జగన్ కోసం సాగుతున్న దీక్షలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చే స్తున్న దీక్షకు మద్దతుగా జిల్లాలో ఆమరణ దీక్ష లు, పూజలు కొనసాగుతున్నాయి. ముగ్గురు పార్టీ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది.
పాకాలలో పార్టీ మండల కన్వీనర్ పద్మజారెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు పూతలపట్టు లోక చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీక్ష విరమించాలని వైద్యులు సూచించినా వారు స సేమిరా అన్నారు. గంగాధరనెల్లూరులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన జిల్లా కన్వీనర్ నారాయణస్వామి దీక్షను శుక్రవారం పోలీసులు భ గ్నం చేశారు. పుంగనూరులో పార్టీ నాయకుడు జయకృష్ణ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరుకోగా, రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేశారు.
రిలే దీక్షల్లో 64మంది...
వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షలకు మద్దతుగా జి ల్లాలో శుక్రవారం 64 మంది రిలే నిరాహారదీ క్షలో పాల్గొన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూ మన కరుణాకరరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో శుక్రవారం పార్టీకి చెందిన బీసీ మహిళలు 30 మంది పాల్గొన్నారు. రేణిగుంట గాంధీ సర్కిల్ వద్ద జరుగుతున్న రిలే దీ క్షలో ఐదో రోజున నలుగురు, కేఎల్ఎం ఆస్పత్రి వద్ద సీరాజ్ నాయకత్వంలో జరుగుతున్న రిలే దీక్షలో ఐదుగురు పాల్గొన్నారు. చిత్తూరులో ని యోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో 15 మంది మహిళలు, వడమాలపేటలో పార్టీ నాయకులు చేస్తున్న దీక్షలో పది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
పలుచోట్ల పూజలు..
వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండా లని ప్రార్థిస్తూ సత్యవేడు నియోజకవర్గం సు రుటుపల్లెలోని పల్లికొండేశ్వర ఆలయంలో ని యోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో 1001 కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేయించారు. చిత్తూరులో పార్టీ మ హి ళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీ దేవి ఆధ్వర్యంలో వినాయక ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. కుప్పంలో తిరుపతి గం గమ్మ ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి పూజలు చేయించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి నాయకత్వం లో ర్యాలీ, ధర్నా చేపట్టారు. పూతలపట్టు మండలం తలపులపల్ల్లె గ్రామంలో పా ర్టీ జిల్లా అధికార ప్రతినిధి బాబురెడ్డి వంటావా ర్పు కార్యక్రమం నిర్వహించారు.
ముస్లింల సంఘీభావం
వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండా లని కోరుతూ తిరుపతిలో ముస్లిం రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్ద మసీదు నుంచి తుడా సర్కిల్లోని వైఎస్ విగ్రహం వరకు సభ్యులు ర్యాలీ నిర్వహించారు.