skating games
-
మా బాబు బంగారం
సాక్షి,విజయనగరం: జిల్లాకు చెందిన క్రీడాకారుడు చందక వెంకట పవన్ కార్తికేయ రోలర్ స్కేటింగ్‌లో రాణిస్తున్నాడు. 2019 జూలైలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జరిగిన వరల్డ్ రోలర్ గేమ్స్ భారత దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన ఒకే ఒక్క క్రీడాకారుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. అర్జెంటీనాలోని శాన్ జువాన్‌లో అక్టోబర్‌లో జరగబోయే వరల్డ్ రోలర్ గేమ్స్–2022 ప్రపంచ పోటీలకు అర్హత సాధించాడు. పతకం సాధనే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాడు. ఆయనకు ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో తన ప్రతిభకు పదును పెడుతున్నాడు. విజయనగరానికి చెందిన కార్తికేయకు క్రీడలంటే ఆసక్తి. మూడో తరగతి వరకు టెన్నిస్‌లో శిక్షణ పొందిన కార్తికేయ... నాలుగో తరగతి నుంచి రోలర్ స్కేటింగ్‌లో తర్ఫీదు పొందుతున్నాడు. తల్లిదండ్రులు సురేష్‌కుమార్, వెంక ట ఆత్మాంబికల ప్రోత్సాహంతో శిక్షకుడు కె.కృష్ణకుమార్ వద్ద మెలకువలు నేర్చుకుని పట్టు సాధించాడు. కాళ్లకు చక్రాలు కట్టుకుని రింగ్‌లో గిర్రు గిర్రున తిరుగుతూ కళ్లు చెదిరేలా విన్యాసాలాతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధిస్తూ నేడు అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. 10వ తరగతి వర కు విశాఖలో చదివిన కార్తికేయ ఇంటర్ మీడియట్‌ను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ డిఫెన్స్ అకాడమీలో పూర్తి చేశాడు. ప్రస్తుతం విశాఖ బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. పవన్ సాధించిన పతకాలు.. 2019, 2020, 2021 సంవత్సరాల్లో రోలర్ స్కే టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగి న జాతీయస్థాయి పోటీల్లో వరుసగా మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. 2018వ సంవ త్సరంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం. 2019లో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ క్రీడా పురస్కారాల్లో భా గంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశా ల మేరకు రూ. 75,000 నగదు ప్రోత్సాహకం అందుకున్నాడు. 2020 సంవత్స రం డిసెంబర్ నెలలో రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించినందుకు ఉత్తరాఖండ్ ప్రభు త్వం నుంచి రూ.50,000 నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నాడు. 2022, ఏప్రిల్ నెలలో పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో జరిగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచి∙అర్జెంటీనాలో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అర్జెంటీనాలోని శాస్ జు వాస్లో జరగబోయే వరల్డ్ రోలర్ స్కేటింగ్ గేమ్స్ కు హాజరయ్యేందుకు జిల్లాపరిషత్ నిధులు రూ. 2.65 లక్షల మొత్తాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఇటీవల అందజేశారు. స్కేంటింగ్ అంటే ఇష్టం చిన్న తనం నుంచి స్కేటింగ్ క్రీడ అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. వారి సహకారంతోనే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం వహించగలుగుతున్నాను. 2022 అక్టోబర్ 24 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు అర్జెంటీనాలోని శాస్ జువాస్‌లోలో జరగబోయే వరల్డ్ రోలర్ గేమ్స్‌కు ఎంపికయ్యాను. బంగారు పతకం సాధించడమే లక్ష్యం. – చందక వెంకట పవన్‌కార్తికేయ చదవండి: ఇద్దరూ ఇద్దరే.. స్కేటింగ్‌లో చిరుతలే.! -
చరితా దేవికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డికి చెందిన చరితా దేవి స్వర్ణంతో మెరిసింది. ఇందిరాపార్క్‌లోని స్కేటింగ్ రింక్‌లో ఆదివారం జరిగిన బాలికల (12–16) క్వాడ్ 3000మీ. స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్లో చరిత విజేతగా నిలిచింది. నల్లగొండకు చెందిన మృలాని రజతాన్ని, మెదక్ ప్లేయర్ లిఖిత కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు అండర్–16 బాలికల కేటగిరీలో డి. శ్రీవిజ్ఞా రెడ్డి రాణించింది. 1000మీ. రోడ్ ఈవెంట్లో రజతం నెగ్గిన శ్రీవిజ్ఞ... రింక్ రేస్ ఈవెంట్లో కాంస్యాన్ని గెలుచుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రోలర్ స్కేటింగ్ సంఘం (ఆర్‌ఎస్‌ఏటీ) అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఏటీ ఉపాధ్యక్షులు రామ్‌ప్రసాద్, అబ్జర్వర్ కల్యాణ్, కార్యదర్శి నిర్మల్ ప్రసాద్, టెక్నికల్ కమిటీ చైర్మన్ నూర్ మొహమ్మద్, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కంటతడి పెట్టినా లైవ్‌లో పరువు తీశారు
సియోల్ : దక్షిణ కొరియా స్కేటర్లపై అభిమానులు భగ్గుమంటున్నారు. సెమీ-ఫైనల్ క్వాలిఫైయింగ్ రేసులో ఓడిపోయి వింటర్ ఒలంపిక్స్ నుంచి టీమ్ నిష్క్రమించింది. అయితే వారు ఓటమి గురించి ఆటగాళ్లపై మండిపడటం లేదు. టీమ్ సభ్యురాలైన నో సెయాన్-యెయాంగ్పై మిగతా సభ్యులు లైవ్‌లోనే విమర్శలు చేసినందుకు... సోమవారం 500 మీటర్ల క్వాలిఫైయింగ్ రేసులో కిమ్ బో-రెమ్ నేతృత్వంలో బృందం పాల్గొంది. అయితే రేసులో కిమ్, మరో ప్లేయర్ పార్క్ జీ-వూ లు దూసుకుపోగా.. నో సెయాన్ మాత్రం వెనకబడిపోయింది. చివరకు రేసులో సౌత్ కొరియా టీమ్ ఓటమి పాలైంది. దీనిని జీర్ణించుకోలేక నో సెయాన్ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే టీమ్ సభ్యులు మాత్రం ఆమెపై కనికరం చూపలేదు. కిమ్, పార్క్‌లు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... ‘మేం మా ఆట సరిగ్గానే ఆడాం. కానీ, నో సెయాన్ విఫలమైంది. చాలా చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఆమె మూలంగానే ఓటమి చెందాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై చూసిన దక్షిణ కొరియా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపొటములు సహజమని.. అంత మాత్రానికి తోటి క్రీడాకారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదని వారంటున్నారు. అంతేకాదు కిమ్, పార్క్‌లను తక్షణమే నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్‌ను రూపొందించారు. దానిని అధ్యక్ష కార్యాలయ అధికారిక సైట్‌కు పొందుపరచగా... దీనిపై ఇప్పటిదాకా దాదాపు 2,50,000 మంది సంతకాలు చేశారు. అయితే వారిద్దరిపై నిషేధం విధించే అంశంపై మాత్రం దక్షిణ కొరియా క్రీడా శాఖ, ఒలంపిక్స్ కమిటీ స్పందించలేదు. -
ఉడతా ఉడతా ఊచ్.. ఆటలు ఆడుదామోచ్..!
ఆటలు మనుషులకేనా.. మీకే ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయా.. మేమూ ఆడతాం అంటూ చాలెంజ్ చేస్తున్నాయి ఈ ఉడతలు. అంతేకాదు ఐస్ స్కేటింగ్ వంటి గేమ్స్ కూడా ఆడేస్తున్నాయి. ఆడటమే కాదు ఒలింపిక్స్ పతకాలను కూడా గెలుచుకున్నాయి. ఉడతల ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయబ్బా.. ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా.. అవును ఒలింపిక్స్ ఏం జరగలేదు. ఇదంతా గీర్ట్ వెగెన్ అనే ఫొటోగ్రాఫర్ మాయాజాలం. తన ఇంటికి వచ్చే ఉడతలకు కొన్ని తిండి గింజలు వేసి.. వాటితో పాటు చిన్న చిన్న ఆటవస్తువులు కూడా పెట్టేవాడు. వాటిని తినేందుకు వచ్చే ఉడతలు.. ఆట వస్తువులపైకి ఎక్కినపుడు ఈ ఫొటోలను తీశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ..! అయితే వాటిని చూసినంత సులువేం కాదు ఫొటోలు తీయడం అంటే.. ఈ ఫొటోల వెనుక చాలా కష్టం దాగి ఉందని చెబుతున్నాడు వెగెన్. దాదాపు 5 ఏళ్లుగా ఈ ఉడతల ఫొటోలను తీస్తున్నాడట. ఇప్పుడు అవి తనకు మంచి స్నేహితులుగా మారాయని మురిసిపోతున్నాడు. -
ఆట అదిరింది
రెండో రోజు కొనసాగిన స్కేటింగ్ పోటీలు పలు విభాగాల్లో మెరిసిన క్రీడాకారులు భానుగుడి (కాకినాడ) : అంతర్ జిల్లాల పాఠశాల క్రీడల్లో భాగంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కాకినాడ రాజా ట్యాంకు స్కేటింగ్ రింక్‌లో 9 జిల్లాల క్రీడాకారులకు అండర్–11, 14, 17, 19 విభాగాల్లో పలు పోటీలు నిర్వహించారు. కర్ణాటక గుల్బర్గాలో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడలకు రాష్ట్రం నుంచి 48 మంది క్రీడాకారులను ఈ పోటీల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం స్థానిక పిండాల చెరువు నుంచి నూకాలమ్మ గుడి వరకూ రోడ్డును బ్లాక్ చేసి రోడ్–1, రోడ్–2లుగా పోటీలు నిర్వహించారు. రోడ్ రేస్ అండర్–11 విభాగంలో పీఎస్పీ రజని (విశాఖ), బి.యశ్విని (కృష్ణా), బి.çసుప్రియ; అండర్–11 బాలుర విభాగంలో అభిరామ్ (కృష్ణా), పి.శివబాలాజీ (కృష్ణా), పి.సాహత్శ్రీ (విశాఖ) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అండర్–14 విభాగంలో ఎంపీ విఠల్, కేఎస్ఎస్వీ లక్షి్మ; అండర్–17 విభాగంలో జి.కారుణ్యవర్మ, ఎ¯ŒSఎస్పీ వైజయంతి మణి, అండర్–19 విభాగంలో బి.విజయశంకర్, కేఎల్ కౌసల్యలు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు అందుకున్నారు. స్కేటింగ్ రింక్‌లో ఆయా విభాగాలకు సంబంధించి క్రీడలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. విజేతలకు డీఎస్డీవో పి.మురళీధర్, పాఠశాల క్రీడల కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, డీవైఈఓలు ఆర్ఎస్ గంగాభవాని, డి.వాడపల్లి, అబ్జర్వర్ రామ్‌కుమార్, స్టేట్ టెక్నికల్ అఫీషియల్ గంగాధర్, దొరయ్యస్వామి, సుబ్రహ్మణ్యం, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం వెంకటేశ్వరరావు, పీడీ రంగా, పీఈటీ స్వామి పాల్గొన్నారు.