వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్‌రెడ్డి మృతి
కొలిమిగుండ్ల: వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కొలిమిగుండ్ల సింగిల్ విండో అధ్యక్షుడు అంబటి శివప్రసాద్‌రెడ్డి(51) అనారోగ్యంతో మృతి చెందారు. చింతలాయపల్లె గ్రామానికి చెందిన ఇతను నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితులు. శుక్రవారం ఉదయం లోబీపీతో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబీకులు తాడిపత్రి వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. శనివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
పలువురు నివాళి:
ప్రసాద్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా రాత్రి 8 గంటలకు చింతలాయిపల్లెకు చేరుకొని నివాళులర్పించారు. నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉదయ్‌భాస్కరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మొలక రాజారెడ్డి, మాజీ అధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, నాయకులు కాటసాని చంద్రశేఖరరెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ నేత పేరం నాగిరెడ్డి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ వెంకటేశ్వరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు నరసింహుడు, హనుమంతుగుండం సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సత్తిగారి రామిరెడ్డి, రామసుబ్బయ్యతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు నివాళులు అర్పించారు.