Skin Light
-
పెరిగే వయసును ఆపేసే దాల్చిన చెక్క...
న్యూ ఫేస్ వంటకాలలో వాడే దాల్చిన చెక్కలో చర్మకాంతిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని సౌందర్య ఉత్పాదనలలో తప్పనిసరిగా వాడుతుంటారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వదు. అమితంగా ఉండే మినరల్స్, విటమిన్ల వల్ల చర్మం సహజకాంతిని కోల్పోదు. దీంతో ఎక్కువ కాలం యవ్వనకాంతితో వెలిగిపోతారు. ఆహారంలోనూ దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉండాలి. జిడ్డు, కాంబినేషన్ చర్మం గలవారికి దాల్చినచెక్క ప్యాక్ మహత్తరంగా పనిచేస్తుంది. కావల్సినవి: * టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి * రెండు టేబుల్ స్పూన్ల తేనె తయారీ: * దాల్చిన చెక్క, తేనె కలపాలి. మృదువైన మిశ్రమం తయారుచేయాలి. * ముఖాన్ని శుభ్రపరుచుకుని తడి లేకుండా తుడవాలి. తర్వాత దాల్చిన చెక్క మిశ్రమాన్ని కళ్ల చుట్టూతా వదిలేసి ముఖమంతా రాయాలి. * అలాగే గొంతు, మెడకు కూడా పట్టించాలి. * కనీసం 15 నిమిషాల సేపు ఆరనివ్వాలి. దీంతో దాల్చిన చెక్క, తేనెలోని పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. * తర్వాత గోరువెచ్చని నీటిని ముఖం మీద చిలకరించి, మృదువుగా మర్దనా చేస్తూ, కడిగేయాలి. * తర్వాత చల్లని నీటితో కడిగి, మెత్తని టవల్‌తో తుడవాలి. * మీ ముఖ చర్మం మృదువుగా కనిపిస్తుంది. వారానికి 2-3 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మ కాంతి పెరగుతుంది. * ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎండకు కందిపోయిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మచ్చలు, యాక్నె సమస్యలు తగ్గుతాయి. -
చర్మకాంతికి కందిపప్పు ఫేస్ ప్యాక్
న్యూ ఫేస్ మొటిమలు, యాక్నె, నల్ల మచ్చలు ముఖం మీద ఉంటే కందిపప్పుతో తయారుచేసిన ప్యాక్ వేసుకుంటే సరైన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి ఈ ప్యాక్ తగినంత మాయిశ్చరైజర్‌ని అందిస్తుంది. ఫలితంగా చర్మ కాంతిమంతంగా కనిపిస్తుంది. స్టెప్ 1: అర కప్పు కందిపప్పును కడిగి కనీసం 4-5 గంటల సేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లన్నీ వడకట్టి మెత్తగా రుబ్బాలి. దీంట్లో పావు కప్పు పాలు, టీ స్పూన్ బాదం నూనె కలపాలి. స్టెప్ 2: ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడవాలి. తయారుచేసుకున్న కందిపప్పు చిక్కటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల సేపు ఆరనివ్వాలి. స్టెప్ 3: ముఖాన్ని కడిగేముందు కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మునివేళ్లతో వలయాకారంగా మృదువుగా రుద్దుతూ ప్యాక్‌ని తొలగించాలి. * ఈ ప్యాక్‌లో రోజ్‌వాటర్‌ని కూడా కలుపుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. * యాక్నే సమస్య ఉన్న వారు మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమంలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ శనగపిండి, ముప్పావు కప్పు పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద వెంట్రుకలు పోవాలంటే.... ముఖ చర్మం మీద ఉండే వెంట్రుకలను తొలగించడానికి కందిపప్పు ఫేసియల్ బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కందిపప్పు, 50 గ్రాముల గంధంపొడి, నారింజ తొక్క పొడి, తగినన్ని పాలు కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి రాసి 15-20 నిమిషాలు ఉంచాలి. పైన కొన్ని నీళ్లు చల్లి ప్యాక్ మెత్తబడ్డాక మునివేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. దీంట్లో ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడచ్చు.