Silent initiation
-
రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష: మంత్రి శంకర్‌నారాయణ
సాక్షి, అనంతపురం: రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే దీక్ష అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ ఏనాడు కృషి చేయలేదన్నారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ హిందూపురానికి బాలకృష్ణ చుట్టపు చూపుగా వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హిందూపురం అభివృద్ధి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విశిష్టతను గుర్తించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. -
ప్రియుడి బెదిరింపు.. ఎన్కౌంటర్ చేస్తా..!
టేకుమట్ల: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడో ప్రేమికుడు. దీంతో యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. టేకుమట్లకు చెందిన కొలుగూరి కార్తీక్ ఆర్మీ జవాన్. రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన తమ బంధువైన ఓ యువతిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ యువతి పెళ్లి చేసుకోమని అడగగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఫోన్లో సంప్రదిస్తే ‘నేను ఎన్కౌంటర్ స్పెషలిస్టును, ఎన్కౌంటర్ చేస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.’అని బెదిరిస్తున్నాడని యువతి వాపోయింది. కార్తీక్‌తో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. చివరకు కుటుంబ సభ్యులతో కలసి శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కార్తీక్ ఇంటి ఎదుట మౌన దీక్ష చేపట్టింది. -
తమిళుల ఆగ్రహం చవిచూస్తారు!
తమిళసినిమా (చెన్నై): కేంద్ర ప్రభుత్వం తక్షణం కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుంటే తమిళనాడు ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని సూపర్‌స్టార్ రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాడు మొత్తం ముక్త కంఠంతో కావేరీ బోర్డు ఏర్పాటును కోరుతోందన్నారు. కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్షాల పోరాటానికి మద్దతుగా ఆదివారం కోలీవుడ్ పరిశ్రమ నిర్వహించిన మౌన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబు కాదన్నారు. ‘రాష్ట్రం మొత్తం కావేరీ అంశంపై ఆందోళన చేస్తుంటే ఐపీఎల్‌ను నిర్వహించడం అవమానకరమే అవుతుంది. ఐపీఎల్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణను నిర్వాహకులు రద్దు చేసుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించి మ్యాచ్‌లు ఆడాలి’ అని రజనీకాంత్ సూచించారు. కావేరీ అంశంపై తమిళనాడు, కర్ణాటకల్లో ఆందోళన కొనసాగుతున్న వేళ.. కన్నడ సంతతికి చెందిన ఎంకే సూరప్పను అన్నా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా గవర్నర్ నియమించడం సరికాదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నై నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద జరిగిన ఈ మౌనదీక్షలో రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్, విజయ్, సూర్య, విశాల్, శింబు, ధనుష్‌లు సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ కార్మికులు పాల్గొన్నారు. -
హైకోర్టులో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం సీమాంధ్ర న్యాయవాదులు మౌనదీక్ష చేపట్టగా.. దానిని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించటంతో.. హైకోర్టులో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గత వారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. ఈసారి పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టటంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తప్పింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా హైకోర్టులో భోజన విరామ సమయంలో బార్ కౌన్సిల్ ఎదుట మౌనదీక్ష నిర్వహించేందుకు దాదాపు 300 మంది సీమాంధ్ర న్యాయవాదులు బార్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిలో కొందరు జై సమైక్యాంధ్ర నినాదాలు చేయగా.. ఆ దగ్గర్లోనే ఉన్న తెలంగాణ న్యాయవాదులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై రోప్ పార్టీల సాయంతో ఇరుపక్షాల న్యాయవాదులు పరస్పరం ఎదురుకాకుండా అడ్డుకున్నారు. మౌనదీక్షలో పాల్గొనటానికి కిందకు వస్తున్న సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సి.వి.మోహన్‌రెడ్డిని, మరికొందరు న్యాయవాదులను అరెస్ట్ చేసి ఫలక్‌నుమా స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలంగాణ న్యాయవాదుల్లో కొందరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకు న్యాయవాదులను పోలీసులు హైకోర్టుకు తీసుకువచ్చి విడిచిపెట్టారు. ఇదిలావుంటే.. సెప్టెంబర్ 6న సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు జరిపిన దాడిని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖండించాయి. -
అసెంబ్లీ ఆవరణలో శంకర్రావు మౌనదీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో గంటసేపు మౌన దీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సీఎం, డీజీపీలు నన్ను వేధిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతను, హైకమాండ్‌కు విధేయుడిని అయిన నన్ను రెండుసార్లు అరెస్టు చేశారు. సోమవారం నా తమ్ముడిని అకారణంగా అరెస్టు చేశారు. తాజాగా నా సోదరినీ అరెస్టు చేశారు. మేం ఏ తప్పు చేశామని ఇలా వేధిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే ఎర్రచందనం కేసు విషయంలోనూ ఆ దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం తీరుతో దళిత, గిరిజన, బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యాయన్నారు.