SIs transferred
-
ఎస్సైల బదిలీలు; సీపీ సెలవులో ఉండగా ఉత్తర్వులు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సబ్ ఇన్స్సెక్టర్ల బదిలీల అంశం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. సీపీ కార్తికేయ సెలవుల్లో ఉన్న సమయంలో బదిలీ ఉత్తర్వులు వెలువడటం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయా స్థానాల్లోరెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి, రెండేళ్లకు దగ్గరలో ఉన్నవారికి స్థానచలనం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇందులో పనితీరుపై విమర్శలు ఎదుర్కొన్న ఒకరిద్దరు ఎస్సైలపై కూడా బదిలీ వేటుపడడం చర్చనీయాంశంగా మారింది. సీపీ మంగళవారం నుంచి వ్యక్తిగత సెలవులో వెళ్లారు. ఆయన సెలవుల్లో ఉండగా, ఉత్తర్వులు వెలువడడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎస్సైల బదిలీల విషయంలో సీపీ పంపే ప్రతిపాదిత జాబితాను పరిశీలించి డీఐజీ నిర్ణయం తీసుకుంటారు. బదిలీల ప్రక్రియకు సంబంధించి సీపీ నెలరోజులుగా కసరత్తు చేసినట్లు సమాచారం. మార్పులు, చేర్పులుచేశాక పంపిన ప్రతిపాదనల మేరకు ఉత్తర్వులు జారీఅయినట్లు తెలుస్తోంది. కాగా పోలీసుశాఖలో ఫిబ్రవరి,మార్చి మాసాల్లో పెద్దఎత్తున బదిలీలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇంతలోపు ముందస్తుగా బదిలీలు జరగడం గమనార్హం. అయితే మూకుమ్మడిగా జరిగే బదిలీల్లో తమకు అనువైన స్థానం లభిస్తుందో లేదోననే ముందు జాగ్రత్తగా కొందరు తమకు అనుకూలమైన స్థానాలకు బదిలీ చేయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.(చదవండి: ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నం) ప్రజాప్రతినిధులను సంప్రదించాకే..! నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే పోలీసు అధికారుల బదిలీలు జరగడం కొంతకాలంగా పరిపాటిగా మారింది. గతంలో జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎస్సైలు రిలీవ్ కాలేదు. బదిలీ అయిన స్థానంలో జాయిన్ కాలేదు. ఈ వ్యవహారం అప్పట్లో పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు, విమర్శలకు దారి తీసింది. రాజకీయ పలుకుబడితో ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పాటించకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దీంతో ఈసారి బదిలీల్లో పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను సంప్రదించాకే బదిలీపై నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో మాదిరి ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. -
13 మంది ఎస్ఐలు బదిలీ
అనంతపురం సెంట్రల్: జిల్లాలో 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
31 మంది ఎస్సైల బదిలీ
సంగారెడ్డి టౌన్: జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 31 ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 11 మంది ప్రొబేషనరీ ఎస్సైలు, నలుగురు సైబరాబాద్ నుంచి వచ్చినవారు, తొమ్మిది మందికి సాధారణ బదిలీ, ఏడుగురిని వీఆర్‌కు బదిలీ చేశారు. పేరు పనిచేస్తున్న స్థలం బదిలీ ఆర్.వెంకటేశ్వర్లు సైబరాబాద్ జోగిపేట్ బి.శ్రీనివాస్ సైబరాబాద్ భూంపల్లి జి.జానయ్య సైబరాబాద్ రేగోడ్ టి.శ్రీధర్ సైబరాబాద్ గౌరారం ఆర్.సాయిరాం ప్రొబేషనరీ బొల్లారం బి.రాజేశ్ ప్రొబేషనరీ తూప్రాన్ ఎస్సై 2 కె.సందీప్ ప్రొబేషనరీ పటాన్చెరు ఎస్.శ్రీకాంత్ ప్రొబేషనరీ మెదక్ టౌన్ ఎస్సై 2 బి.సుభాష్ గౌడ్ ప్రొబేషనరీ పటాన్చెరు కె.రాజు ప్రొబేషనరీ సదాశివపేట ఎస్సై 2 ఎల్.సందీప్ ప్రొబేషనరీ నారాయణఖేడ్ ఎస్సై 2 డి.ఆంజనేయులు ప్రొబేషనరీ రామాయంపేట ఎస్సై 2 జి.లింబాద్రి ప్రొబేషనరీ జోగిపేట్ ఎస్సై 2 బోపుల రాము ప్రొబేషనరీ సంగారెడ్డి టౌన్ ఎస్సై 2 ఎం.మహేశ్వర్ రెడ్డి ప్రొబేషనరీ గజ్వేల్ ఎస్సై 2 జి.ప్రశాంత్ బొల్లారం జిన్నారం ఆర్.వెంకట్ రాజు వీఆర్ ఆర్సీపురం ట్రాఫిక్ పీఎస్ బి.మురళీధర్ డీఎస్బీ డీటీసీ మెదక్ జి.రాజులు వీఆర్ డీఎస్బీ సంగారెడ్డి బి.దశరత్ వీఆర్ డీఎస్బీ సంగారెడ్డి జి.వినాయక్‌రెడ్డి వీఆర్ డీఎస్బీ సంగారెడ్డి ఎం.రవీందర్‌రెడ్డి వీఆర్ డీఎస్బీ సంగారెడ్డి ఇ.రామరావు వీఆర్ డీఎస్బీ సంగారెడ్డి పి.ప్రభాకర్‌రెడ్డి వీఆర్ డీఎస్బీ సంగారెడ్డి పబ్బా ప్రసాద్ భూంపల్లి వీఆర్ కె.మారుతి ప్రసాద్ తూప్రాన్ వీఆర్ డి.ఎల్లాగౌడ్ మెదక్ టౌన్ వీఆర్ పి.నాగేశ్వరరావు నారాయణఖేడ్ వీఆర్ కె.గణేశ్ సంగారెడ్డి టౌన్ వీఆర్ ఎస్కె మెహబూబ్ గజ్వేల్ వీఆర్ జి.లాలు నాయక్ జిన్నారం వీఆర్