silence protest
-
ఎస్ఐ తీరుపై వైసీపీ కార్యకర్త మౌనదీక్ష
సాక్షి,విశాఖపట్నం : గొలుగొండ ఎస్ఐ ఎం.నారాయణరావు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకుడు సుర్ల గిరిబాబు మౌనదీక్ష చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి దీక్ష చేశారు. వివరాల్లోకి వెళితే..చీడిగుమ్మల గ్రామానికి చెందిన లోకారపు రామరాజు తనపై నాలుగు రోజులు క్రితం ఇదే గ్రామానికి చెందిన కామిరెడ్డి గోవింద్ రాయితో దాడి చేశాడని.. తీవ్రంగా గాయపడి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత గొలుగొండ ఎస్ఐ నారాయణరావుకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే ఎస్ఐ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రామరాజు గిరిబాబుకు చెప్పడంతో ఆయన వచ్చి ఎస్ఐకి కలసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కుసిరెడ్డి రాజుబాబుపై ఇంటి దారి స్థలం వివాదం జరిగితే పక్క ఇంటి యజమాని ఫిర్యాదు ఇవ్వడంతో రాజుబాబును ఎస్ఐ కొట్టినట్టు గిరిబాబు ఆరోపించారు. ఇదేం తీరు అని ఎస్ఐను నిలదీసి పక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. గిరిబాబుకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు లెక్కల సత్యనారాయణ, పోలిరెడ్డి రాజుబాబు, మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, చిటికెల వరహాలబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గండెం ఈశ్వర్రావు మద్దతు తెలిపారు. దీంతో ఎస్ఐ వచ్చి గిరిబాబుకు క్షమాపణ చెప్పారు రామరాజుపై దాడి చేసిన కామిరెడ్డి గోవింద్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో గిరిబాబు దీక్షను విరమించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గిరిబాబు ఎస్ఐని కోరారు. -
పెళ్లయిన మర్నాడే..
విశాఖపట్నం, నర్సీపట్నం: ప్రేమించి ఆపై పోలీసుల సమక్షంలో వివాహం చేసుకుని మొహం చాటేసిన భర్త కోసం భార్య పెదిరెడ్ల పరమేశ్వరి శుక్రవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పాతసంతబయలకు చెందిన పరమేశ్వరి, ఇదే ప్రాంతా నికి చెందిన షేక్ అబ్దుల్లా అలియాస్ వల్లీ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించటం లేని వల్లీ వెనకడుగు వేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో పట్టణ సీఐ ని పరమేశ్వరి ఆశ్రయించింది. వల్లీని స్టేషన్‌కు పిలిపించి పో లీసులు పెళ్లికి ఒప్పించారు. వారి సమక్షంలోనే ఇద్దరూ వివా హం చేసుకున్నారు. వల్లీ రాత్రి రాత్రే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరమేశ్వరీ మళ్లీ టౌన్ సీఐను ఆశ్రయించింది. పోలీ సుల నుండి సరైన సమాధానం రావటం లేదని బాధితురాలు జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసింది. ఆరు నెలల నుంచి కాళ్లు అరిగేలా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం స్వయంగా వల్లీ ఇంటికి వెళ్లి తన భర్తను రప్పిం చాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. -
భర్త వేధింపుల నుంచి కాపాడండి
అనంతపురం, సోమందేపల్లి: భర్త వేధింపుల నుంచి కాపాడాలని షబ్రీన్ అనే మహిళ మౌనదీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం సాయినగర్‌కు చెందిన షబ్రీన్‌కు పెనుకొండలోని కుమ్మరదొడ్డి ప్రాంతానికి చెందిన ఫరూక్‌తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి మానసిక వికలాంగుడైన కుమారుడుతోపాటు మూడేళ్ల వయసు కలిగిన కుమార్తె ఉన్నారు. ఏడాది కాలంగా ఫరూక్ సోమందేపల్లిలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి వెళ్లేవాడు కాదు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి బుద్ధిగా కాపురం చేసుకోవాలని చెప్పి పంపించారు. ఆ తర్వాత నుంచి భార్య షబ్రీన్‌పై ఫరూక్ అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేస్తూ వస్తున్నాడు. మంగళవారం ఈ విషయమై గొడవ జరిగింది. షబ్రీన్‌పై మామ బాబా చేయిచేసుకున్నాడు. దీంతో తనకు భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించి, న్యాయం చేయాలని షబ్రీన్ తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి సోమందేపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట మౌనదీక్ష చేపట్టింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
మిస్డ్ కాల్‌తో మిస్సెస్సై..
ప్రకాశం, గిద్దలూరు: మిస్డ్ కాల్‌తో మిసెస్‌ను చేసుకుని రెండు నెలల కాపురం చేసి ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలేసి పారిపోయి వచ్చిన ఓబులాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి ఉదంతమిది. భర్త ఇంకా వస్తాడని ఎదురు చూసిన భార్య ఎంతకీ రాకపోగా ఫోన్ పని చేయకపోవడంతో గురువారం నేరుగా ఓబులాపురం వచ్చిన యువతి మహేశ్వరరెడ్డి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలతి మండలంలోని ఓబులాపురానికి చెందిన వేమిరెడ్డి మహేశ్వరరెడ్డికి మిస్డ్ కాల్ ద్వారా ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని నమ్మబలికి మాలతి కుటుంబ సభ్యులను నమ్మించి గుడిలో మహేశ్వరరెడ్డి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే కాపురం పెడదామని ఉప్పల్‌లోని గణేష్‌నగర్ తీసుకెళ్లి అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలల కాపురం చేసిన తర్వాత భార్యను శ్రీకాకుళం తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం లేదు. ఫోన్ చేయడం లేదు. ఆమె ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇక తన బంధువులకు ముఖం ఎలా చూపించగలనని బాధితురాలు విలపిస్తోంది. తాను వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న మహేశ్వరరెడ్డి తన బంధువుల ద్వారా బెదిరిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది. చావైనా బతుకైనా తన భర్త మహేశ్వరరెడ్డితోనేనని, ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెబుతోంది. భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని మాలతి కోరుతోంది. మహేశ్వరరెడ్డి గతంలోనూ గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంటి నుంచి తీసుకెళ్తుండగా గమనించిన ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. -
ప్రియుని ఇంటి ముందు మౌన దీక్ష
ప్రకాశం, ముండ్లమూరు: మండలంలోని ఈదర పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్‌లో ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష చేపట్టింది. హైదరాబాద్ బోరుబండకు చెందిన తోట రేణుక గ్రామానికి చెందిన నారు నాగ శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు మంగళవారం దీక్ష చేపట్టింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శివనాంచారయ్య సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని రేణుకను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా రేణుక మాట్లాడుతూ తనతో రెండేళ్లుగా పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో నాగ శ్రీని వాసరెడ్డి మోసం చేశాడని తెలిపింది. 15 రోజులుగా కనిపించకుండా పోవడంతో వెతుక్కుంటూ అయోధ్యనగర్ వచ్చానని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో తనని మోసం చేసినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. దీంతో ఎస్ఐ శివనాంచారయ్య ఎస్ఆర్నగర్ ఎస్ఐతో ఫోన్లో మాట్లాడారు. రేణుకతో ఫోన్ మాట్లాడించగా తనకి న్యాయం చేస్తానని ఎస్ఆర్నగర్ ఎస్ఐ ఫోన్లో సర్ది చెప్పడంతో అక్కడి నుంచి దీక్ష విరమించింది. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనపోరాటం
-
గాంధీభవన్‌లో టీ నేతల మౌనవ్రతం
సాక్షి, హైదరాబాద్: శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బాధ్యతల నుంచి శ్రీధర్‌బాబును తప్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నేతలు బుధవారమిక్కడ గాంధీభవన్‌లో మౌనదీక్ష నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్తోపాటు నేతలు నిరంజన్, కమలాకరరావు, శ్యాంమోహన్, రాజేశ్వర్ గాంధీభవన్‌లో గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది. సీఎంను ఉపేక్షించడం బాధాకరం: జీవన్‌రెడ్డి రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో శాసనసభా వ్యవహారాల బాధ్యతల నుంచి మంత్రి శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పించడం తెలంగాణ ప్రజలందరినీ కించపరచడమేనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకున్న నాటి నుంచి ముఖ్యమంత్రి ఎన్నో రకాలుగా ధిక్కరించేలా వ్యవహరించినా, అధిష్టానం ఉపేక్షించడం బాధాకరమన్నారు. ‘ముఖ్యమంత్రి చిత్తూరు పోవాల్సిందే’ మంత్రి శ్రీధర్‌బాబును తప్పించడంపై రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, వీ హనుమంతరావు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది శాడిస్టు వ్యవహారమని, శ్రీధర్‌బాబుకు భయపడే ఆయనేం ముఖ్యమంత్రి అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఆయన హైదరాబాద్‌లో ఇల్లు అమ్ముకుని చిత్తూరు పోయే పరిస్థితి ఏర్పడుతుందని పాల్వాయి హెచ్చరించారు. ఓయూ విద్యార్థుల ఆగ్రహం రాష్ట్ర శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చుతూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉస్మానియా(ఓయూ) విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖ మార్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ, టీజీవీపీ ఆధ్వర్యంలో బుధవారం 50 మంది విద్యార్థులు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు వీరిలో 10 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోపక్క ఓయూ క్యాంపస్‌లో విద్యార్థి నేతలు సీఎం కిరణ్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.