siromundanam case
-
తలబిరుసు.. లెక్కలేనితనం..
పెందుర్తి: యువకుడి శిరోముండనం ఘటనపై దళితులు భగ్గుమన్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. తక్షణం స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిందితుల్ని కొద్ది గంటల్లో అరెస్ట్ చేసింది. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. లెక్కలేనంత డబ్బుందని.. సమాజం అంటే ఆయనకు లెక్కలేదని గతంలో ఆయన వ్యవహార శైలిని ఈ ఘటనతో గుర్తు చేసుకున్నారు స్థానికులు. సెలబ్రిటీ హోదాను ఇచ్చిన ప్రజల్ని మరిచి విచక్షణా రహితంగా ప్రవర్తించడం ఆయనకు కొత్తేమీ కాదని చెబుతున్నారు గోపాల్కృష్ణనగర్ వాసులు. (చదవండి: కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు) ‘తమ ప్రాంతానికి నూతన్‌నాయుడు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాం.. అతడిది అంతా హైఫ్రొఫైల్. ఎవరినీ లెక్క చేయడు. ఇతరులంటే చాలా చులకన. కనీసం మానవత్వం ఉండదు.’ తన ఇంటి గార్డెన్ కోసం ఇంటి ముందు ఉన్న 40 అడుగుల రోడ్డులో చాలా భాగం ఆక్రమించేశాడు. ఈ విషయంపై అడుగుదాం అని ఇంటికి వెళితే కనీసం లోపలకు కూడా వెళ్లనివ్వలేదు. సమాజంపై పూర్తిగా నిర్లక్ష్యం భావంతో ఉంటాడు’ ఇవీ సుజాతనగర్‌లోని గోపాలకృష్ణనగర్ వాసులు ఆరోపణలు. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో ఏకంగా దళిత యువకుడు శ్రీకాంత్‌పై తన మనుషులు దాడి చేసి శిరోముండనం చేయించిన ఘటనతో నూతన్‌నాయుడు వ్యవహారశైలి స్థానికంగా చర్చకు వచ్చింది. సినీ నిర్మాతగా.. దర్శకుడిగా చెలామణి అవుతున్న నూతన్ నాయుడు నగరంలోని మాజీ మేయర్, టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. 2014 వరకు సమాజానికి పెద్దగా పరిచయం లేని నూతన్‌నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా వెలుగులోకి వచ్చాడు. నాటి ఎన్నికల సమయంలో నూతన్‌నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పుడు నూతన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కొన్ని తప్పుడు పత్రాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అతడి ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అతడ్ని ‘లైట్’ తీసుకున్నారు. తరువాత కొన్నాళ్ల అజ్ఞాతంలో ఉన్న నూతన్ బిగ్‌బాస్–2తో మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చాడు. ఆ తరువాత చిన్నాచితకా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ప్రముఖ సినీదర్శక నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ తీసిన పవర్‌స్టార్ సినిమాకు కౌంటర్‌గా పరాన్నజీవి సినిమాతో దర్శక అవతారం ఎత్తాడు. (చదవండి: శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్) రోడ్డును ఆక్రమించి తీర్చిదిద్దిన గార్డెన్.. నాడు అధికారంతో.. నేడు డబ్బుమదంతో మూడేళ్ల క్రితం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను టీడీపీ నాయకులు ఘోరాతిఘోరంగా అవమానించారు. ఆ ఘటనతో టీడీపీ పతనం ప్రారంభమైంది. మళ్లీ ఇప్పుడు నూతన్‌నాయుడు ఇంట్లో జరిగిన తాజా ఘటన మరింత సంచలనం రేపింది. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో సెల్‌ఫోన్ దొంగతనం అంటగట్టిన నూతన్నాయడు భార్య మధుప్రియ, బ్యుటీషియన్ ఇందిర సహా ఏడుగురు వ్యక్తులు శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. డబ్బుందన్న అహంకారంతో సభ్యసమాజం తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. నిజంగా శ్రీకాంత్ సెల్‌ఫోన్ దొంగతనం చేసుంటే అతడు పనిమానేసి దాదాపు నెల రోజులు కావస్తుంది. మరి ఇన్నాళ్ళు నూతన్ కుటుంబ సభ్యులు, పనివారు అతడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే హోదా ఉందన్న తలబిరుసు.. బాధితుడికి ఎవరూ లేరన్న ఆలోచనతో ఈ దాడికి పాల్పడినట్లు తేటతెల్లం అవుతుంది. ఇందులో నూతన్‌నాయుడు పాత్ర నేరుగా లేకపోయినా.. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. -
ఎవరినీ ఉపేక్షించేది లేదు
-
నిజానిజాలు వివరిస్తూ.. జాప్యాన్ని నిరసిస్తూ...
శిరోముండనంపై సాగుతున్న ప్రచార యాత్ర తక్షణం నిందితులను శిక్షించాలని డిమాండ్ అమలాపురం టౌన్ : శిరోముండనం కేసులో బాధితులకు జరగుతున్న అన్యాయం.. విచారణలో జరగుతున్న జాప్యం.. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం.. బాధితులు 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటం వంటి పరిణామాలు ప్రజలకు వివరించేందుకు... ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు కోనసీమలో ప్రచార యాత్ర శనివారం మొదలైంది. శని, ఆదివారాల్లో సాగే ఈ యాత్రకు అయినివిల్లి గ్రామం నుంచి మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ, వెంకటాయపాలెం దళిత ఐక్య పోరాట వేదికలు శిరోముండనం బాధితులతో కలిసి సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయినవిల్లి నుంచి బయలుదేరిన యాత్ర ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు వంద కిలోమీటర్ల మేర తొలిరోజు సాగింది. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ... గ్రామం నుంచి మరో గ్రామం వెళుతున్నప్పుడు ఆటోలు, మోటారు సైకిళ్లపై యాత్రగా సాగారు. 1996 డిసెంబర్ 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి, జిల్లా అధ్యక్షుడు నామాడి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, కార్యదర్శులు ముత్యాల శ్రీనివాస్, బీబీ జోగేష్, శిరోముండనం బాధితుడు చల్లపూడి పట్టాభిరామయ్య, ఘటన ప్రత్యక్ష సాక్షి రేవు అప్పారావు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ భీమశంకరం యాత్రలో పాల్గొని శిరోముండనం కేసులో ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, నిందితుల రాజకీయ పైరవీలు, ప్రలోభాలు, బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. విచారణలో జరగుతున్న జాప్యాన్ని నిరసించారు. ప్ల కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ మాట్లాడుతూ శిరోముండనం కేసులో నిందితులను రక్షించే దురుద్దేశంతో ప్రభుత్వం సహకరించడం అప్రజాస్వావిుకమన్నారు. ఈ నిజానిజాలను ప్రజలకు వివరించి ప్రజా మద్దతును కూడగట్టే లక్ష్యంతో బాధితులతో కలిసి ఈ ప్రచార యాత్రను చేపట్టామని చెప్పారు. వేదిక జిల్లా అధ్యక్షుడు నామాడి శ్రీధర్ మాట్లాడుతూ ఈ నాటికీ బాధితులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిందితుల బెదిరింపులను ఖాతరు చేయకుండా న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. 20 ఏళ్లుగా బాధితులకు ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధిదారులుగా ఎంపిక చేయకపోవడం నిందితులు ఈ నాటికీ కొనసాగిస్తున్న వివక్షకు దర్పణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను తక్షణమే పూర్తి చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని దళిత ఐక్యవేదిక కన్వీనర్ భీమశంకరం డిమాండు చేశారు. రెండో రోజు యాత్ర అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని గ్రామాల్లో మరో 150 కిలో మీటర్ల మేర సాగనుంది. ఆయా గ్రామాల్లో దళితులు యాత్రకు స్వాగతం పలికి మద్దుతు తెలుపుతున్నారు. నిందితులు రాజకీయ పదవులు, అండదండలతో ఆర్థికంగా బలపడితే...బాధితులు వివక్షతో దుర్భర జీవనాన్ని ఎదుర్కొంటున్నారని యాత్ర నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పెనుమాల సుధీర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కొండా దుర్గారావు, దళిత నాయకులు యాత్రలో పాల్గొన్నారు. -
శిరోముండనం కేసును త్వరగా తేల్చాలి
దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, నిరసన ప్రదర్శన కాకినాడ సిటీ : దళితుల శిరోముండనం కేసును త్వరగా తేల్చాలని దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసుకు గురువారంతో 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కాకినాడలో నిరసన ప్రదర్శన చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్ నుంచి జెడ్పీసెంటర్ మీదుగా ఇంద్రపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యే త్రిమూర్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్తులకు కొమ్ముకాస్తున్న సీఎం చంద్రబాబు వైఖరి నశించాలంటూ నినదించారు. నాయకులు మాట్లాడుతూ 1996లో వెంకటాయపాలెం దళితులను కొట్టి శిరోముండనం ఘటన నేటికీ మచ్చగా మిగిలే ఉందన్నారు. జిల్లా యంత్రాంగం సీఎం ఆదేశాలతో కేసు విచారణ జాప్యం అయ్యేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం నగర అధ్యక్ష, కార్యదర్శులు గుడాల కృష్ణ, టి.నూకరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్, జిల్లా అధ్యక్షులు తాడి బాబ్జీ, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, బహుజన యునైటెడ్ ఫ్రంట్ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, డీసీఎఫ్, సీపీఐ(ఎంఎల్) లిబరేష¯ŒS, పీడీఎస్‌యూ, వెల్ఫేర్ పార్టీ, వ్యవసాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు స్థానిక బాలాజీ చెరువుసెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కేసులో పీపీని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసించారు. న్యూడెమోక్రసి నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దుర్గాప్రసాద్, ప్రదీప్, వి.రామన్న పాల్గొన్నారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్) : శిరోముండనం ఘటన జరిగి గురువారం నాటికి 20 ఏళ్లు పూర్తయినా బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో బాధితులు చల్లపూడి పట్టాభిరామయ్య, కోటి చినరాజులు గురువారం వెంకటాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 64 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే ఆమరణ దీక్షకు కూర్చున్నామన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, హైకోర్టు న్యాయవాది కొప్పిశెట్టి వీరభద్రరావు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనుపెల్లి సత్తిబాబు, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి పాటి శివప్రసాద్, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం తదితరులు వారికి మద్దతు పలికారు. -
పీపీ నియామకంలో అలసత్వం
శిరోముండనం కేసులో అడుగడుగునా నిందితులకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 37వ రోజుకు చేరుకున్న దళితులు నిరాహార దీక్షలు ఒక రోజు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బోస్ రామచంద్రపురం రూరల్ : శిరోముండనం కేసులో ప్రభుత్వ తీరును నిరసిస్తు సంఘటన జరిగిన వెంకటాయపాలెంలో దళిత సంఘాల నేతృత్వంలో చేస్తున్న దీక్షలు శుక్రవారం నాటికి 37రోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ దళితులకు మద్దతుగా వెంకటాయపాలెంలో గురువారం జరిగిన ఒక రోజు దీక్షలో పాల్గొన్నారు. శిరోమండనం కేసులో వెంటనే పీపీని నియమించి బాధితులకు న్యాయం చేయాలని వారు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విచారణ నుæ అడ్డుకోవడమే లక్ష్యంగా.. మండలంలోని వెంకటాయపాలెంలోని సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో చంద్రబాబు ప్రభుత్వం అప్పుడూ, ఇప్పుడూ కొమ్ముకాçస్తూనే ఉంది. 20 ఏళ్లుగా కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నది. దీనిని నిరసిస్తూ దళిత సంఘాలు 37 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. 1996 డిసెంబర్ 29న వెంకటాయపాలెంలో ముగ్గురు దళిత యువకులకు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శిరోముండనం చేయించారన్న ఆరోపణతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టులో ఈకేసు నడుస్తుండగా 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పుట్టు్టస్వామి కమిష¯ŒSను ఏర్పాటు చేసి, ఆ నివేదిక మేరకు మేరకు శిరోముండనం కేసును ఎత్తివేస్తూ జీవోను జారీ చేసింది. బాధితులు మళ్లీ తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించగా అది విచారణకు రాకుండా ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారు. 20 ఏళ్లపాటు స్టేలను తీసుకువస్తూ సాగదీశారు. 1997 నుంచి ఇప్పటివరకు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన ముగ్గురు మారిపోయారు. అయితే మొదటి ఇద్దరిలో ఒకరు స్వచ్చందంగా కేసు నుంచి తప్పుకోగా మరొకరు రాజీనామా చేశారు. తాజాగా విశాఖపట్నం స్పెషల్ కోర్టులో మరో రెండు రోజుల్లో కేసు విచారణకు వస్తుందనగా సెప్టెంబర్ 23న పీపీ జవహర్ ఆలీని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనంతటికీ కారణం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే. ఇదే విషయాన్ని దళిత సంఘాలూ ఆరోపిస్తున్నాయి. -
పీపీ తొలగింపుపై వెల్లువెత్తిన నిరసన
కాకినాడ సిటీ : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో తెలుగుదేశం ప్రభుత్వం పీపీని తొలగించడంపై నిరసన వెల్లువెత్తింది. (రెండు దశాబ్దాల కిందటి ఈ సంఘటనలో నాటి, ప్రస్తుత ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిందితుడు). సోమవారం వామపక్షాలు, దళిత సంఘాలు నిర్వహించిన చలో కాకినాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు. ముందుగా బాలాజీచెరువు సెంటర్ నుంచి శాంతిభవన్, జీజీహెచ్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి రెండు గంటలు ఆందోళన నిర్వహించి ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఉత్పన్నమైంది. పోలీసులకు వామపక్ష, దళిత సంఘాల నాయకులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల లాఠీచార్జితో పలువురు ఆందోళనకారులు గాయాలపాలయ్యారు. వామపక్ష, దళిత సంఘాల నాయకులుతో పాటు సుమారు 60 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసి నగరంలోని వివిధ స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. శిరోముండన బాధితులతో కలిసి నాయకులు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే త్రిమూర్తులునుకఠినంగా శిక్షించాలి.. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ శిరోముండనం ఘటన జరిగి సుమారు 20 ఏళ్లు కావస్తున్నా నేటికీ తీర్పు రాక పోవడం దారుణమన్నారు. కేసులో పీపీని తొలగిస్తూ జీవో విడుదల చేయడాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోగా కేసును ఎత్తివేయడానికి చూస్తోందని, ప్రస్తుతం విచారణను అడ్డుకునే విధంగా పీపీని తొలగిస్తూ జీఓ తెచ్చిందని ఆరోపించారు. తొలగించిన పీపీని తిరిగి కొనసాగించాలని, కేసు విచారణను త్వరితగతిన పూర్తిచేయించాలని, ముద్దాయి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి పార్టీలతో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి శిరోముండన కేసు విచారణ
బోట్‌క్లబ్ (కాకినాడ) : వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారం¿¶ మవుతుందని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు షెడ్యూల్ విడుదల చేసిందని రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం సంఘటన 1996 డిసెంబర్లో జరిగిందన్నారు. అప్పట్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.