ఆట అదిరింది
-
రెండో రోజు కొనసాగిన స్కేటింగ్ పోటీలు
-
పలు విభాగాల్లో మెరిసిన క్రీడాకారులు
భానుగుడి (కాకినాడ) :
అంతర్ జిల్లాల పాఠశాల క్రీడల్లో భాగంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కాకినాడ రాజా ట్యాంకు స్కేటింగ్ రింక్‌లో 9 జిల్లాల క్రీడాకారులకు అండర్–11, 14, 17, 19 విభాగాల్లో పలు పోటీలు నిర్వహించారు. కర్ణాటక గుల్బర్గాలో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడలకు రాష్ట్రం నుంచి 48 మంది క్రీడాకారులను ఈ పోటీల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం స్థానిక పిండాల చెరువు నుంచి నూకాలమ్మ గుడి వరకూ రోడ్డును బ్లాక్ చేసి రోడ్–1, రోడ్–2లుగా పోటీలు నిర్వహించారు. రోడ్ రేస్ అండర్–11 విభాగంలో పీఎస్‌పీ రజని (విశాఖ), బి.యశ్విని (కృష్ణా), బి.çసుప్రియ; అండర్–11 బాలుర విభాగంలో అభిరామ్ (కృష్ణా), పి.శివబాలాజీ (కృష్ణా), పి.సాహత్‌శ్రీ (విశాఖ) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అండర్–14 విభాగంలో ఎంపీ విఠల్, కేఎస్‌ఎస్‌వీ లక్షి్మ; అండర్–17 విభాగంలో జి.కారుణ్యవర్మ, ఎ¯ŒSఎస్‌పీ వైజయంతి మణి, అండర్–19 విభాగంలో బి.విజయశంకర్, కేఎల్ కౌసల్యలు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు అందుకున్నారు. స్కేటింగ్ రింక్‌లో ఆయా విభాగాలకు సంబంధించి క్రీడలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. విజేతలకు డీఎస్‌డీవో పి.మురళీధర్, పాఠశాల క్రీడల కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, డీవైఈఓలు ఆర్‌ఎస్ గంగాభవాని, డి.వాడపల్లి, అబ్జర్వర్ రామ్‌కుమార్, స్టేట్ టెక్నికల్ అఫీషియల్ గంగాధర్, దొరయ్యస్వామి, సుబ్రహ్మణ్యం, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం వెంకటేశ్వరరావు, పీడీ రంగా, పీఈటీ స్వామి పాల్గొన్నారు.