sivamogga
-
ఊ అంటే ఉద్రిక్తత
మత సమైక్యత, సుహృద్భావానికి తూట్లు పడేలా కొందరి చర్యలు సమాజంలో కల్లోలానికి కారణమవుతున్నాయి. వట్టి వదంతులతోనే అల్లర్లకు దిగడం, ఆస్తి నష్టానికి పాల్పడడం, ఆపై రావణకాష్టంలా అది కొనసాగడం కొన్ని జిల్లాలకు సమస్యగా మారింది. మల్నాడు, కోస్తా, పలు ఉత్తర కర్ణాటక జిల్లాల్లో కలహాల బెడద ఎక్కువగా ఉంటోంది. బనశంకరి: రౌడీయిజంలో ఉడుపి, కోలారు, అగ్రస్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా రౌడీయిజం ఆధారిత కేసులు నమోదు కాబడ్డాయి. ఉడుపి జిల్లాలో గత ఐదేళ్లలో 431 కేసులు నమోదు కాగా, కోలారు జిల్లాలో 165, ఆ తరువాత దక్షిణ కన్నడ జిల్లాలో 152 కేసులు, బెంగళూరు నగర 60, కలబురిగి 97, శివమొగ్గ 156 నేరాలు జరిగాయి. అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో మత ఘర్షణలు కేసులు 242 నమోదయ్యాయి. వీటిలో శివమొగ్గ జిల్లాలో 57 కేసులు, దక్షిణ కన్నడ జిల్లాలో 46 నేరాలు జరిగాయి. బాగల్కోటెలో 26, దావణగెరెలో 18, హావేరి 18 ఘటనలు సంభవించాయి. గత మూడేళ్లలో నాలుగు మత ఘర్షణలతో కూడిన హత్యలు జరిగాయి. మంగళూరులో 1, దక్షిణ కన్నడ జిల్లాలో 1, గదగ (నరగుంద)లో 1, శివమొగ్గలో 1 హత్య జరిగాయి. మత ఘర్షణల ఆస్తినష్టం కేసులు శివమొగ్గలో 31 నమోదయ్యాయి. ఇదే అత్యధికం. సోషల్ మీడియా ఎఫెక్టు .. ఇందులో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంది. ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడే జరిగాయని కొందరు మసిపూసి పోస్ట్ చేయడం, అవి వైరల్‌గా మారి కల్లోలం చెలరేగడం పరిపాటిగా మారింది. అవి ఫేక్ వీడియోలు అని చెప్పినప్పటికీ ఆవేశంలో యువత నమ్మడం లేదు. మరో వర్గానికి చెందినవారిని దారి కాచి దాడి చేయడం ఆస్తులను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముంది. గొడవల్లో 380 మంది పోలీసులకు గాయాలు గొడవలు, మత ఘర్షణలను నియంత్రణ చేయడం పోలీసులకు సవాల్‌తో కూడుకున్నది. ఈ ఘర్షణలను అడ్డుకునే క్రమంలో 380 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో సీఐ, ఆపై అధికారులు 107 మంది, ఎస్ఐలు 49 మంది, హెడ్‌కానిస్టేబుల్స్ 96, కానిస్టేబుళ్లు 128 మంది ఉన్నారు. ఘర్షణల కేసుల్లో విచారణ జరిపి 3,489 మందిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వీరిలో ఉత్తర కన్నడ జిల్లాలో 802, దావణగెరెలో 465, మంగళూరులో 501, బెంగళూరునగర 493 మందిపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుచెబుతున్నప్పటికీ మత ఘర్షణలకు బ్రేక్ పడటం లేదు. (చదవండి: పేసీఎం పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెసకు వార్నింగ్ ఇచ్చిన నటుడు) -
స్వాతంత్య్ర వేడుకుల నడుమ ఉద్రిక్తతలు
శివమొగ్గ: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శివమొగ్గ నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమరయోధుడు సావర్కర్ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. సోమవారం ఇక్కడి హమీద్ అహ్మద్ సర్కిల్ వద్ద వీర సావర్కర్ ఫ్లెక్సీతో సావర్కర్ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించగా కొందరు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఇదే సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని సావర్కర్ ఫ్లెక్సీని తొలగించాలని యత్నించారు. దాని స్థానంలో టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి యత్నిస్తుండగా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో హిందూ పోరాట సంఘాలు అక్కడి చేరుకోవడంతో గొడవ మరింత పెరిగింది. సర్కిల్‌కు సమీపంలో ప్రేమ్‌సింగ్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు చాకుతో దాడి చేశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. (చదవండి: జెండా పండుగలో విషాదం) -
హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మరో హిందూ కార్యకర్తను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు... శివమొగ్గ నగరానికి చెందిన హిందూ కార్యకర్త భరత్‌ను హత్య చేయడానికి సల్మాన్, అబ్బాస్, ఉస్మాన్ కుట్రపన్నారు. విషయం తన సోదరుడి ద్వారా తెలుసుకున్న భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వక్కచెట్ల నరికివేత: శివమొగ్గ జిల్లాలోని వీరాపుర గ్రామంలో రైతు మోహన్ కుమార్‌కు చెందిన 40 వక్కచెట్లను దుండగులు నరికివేశారు. సోమవారం రాత్రి దుండగులు చెట్లను నరికి పారిపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: కేటీపీసీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృతి) -
ఆశ్రమంలో హంతకుడు
► బంధువులపై ద్వేషంతో భక్తురాలి కుమారుడి ప్రాణాలు తీసిన వైనం ► మూలెగెద్ద సదానంద ► శివయోగాశ్రమ మఠంలో ఘటన శివమొగ్గ : ఓ వ్యక్తి తన సమీప బంధువులపై ద్వేషాన్ని పెంచుకొని ఉన్మాదిగా మారి బాలుడి ప్రాణాలు బలిగొన్నాడు. మఠానికి వచ్చిన భక్తురాలి పక్కన నిద్రిస్తున్న ఆమె మూడేళ్ల కుమారుడిని ఎత్తుకెళ్లి ఊపిరి ఆడకుండా చేసి హత మార్చాడు. ఈ ఘటన హోసనగర తాలూకా, మారుతీపుర గ్రామ పంచాయతీ పరిధిలోని మూలెగెద్ద సదానంద శివయోగాశ్రమంలో చోటు చేసుకుంది. వివరాలు.. పూణెలోని గంధర్వనగరలో నివాసం ఉంటూ అక్కడి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కుమారస్వామి, చెత్ర దంపతుల బంధువులకు, హోసనగర తాలూకా, మారుతీపుర గ్రామ పంచాయతీ పరిధిలోని మూలెగెద్ద సదానంద శివయోగాశ్రమ మఠంలో పరిచారికుడిగా పనిచేస్తున్న రుద్రేష్‌కు మధ్య విభేదాలున్నాయి. సదానంద శివమోగాశ్రమం మఠంలో జరుగనున్న చిన్న స్వామిజీ పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొనేందుకు వారం రోజుల క్రితం చైత్ర తన మూడేళ్ల కుమారుడు సుహాయ్‌తో కలిసి వచ్చింది. చైత్ర బంధువులపై కక్ష పెంచుకున్న రుద్రేష్ ఇదే అదునుగా హత్యకు పథకం పన్నాడు. సోమవారం రాత్రి నిద్రమాత్రలు కలిపిన సాంబర్ అన్నాన్ని రుద్రేష్ వడ్డించాడు. అది తిన్న చైత్ర, ఆమె కుమారుడు, మరికొందరు భక్తులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తల్లి పక్కన ఉన్న బాలుడిని రుద్రేష్ ఎత్తుకెళ్లి మఠం వెనుకకు చేరుకొని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులోకి విసిరేశాడు. మంగళవారం ఉదయం చిన్నారి కనిపించకపోవడం, చైత్రతోపాటు నలుగురు భక్తులు అస్వస్థతకు గురవ్వడంతో ఆశ్రమంలో కలకలం చోటు చేసుకుంది. సీఐ మంజునాథ్‌గౌడ ఆశ్రమానికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీశారు.అస్వస్థులకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అనుమానంతో రుద్రేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చిన్నారి సుహాయ్‌ను ఊపిరాడకుండా చేసి హత్య చేసి శవాన్ని చెరువులో వేసినట్లు అంగీకరించాడు. దీంతో చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా నిద్రమాత్రల ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చైత్ర ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. కుమారుడు చనిపోయిన విషయం తెలియక అమయాకంగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. -
వీడని భయం
శివమొగ్గలో భారీగా బలగాల మొహరింపు బంధువుల ఊళ్లకు పయనమైన నగర ప్రజలు పోలీసుల అదుపులో వంద మంది మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల పరిహారం శివమొగ్గ వాసులను భయం వెన్నాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఆదివారం తమ బంధువుల ఊళ్లకు పలువురు నగర వాసులు పయనమై వెళ్లారు. కేఎస్ ఆర్టీసీ బస్సుల సంచారం పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేట్ బస్సులపై ప్రయాణికులు ఆధారపడ్డారు. అల్లర్లకు సంబంధించి వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నగరం మొత్తం భారీగా బలగాలను మొహరింపజేశారు. శివమొగ్గ : ఈ నెల 19న శివమొగ్గలో పీఎఫ్ఐ సంస్థ చేపట్టిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణలు మూడు రోజుల పాటు నగరాన్ని కుదిపేశాయి. ఎటు చూసిన విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భారీ బలగాలను పోలీస్ యం త్రాంగం మొహరింపజేసింది. నగరం మొత్తం ఖాకీల మయమైంది. ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో పొరుగూళ్లలో ఉన్న తమ బంధువుల ఇళ్లకు చాలా మంది ఆదివారం పయనమై వెళ్లారు. సీఆర్పీఎస్ బల గాలతో పాటు 2500 మంది కానిస్టేబుళ్లు నగరంలో గస్తీ తిరుగుతున్నారు. నగరంలో రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ఆటోలు, ప్రైవేట్ బస్సులు మాత్రం రోడ్డుపైకి వచ్చాయి. వ్యాపార కేంద్రాలన్నీ మూతపడ్డాయి. 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. కాగా, శనివారం రాత్రి కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టేందుకు అల్లరిమూకలు విఫలయత్నం చేశాయి. పోలీసుల అదుపులో వంద మంది అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర శాంతిభద్రత విభాగం ఏడీజీపీ షోర్ చంద్ర ఇక్కడే తిష్టవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అన్నారు. ఇద్దరిని హతమార్చిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రత పర్యవేక్షణలో 24 బెటాలియన్ల కేఎస్ఆర్పీ బలగాలు, ఆరు బెటాలియన్ల సీఆర్పీఎఫ్, 20 బెటాలి యన్ల డీఏఆర్క్యూర్టీ బలగాలతో పాటు 2500 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్ర హోం శాఖ సలహాదారుడు కెంపయ్య ఆదివారం ఇక్కడకు వచ్చి పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. కాగా, అల్లర్లలో చిక్కుకుని హత్యకు గురైన విశ్వనాథ్, మంజునాథ్ కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కి మ్మనె రత్నాకర్ అన్నారుృ మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. పది లక్షల చొప్పున పరిహారాన్ని అం దజేయనున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని శిక్షించాలి పీఎఫ్ఐ సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహిస్తూ పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా మాజీ డీసీఎం కె.ఎస్.ఈశ్వరప్ప గుర్తు చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముం దు ఆయన రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య, ఉ న్నతాధికారులను కలిసి చర్చించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం సరికాదని హితవు చెప్పడంతో ఓ వర్గం పథకం ప్రకారం దాడులకు పూనుకుం దని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఆఖరుకు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వచ్చిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలోనూ పోలీసులు విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఓ మంత్రిని ప్రజలు ముట్టడిస్తే పోలీసులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని అన్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం ముస్లిం మత పెద్దలతో జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఘటన వివరాలను వారి నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంగా ముస్లిం నేతలతో బీజేపీ నాయకులు బేటీ అయి చర్చించారు. -
లోకసభ ఫలితాలపై శివమొగ్గలో.. ఊపందుకున్న బెట్టింగ్
శివమొగ్గ, న్యూస్‌లైన్ : లోకసభ ఎన్నికల ఫలితాలపై శివమొగ్గలో బెట్టింగ్ ఊపందుకుంది. బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప, జేడీఎస్ అభ్యర్థి గీతాశివరాజ్‌కుమార్‌పైనే పెద్ద మొత్తంలో పందెంకాస్తున్నారు. ఇప్పటికే వీరిపై రూ. కోట్లలోనే బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. యడ్యూరప్పకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆయన గెలిస్తే పార్టీలో మళ్లీ కింగ్ మేకర్ కానున్నారు. ఓటమి పాలైతే మాత్రం అతని రాజకీయ భవిష్యత్ కనుమరుగు కావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. 16న నిషేదాజ్ఞలు : కలెక్టర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 16న జరగనుండడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు విధించినట్లు జిల్లా కలెక్టర్ విపుల్ బన్సల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వీడియో చిత్రీకరణ కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్ఆర్ నాగప్ప శెట్టి స్మారక జాతీయ సైన్స్ కాలేజీలో శివమొగ్గ గ్రామాంతర, శికారిపుర, సాగర, బైందూరు నియోజకవర్గాలు, నేషనల్ డిగ్రీ కాలేజీ తరగతి గదుల్లో సొరబ, శివమొగ్గ, తీర్థహళ్లి, భద్రావతి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. శివమొగ్గ, బైందూరు నియోజకవర్గాలకు ఒకే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు మూడు టేబుల్, ఎన్నికల అధికారుల టేబుల్లో ఫలితాలు క్రోడీకరణకు ఒక టేబుల్ కేటాయించినట్లు చెప్పారు. లెక్కింపు ప్రక్రియలో 150 మంది, వారికి సహాయకులుగా మరో 150 మంది, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులకు తొమ్మిది మంది, ట్యాబులేషన్‌కు 48 మందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా 160 మంది నౌకర్లు హాజరు కానున్నారని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించినట్లు తెలిపారు. 16న మద్యం అమ్మకాలు, కౌంటింగ్ కేంద్రాలు 200 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. -
ఆకట్టుకున్నపొట్లేళ్ల పందెలు