ (ఆర్జీసీఏ) నిర్వహిస్తున్నాయి. ఏపీతో సహా దేశంలోని ఆక్వా హేచరీలన్నీ ఈ కేంద్రానికి క్యూ కట్టాల్సిందే. ఇక్కడ 400 తల్లి రొయ్యలను ఒక క్యారంటైన్ క్యూబికల్లో ఉంచి ఐదారురోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఒక క్వారంటైన్ క్యూబికల్‌కి డిమాండ్‌ను బట్టి రూ.95 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేస్తారు. ఏటా 1.50 లక్షల బ్రూడర్స్ దిగుమతి రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే హేచరీలు దేశవ్యాప్తంగా మొత్తం 560 ఉంటే.. వాటిలో 389 హేచరీలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఇక్కడ ఏటా 65 వేల మిలియన్ల సీడ్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం ఏటా సింగపూర్, హవాయ్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల నుంచి 1.50 లక్షల బ్రూడర్స్‌ను హేచరీలు దిగుమతి చేసుకుంటాయి. వీటిని క్వారంటైన్ చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటారు. దేశం మొత్తమ్మీద ఒకే ఒక్క క్యారంటైన్ కేంద్రం ఉండటంతో సకాలంలో క్వారంటైన్ పూర్తికాక, సీజన్‌కు నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అదును దాటిపోతుందన్న ఆందోళనతో నాసిరకం సీడ్‌పై ఆధారపడి ఆక్వా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 30 ఎకరాలను సేకరించారు. దీని నిర్మాణానికి రూ.36.55 కోట్లను కేటాయించి ఇటీవలే టెండర్లు ఖరారు చేశారు. దీనిని 2023 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. నాణ్యమైన సీడ్ ఉత్పత్తే లక్ష్యం నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఇది రెండో క్వారంటైన్ కేంద్రం. ఏడాదికి 1,23,750 బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంటుంది. ఒకేసారి 625 తల్లి రొయ్యలను పరీక్షించవచ్చు. వీటిద్వారా 10 బిలియన్ల సీడ్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్వా సాగు విస్తరణకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
ప్రశ్నార్థకంగా పులికట్ సరస్సు మనుగడ
-
పులికాట్‌కు రొయ్య కాటు
సూళ్లూరుపేట: సహజసిద్ధంగా ఏర్పడి ప్రకృతి వరప్రసాదమైన పులికాట్ సరస్సును ఇప్పుడు రొయ్యల సాగు రూపంలో కాలుష్య భూతం కాటేస్తోంది. ఒకనాడు అందాల తీరంగా పడవ ప్రయాణాలతో అలరారిన ఈ సరస్సు.. ఇప్పుడు తమిళనాడులో విచ్చలవిడిగా సాగిస్తున్న రొయ్యల సాగుతో దెబ్బతింటోంది. ఫలితంగా మత్స్య సంపద నశిస్తుండగా.. మత్స్యకారులు ఉపాథి లేకుండాపోతున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లో సుమారు 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఆంధ్రా పరిధిలో 500 చ.కి.మీటర్లలో.. తమిళనాడులో 120 చ.కి.మీటర్ల పరిధిలో ఉంది. దీనికి సుమారు ఐదు కిలోమీటర్లు వరకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉంటుంది. దీని పరిధిలో ఎక్కడా రొయ్యలు సాగు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలవుతుండగా.. తమిళనాడులో పట్టించు కునే దిక్కులేదు. దీంతో ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు గ్రామానికి సమీపంలోని తమిళనాడు భూభాగంలో సుమారు 100 ఎకరాలకు పైగా అక్కడి వ్యాపారులు రొయ్యల సాగుచేస్తున్నారు. ఇందులో నుంచి వచ్చే వ్యర్థ జలాలన్నీ పులికాట్ సరస్సులో నేరుగా వదిలేస్తున్నారు. అంతేకాదు.. పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగ చట్టాన్ని సైతం అతిక్రమించి సున్నపుగుల్ల కంపెనీలను ఏర్పాటుచేశారు. సున్నాంబుగోళం కేంద్రంగా సరస్సు గర్భంలో లభించే సున్నపుగుల్లను తీసేసి తరలిస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వారు పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దులో రొయ్యల సాగుచేస్తూ అందులో నుంచి వచ్చే విషపూరిత వ్యర్థ జలాలు ఆంధ్రా ప్రాంతం సరిహద్దులో కలుస్తున్నాయి. దీనిపై సూళ్లూరుపేట వైల్డ్‌లైఫ్ అధికారులూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తు న్నారు. ఈ వ్యర్థ జలాలవల్ల సరస్సులోని మత్స్య సంపదకు ప్రమాదం వాటిల్లుతోంది. ఫలితంగా ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 10వేల మందికి పైగా ఆంధ్రా మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. తగ్గిన చేపల ఉత్పత్తి పులికాట్ సరస్సులో 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ వస్తోంది. 2001 వరకు సుమారు 3 వేల టన్నులు చేపలు పట్టేవారు. కానీ, నేడు కేవలం రెండు వేల టన్నుల చేపలు మాత్రమే దొరుకుతున్నట్టు జాలర్లు చెబుతున్నారు. పక్షుల పండుగకే పరిమితం ఇదిలా ఉంటే.. పక్షుల పేరుతో ఫ్లెమింగో ఫెస్టి వల్‌ను 16ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా జరిగే పక్షుల పండుగను 2013 టూరి జం క్యాలెండర్లో చేర్చారు. 2014లో స్టేట్ మెగా ఫెస్టివల్‌గా మార్చారు. కేవలం సాం స్కృతిక కార్యక్రమాలతో రూ.కోట్లు ఖర్చుచేసి సరిపెట్టే స్తున్నారు కానీ, పక్షులు నివసించేం దుకు చెట్లు పెంచడం, సరస్సులో నీళ్లు ఎప్పు డూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయిం చడం వంటి పనులకు మాత్రం అడుగులు పడటంలేదు. ఈ ఏడాది కూడా పండుగ నిర్వహణకు రూ.3 కోట్లు, పలు అభివృద్ధి పనులు పేరుతో మరో రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని సరస్సు అభివృద్ధికి ఖర్చుచేసి వుంటే బాగుండేదని పర్యాటక ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సరస్సు అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేయాలి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉండటమే పులికాట్ చేసుకున్న పాపం. ఆ సరిహద్దుల విషయమే ఇప్పటికీ తేల్చలేదు. ఈ రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా దీని అభివృద్ధికి కృషి చేయకపోవడంవల్లే జాలర్లు కూడా తరచూ ఘర్షణ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పులికాట్ లేక్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేయాలి. – గరిక ఈశ్వరయ్య, పర్యావరణవేత్త పులికాట్‌కు రొయ్య కాటు -
రొయ్య మళ్లీ మీసం తిప్పుతోంది
పశ్చిమగోదావరి ,భీమవరం అర్బన్ : కొద్ది రోజులుగా వనామీ రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలించడంతో రైతులు రొయ్యల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు, అనాకోడేరు, గూట్లపాడు, వెంప, తోకతిప్ప, దెయ్యాలతిప్ప, లోసరి, నాగిడిపాలెం, దిరుసుమర్రు, కొమరాడ తదితర గ్రామాల్లో సీజన్లో 7 వేల ఎకరాలు, అన్ సీజన్లో 3 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేపడుతుంటారు. భీమవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల నుంచి సుమారు 200 టన్నుల వరకు రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రాథమిక అంచనా. దీని ద్వారా వందల కోట్ల రూపాయల విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది. ఈ ఏడాది మొదటి పంటైన ఫిబ్రవరి నుంచి జూన్ సీజన్లో రొయ్యల సాగులో దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించలేదు. దాంతో చాలా మందికి పెట్టుబడి ఖర్చులు రావడమే గగనమైపోయింది. మరికొంత మంది నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం చెరువుల్లో సీడ్ దశ నుంచి 100 కౌంట్ దశలో రొయ్యలు ఉన్నాయి. ఈసీజన్పై ఆక్వా రైతుల దృష్టి : ఏటా సీజన్లో మాత్రమే రైతులు రొయ్య సాగు చేసి మిగిలిన సమయంలో వైరస్ ఎక్కువగా ఉండటంతో చేపల పెంపకం సాగించేవారు. ఈ ఏడాది అగస్టు నుంచి ఎండలు ఎక్కువగా ఉండి రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో వనామీ సీడ్‌ను చెరువులలో వదులుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే రొయ్యలు వైరస్ బారిన పడవని రైతులు చెబుతున్నారు. ఆశాజనకంగా ధరలు మండలంలో ఎక్కడా పట్టుబడికి వచ్చిన రొయ్యలు లేకపోవడంతో మార్కెట్లో రొయ్యల ధర చుక్కలనంటుతోంది. గత 20 రోజుల క్రితం నుంచి చూస్తే కౌంట్‌కు రూ.70 నుంచి రూ.100 వరకు ధర పెరిగింది. అధిక దిగుబడి ఉంటే 30 కౌంట్ 440, 40 కౌంట్ 420, 50 కౌంట్ 370, 60 కౌంట్ 350, 70 కౌంట్ 330, 80 కౌంట్ 300, 90 కౌంట్ 280, 100 కౌంట్ 250 ఇస్తున్నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవాలి వనామీ సాగు వల్ల రాష్ట్రానికి వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగంలో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. – నాగిడి నారాయణస్వామి, వనామీ రైతు, నాగిడిపాలెం నకిలీలను అరికట్టాలి రొయ్య పిల్ల వేసేటప్పుడు నాణ్యత తెలియడం లేదు. దీంతో రొయ్యలు వైరస్ బారిన పడి చనిపోతున్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని నకిలీ మందులు, హేచరీలను అరికట్టాలి. – తిరుమాని తులసీరావు, వనామీ రైతు, కొత్తపూసలమర్రు -
వెనామీ.. జాగ్రత్త సుమీ..
యూజమాన్య పద్ధతులతో వెనామీ సాగు లాభదాయం వ్యాధులపై అప్రమత్తత అవసరం కైకలూరు : రొయ్యల సాగు ఒడిదుడుకుల్లో పడింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కలిగిన వెనామీ రొయ్యల సాగు జిల్లాలో ఇటీవల పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 22 వేల ఎకరాల్లో సాగవుతోంది. సరైన శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడంతోనే నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల సాగు లాభాలొస్తే కుబేరుడిని, నష్టాలొస్తే బిచ్చగాడిని చేస్తుందని నానుడి. అందుకే రైతులు యూజమాన్య పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బీ రాజ్‌కుమార్ సూచిస్తున్నారు. చెరువును ఎండ బెట్టడం ఉత్తమం... రొయ్యల చెరువులో మట్టి తన సహజ లక్షణాలను కోల్పోతుంది. ఎండిన తర్వాత మూడు సార్లు దుక్కి దున్ని, దుక్కికి దుక్కికి మధ్య ఏడు రోజులు విరామం ఇవ్వాలి. నేలను రోలర్‌తో చదును చేయాలి. చెరువును బాగా ఎండబెట్టడంతో అడుగున చేపలు, నత్తలు వంటి జీవులు నశిస్తాయి. ఒకవేళ చెరువు పూర్తిగా ఎండని పక్షంలో టీ సీడ్ కేకు, కాపర్ సల్ఫేట్‌ను ఉపయోగించాలి. పూర్తిగా ఆరిన చెరువులో సూర్యరశ్మి వల్ల అడుగున ఉండే వ్యర్థాలు ఆక్సీకరణం చెంది, తొలగించడానికి సులువుగా ఉంటుంది. రొయ్యలు అడుగు భాగాన సంచరించే జీవులు కాబట్టి నేల స్వభావం రొయ్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీవభద్రత వ్యవస్థను పటిష్టం చేయాలి... వెనామీ రొయ్యల చెరువులో జీవ వాతావరణ వ్యవస్థ ఎంతో కీలకం. నేల, నీరు, సీడ్, గాలి, జంతువులు, మనుషులు ఇలా ఆరు మాధ్యమాల ద్వారా సూక్ష్మజీవులు చెరువులోకి ప్రవేశిస్తారుు. పీతలు, తాబేళ్లు, కప్పలు, పాములు, కుక్కలు, నక్కలు వంటివి రొయ్యల చెరువు వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీతలు, నత్తల బొరియల్లో గ్యాస్ బిల్లలు వేసి పూడ్చివేయాలి. చెరువులోకి నీటిని నింపేటప్పుడు 40 లేదా 60 నంబరు మెష్ హపాను కట్టాలి. నీటిని నింపిన తర్వాత 30 లేదా 40 పీపీఎంతో క్లోరినేషన్ చేసుకోవాలి. నత్తలు, పీతలు పైకి ఎక్కకుండా 30-50 సెంటీ మీటర్ల ఎత్తులో క్రాబ్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి. ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థ పదార్థాలను పడవేసినా లోపలికి వెళ్లకుండా ఎరుపు వలలతో బర్డ్ ఫెన్సింగ్ నిర్మించుకోవాలి. రొయ్య పిల్లలను వదిలే ముందు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాలి. రొయ్యల చెరువుకు ఉపయోగించే వల, బకెట్, టబ్స్, పని చేసే సిబ్బంది చేతులు 100 పీపీఎం, అయోడిన్ ద్రావకంతో శుభ్రపర్చుకోవాలి. ఏరియేటర్లు కీలకం... రొయ్యలకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి. దీనికి ఏరియేటర్లను ఉపయోగిస్తారు. వీటిని ఏర్పాటు చేసేటప్పుడు నీటి ప్రవాహ దిశను బట్టి దాని పైపు భూమిలో బలంగా నాటాలి. నీటి ప్రవాహం వృత్తాకారంలో ఉండేలా తగిన మార్పులు చేసి బిగించాలి. ఏరియేటర్లతో చిన్న దశలో రొయ్య పిల్లలకు ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి చెరువు అడుగుభాగాన పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతోంది. బయోమాస్ ఆధారంగా హెచ్‌పీ మోటర్లు వినియోగించాలి.