భర్త వేధింపుల నుంచి కాపాడండి | muslim Woman Silence Protest On husband Harassments Anantapur | Sakshi
Sakshi News home page

భర్త వేధింపుల నుంచి కాపాడండి

Published Wed, Sep 5 2018 11:05 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

muslim Woman Silence Protest On husband Harassments Anantapur - Sakshi

స్టేషన్‌ముందు తల్లి, బిడ్డలతో కలిసి బైటాయించిన షబ్రీన్‌

అనంతపురం, సోమందేపల్లి: భర్త వేధింపుల నుంచి కాపాడాలని షబ్రీన్‌ అనే మహిళ మౌనదీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం సాయినగర్‌కు చెందిన షబ్రీన్‌కు పెనుకొండలోని కుమ్మరదొడ్డి ప్రాంతానికి చెందిన ఫరూక్‌తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి మానసిక వికలాంగుడైన కుమారుడుతోపాటు మూడేళ్ల వయసు కలిగిన కుమార్తె ఉన్నారు. ఏడాది కాలంగా ఫరూక్‌ సోమందేపల్లిలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి వెళ్లేవాడు కాదు.

భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి బుద్ధిగా కాపురం చేసుకోవాలని చెప్పి పంపించారు. ఆ తర్వాత నుంచి భార్య షబ్రీన్‌పై ఫరూక్‌ అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేస్తూ వస్తున్నాడు. మంగళవారం ఈ విషయమై గొడవ జరిగింది. షబ్రీన్‌పై మామ బాబా చేయిచేసుకున్నాడు. దీంతో తనకు భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించి, న్యాయం చేయాలని షబ్రీన్‌ తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి సోమందేపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట మౌనదీక్ష చేపట్టింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement